Jump to content

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం

వికీసోర్స్ నుండి

వలసవాదం

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు

9866 28846

అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం

అభివృద్ధి చెందిన దేశాల భాషలు ప్రపంచ భాషలుగా చెలామణి కావటం, అట్లా వాటిని చెప్పుకోవటం అనే కొత్త పోకడ ఒకటి మన మానవాళి సంస్కృతిలో భాగమైంది. ఇంగ్రీషు, ఫ్రెంచి, స్పానిష్‌, పోర్చుగీసు, మొదలైనవాటిని ప్రపంచ భాషలని అనడం పరిపాటైపోయింది. అసలు ప్రపంచ భాషలంటే ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడటం, నేర్చుకోవడం, అనేకమంది వాటిని రెండవ భాషగా వాడటం, జనాభా పరంగానే కాక, భౌగోళికపరమైన విస్తరణా, అంతర్జాతీయ సంస్థలూ దౌత్య నంబంధాలలో వినియోగం మొదలైన లక్షణాలను కూడా కూడగట్టుకొని వర్గీకరణ జరుగుతోంది (ప్రపంచ భాషలని జి-? భాషలుగా పేర్కొంటూ మరికొన్ని, అరబిక్‌, చైనీసు, హిందీని కూడా కలుపుకున్నా పైన చెప్పినవాటికి ఉన్న రక్తసిక్త చరిత్ర వీటికి ఉన్నట్లు లేదు).

అయితే వీటికి ఈ లక్షణాలు ఎట్లా వచ్చాయి, ఇవి మాత్రమే ప్రపంచ భాషలుగా ఎట్లా ఎదిగాయో మనం తెలుసుకోవాలి. ఇవి (ప్రపంచ భాషలుగా రూపుదిద్దుకొనే క్రమంలో విచక్షణారహితంగా జరిగిన ఆదివానుల జననష్టం, దురాక్రమణలూ, వలసవాదుల హింసా ప్రవృత్తి, ఇవి దేశీయ భాషలూ వాటిని మాట్లాడే జాతుల, తెగల జనాభా అడుగంటిపోవదానికి కారణం అని ఎన్నో వరిశోధనలు నిరూపిస్తున్నాయి.

పదిహేనవ శతాబ్దం ముగిసేనాటికి భారత దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే నెపంతో ఇద్దరు నావికులు తమ నౌకా దండుతో ప్రయాణమయ్యారు. వారిలో ఒకరైన క్రిస్టోఫర్‌ కోలంబన్‌, స్పైన్‌ నుంచి బైలుదేరి (1492) పడమటివైపు ప్రయాణించి అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని దాటి మధ్య అమెరికాలోని బహామా దీవులను (ఇప్పటి మధ్యఅమెరికాకు చేరువలో ఉన్న దీవులు) చేరుకొని దాన్నే ఇండియాగా బ్రమించాడు. అవే తర్వాత వెస్ట్‌ ఇండీస్‌ అంటే పడమటి ఇండియా దీవులుగా టప్రనిద్ధి చెందాయి. రెండవ దండుకు నాయకత్వం వహిస్తూ వాస్కో డా గామా పోర్చుగల్లులోని లిస్బన్‌ నగరం నుంచి బైలుదేరి (1497) తూర్పువైపు ప్రయాణించి ఆఫ్రికాను చుట్టి హిందూ మహాసముద్రం మీదుగా కేరళలోని కాలికట్‌ నగరానికి చేరుకున్నాడు. ఈ రెండు అన్వేషణలూ భారతదేశంలోని విలువైన సుగంధద్రవ్యాలూ, బంగారం, వజ్రాలు మొదలైనవాటి వ్యాపారం కోసమే అయినా చివరకు ప్రపంచ చరిత్రను ఊహించనటువంటి మలువుతిప్పాయి. వీటివలన అమెరికా, ఆఫ్రికా ఆసియా చివరకు ఆస్ట్రేలియా ఖందాలలోని కోట్లాదిమంది దేశీయ తెగలూ జాతుల జన నష్టంతో బాటు, వారి భాషలూ వాటితోబాటు వారి నంన్కృతులకూ అంత్య కాలం దాపురించింది. ఈ సముద్ర మార్గాలను కనుగొన్న ఐరోపా వాసులు వాటిని వ్యాపారానికి కాక ఇతర ఖండాలలోని తెగలూ జుతులపైన దాడిచేసి, ఆక్రమించి వలసదేశాలుగా మార్చివేసేందుకు వినియోగించారు.

పోర్చుగీసు ఒక భాషగా గుర్తింపు పొందినది 12వ శతాబ్దంలో. అప్పటివరకూ దానికి ఒక గ్రామ్య భాషగానే అంటే లాటిను

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |

మాండలికంగానే గుర్తింపు ఉండేది. 1296లో రాజభాషగా వాడేందుకు నిర్ణయం జరిగింది. 12-14 శతాబ్దాలలో వాడిన పోర్చుగీసును ప్రాచీన పోర్చుగీసు అనేవారు. 15636 లో మొట్టమొదటి సారి పోర్చుగీసు భాషా వ్యాకరణాన్ని గ్రంథస్తం చేశారు. అయితే 15-16 శతాబ్దాలలో పరిశోధనలూ అన్వేషణల మూలంగా సొంత దేశపు ఎల్లలను దాటి ప్రపంచంలోని ఇతర దేశాలకు సాగిన వలసలలో భాగంగా పోర్చుగీసు ప్రపంచ భాషగా విస్తరించింది. ప్రస్తుతం 10 చిన్నా పెద్ద దేశాలలో అధికార భాషగానూ మొత్తమ్మీద షుమారు 28 కోట్లమందికి ప్రధాన భాషగా ఉన్నా అసలు పోర్చు గల్లులో పోర్చుగీసు మాట్లాడేవారి జనాభా మాత్రం కోటి మంది మాత్రమే.

2015 లో ప్రపంచంలో ఇంగ్లీష్‌ మాట్లాడేవారు ప్రపంచవ్యా ప్తంగా 150 కోట్లమంది (ప్రపంచ జనాభా మొత్తం 700 కోట్లు) ఉన్నారని ఒక అంచనా (సెయింట్‌ జార్జ్‌ ఇంటర్నేషనల్‌, ద లాంగ్వేజ్‌ స్పెషలిస్ట్‌). వీరిలో ప్రథమ భాషగా కంటే, రెండవ, మూడవ భాషగా మాట్లాడేవారి సంఖ్యే ఎక్కువ.

2015 లో, ప్రపంచంలోని మొత్తం 195 దేశాలలో, 67 దేశాలలో “అధికారిక హోదా” తో ప్రాధమిక భాషగా ఇంగ్లీషు ఉన్నా ఇంగ్లీషును ద్వితీయ “అధికారిక భాషగా మాట్లాదే 27 దేశాలు కూడా. ఉన్నాయి.

ఇక వేరే (1005://90101.61013600/069823%.0090/ 40ఫస(0రేఖం%6యై గణాంకాల ప్రకారం బ్రిటన్‌, ఐర్లాండ్‌, యుఎస్‌ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లాంటి కొన్ని కరేబియన్‌ దేశాల ప్రధానభాష లేక స్థానిక భాష ఇంగ్లీష్‌ కానీ 57 దేశాలలో (ఘనా, నైజీరియా, ఉగాంద్యా, దక్షిణాఫ్రికా, ఇండియా, పాకిస్తాన్‌, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, ఫిజి, వనాటు మొదలైనవి), ఇంగ్లీషును “అధికారిక హోదా” కలిగిన భాషగా వాడుతారు. ఇవి ఎక్కువగా మాజీ వలసరాజ్య దేశాలు, ఇవి ఇంగ్లీషును వాటి ముఖ్య వ్యవస్థలలో వాడుక భాషగా చేశాయి. ఆపైన అత్యంత ప్రజాదరణ పొందిన అధికారిక వలస భాష (ఫ్రెంచ్‌ (31 దేశాలకు వర్తిస్తుంది). తరువాత స్పానిష్‌ (25దేశాలలోనూ), పోర్చుగీస్‌ (13 దేశాలలోనూ) అధికారిక లేక ప్రధాన భాషగా గుర్తింపును పొందాయి.

మ2-14 శతాబ్దాలలో ఐరోపా ఖండంలో వచ్చిన బ్లాక్టెత్‌ మళ్లీమళ్ళీ తిరగబెట్టిన ప్లేగువ్యాధులూ, కరువుకాటకాలవల్లా యుద్ధా లవలనా వాటికి తోడు అరాచకత్వం, తిరుగుబాట్లు, దోవిడీలతో మందగించిన ఆర్థిక వ్యవస్థతో ప్రజాజీవనం చిన్నాభిన్నం అయింది. 15వ శతాబ్ది చివరికి ఇంగ్లీషువారి జనాభా 80 లక్షలు మించదని పరిశోధకుల అభిప్రాయం (మిడిఎవల్‌ పాపులేషన్‌ దైనమిక్స్‌ టు క్రీ.శ. 1500, పార్ట్‌ సి: ద మేజర్‌ పావ్యులేషన్‌ చేంజస్‌ అండ్‌ డెమోగ్రఫిక్‌ ట్రెండ్స్‌ ఫ్రమ్‌ 1250 టో చ. 1520).

అయితే, 16వ శతాబ్ది మొదటిపాదంలో ఆర్థిక వ్యవస్థగాడిలో పడటంతోబాటే రాజకీయంగానూ ఇంగ్లండు బలోపేతం అయింది. 16 వ శతాబ్దం చివరి నుండి 18 వ శతాబ్దం ప్రారంభందాకా, ఇంగ్లండురాజ్యం విదేశీ వలసలతో ఆస్తుల సంపాదనా వాణిజ్య వ్యాపారాల వ్యవస్థల స్థావనతో మొదలై చరిత్రలోనే కనీవినీ ఎరగని అతిపెద్దదైన బ్రిటీషు సామాజ్యంగా అవతరించింది. 16 వ శతాబ్దంలో చిన్న వలస ప్రాంతంగా ఉత్తర అమెరికాలోని జేమ్స్‌ టౌనుతో మొదలైన అమెరికా వలస విధానం నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి ఇంగ్లండు వలసవాదులు అమెరికా ఆదివాసులతో జరిపిన యుద్ధంలో పాస్పెఘా అనే రెడ్‌ఇండియను తెగను నిర్మూలించింది.

ఇలాంటి సందర్భాలను పురస్కరించుకొని, గత సంవత్సరం అక్టోబర్‌ 14న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో “కొలంబస్‌ దే” జరుపుకొన్నారు అంటే, జాత్యహంకార మారణహోమానికీ, మన నేలను ఆక్రమించి మనల్ని అనాగరిక బానిసత్వానికి గురిచేసి మన పిల్లలనూ వయోజనులనూ వరుస మానభంగాలకూ ఇంకా శారీరక హింసలకూ గురిచేసి మన భాషలనూ మన సంస్కృతులకూ మరణ శాసనాలు రాసిన నరరూప రాక్షసులకు నాయకత్వం వహించిన కొలంబన్‌ అమెరికా ఖండంలోని ఒక ద్వీపంపై కాలుమోవీన నాటిరోజును ఒక దినోత్సవంగా జరుపుకుంటారా అంటూ దానికి వ్యతిరేకంగా స్థానిక అమెరికన్లు అమెరికా సంయుక్తరాష్ర్రాలలో అనేక నగరాలలో నిరసనలు తెలియజేశారు. కొలంబస్‌ అప్పటికే 100 మిలియన్ల మంది నివసించే అమెరికా ఖండాన్ని కనుగొనలేదు అలా కాదని మేము నిరూపించగలమంటూ ఎన్నో సాక్ష్యాలను చూపారు.

క్రిస్టోఫర్‌ కొలంబస్‌ (1492) రాక ముందు అమెరికాలోని స్థానిక ప్రజల జనాభా సంఖ్యను ఊహించడం కౌంత కష్టమైనా యూరోపియన్‌ వలస నివాసుల నుండి పురావస్తు ఇంకా రాతపూర్వక ఆధారాలతో చాలా మంది వండితులూ మరి కొంతమంది చరిత్రకారులూ - సుమారు 5-10 కోట్లమంది లేక అంతకంటే ఎక్కువ ఉండవచ్చని లెక్కకట్టారు. ఐతే ప్రస్తుతం వారి జనాభా 30 లక్షలు మాత్రమే. అయితే వీరిలో 30% కంటే తక్కువమంది మాత్రమే వారి మాతృభాషలను మాట్లాడగలుగుతున్నారు. అంటే 500 ఏండ్లలో అమెరికా ఆదివాసుల జనాభా పెరుగుదలమాట అటుంచి షుమారు 20 నుంచి 30 వంతుల తరుగుదల కనిపించడం జనాభా గణాంకాల పరిశోధకులకు ప్రశ్నార్థకంగా నిలిచిపోయింది.

అమెరికాలోని స్థానిక వ్రజలు అంటే రెడ్‌ ఇండియన్లు ఐరోపాదేశాలనుంచి వలసవచ్చినవారి వరిచయంతో వారి జనాభా పెరుగుదలలో బలమైన అడ్డంకిని ఎదుర్కొన్నారు అని వరిశోధనలు తెలుపుతున్నాయి. పరిశోధనల ఫలితాలు ఇలా ఉన్నాయి. పురావస్తు, చారిత్రక రికార్డులు యూరోపియన్ల సంపర్మం వల్ల రెడ్‌ఇండియన్ల జనాభాలో విస్తృతమైన మరణాలు సంభవించాయని సూచిస్తున్నాయి. ప్రాచీన-సమకాలీన మైటోకాన్దియల్‌ డిఎన్‌ఎతో అతివిస్తృతమైన సమాచారాన్ని ఉపయోగించి నిర్వహించిన అత్యాధునిక జన్యు అధ్యయనంలో, స్థానిక అమెరికన్ల జనాభా పెరుగుదలలో గణనీయమైన నష్టాన్ని కలిగించిందని సూచిస్తోంది. యూరోపియన్‌ వలసరాజ్యం దేశీయ అమెరికన్లలో యూరోవియన్ల వలసలు విస్తృతమైన మరణాలను ్రేరేపించిందని పేర్కొంది. (ఖైండన్‌ డి. జె ఫలోన్‌ అన్‌ లార్స్‌ ఫె'హైన్‌-శ్శిర్డ్‌, పిఎన్‌. ఏ.ఎస్‌. డిసెంబర్‌ 20, 2011 1ుం:/601.08/ 10. 1073/102. 1112563108) కొలంబస్‌ ఇంకా అతని సహచరులు అమెరికాను న్యూ వరల్డ్‌ అని పిలవడం దుర్మార్గం. వాస్తవానికి, రెడ్‌ఇండియన్లుగా మనం పిలుచుకొంటున్న ప్రజలు, అనగా తయినో, ఆరవాక్‌, లుకాయన్లు, అనే వందలాది అమెరికన్‌ ఆదివాసి తెగలవారు ఈ గద్దపై అప్పటికి 14000 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు.

యూరోపియన్లు అమెరికన్‌ తీరాలను చేరిననాటి నుండి, శ్వేతజాతుల నాగరికతకూ అమెరికా ఖండపు ప్రాకృతిక ప్రపంచంలోని వివిధ తెగలకూ వారి మధ్యనున్న తేడాలు అనేక ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణలు ఏదో ఒక చోట కాక అమెరికా అంతటా విన్తరించాయి. ఈ వుర్నణలే అమెరికా నంయుక్తరాష్రాలు రెడ్‌ఇండియన్లపై 1,500 యుద్ధాలూ, దాడులూ జరవడానికీ దారితీసింది. ప్రపంచంలోని ఏ దేశానికైనా దాని స్వంత ప్రజలకు వ్యతిరేకంగా ఇలా చేయడం ఎక్కదా కనబడదు. 19 వ శతాబ్దం చివరలో రెడ్‌ఇండియన్లపై యుద్ధాలు ముగిసే సమయానికి, 2,38,000 కంటే తక్కున మంది రెడ్‌ఇండియన్లు మాత్రమే మిగిలి ఉన్నారు. కొలంబస్‌ 1492 లో మొదటిసారి అమెరికా చేరినప్పటి ఉత్తర అమెరికాలో నివసిస్తున్న రెడ్‌ఇండియన్ల జనాభా (హెన్రీ దోబిన్స్‌, 1966) 1 కోటీ 50 లక్షల నుండి ఇప్పటి జనాభా 25 లక్షలకు గణనీయమైన తరుగుదల కనిపిస్తోంది.

1492 లో కొలంబస్‌ సముద్రమార్గంద్వారా ప్రయాణించి తను భరతఖందానికి సత్వర నముద్రమార్గాన్ని కనుగొన్నట్లు తప్పుడు నమ్మకంతో, నేటి హైతీ - డొమినికన్‌ రిపబ్లిక్‌ లేక ఇస్పానియోలా అని పిలిచే చిన్న ద్వీపాలకు ప్రయాణించి చేరుకున్నాడు. వాస్తవానికి దేశంలోని దేశీయ రెడ్‌ఇండియన్లను సాధారణంగా, “ఇండియన్‌” అని పిలవడానికి ఏకైక కారణం ఏమిటంటే, తను భారతదేశంలో ఉన్నానని పొరపాటుగా భావించటమే. తిరుగుప్రయాణంలో 500మంది రెడ్‌ఇండియన్లను బానిసలుగా అమ్మేందుకు బందీలను చేసి పట్టుకెళ్ళాడు.

స్పానిష్‌ రాజు ఫెర్డినాండ్‌, క్వీన్‌ ఇసాబెల్లా నుండి మరింత ఆర్థిక సహకారం పొందటానికి, తను ఇండియాకు త్వరిత మార్గాన్ని కనుగొన్నట్లు వార్తలతో తిరిగి వచ్చాడు. ఇట్లా 1493, 1498, 1502 లలో ఇండియాగా విలవబడదే ఇప్పటి మధ్య అమెరికాకు మరో మూడు ప్రయాణాలకు ఆయన నిధులు పొందారు.

ఆ సముద్రయానాల ఫలితం, ఆదివాసుల భాషలనూ వారి పురాతన నాగరికతలను నాశనం చేయడంతోపాటు, సుమారు ఎనఖై లక్షల మంది రెడ్‌ఇండియన్లను హత్య చేయడం, లక్షలాది మందిపై అత్యాచారం, హింసించటమేకాక వారు అనుభవిస్తున్న లక్షల ఎకరాల భూమిని దోచుకున్నాడు.

ప్రపంచ చరిత్రలో కొలంబస్‌ అంతటి నికృవ్ణుడూ- నిస్సందేహంగా పరమ రాక్షసుడు అని నిరూపించే తిరస్మరించలేని ఐదు వాస్తవాలు చారిత్రకంగా నమోదు చేయబడిన కథనాలు ఉన్నాయి:

కొలంబస్‌ తన అన్వేషణలో “ఆదివాసులను ఏవిధంగానూ గాయపరచకుండా ఉండాలి అని స్పానిష్‌ రాజు ఫెర్డినాండ్‌, రాణీ ఇసాబెల్లాల ఆదేశాన్ని కొలంబస్‌ విస్మరించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు, అతను మధ్య అమెరికాలో 1495 లో తనకు రావలసిన వ్యక్తిగత సుంకంగా ఒక “కట్టుబడి” వ్యవస్థను సృష్టించాడు, 14 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తీ ప్రతి మూడు నెలలకూ ఒకసారి “చిరు గంట” అంత బంగారాన్ని అందించాలి. కట్టుబడి అందించినవారికి వారి మెడలో ధరించడానికి “టోకెన్‌” లాంటిది ఇచ్చేవారు. అలా అందించనివారిని “చేతులు నరికి చంపడం ద్వారా శిక్షించడం”, “చనిపోయేంతవరకూ నెత్తురు ఓడుతుందేట్లు వదిలివేయడం” జరిగేది అని కొలంబన్‌ కుమారుడు సఫెర్నాందో తన దినచర్యలో భాగంగా రాసుకున్నాడు. హైతీ మరియు డొమినికన్‌ రిపబ్లిక్‌లో సుమారు 10,000 మంది అలా వాంనకు గురయ్యారు. చాలా మందిని కొన్నిసార్లు - సజీవంగా ఉండగానే - “ఇనువ మేకులు తేలిన కట్టెల మీద కాల్చటం”... ఇంకా ఆక్రమణదారులు తమ కత్తుల పదును తేల్చేందుకు “ఆదివాసుల విల్లలను ముక్కలు చేయడం”, ఇంకా, కొలంబస్‌ మనుషులు “ఆదివాసుల పిల్లలను తమ తల్లి రొమ్ము నుండి లాగి కాళ్ళుబట్టి, బండలకేని తలలు బాదడం...”, విల్లల మృతదేవోలను వారి తల్లులపైవేని .. కత్తులతో చీల్చడం జరిగేది, “వారి కత్తుల పదును పరీక్షించడానికి, తన మనుషులను “వారి నుండి వరుగెత్తే పిల్లల కాళ్ళను నరికివేయమని” ఆదేశించేవాడట. అతని సిబ్బంది “ఆదివాసులపై ... మరిగే సబ్బునీళ్లు పోయడం” ఇతరులను “బతికుండగానే పీక్కుతినడానికి, ఆదివాసులపై కుక్కలను ఉసిగొల్ప్బడం”, ఇంకా భయానకమైనదేమంటే తమ వేటకుక్కలకు మాంసం అయిపోతే, “ఆదివాసుల పిల్లలను కుక్కలకు ఆహారం కోసం చంపివేయడం” అంటూ బార్జోలోమ్‌ డి లాస్‌ కాసాస్‌ అనే స్పానిష్‌ చరిత్రకారుడూ కాథలిక్‌ పూజారీ తను నమోదుచేసినట్లు, కొలంబస్‌ దండు జరిపిన మారణహోమానికి సాక్ష్యమిచ్చాడు.

కొలంబస్‌ తోటి నావికుడు, మిగ్యుల్‌ కునియో కూడా ఇలా వ్రాశాడు, “మేము స్పెయిన్‌కు బయలుదేరాల్సి వచ్చినప్పుడు, 1,600 మంది మగ ఆడ రెడ్‌ఇండియన్లను సేకరించాము... ఫిబ్రవరి 17, 1495న... మేము ఈ విషయాన్ని... నావికులలో ఎవరైనా కావాలనుకుంటే ... వారిని అనుభవించవచ్చని తెలియపరిచాం.” కొలంబస్‌, నావికులలో ఒకరికి 16ఏండ్ల కరేబియన్‌ అమ్మాయిని బహుమతిగా ఇచ్చాడు. “ఆమె ప్రతిఘటించినప్పుడు (అతడు) ఆమెను కనికరం లేకుందా కొట్టి ఆమెపై అత్యాచారం చేశాడు”. అత్యాచారాల గురించి మాట్లాడుతూ, యూనివర్శిటీ ఆఫ్‌ వెర్మోంట్‌ చరిత్ర ప్రొఫెసర్‌ దాక్టర్‌ జేమ్స్‌ లోవెన్‌ “14938 యాత్ర కరేబియన్‌కు చేరుకున్న వెంటనే ... కొలంబస్‌ తన లెప్టినెంట్లకు స్థానిక మహిళలను బహుమతిగా ఇస్తున్నాడు. హైతీలో, వారిని సెక్స్‌ బానిసలుగా చేసి ఆనందించేవారు.” ఇందులోని వయోజనులూ పిల్లలూ అత్యాచారానికి గురయ్యేవారు ఉన్నారు. “బాలికలలో ... 9-10 వయసువారికి ... డిమాండ్‌ ఉంది” అని కొలంబస్‌ స్వయంగా 1500 లో వ్రాసినట్లు తెలుస్తోంది”. ఒక రోజున, డి లాస్‌ కాసాస్‌ ప్రత్యక్షసాక్షిగా, కొలంబస్‌ సైనికులు “3,000 మంది స్థానికులను విడదీయడం, శిరచ్చేదం చేయడం లేదా అత్యాచారం చేయడం” చూశానని రాసుకున్నాడు. డిలాస్‌ కాసాస్‌ మాటల్లో “ఈ చర్యలను మానవ స్వభావానికి విరుద్ధమైనవిగానూ పరమ నికృష్టమైన వికృతచేష్టలుగా నా కళ్ళకు అనిపించాయి. ఇప్పుడు నేను వ్రాస్తున్నప్పుడు నేను వణుకుతున్నాను.” అంటూ పేర్మొన్నాడు.

అతి క్రూరమైన పాశవిక మారణకాండను ఎదుర్కొంటున్న ఆరవాక్‌ ఆదివాసులు స్పెయిన్‌ వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రయత్నించారు. కానీ వారికి యూరోపియన్ల దగ్గర ఉన్న ఆయుధాలూ తుపాకులూ, కత్తులూ ఇతరత్రా ఇంకా గుర్రాలు కలిగిన యుద్ధసంపదతో పోలికే లేదు. బందీలుగా తీసుకున్న రెడ్‌ఇండియన్లను స్పెయిన్‌ వలసవాదులు ఉరితీయడమో లేదా కాల్చివేయడమో చేసేవారు. ఈ పరిస్థితులలో, ఆరవాక్‌ ఆదివాసులు సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారు. వారు తను శిశువులను స్పానిష్‌ వలసవాదుల నుండి కాపాడటానికి కసావాకంద విషాన్ని తినిపించేవారు. రెండేళ్లలో, హైతీలో ఉన్న 2,50,000 మంది ఆదివాసులలో సగం మంది హత్యకు గురవ్వడమో, అంగవైకల్యం పొందడమో లేదా ఆత్మహత్యల ద్వారా చనిపోవడమో జరిగింది. 1550 నాటికి 500 మంది రెడ్‌ఇండియన్లు మైత్రమే మిగిలారు. ఇక 1650 నాటికి, ఆరవాక్‌ ఆదివాసులుగా ప్రపంచానికి పరిచయమైన

రెడ్‌ ఇండియన్లు అమెరికా ఖండం నుంది పూర్తిగా తుడిచిపెట్టబడ్డారు. వారితోబాటే వారి భాషకూడా వలసవాద యూరపుదేశీయుల దాష్టీకానికి బలైపోయింది. ఈ రక్తసిక్త చరిత్ర పునరావృతం కాకూడదంటే వీటిని మననం చేసుకోవడం మనకు తప్పనిసరి. కాలగతిలో వచ్చిన మార్పులను ఆసరాగా తీసుకొని ఈ నేలపై పుట్టిన జాతులపై వారి భాషలపై ప్రపంచీకరణ పేరుతో పరభాషలను రుద్దే ప్రయత్నాలను జాగ్రత్తగా గమనించాలి. గమనించటమేకాదు వాటిని అద్దుకునే ప్రయత్సమూ చేయాలి.

అమ్మతనం

అందాల కలలలోకంలో
ఆదమరిచి విహరించిన ఆ మనసు..!

'ఉదరపు కుడ్యాలను తడుముతున్న
ఆ వెచ్చని పాదాలు..!

(వెన్నులో నుండి పుట్టుకొచ్చిన
నాడులు నాట్యాలు..!

భరించలేని బాధల సుడుల్లో
తనువు పుండైన తరంగాలు...

వారసుని రాకకు సూచికతో..
(దిక్కులు పిక్కటిల్లేలా సంతోషపు కేకలు..!

ఒకవైపు కండరాలన్ని బరువెక్కి

చీకటి ముసిరిన ఆకళ్లల్లో దివ్యతేజస్సులు,
పొత్తిళ్లలో బిడ్డను చూసిన మది
ఆనందతాండవాలు..!

ప్రతి స్త్రీకి ఆ...నవమాసాలు అద్భుత
అనుభూతులకు ఆలవాలమే!

వారసుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతూ
పొందే అనుభవం ఓ అపురూపవరమే!

- అయిత అనిత 89885 348424