అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/బ్రతుకుతెరువు కోసం తెలుగు భాష

వికీసోర్స్ నుండి

సి.వి. క్రిష్టయ్య

93965 14554

బ్రతుకుతెరువు కోసం తెలుగు భాష

నేనొక వల్లెటూరు హైస్కూల్లో పనిచేస్తున్నాను. సిటీ నుండి ఈ ఊరికి బస్‌ సౌకర్యం ఉంది. గంటలోపు ప్రయాణం. పిల్లలు కాలేజి చదువులకు వచ్చినందువల్ల, ప్రయాణ సౌలభ్యం వల్లా సిటీలో సంసారం పెట్టాను.

సిటీ ఐస్‌ కోసం ప్రతి రోజు ఒక బజారు సెంటర్లో నిలబడి ఎదురుచూసేవాడిని. ఆ సెంటర్లో అనేక షాపులతో పాటు ఒక యస్‌.టి.డి. టెలిఫోను బూతు, ఒక ఫోటోస్టుడియో కూడా ఉన్నాయి. ఈ రెండింటిలో వని చేన్తున్న ఇద్దరు యువకులు నాకు పరిచమయ్యారు. వారు చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. వేరే ఎక్కడైనా కొత్త పని కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.

నేను బన్‌ వచ్చే వరకు యస్‌టిడి బూతులో కూర్చుని అక్కడ పనిచేస్తున్న ప్రసాదుతో పిచ్చాపాటి మాట్లడతూ ఉండేవాడిని. ఒక రోజు ఉన్నట్లుండి ప్రసాదు “సార్‌ ఇంతకూ మీరు ఏమిచేస్తుంటారు? అని అడిగాడు.

“పిల్లలకు అక్షరాలు నేర్పుతుంటాను” అని బాధగా చెప్పాను.

మీరు ఎలిమెంటరీ స్కూలు టీచరా?

“కాదు, హైస్కూల్లో సీనియర్‌ తెలుగు పండితుడిని”.

అయితే అక్షరాలు నేర్చదం ఏమిటి?

“ఏమి చేయమంటావు? పదో తరగతికి వచ్చినా చదవడం రాయడం రాదు. ఏంరాదో అదేకదా నేర్పాలి” అన్నాను విసుగ్గా.

ఈ మాటలు విన్న ప్రసాదు, నారెండు చేతులు గట్టిగా పట్టుకొన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. “సార్‌ నా పరిస్థితి గూడా ఇదే. నేను పదోతరగతి వరకు కాన్వెంట్‌లో ఇంగ్లీషు మీడియంలో చదివాను. నాకు ఇంగ్లీషూ రాదు. తెలుగూ రాదు. అయితే తెలుగు కొంచెం మెరుగు. మనం మాట్లాడే భాషేగదా! కాని సరిగ్గా రాయలేను. తప్పులుపోతాయి. మా అమ్మ ఉదయం సాయంకాలం చిన్న టిఫెన్‌ సెంటర్‌నడుపుతూ ఉంది. నేను రాత్రి ఇంటికి వెళ్లగానే శేపటికికానలసిన సామాను ఏది ఎంతకావాలో చెప్పి దబ్బులిస్తుంది. నేను ఆ సామాను పేర్లలో మొదటి అక్షరాలు ఒక చీటీ మీద రాసుకొంటాను గుర్తుకోసం. ఆ చీటీని తీసుకొని కొట్టుకు వెళతాను. చీటీ చూసి ఏది ఎంత కావాలో రాసుకొమ్మని కొట్టువాడికి చెబుతాను. అతను నా చేతులోని చీటి ఇమ్మంటాడు. దాన్ని ఎలా ఇచ్చేది? అసలు సంగతి ఏమిటంటే ఆషాపువాడు నాబాపతే. ఈ మధ్య నాకు ఒక ఎలక్ట్రిక్‌ షాపులో ఉద్యోగం ఇస్తామన్నారు. లెక్కలు రాసే పని. రాదన్నాను. నేర్చుకొని రమ్మన్నారు. ఎలాగా అని అలోచిస్తున్నాను. దేవుడిలా మీరు దొరికారు. ఎలాగైనా మీరు నాకు నేర్పాలి. ఉండండి శంకర్‌ని కూడా పిల్చుకొని వస్తాను. అంటూ ఫోటో స్టూడియోకెళ్లి శంకర్‌ను పిల్చుకొని వచ్చాడు.

“సార్‌ ఎంతడబ్బు అయినా ఇచ్చుకుంటాం. మీరు మాకు చదువు నేర్పాలి అంటూ ప్రాధేయపడ్దారు. ఇంతకూ మీరు పది పాసయ్యారా అని అడిగాను. 'పాసయ్యాము ఇంటర్లోకూడా చేరాము. ఇంటర్‌ చదవలేమని త్వరలోనే తెలిసిపోయింది. కాలేజీ మానుకొన్నాము. వనుల్లో కుదురుకున్నాము.” అని చెప్పారు. మరి పదెలా పాసయ్యారని అడిగాను.

“ఏమోసార్‌ ఎలా పాసయ్యామో అంటూ సిగ్గుపడుతూ తలలు వంచుకున్నారు. ఆవును. చూని రాశామనీ, వరీళ్షహాల్లో మూకుమ్మడిగా అందరికీ బిట్‌పేపర్లు జవాబులు చెప్పారనే సంగతి ఎలా చెబుతారు. టీచర్లు అధికారులు, ప్రభుత్వమూ కలిసి విల్లల జీవితాలతో ఆడుకుంటుంన్నారనీ, పిల్లల తల్లిదండ్రులను మోసగిస్తున్నారనీ అంటే ఎవరూ ఒప్పుకోరు. పైపెచ్చు పిల్లలకు సహాయం చేసామని చెబుతారు. ఇంక ఎవరు మాత్రం ఏమీ చేయగలరు? సంవత్సరమంతా సిలబస్‌, పాఠాలంటూ (శ్రమపఢడం ఎందుకు? అంతా పరీక్షరోజుల్లో సాయం చేస్తే సరిపోతుంది గదా! నిజంగానే ఇలాగే అనుకొంటున్నారు చాలా మంది.దీనివల్ల చెప్పే టీచర్లకు కూడా ఆసక్తి లేకుందా పోయింది. చదివే పిల్లలు చదవడం మానుకొన్నారు. పదో తరగతి పిల్లలకు సంవత్సరమంతా ఎలా పాసవ్వాలో శిక్షణ ఇస్తూ ఉంటారు. పిల్లలు పది పూర్తిచేసి బయటకు వచ్చి బతాకాల్సి వచ్చినపుడు ఈ పాస్‌లూ మార్కులూ ఎందుకూ పనికిరావు. వాళ్లకు మిగిలేది చదవడమూ, రాయడమూ కాస్తంత గణితమూ. అందుకే ఐన్‌స్టీన్‌ బడిలో సంపాదించిన జ్ఞానాన్ని గురించి ఒక మాట అంటాడు. “బడిలో నేర్చుకొన్నదంతా మరిచిపోయిన తర్వాత ఏదిమిగిలి ఉంటుందో అదే జ్ఞానం అంటాడు. ఇప్పుడు మన పిల్లలకు మిగిలింది ఏమిటి? ఎంతసేపటికీ నూటికి పదిమంది చదివే ఉన్నత చదువుల గురించే ఆలోచిస్తారు. తొంభైమంది సంగతి గాలికి వదిలేశారు.

“సార్‌ ఏమిటి ఆలోచిస్తున్నారు. మాకు మీరేదిక్కు” అంటూ (పాధేయవడసాగారు. శంకర్‌ (వ్రసాద్‌లిద్దరూ. అవనరం వారిదీమరి.“నేను సాయంకాలం వచ్చి మీతో మాట్లాడతాను. మీకు చదువు నేర్చే బాధ్యత తీసుకొంటున్నాను. ధైర్యంగా ఉండండి" అని వారికి భరోసా ఇచ్చాను.

నిటీ బస్సెక్కి కూర్చోగానే అనేక ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. హామీ అయితే ఇచ్చాను గాని ఓపిగ్గా చెప్పగలనా? ఎన్ని రోజులు పడుతుందో? సందేహించాను, భయపడ్డాను. కాని పిల్లల శక్తి సామర్ధ్యాల మీద నాకు అపారమైన నమ్మకముంది. టీచర్‌గా నా సర్వీసు పెరిగే కొలదీ పిల్లలతో అనేక అనుభవాలు పొందాను. ఈ అనుభవాల ఆధారంగా బడిని గురించి పిల్లల చదువుల గురించి నాలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

1. పిల్లలు బడిలో చదువు నేర్చుకోవడానికీ, నేర్చుకోలేకపోవదానికీ వారి తెలివితేటలకూ ఏ సంబంధమూలేదు.

2. పిల్లలు బడిలో తమశక్తి సామర్ధ్యాలను ప్రదర్శించడానికి ఎలాంటి అవకాశంలేదు. సాధ్యమైనంత వరకూ వాటిని అణచుకొని తమనుతాము అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 3. కొందరు పిల్లలు పదేళ్లు బడిలోఉన్నా చదవలేకపోవడానికీ, రాయలేకపోవడానికీ కారణం టీచర్లు చెప్పకపోవడం కాదు, టీచర్లు చెప్పకపోయినా బడికి వచ్చినందుకైనా 50 అక్షరాలు గుర్తుపట్టి అక్షరం పక్కన అక్షరం పెట్టి చదవడం రాయడం స్వయంగా నేర్చుకొని ఉండాలి. ఆ మాత్రం నేర్చుకోగల్లిన శక్తిసామర్థ్యాలు పిల్లలకున్నాయి. బడిలో టీచర్ల వల్లా బోధనా పద్ధతులవల్లా విల్లల్లో ఏర్పడ్డ మానసిక సమస్యఇది.

4. భయం- ఈ అర్ధంగాని చదువుల వల్లా, టీచర్‌ మాటలవల్లా పరీక్షలు, మార్కులు, పాన్‌, ఫెయిల్‌- ఇలాంటి వాటి వలన బడిలో ఒకరకమైన భయం ఏర్పడుతుంది. ఈ భయం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యంపైన (ప్రభావం చూవిన్తూ ఉంటుంది.

5. ఆత్మన్యూనత - చాలా విషయాలు అర్ధం కానందు వల్ల నిరంతరం ఇతరులతో పోటి ఉన్నందు వల్ల (పరీక్షలు మార్కులు ఒక రకమైన పోటీయే) ఆత్మన్యూనత ఏర్పడుతుంది. తనను తాను అసమర్భునిగా భావించుకొంటాడు.

6. విల్లలను చదువులపేరుతో హింసించడం తిట్టడం మాని ఆత్మవిశ్వాసం కల్లించేలా ధైర్యం చెప్పాలి. ప్రోత్సహించాలి. భయాన్ని ఆత్మన్యూనతను పోగొట్టాలి. వానే చదువుకౌంటారు. వృత్తి నిపుణులపేరుతో కొంతమంది కౌన్సిలింగ్‌ ఇస్తూ పిల్లల్ని హింసిస్తూ ఉంటారు. ఈ కౌన్సిలింగ్‌ సన్నిహితంగా ఆత్మీయంగా ఉండే టీచరే చేయాలి. ఈ విషయాలన్నీ నాకు గుర్తుకురాగానే నా పని సులువుగానే పూర్తవుతుందని నమ్మకం ఏర్పడింది.

సాయంకాలం బన్సుదిగగానే (వసాద్‌ శంకర్‌లు పరుగెత్తుకొంటూ నా దగ్గరకొచ్చారు. ఇంటికెళ్లి బడలిక తీర్చుకొని ఒక అరగంటలో వస్తానని చెప్పాను. పాపం వారి ఆత్రం వారిది. నాకూ ఆసక్తిగానే ఉంది. ముందు వారికెంత వచ్చో, ఏమిరాదో తెలుసుకోవాలి. గణితం, భాషల్లో ప్రాధమిక విషయాలు (బేసిక్స్‌) ఎంత వచ్చో తెలుసుకోడానికి నేను కొంత సరంజామా సిద్ధంచేసుకొని ఉన్నాను. ఈ నరంజామా నాలుగు స్థాయిల్లో ఉంటుంది. ఈ సరంజామా అంతా తీసుకొని శంకర్‌ పనిచేసే ఫొటోస్టూడియోలో కూర్చొన్నాం. ఒక అరగంటలోనే వారికెంత తెలుసో? రానిదేదో అర్ధమైపోయింది.

వీరికి తొంభైశాతం వచ్చు. మిగిలిన పదిశాతం కూడా నందేహాలేకానీ రాకపోవడంగాదు. గణితంలో బాగా వెనుకబడి ఉన్నారు. స్థాన విలువలు, సంఖ్యామానం, క్లిష్టంగా ఉన్న తీసివేతలు, భాగహారాలు, ఆయా సందర్భాలలో సున్న(0) విలువ తెలియదు. వదిరోజుల కృషితో దారిలో వడ్డారు. ప్రోత్సాపాంచడం, థైర్యంచెప్పడం కాన్ని చిన్నవిన్న పొరపాటు అభిప్రాయాలను సరిదిద్ది ధారాళంగా చదివే అలవాటు చేయడం. ఇవే నేను చేసిన పనులు. వారి శ్రద్ధా, భవిష్యత్తు మీద ఆశా, అవసరాలే వారు వేగంగా నేర్చుకొనేటట్లు చేసాయి.

పదిరోజులు నేను చేసిన కృషి వివరిస్తాను.

1. పరీక్షించిన రోజునుంచే పని ప్రారంభించాను. వారికి ఇప్పుడు రాయడం ముఖ్యం. తప్పుల్లేకుందా రాయాలంటే మొదటచేయాల్సిన వని స్పష్టంగా, భావయుక్తంగా, ధారాళంగా చదవడం రావాలి. ముక్కుకూ, నసుగుతూ చదువుతున్నారు. ఎలా చదవాలో వినిపించి చిన్నచిన్న కథల పుస్తకాలిచ్చి రాత్రికి బాగా చదువుకొని రమ్మని చెప్పాను. పాపం రాత్రి చాలాసేవు మేలుకొని ఒక్కో కథ నాలుగైదుసార్లు చదివి, మరుసటి రోజు నాకు చదివి వినిపించారు. నేను ఆశ్చర్యంపోయాను. ఒక్కరోజులోనే చాలా అభివృద్ధి కనబడింది. అంటే పఠనాన్ని ఎంత నిర్తక్ష్యం చేస్తున్నామొ అర్ధమయింది.

2. భయాన్ని సిగ్గుపడటాన్ని దానికి కారణాలను వివరించి - తప్పో ఒప్పో రాయడం, మనం రాసింది మనవే తప్పులు సరిచూనుకోవడం, వుస్తకంలో ఉన్న కథలను సొంతమాటల్లో రాయడం అలవాటు చేసాను. రాసేటప్పుడు ఎక్కువగా చేసే పొరపాట్లను సరిదిద్దాను.

3. ఎక్కువ తప్పులు పోతున్నవి గుడిదీర్టం, ఏత్వం, ఓత్వం- ఉన్నచోట్ల తీసేయడం లేనిచోట్ల ఇవ్వడం-దీనికి కారణం వీటిని దీర్ధంగా భావించడంలేదు. కకా, కికీ, కుకూ, కెకే కొకో, ప్రతి రెండో అక్షరం దీర్షమే. పొల్లు అన్నా దీర్జంఅన్నా ఒకటే, సౌలభ్యంకోసం కొన్ని అక్షరాలకు దీర్జాన్ని 'కా మాదిరి భూమికి సమాంతరంగా. కాకుండా పైకి మళ్లించారు. "కీ, కే, కో- ఈ మూడు అక్షరాలకు దీర్ధం(పొల్లు) భామిక సమాంతరంగా రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అర్ధం చేసుకోవడం కష్టం అవుతుంది కదా.

ఇలా వివరించి రాసేపదాన్ని ముందుగా పైకి పలుకుతూ రాయమని సలహా ఇచ్చాను.

4. ద్విత్వాలు(క్కప్ప) తప్పుల్లేకుండా రాస్తున్నారు. కాని సంయుక్తాలు (క్ర, రృ) అక్కడక్కడా ఇబ్బంది పడుతున్నారు. విడదీసిరాయడం ఎలాగో నేర్పించాను.

సుల్తాను - సుల్‌తాను, - కార్యం - కార్‌యం

చక్రవర్తి - చక్‌ రవర్‌తి, ప్రయత్నం - ప్‌ రయ త్‌నం. హల్లు నిండు అక్షరంగాను, నిండు అక్షరం వత్తుగాను మారడం గమనింవచేసాను.

5. ష స శ చ-ల ళ-న ణ - లమధ్య ద్వని బేధాలను గుర్తింపజేసి తప్పులు రాసే సందర్భాలను తెలియజేసాను.

6. వత్తు అక్షరాలు -ఖఘఛరుఠతధథధఫభ - ముఖ్యంగా ధ,భృఫ-లు ఎక్కువగా వాడుకలో ఉన్నకొన్ని పదాలను గుర్తించి ఒక జాబితా ఇచ్చాను.

7. జృఇరుథ - వీటిని చూసి భయపడకుండా ఏపదాల్లో వస్తాయో వివరించాను.

8. అనుమానం వచ్చినపుడు ఎలా మాట్లాదుతున్నామో అలాగే రాసి, తరువాత తప్పొప్పుల గురించి ఆలోచించి సరిచేసుకోవల సిందిగా సలహా ఇచ్చాను.

9. మ, య - గుణింతంలో మొమో-యెయో-ఇలా రాసే సంప్రదాయాన్ని తెలిజేసాను.

10. ప్రామిసరీనోటు రాయడం, రశీదు రాయడం, అప్లికేషన్లు పూర్తిచేయడం, రైల్వే రిజర్వేషన్‌ఫారం పూర్తి చేయడం, బయోడేటా రాసిపెట్టుకోవడం, ఆర్జీరాయడం, బ్యాంకులావాదేవీలు, జమ చేయడం, నగదు తీసుకొనే ఫారాలు పూర్తిచేయడం నేర్పాను.

11. గణితంలో రానివేవో అవినేర్పాను. సులభంగానే నేర్చుకొన్నారు. జమా ఖర్చులు ఎలారాయాలో నేర్పాను. బ్యాంకు

పిల్లల్ని పరీక్షించకండి-ప్రోత్సహించండి.

తెలుగు భాషాభిమానులు, పిల్లల చదువులపై శ్రద్ధజన్నవారు, అధికారులు. స్కూళ్లకు వెళ్లుతూ ఉంటారు. ఏదో ఒక తరగతిగదిలో అడుగుపెడతారు. పరిచయం చేసుకొంటారు.

పిల్లల్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఏదీ ఒకపద్యం చెప్పండి? సవర్ణదీర్ధసంధి సూత్రం చెప్పండి? ప్రకృతికి వికృతి చెప్పండి? మన రాష్ట్రపతి ఎవరు? మనదేశ సరిహద్దులు చెప్పండి. పందొమ్మిదో ఎక్కం చెప్పండి. ఇలాంటివి ఏవో అడుగుతారు. ఇలా అడిగి పిల్లలకు ఏమీరాదని, అక్కడి టీచర్లు ఏమీ చెప్పడం లేదని నిరూపించదలిచామా?

ఆ సమయంలో పిల్లలు ఎలాంటి స్థితిలో ఉంటారు? ఎవరో వచ్చారు, ఎవరిని ఏమి ప్రశ్నిస్తారో అని భయపడుతూ ఉంటారు. ఈ భయంతో వచ్చింది కూడా మరచిపోతారు. ఆ సమయంలో ఏమీ ప్రశ్నించకండి. వాళ్లు ఇబ్బందులుకూడా అడక్కండి. ఏమి చెబితే ఏమవుతుందో అని ఎవరూ ఏమీ చెప్పరు.

స్కూలుకు వెళ్లేటప్పుడు నాలుగు కథల పుస్తకాలు తీసుకెళ్లండి. ఒక కథను చెప్పమని అడగండి. లేదా మీరు తెచ్చిన కథల పుస్తకం ఇచ్చి చదవమనండి. అంతా డ్రద్ధగా వినండి. ఆ కథలో విషయాలను ్రశ్నించకండి. ఆ'కథిను అనుభూతి పొందడమే ఇక్కడ ముఖ్యం. మీరు బాగా చదివగల్గితే ఒక మంచి కథచదివి వినిపించండి. నీకు వచ్చినదేదైనా పిల్లలముందు ప్రదర్శించండి. జోక్స్‌ చెప్పండి. లేదా జోక్స్‌ చెప్పమని పిల్లల్ని అడగండి. ఆ కొద్ది సమయంలో మీరొక మంచి జ్ఞాపకంగా మిగిలిపొండి. చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వుతో సెలవు తీసుకోండి. మీరు తీసుకెళ్లిన పుస్తకాలు పిల్లలకు బహూకరించండి.

పిల్లలు తెలుగు మాటల్ని తెలుగు సంభాషణలను, తెలుగు సాహిత్యాన్ని తెలుగు పుస్తకాల్ని (ప్రేమించేటట్లు చేయండి. భయపెట్టకండి.


పాసువుస్తకంలో బ్యాంకువారు ఎలా జమాఖర్చులు రాస్తారో పుస్తకం పరిశీలింపజేశాను.

12. చివరలో 5 పదాలు ఇచ్చి కథ రాయమన్నాను. కథ అద్భుతంగా రాసారు. ఆనందంగా రాసారు.

“జీవితంలో ఇంత ఆనందంగా, ఇంత ధైర్యంగా స్వంతంగా ఇంతవరకూ రాయలేదు. ఇలా రాయగలమని మాకు తెలియదు. సార్‌ ఏమీ అనుకోరంటే ఒక మాట చెబుతాము. మీరు తెలుగు వండితులుగదా వద్యాలు, (ప్రతివదార్థం, సంధులు, సూత్రాలు ఇలాంటివి చెబుతారోమోనని భయపడద్దాం. తెలుగు ఇంత సులభమా? మరి అందరూ తెలుగు ఇలా ఎందుకు చెప్పరు” అని ప్రశ్నించారు.

“సర్‌ ఇన్నేళ్లు భయం భయంగా నేర్చుకొన్నాం. ఈ పదిరోజుల్లో ఇన్ని విషయాలు నేర్చుకొన్నాం. చదువంటే భయం పోయింది. ఇప్పుడు మళ్లీ కాలేజీలో చేరి చదవాలనిపిస్తున్నది. మీ రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేం. మీ ఫీజు ఎంతో చెబితే ఇచ్చుకొంటాం” అంటూ నా గురుదక్షిణ ఎంతో చెప్పమన్నారు.

“మీరు భయంభయంగానైనా బడిలో ఎంతో నేర్చుకొన్నారు. కాకపోతే కర్ణుడి శావపంలా, భయంవల్ల ఆచదువు ఎందుకూ ఉపయోగంలేకుందా పోయింది. నేను కొన్ని కొత్త విషయాలు నేర్ప్చిఉండవచ్చు. నేను చేసింది మీకు ధైర్యంచెప్పి ఆత్మవిశ్వాసం కల్గించడమే. బడిలో ఉపాధ్యాయుల్లాకాకుండా మీతో స్నేహంగా సన్నిహితంగా ఉన్నాను. ఇందువల్లనే మీరు నేర్చుకొన్నారు. ఫీజు సంగతి అంటారా? నానుండి మీరెంత నేర్చుకొన్నారో మీనుండి కూడా నేను ఎంతో నేర్చుకొన్నాను. నాకు ప్రభుత్వం జీతం ఇస్తున్నది. నేను నా తెలుగునేగదా నేర్పాను. ఒక పనిచేయండి. మీలాంటి యువతీ యువకులు మీచుట్టూ ఉంటారు. మీలానే ఇబ్బంది పడుతుంటారు. మీరు నేర్చుకొన్న విషయాలన్నీ దాచుకోకుండా వారికి నేర్పించండి అంటూ నా ఆశీస్సులు అందించాను.

మరునాడే ప్రసాదు ఎలక్ట్రిక్‌ షాపులో ఉద్యోగంలో చేరాడు. మూడోరోజు మా యింటికొచ్చి బెడ్‌లైట్‌ ఒకటి బహూకరించాడు. మీకు కరెంటుకు నంబంధించి ఏ వన్తువు కావాలన్నా మా షాపుకురండి. లేదా ఫోన్‌ చేసి చెప్పండి తెచ్చి ఇస్తానని తన షాపు విజిటింగ్‌కార్డు ఇచ్చి నన్ను తన కష్టమర్‌గా చేసుకొన్నాడు.

శంకర్‌ ఆవీధిలోనే ఒక వారం తర్వాత కొత్త ఫొటోస్టూడియోపెట్టి నాచేతనే ప్రారంభోత్సవం చేయించాడు. ఇది కథ కాదు ఒక అనుభవం.

ఇప్పటినుండి నా మనస్సులో ఒక ప్రణాళిక రూపుదిద్దుకొన్నది. శంకర్‌ ప్రసాదులాంటి యువకులకు, యువతులకు నిత్య జీవితంలో అవసరమైన తెలుగు గణితం నేర్పాలి. ఇందుకోసం అవసరమైన సిలబస్‌ రూపొందించుకోవాలి. 15 రోజులు, నెల రోజులు, 3 నెలల కోర్సులు పెట్టి సద్దిఫికెట్లు ఇవ్వాలి. ఈ ఆలోచన రేపోమాపో కార్యరూపంలో పెట్టాలనుకొంటూ ఉన్నాను. ఇంతలో రెండు ఉపద్రవాలు వచ్చి పడ్దాయి. ఒకటి నా అనారోగ్యం, రెండు కరోనా. ప్రస్తుతం ఆశానిరాశలమధ్య కొట్టుకులాడుతున్నాను.

భవిష్యత్తులో తెలుగు భాషాభిమానులు ఈపని చేస్తారని ఆశిస్తున్నాను. తెలుగును (బ్రతికించుకోవడం ఒక్కటే మన ఆశయంకాదు. బ్రతుకు తెరువుకోనం తెలుగును ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనం పిల్లలకు నేర్పాలి.

ఒక వ్వక్తితో అతనికి అర్థమయ్యే భావలో మాట్లాడినవ్చుడు ఆ మాటలు అతని తల వరకే చేరుతాయి. అతని మాతృభాషలో మాట్లాదితో అవి మననులో

- నెల్సన్ మండేలా