అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఫలితాలు ప్రశ్నార్థకమే!

వికీసోర్స్ నుండి

విద్యావిధానం

డా! సామల రమేష్‌బాబు

98480 16186

ఫలితాలు ప్రశ్నార్థకమే!

జులై 29న కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన జుతీయ విద్యావిధానం మీద దేశవ్యాప్తంగా ఎంతో చర్చ జరుగుతోంది. విధానవత్రం విడుదలైనంత మాత్రాన ఇది వెంటనే అమలులోకి వస్తున్నట్లు కాదు. ఇది పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. రాష్ట్రాలతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి, “విద్యా అనే అంశం రాజ్యాంగంలోని ఏదో షెడ్యూలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండటంతో రాష్ట్రాల ఆమోదాన్నీ తీసుకోవాల్సి ఉంది.

రాష్ట్రాల ఆమోదంతోనే కౌత్త విద్యావిధానం అమలులోకి రాగలుగుతుంది. అమలు కోసం తగిన విధంగా కొన్ని చట్టాలను చేయాల్సి ఉంది. ఇదంతా జరగడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. ఇప్పుడు దీనిలో భాషా విధానానికి సంబంధించిన అంశాలు గురించి పరిశీలిద్దాం.

రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లోని జాబితా ప్రకారం 22 దేశీయ భాషలను అధికార భాషలుగా గుర్తించారు. జాతీయభాషను నిర్ణయించడంలో మన రాజ్యాంగ నిర్మాణకర్తలు ఏకీభావం సాధించడంలో విఫలమై, నాగరలిపిలోని హిందూస్తానీ(హిందీ)ని అధికార అనుసంధానభాషగా అంగీకరించారు. అదే సమయంలో షెడ్యూల్‌లోని 22 భారతీయ భాషలనూ జాతీయ భాషలుగా గుర్తించాలనే అంళం నేటికీ ఒక రాజకీయ డిమాండుగా మిగిలిపోయిందేగాని, చట్టరూపంగా ఆమోదం పొందలేదు. అదే సమయంలో రాజ్యాంగం అమలులోకొచ్చిన 15 ఏళ్లలో జాతీయ అధికారభాషగా ఆంగృం స్థానంలో భారతీయ భాషను నిర్ణయించుకోవాలన్న అంశమూ ఆచరణలోకి రాలేదు. దాంతో ఆంగ్లభాష విద్యా పరిపాలనారంగాల్లో బలంగా చొచ్చుకుపోయింది. అయినా అది విదేశీ భాష అయినందున దానికి జాతీయ భాషగా గుర్తింపు వచ్చే ప్రసక్తి లేదు. దేశమంతటా విద్యాపాలనా రంగాల్లోని వాన్తవస్థితిని పరిగణించి, ఆంగ్లాన్ని కూడా షెడ్యూల్లో చేర్చాలనే డిమాండును కొన్ని బలమైన వర్ణాలు ముందుకు తెస్తూనే ఉన్నాయి. అయితే, విద్యారంగంలో బోధనా మాధ్యమంగా ఆంగ్లమే ఉండాలనే డిమాండు క్రమంగా దేశవ్యాప్తంగా బలాన్ని సంతరించుకుంటోంది. ఈ పరిస్థితులు నలభై ఏళ్ల నాటి విద్యా విధానం నుంచీ క్రమంగా పుంజుకొని, గత 20-30 ఏళ్లలో మరింతగా బలపద్దాయి. మిగిలిన భాషల మాటేంటి?

ఇప్పుడు వెలుగుచూసిన కొత్త విద్యావిధానం చాలా తెలివిగా భాషాసమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించినట్లు కనబడుతోంది. రాజీలేని జాతీయవాదాన్ని అన్ని రంగాల్లోను తీర్చిదిద్దాలనే నేటి కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగానే ఆ ప్రతిపాదనలు సాగాయి. ఆ తపనలో హిందీ, సంస్కృతం తప్ప తక్కిన అన్ని భాషల అభివృద్ధిని, ప్రజల ప్రయోజనాలను, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త విద్యావిధానం చిన్న చూపు చూసింది. బోధనాభాషలుగా వాటి వినియోగం ప్రాథమిక విద్య వరకే లేదా మరి మూడేళ్లకు పరిమితమవుతుంది. వాటి పక్కనే త్రిభాషా నూత్రం ప్రకారం హిందీయేతర భాషలతోపాటు హిందీ, దానితోపాటు సంస్కృుతమూ తప్పనినరి అనకపోయినా అమలులోకి వస్తాయి. ఇంకా విశేషం ఏంటంటే ఇంగ్లీషు భాష ప్రాథమిక విద్య నుంచి ఎంత పైస్థాయి విద్యలోనైనా మాధ్యమంగా ఏదో ఒక రూపంలో తప్పనిసరై కూర్చుంటుంది. అంటే నేటి కేంద్ర పాలకుల దృష్టిలో జాతీయతకు, దేశ ఐర్యతకూ ప్రతిబింబంగా హిందీ, సంస్కృత భాషలు స్థిరపడి, భారతీయతకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. భారతీయులను ప్రపంచ పౌరులుగా నిలబెట్టేందుకు, కార్బారేట్‌ రంగంలోని అన్ని స్థాయిల్లో సేవలందించగల వారిగా తీర్చిదిద్దడం కోసమూ - ఇంగ్లీషు మరింతగా స్థఇరపడి, బలపడుతుంది. మరి తక్కిన 20 భారతీయ భాషల వినిమయం, అభివృద్ధి ఎంతవరకు? నేటి పరిస్థితుల్లో విస్తారంగా అన్ని ఆధునిక అవసరాలకు వినియోగించని భాషలు బతుకుతాయా? వాటికి ఆ సమర్థత లేదా కోట్లాదిమంది మాట్లాడే అతి పెద్ద భారతీయ భాషల ఎదుగుదల కూడా అంతేనా? నేటి కంప్యూటర్‌ యుగంలో- సాంకేతికతను ఉపయోగించుకొని అవి ఎంతైనా ఎదగడానికి అవకాశం ఉంది కదా. అందుకు అద్దుకట్టలు వేయడం సమంజసమేనా అండరూ లోతుగా ఆలోచించాల్సిన అంశమిది. వాటిని విస్మరించారు!

నిజానికి రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలనూ జాతీయ భాషలుగా, ప్రకటించాలి. ఏ భాష అయినా, అది చిన్నదైనా పెద్దదైనా అవకాశమిస్తే ఎంతకైనా ఎదగగలరని, అన్ని భాషలకూ మౌలికంగా ఆ శక్తి ఉంటుందన్న శాస్త్రీయ దృక్పదాన్ని ఈ విధానం విస్మరిస్తోంది. పాఠశాల విద్యను పూర్తిగా మాతృభాషా మాధ్యమంలోనే బోధించాలనే నిర్ణయాన్ని తీనుకోవడంలోనూ కౌత్త జాతీయ విద్యావిధానం విఫలమైంది.

మరొక ప్రధానాంశం ఉంది. ఏ భాషలో మాట్లాడినా, రాసినా, ముద్రించినా దాన్ని వెంటనే మరొక భాషలోకి అనువాదం చేయగల సాంకేతికత ఇప్పుడు అందుబాటులో ఉంది. అందువల్ల ఇప్పుడు దేశం మొత్తాన్నీ ఒకటి రెండు భాషల ఆధివత్యంలోకి తెద్దామనే ఆదిపత్య ధోరణులను పాలకులు మానుకోవాలి. ఈ విషయంలో ఒక విధానపరమైన నిర్ణయాన్ని (ప్రకటించాల్సిన అవసరం ఉందని పాలకులు గుర్తించాలి.

భారతదేశం అనేక భాషాసమూహాలతో ఏర్పడిన సమాఖ్య దాన్ని రాజ్యాంగం గుర్తించబట్టే భాషాప్రాతివదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగం ప్రకారం ఏ విధంగానూ అనమన్యాయం గానీ అన్యాయంగానీ ఎవరికీ జరగకూడదు.

విద్యావిధానానికి సంబంధించి అనేక అంశాలున్నాా దీనికి ప్రాణం లాంటి భాషావిధానాల గురించే, దాని పరిణామాలను మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని వివరంగా అర్ధం చేసుకోవాలంటే కొత్త జాతీయ విద్యావిధానాన్ని సూక్ష్యంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ భాషలను నేర్చుకుని మన విద్యార్థులు అత్యంత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఈ విధాన నిర్మాతలు - అందుకోసం మాతృభాషల్ని శక్తిమంతం చెయ్యాలన్న మౌలిక అంశాన్ని విస్మరించారు!

భావతోపాటు చర్చించాల్సిన అంశాలెన్నో జాతీయ విద్యావిధానంలో ఉన్నాయి. మనదేశంలోని సామాజిక అసమానతలు, చారిత్రక సమస్యలు, సాంస్కృతికతలోని వైవిధ్యాలు లాంటి అంశాల గురించి ఈ విద్యావిధానం మాట్లాడినా, వాటి విషయంలో చేపట్టడలచిన చర్యలన్నీ ఆ సమస్యల పరిష్కారానికి, శక్తివంతమైన భారతీయ సమాజాన్ని నిర్మించే దిశగానూ ఏమాత్రం దోహదం చేయలేవు. పైగా ఈ సమాజాన్ని మరింతగా వైరుధ్యాలతో నిర్వీర్యం చేయడానికే పనికివస్తాయి. మొత్తంగా ఈ విద్యావిధానం పెద్ద పెద్ద ఆలోచనలతో ఆశయాలతో నిండివున్నా, అందుకు అనుసరించదలచిన వ్యూహాలు, విధానాల కారణంగా విరుద్ధమైన వలితాలనిచ్చేదిగా ఉందని చెప్పక తప్పుదు.


తెలుగు వెలుగు” సెప్టెంబరు 2020, సంచిక సౌజన్యంతో

“తమిళనాడులో ఆంగ్ల మాధ్యమం వైపు.

10 వ పుట తరువాయి.......

తెచ్చుకున్నది. తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ వారి 2016-17 విధాన పత్రంలో * పిల్లలకు గరిష్టంగా సదుపాయాలను కల్పిస్తూ, తద్వారా, సాంథింక, ఆర్థిక అడ్బంకులను, అవరోధాలను అధిగమిస్తూ, అందరికీ చదువుకునే విశాల అవకాశాన్నికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. అంతేకాకుండా, సాంఫిక-ఆర్థిక అడ్డంకులు లేకుండా పిల్లలందరూ చదువుకొనునట్లుగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టటడంలో అ(గ్రగామి తమిళనాడు. అన్ని ప్రభుత్వాలు తమ సాఫల్యాలను అతిశయంగా చెప్పుకుంటాయి. కళ్ళ ముందున్న వాస్తవాలను ఒప్పుకుంటున్నప్పటికీ, విద్యాశాఖ వారి దృష్టిలో మాత్రం, నిర్ణీత పట్టిక వేరకు సదుపాయాలు కల్పించడం వల్లే ప్రాథమికవిద్య పెంపొందించబడుతుంది. ఈ నిర్ణీత పట్టికలోని వస్తువులైన - యూనిఫాంలు, జామెట్రీ పెట్టెలు, పుస్తకాలు, ఆంగ్ల మాధ్యమం ఇస్తేనే అది సాధ్యమవుతుంది . కానీ బోధనామాధ్యమం మార్చడమన్నది సంచులు, సుద్దముక్కల పెట్టెలు ఇచ్చినంత సులువు కాదు.

ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యలో “ఉచిత” యూనిఫాంలు, నంచులు, వుస్తకాలు ఇవ్వడం ఒక కోణం. (ఫైవేటు (సొంత) పాఠశాల _ విద్యార్థులకున్న అవకాశాలకన్నా తక్కువ స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నారు. కాని, ప్రభుత్వపాఠశాలలో చదువుకోవ డానికి సమానమైన అవకాశాలు కల్పించామని అధికారులు చెప్పుకోవడం పరిపాటి. ఇది పెద్ద మోసం.

(Why Tamil Nadu shift to English Medium instruction is not helping children వ్యాసానికి ఇది తెలుగుసేత.)


12 వ పుట తరువాయి....


అనే త్రిభాషా విధానం అమలు కావచ్చు. మాతృభాషను తప్పనిసరి చేయని ఈ త్రిభాషా విధానం వలన విద్యావ్యాపారీకరణ నేపథ్యంతో మాతృభాషలకే గండం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక మూడు భాషలకు అదనంగా ఏదేన ఒక భాషను (ఫ్రెంచ్‌, జర్మన్‌, కొరియన్‌, జపనీన్‌ వంటివి) ఒక ఐచ్చిక పాఠ్య విషయంగా తీసుకోవచ్చని జాతీయ విద్యావిధానం 2020లో పేర్కొనబడింది. ఈ విధానంలో అకడమిక్‌ కోర్సులైన సామాజిక, ప్రకృతి మరియు గణిత శాస్త్రాల వంటివి కూడా ఐచ్చిక పాఠ్య విషయాలుగా కుదించబడ్దాయి. అంటే ఎవరైనా ప్రకృతి, సామాజిక మరియు గణిత శాస్త్రాలలో ఒకదానిని (ఆచరణలో సామాజిక శాస్త్రాన్ని) విడిచిపెట్టి ఆంగ్లానికి అదనంగా. మరొక విదేశీ భాషను ఎన్నుకునే వీలు కల్పించబడింది. ఈ వీలును ప్రధానంగా ఉపయోగించుకునేది ప్రైవేటు పాఠశాలలు. ఒక స్థాయి వైవేటు పాఠశాలలలో జర్మనీ, జపనీస్‌, కొరియన్‌ వంటి భాషలకు డిమాండు ఉంది. ఆ డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్దేశాన్ని రూపొందించి ఉండవచ్చు. ఈ విధానం అమలు జరిగితే అధిక ఫీజులు వసూలుచేసే ఐదు నక్షత్రాల ప్రైవేటు పాఠశాలలలో చదివే విద్యార్థులు సామాజిక శాస్త్రాలు నేర్చుకోకుందానే పై స్థాయిలకు వెళ్ళిపోతారు. అట్టివారు నైపుణ్యం కలిగిన కార్బోరేటు మేనేజర్లు కాగలరు గాని సామాజిక స్పృహ కలిగిన పౌరులు మాత్రం కాలేరు. ఈ విధానం యొక్క పర్యవసానంగా తెలుగు రాష్ట్రాలలో, ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం ఉన్న త్రిభాషా విధానం కొనసాగే అవకాశం ఉండగా, ప్రైవేటు పాఠశాలలలో తెలుగును తొలగించి 6వ తరగతి నుంచే నంస్కృతం ప్రారంభం కాగలదు. త్రిభాషావిధానంలో భాగంగా మాతృభాషను తప్పనిసరి చేయకపోవడం మరిమొకవైవు సంస్కృతాన్ని అన్ని పరిధులు దాటి ప్రోత్సహించడం, మాతృభాషా మాధ్యమాన్ని ఐదవ తరగతికి పరిమితం చేయడం ఈ విధానంలో (ప్రధానమైన సమస్యలు. ఈ విధానం పేదల ఎడల మాత్రమే కాక భాషల ఎడల కూడా వివక్షగా పరిణమించగలదు.

రచయిత అఖిలభారత విద్యాహక్కువేదిక అధ్యక్షవర్గ సభ్యులు

ఈ వ్యాసంలో కొంతభాగం “ఆంధ్రజ్యోతి”

15 సెప్టెంబరు 2020 సంచికలో వచ్చింది.


'వికీపీడియా'కు మప్పిదాలు

'సెష్టెంబరు సంచికలో శ్రీ రహ్మానుద్దీన్‌ రచించిన “ఈశాన్య రాష్రాల జనజాతుల భాషలకు పొంచివున్న ముప్పు” వ్యాసానికి సంబంధించి 9,10,11, పుటల్లోనూ ముఖచిత్రంలోనూ ప్రచురించిన ఫోటోలను 'వికీపీడియా” నుంచి తీసుకొన్నాము. వారికి మప్పిదాలు -సం.

భాష నశిస్తే జాతి నశిస్తుంది. వాడని భాష వాడిపోతుంది