అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/పదనిష్పాదనకళ - 6
మాటల నిర్మాణం
-వాచస్పతి
(గత సంచిక తరువాయి...)
పదనిష్పాదనకళ
The joy of coining new words!
నూతన పదాల నిష్పాదనకి మాండలికాల వితరణ
18. ఆంగ్లపదాలకి తెలుగు సమానార్థకాల్ని రూపొందించే క్రమంలో మనం సంస్కృతం మీద హెచ్చుగా ఆధారపడుతూ వస్తున్నాం. దీనికొక కారణం మన సాంస్కృతిక వారసత్వం కాగా, ఇంకో కారణం - మన- అంటే విద్యావంతుల బౌద్దిక వాతావరణం దేశి (గ్రామీణ) ప్రజానీకంతో సంబంధాలు కోల్పోయి ఉండడం. మనం ఉండేది నగరాల్లో/ అథవా పట్టణాల్లో ! మనం చదివేది/మాట్లాదేది ఇంగ్లీషు లేదా ప్రామాణిక (శిష్టవ్యావహారిక) తెలుగు మాండలికం లేకపోతే ఇటు ఆంధ్రమూ, అటు ఆంగ్లమూ కానటూవంటి ఒక సంకర తెంగ్లీషు. తద్ద్వారా మనం చాలా కృతక (synthetic) వ్యక్తులుగా మారిపోయాం
పల్లెపట్లలో చాలా ముచ్చటైన దేశిపదాలు వాడుకలో ఉన్నాయి. వాటిల్లో చాలావఱకు ఇంగ్లీషు పదాలకి సమాధానం చెప్పగలవే. అయితే మనకి అవి తెలియకపోవడం. గ్రామీణులకేమో- అవి మనకి, అంటే పదనిష్పాదకులకి అవసరమని తెలియకపోవడం, ఈ కారణాల వల్ల పరస్పర సమాచారలోపం (communication gap)తీవరించి మనం క్రమంగా అసలైన తెలుక్కి దూరంగా, సుదూరంగా జఱిగిపోతున్నాం. “ఇంగ్లీషు పదాలే original, తెలుగు పదాలంటే మక్కికి మక్కి అనువాదాలు (True Translation), తెలుగంటే సంస్కృతం” అనే అభిప్రాయంలో పడి ఊగిసలాడుతున్నాం. కొన్నిసార్లు కొత్త పదాల్ని నిష్పాదించినవారే వాటిని వాడని పరిస్థితి కూడా లేకపోలేదు.
మాండలికాలు లేకుండా తెలుగు పరిపూర్ణం కాదు. ఆ పదాల్ని ఆయా జిల్లాలకీ, తాలూకాలకీ వరిమితం చెయ్యకుండా శిష్టవ్యావహారికంలోకి, సాపాత్య ప్రధాన స్రవంతిలోకి తీసుకురాగలిగితే, అందరికీ వాటి వాడుకని అలవాటు చెయ్యగలిగితే భాషకి మహోపకారం జరుగుతుంది. అనువాదాలు చేసేటప్పుడు గానీ, సమానార్ధ కాల్ని రూపొందించేటప్పుడు గానీ మన భావదారిద్యమూ, పదదారిద్య్రామూ వదిలిపోతాయి. అంతకంటే ముఖ్యంగా సమర్థకాలకి కృత్రిమత్వదొషం నివారించబడి సహజ తెలుగుతనపు పరిమళాలు గుబాళిస్తాయి. మూర్త నామవాచకాల్ని (Material Nouns) ని అమూర్త నామవాచకాలు (Abstract Nouns) గా పరివర్తించడం ద్వారా చాలా బౌద్ధిక పదజాలాన్ని (Intellectual Vocabulary) నీష్పాదించవచ్చు. ఇందునీమిత్తం మనకి వ్యవసాయంతో సహో వివిధ గ్రామీణ వృత్తుల పదజాలాలు సహకరిస్తాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే సాహిత్యభాషలోకి ప్రవేశించాయి. అవి అలా ఇంకా ఇంకా ప్రవేశించాలనీ సాహిత్యానీకీ, 'ప్రజలకీ మధ్య ఏర్పడిన తెంపు (disconnect) రద్దు కావాలని ఆశిస్తున్నాను. ఉదా:
మళజో ఉదాహరణ - తూర్పుగోదావరి జిల్లాలో కొన్నీ ప్రాంతాల్లో వాడే “కిట్టింప్పు” అనే పదాన్ని తీసుకుందాం. లెక్కలో వచ్చే హెచ్చుతగ్గుల్ని సరిపెట్టదానికి ఈ పదాన్ని వాడతారు. ఇది ప్రధానంగా బళ్ళలోను ట్యూషన్లలోను వినపడే పదం. ఎలాగైనా సరే answer వచ్చేలా చెయ్యడమన్నమాట. ఇది సానుకూలార్థం (positie meaning)
| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఉ ఫిబ్రవరి-2021 |
1౧8) లో వాదే పదం మాత్రం కాదు. ఇది కిట్టింపు ఎందుకయిందంటే కిట్టు = సరిపోవు
కిట్టుబాటు = గిట్టుబాటు
కిట్టించు = సరిపోయేలా చేయు ఈ రకమైన కిట్టింవు (manipulation of accounts) నీ మనం సత్యం కంపెనీ కుంభకోణంలో గమనించాం. మన పాత్రికేయులెవజ్రైనా ఈ పదం వాడతారేమోనని చూశాను. ఎక్కడా కనీపించలేదు. దాన్ని బట్టి చూస్తే మనం (ఆలో చనాపరులం) ప్రజలకి నేర్పాల్సినదాని కన్నా వారినుంచి నేర్చుకోవాల్సిందే ఎక్కువ ఉందనీపిస్తోంది. సంస్కృతం మీద అతి-అధారపాటు (oer dependence)
19. మన పదాల చరిత్ర ఇప్పటిదాకా ఎలా ఉందో టూకీగా సమీక్షించుకుందాం. ఇంగ్లీషు పదాలకి ప్రతిగా మనం ఇలా అనేక సంస్కృత శబ్టాలతో, సమాసాలతో తెలుగుని నింపేయడం, అవి జనానీకి నోరు తిరక్క్మపోవడం, పైగా అవి ఆదాన అనువాదాలు (loan translations) అనే దృష్టితో వాటిని ప్రజలు చిన్నచూపు చూడ్డం, చులకనగా మాట్లాడ్డం, వాళ్ళు ఆదరించడం లేదనీ మనం బాధపడడం తఅచయింది. దాని బదులు ముచ్చటైన, పలకడానికి సులభమైన, తక్కువ అక్షరాలు గలిగిన తెలుగు ప్రత్యామ్నాయాలు దొరికినప్పుడు వాటినే వాడడం మంచిది. సంస్కృతపదాల కంటే అవి త్వరగా ప్రచారంలోకి వస్తాయి. సంస్కృతపదాల్ని విచ్చలవిడిగా తెలుగులోకి దిగవేయడం (dumping) లో ఉన్న ఇబ్బందుల గుటించి కాస్త తెలుసుకుందాం.
1. చాలా సందర్భాల్లో ఇలా దిగవేయబడదే పదాలు అర్ధరీత్వా తెలుగుపదాల కంటే గొప్పవి కావు.
2. కానీ వాటికివ్వబదే అనవసరమైన గౌరవం వల్ల అవి తెలుగు పదాల్నీ నీచపణుస్తాయి (demeaning). అంటే అవి తెలుగులోకి వచ్చినాక వాటి తెలుగు నమార్ధకాల్ని నీచార్థంలో వొాడడఠ6 మొదలుపెడతారు పండితులు. వాళ్ళని చూసి పామరులు కూడా తెలుగుపదాల్ని నీచార్థానికే వరిమితం చేస్తారు. ఉదాహరణకి 'క్రిందిపదాల్ని గమనించండి.
మట్టి = మృత్తిక
చచ్చిపోయారు = మరణించారు
కంసాలి = విశ్వకర్మ
కంపు = వాసన
బడి = పాఠశాల ఊరు = పట్టణం చెట్టు = వ్బక్షం
ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. కనుక ఇలా దిగవేయడం తెలుగు (ప్రాధాన్యాన్ని తగ్గించడమే బెకుంది తప్ప అభివృద్ది చెయ్యడం అవ్వదు. 3. దిగవేసిన ప్రతి సంస్కృత పదంతోపాటు అనేక సంస్కృత ప్రత్యయాల్ని ఉపసర్గల్ని కూడా దిగవేయాల్సి వస్తుంది. ప్రత్యయాలూ, ఉపసర్గలూ మన తెలుగువాళ్ళకి తెలిసినవి కావు. వాటి అర్జమూ తెలియదు, వాటినీ ఎక్కడ ఎలా అతకాలో కూడా వాళ్ళకి తెలియదు. సంస్కృత వ్యాకరణంలో శాస్త్రీయమైన శిక్షణ లేకపోడం చేత ఒక పదంలో కనిపించే ప్రత్యయాన్ని లేదా ఉపసర్గని థైర్యంగా ఇంకో పదానికి అన్వయించుకోలేరు. అన్వయించబోతే అన్నీ తప్పులే వస్తాయి. అందుచేత అలా ఎన్నింటిని దిగవేసినా ఇంకా ఇంకా భారీగా దిగవేయాల్సి వస్తూనే ఉంటుంది. ఆ దరిద్రానికి అంతులేదు. దీనిక్కారణం - అవి తెలుగు కాకపోవడం, అవి తెలుగు వ్యాకరణంలో ఇమడకపోవడం. తెలుగు వ్యావహారిక శైలిలో అసలే ఇమడకపోవడం. దీనికి పరిష్కారం - సంస్కృతపదాల బదులు కొన్ని సంస్కృత ప్రత్యయాల్నీ ఉపసర్దల్ని తెలుగులోకి తెచ్చి వాటిని నేరుగా తెలుగు పదాలకే కలపడం.
ఉదాహరణకి :- ఉప -అద్దె (sub-rent), తెలివిమంతుడు, నిష్పూచీ మొ॥
4. సమాసఘటన చేసేటప్పుడు సంస్కృతపదాల్ని సంస్కృత పదాలతోనే కలపాలనే చాదస్తం మనవాళ్ళలో చాలా చాలా ఎక్కువ. అలా అవసరం లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా సంస్కృతపదాలు సమాసాల ద్వారా తెలుగులోకి వచ్చి తిష్టవేశాయి. తిష్టవెయ్యడమే కాదు, సమాసాల ద్వారా అలవాటైన సంస్కృతపదాలు కొన్ని సందర్భాలలో అసలైన తెలుగు పదాల్నే భాషలోంచి ఏకమొత్తంగా తుడిచిపెట్టాయి. ఉదా :- ఉత్తరం, దక్షిణం.
మన ముందున్న కార్యావళి (agenda)
20. తెలుగులో కొత్త పదాల్ని కల్పించడమనే కార్యకలాపం నాలుగు దిశల్లో జఱగాల్సి ఉంది.
(అ) ఇంగ్లీషు పదాలకి సమాధకాల (equialents) కల్పన /అన్వేషణ
(ఇ) ఇంగ్లీషులో లేనటువంటివి/మన స్థానిక తెలుగుభాషుల (Natie Telugu speekers) భావాల వెల్లడింపుకి ఉపయోగపడేవీ అయిన కొత్త పదాల నిష్పాదన (Coinage)
(ఉ) అన్యదేశ్యాల స్థానికీకరణ (natiization)
(బు) కొత్త పరిభావనల (Concepts) గుర్తింపు మఱియు నామకరణం.
ఔత్సాహిక పదనిష్పాదకులు ఈ పై నాలుగో కార్యకలాపం గుఱించి కొంచెం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మనమిప్పటి దాకా చేస్తూ వస్తున్నది ప్రధానంగా, ఆంగ్ల ఆరోపాలకి తెలుగు సమార్థకాల్ని నిష్పాదించడం. ఈ మార్గంలో మన భాష ఇంగ్లీషువారి పరిభావనలకి ప్రతిబింబప్రాయం మాత్రమే కాగలదు. పదాలనేవి పరిభావనల వ్యక్తీకరణలు మాత్రమే. అసలు పరిభావనలంటూ ఉంటే పదాలు పుట్టడం కష్టం కాదు. కనుక ముందు సరికొత్త పరిభావనల్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా జఱగాలి. చూడగల కళ్ళుంటే మనచుట్టూ ఉపయుక్తమైన సరికొత్త పరిభావనలు ఉన్నాయి. వాటిని గుర్తుపట్టాలి. అది భాషాస్వకీయత (originality) కీ, సుసంపన్నతకీ దారితీయగలదు. ఉదాహరణకు -
- 1. చదువు చెప్పేవాడు = ఉపాధ్యాయుడు
- చదువుకునేవాడు = విద్యార్థి
- చదువు చెప్పించేవాడు (తండ్రి/ బడి యజమాని) =
- 2. భవనం కట్టించేవాడు = కాంట్రాక్టరు, బిల్డర్
- భవనం కట్టేవాడు = మేస్త్రీ
- కట్టించుకునేవాడు =
- 3. వెలుగు X నీడ
- ప్రతిఫలితమైన వెలుగు (reflected light) ని ఏమనాలి ?
- అలాగే ప్రతిఫలితమైన వెలుగు వల్ల ఏర్పడే నీడని ఏమనాలి ?
- 4. ఎంజిన్ పనిచేస్తున్నది = బండి/ యంత్రం కదులుతున్నది. ఇది యాంత్రిక చలనం.
- ఇంకో దృగ్విషయం : ఎంజిన్ పనిచేస్తున్నది కానీ బండి/యంత్రం కదలడం లేదు. దీన్నేమనాలి ?
- 5. సోదరి కొడుకు మగవారికి మేనల్లుడు.
- మఱి తమ సోదరుని కొడుకు వారికి ఏమవుతాడు ?(మేనకొడుకు అందామా ?)
- అలాగే సోదరుని కొడుకు ఆడవారికి మేనల్లుడు. మఱి తమ సోదరి కొడుకు వారికి ఏమవుతాడు ?
- 6. మన పూర్వీకులు మానవ శరీరంలోని అన్ని భాగాలకీ పేర్లు పెట్టలేదు. కొన్నిటిని వదిలేశారు. వాటికి ఏమని పేర్లు :పెడదాం ?
ఏది చెయ్యాలన్నా ముందు మన భాషాస్వరూపం గురించి మనకి కొంత అవగాహన ఉండాలి. అది ఏర్పడాలంటే శబ్టార్ధ చంద్రిక వంటి కోశాలను అనునిత్యం పరిశీలిస్తూ ఏ పదమైనా మనకి పనికొచ్చే లక్షణాలు కలిగి ఉందా ? అని కాస్త మధనపడాలి. రెండోది- బాలవ్వాకరణాన్నీ సిద్దాంతకౌముదినీ కూడా శోధించాలి. ఎందుకంటే ఒక మహాకవి చెప్పినట్లు “గతం నాస్తి కాదు నేస్తం, అది అనుభవాల ఆస్తి.” పాతపుస్తకాల బూజుదులిపి దుర్శిణితో గాలిస్తున్నంత మాత్రాన ప్రతి చాదస్తాన్నీ నెత్తిన వేసుకుంటామనుకోరాదు. "కొత్త పదాలు” అంటే - ఏ విధమైన కొత్త పదాలు ? పదాల్లో రకాలున్నాయి. ఇంగ్లీషువారు వాటికి Parts of speech అని పేరుపెట్టారు. మన భాషకి సంబంధించినంత వఱకు మనం సిద్దం చెయ్యాల్సినవి:
- 1. క్రియాధాతువులు (erb-roots)
- 2. నామవాచకాలు (nouns)
- ౩. విశేషణాలు (adjecties)
మళ్ళా వీటిల్లో చాలా రకాలున్నాయి. తెలుగుభాష నామవాచకాల్ని క్రియలుగా ఎలా మారుస్తుంది ? క్రియల్ని నామవాచ కాలుగా ఎలా మారుస్తుంది ? ఒక నామవాచకంలోంచి ఇంకో నామవాచకాన్ని ఎలా నిష్పాదిస్తుంది ? వీటన్నింటి నుంచి విశేషణాల్ని ఎలా పుట్టిస్తుంది ? మళ్ళీ విశేషణాల్లోంచి నామవాచకాల్నీ క్రియల్నీ ఎలా రప్పిస్తుంది ?
ఇవన్నీ కూలంకషంగా తెలునుకుంటే సగం అయోమయంలోంచి బైటపడతాం.
21. తెలుగులో పదనిష్పాదన మఱింత ప్రజాస్వామికం కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ఎప్పుడూ ఎవఱొ ఒకటిద్దఱు లేదా ముగ్గుఱు, నలుగుఱు సమార్ధకాల్ని సూచించడం, వారి వద్ద మాత్రమే నమాధానాలు ఉండడమూ, మిగతావారివద్ద ప్రశ్నలు మాత్రమే ఉండడమూ తరగతిగదిలాంటి ఈ పరిస్థితి శీఘ్రంగా మారడం మిక్కిలి వాంఛనీయం. ఇది నిజానికి ఒక అభ్యసనాప్రక్రియ. ఇది ఒక ఇబ్బందికరమైన ప్రక్రియ. ఎందుకంటే మనం స్వయంగా నేర్చుకునే కంటే ఇతరులకి నేర్పడానికి ఎక్కువ ప్రయత్నిస్తూంటాం. ఈ వైఖరి మన మనోభివృద్ధికి అడ్డుపడుతుంది. అదే సమయంలో భాషాభివృద్దికి కూడా!
1. మఱింతగా పాత -కొత్త తెలుగు-ఇంగ్లీషు పుస్తకాల్ని చదవడం అలవాటు చేసుకోవాలి. అంతకన్నా ముఖ్యంగా పూర్తిగా తెలుగులోనే ఆలోచించడం, మాట్లాదదం అలవాటు చేసుకోవాలి. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో మాట్లా డడం పనికిరాదు.
2. ప్రతిపదానికి తెలుగు సమార్ధకం ఏమై ఉంటుందో అని ఊహించే ప్రయత్నం చేయాలి.
3. తెలుగు పుస్తకాల్లో దర్శనమిచ్చే పదఘటనా వైచిత్రికి క్షణికంగా మురిసిపోయి ఆ తరువాత వాటిని అక్కడికక్కడే మర్చిపోకుండా “అవి ఏ ఆధునిక పద- అవసరాల్ని తీర్చగలవో?” అని ఉత్ప్రేక్షించే ప్రయత్నం చేయాలి.
4. మాండలిక పదాల్ని ఇతోధికంగా అధ్యయనం చేయాలి. అవి కూడా మాండలిక ప్రతిపత్తిని అధిగమించి మఱికొంత ఉన్నతశ్రేణిలో ఏ ఆధునిక పద -అవనరాల్ని తీర్చగలవో అని ఉత్ప్రేక్షించే ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రామాణిక వాఢుకలు చేయజాలని పనిని మాండలిక పదాలు లెస్సగా నెఱవేఱుస్తాయి.
5. పదనిర్మాణ నిమిత్తం తెలుగు -సంస్కృత వ్యాకరణ గ్రంథాల్ని తఱచుగా తిరగేయాలి. వ్యాకరణ పరిజ్ఞానం లేకుండా అర్దవంతమైన, పదునైన పదాల నిష్పాదన సాధ్యం కాదు. ఒక మేస్త్రీ ఎంత గట్టిపనివాడైనప్పటికీ, ఇసుక, ఇటుక, సిమెంటు అనే ఉపచయాలు(inputs) లేకపోతే ఎలాగైతే ఏమీ చెయ్యలేడో, అదే విధంగా పద-ధాతు-ప్రత్యయ పరిజ్ఞానం లోపిస్తే ఇతరత్రా ఎంత మేధావులైనా వారు చేయగలది కూడా శూన్యం. పదనిర్మాణాలకి ఒక తార్మికమైన,హేతుబద్దమైన సుక్రమం (consistency) అవసరం. దాన్ని వ్యాకరణపరిజ్ఞానమ సమకూర్చగలదు. మనం మాట్లాడే భాషలోని పదాలూ, వాక్యాలూ వ్యాకరణమూ ఎంత తార్మికంగా ఉంటే మన జాతి యొక్క మేధాశక్తి కూడా అంత హేతుబద్దంగానూ, నాగరికంగానూ ఉంటుంది. ప్రజలూ, ప్రజా భాష - వీటికి ఆ పరిజ్ఞానం అవసరం లేదనీ, అజ్ఞానమే సుజ్ఞానమనీ, రాచపుండు రాచబాట అని వాదించే మహామేధావులకు దూరం నుంచే ఒక నమస్కారం పెట్టవలసినది. ఎందుకంటే వైజ్ఞానికంగా అభివృద్ది చెందిన ఆంగ్లంలో కూడా ప్రామాణిక శాస్త్ర పదజాలమంతటికీ వ్యాకరణం ఉన్నది. అందు చేత వ్యాకరణం లేకుండా ఆంగ్లం లేదు. తెలుగైనా అంతే !
6. హిందీలాంటి ఇతర భాషల్లో ఇంగ్లీషుకి ప్రతిగా వాడుతున్న సంస్కృత సమార్ధకాల్ని యథాతథంగా తెలుగులోకి దింపుదల చేయడంలో ఉన్న సాంస్కృతికమ్లైన ఇబ్బందుల్ని సమీచీనంగా గుర్తెఱగాలి. వారూ, మనమూ వాడుతున్నది గీర్వాణమే అయినప్పటికీ వారి వాడుకా, మన వాడుకా అచ్చుమచ్చుగా ఒకటి కాదు గనుక ఆ పదాలు తెలుగువారికి సద్యః స్ఫురణ కావని గుర్తించినప్పుడు వాటిని వర్ణించి మనం స్వకీయంగా, సరికొత్తగా పదనిష్పాదన చేయడమే వాంఛనీయం.
(తరువాయి వచ్చే సంచికలొ...) ———————————————————————————————————————————————————————————————————————————————————————————————————— 12వ పుట తరువాయి.......
ఎరుకల భాష-మాతృభాషలో బోధన
అలాంటప్పుడు ప్రాధమిక స్థాయిలో విద్యాబోభన జరుగుతున్నప్పుడు అది తప్పకుండా మాతృభాషలోనే అయి ఉండాలి. అమ్మభాషలో ప్రేమ ఉంటుంది. లాలన ఉంటుంది. కఠినమైన విషయం కూడా సులభంగా అర్ధమౌతుంది. ఉదా॥కు: ఒక పాప/బాబు బడికి వెళ్ళడం ప్రారంభం చేసినపుడు అక్కడ కూచోనని, ఉండనని ఏడుస్తారు. కొద్ది రోజులు అమ్మ, నాన్న లేదా దగ్గరి వాళ్ళెవరైనా కొద్దిగా శిశువుకు బడి పరినరాలు, వ్యక్తులు ఉపాధ్యాయులు అలవాటు పడే వరకు తోడుగా ఉంటారు. తర్వాత క్రమంగా బడి అలవాటటైపోతుంది.
అలాగే ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన తెలియని కొత్త భాషలో జరిగే బదులుగా మాతృభాషను మాధ్యమంగా బోధన జరిగితే అమ్మనే శిశువుని దగ్గర కూచోబెట్టుకుని కథ చెప్పినంత ఆనందంగా పాఠం అవగాహనకు వస్తుంది. ఈ విషయాన్ని అటు తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, అధికారులు అద్ధం చేసుకోవాలి. మాతృభాషలో విద్యాబోధన సాగడానికి కృషి చేయాలి.
ఎరుకల భాష వంటి గిరిజన తెగల భాషలను మాట్లాడే ప్రాంతాల్లో తప్పకుండా అ భాషలో బోధన జరిగేలా చూడాలి. ఆ భాషకు లిపి లేకపోయినా ఆ స్థాయిలోని పుస్తకాలను, అయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న ఇతర భాషలో అచ్చువేసినా కూడా, మౌఖికంగా బోధన మాత్రం ఎరుకల భాషలోనే జరగాలి.
పరీక్షించే విదానం కూడా మౌఖికపరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. శిశువు పాఠ్యాంశాలను చక్కగా నేర్చుకోవడమే కాకుండా స్పష్టంగా వ్యక్తీకరించే సామర్ధ్యాన్ని నేర్చుకుంటాడు.
అంతేకాదు. మాతృభాష ద్వారా ఆంగ్లం వంటి ఇతర భాషలను కూడా సులభంగా నేర్చుకుంటాడు. అటు భాషా పరిజ్ఞానం, ఇటు విషయ పరిజ్ఞానం కూడా శిశువుకు చక్మగా అలవడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఈ స్థాయిలో జోధనకు నియమించే అధ్యాపకులు కచ్చితంగా ఆ భాషా వ్యవహర్తలై ఉండాలి. ఒకవేళ వారికి సరైన అర్హతలు లేకపోయినా, కనీస స్థాయి అంటే డిగ్రీ వరకు చదువుకున్నాా ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ లేకపోయినా కూడా, వారికి తాత్మాలికంగా కొంత శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని అధ్యాపకులుగా నియమించుకోవాలి. ఈ స్థాయిలో జోధనకు మాతృభాషా మాధ్యమం ఎంతో ప్రధానం అనే విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఈ సందర్భంలో ఎరుకల లాంటి ఎన్నో గిరిజన భాషలను వాటి విశిష్టతను, విజ్ఞానాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ. భాషాశాస్త్రవేత్తలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. గిరిజన సమాజాన్ని ఉత్తేజ పరిచి, వారి ప్రాధాన్యతను భాష ప్రాచీనతను గౌరవించాల్సిన బాధ్యత మనందరిదీ.
డా. పి. వారిజారాణి సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం
డా. వి. ఎం. సుబ్రహ్మణ్య శర్మ సహాయ ఆచార్యులు (C), భాషా శాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం
వినియోగించే కొద్దీ భాష వికసిస్తుంది. వాడనిభాష వాడిపోతుంది.