Jump to content

అమెరికా సంయుక్త రాష్ట్రములు/పదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి


అమెరికా ప్రజల హక్కులు.

పదవ అధ్యాయము. (1)

జనసంఖ్య
వైశాల్యము.

నేడు అమెరికా సంయుక్త రాష్ట్రములు తూర్పు అట్లాంటికు మహాసముద్రము మొదలు పడమర పసిఫిక్కు మహాసముదమువరకును వ్యా పించి యున్నవి. వీటికి ఉత్తరమున ఆంగ్లేయ రాజ్యములో చేరిన కనడా దేశమును దక్షిణమున స్వతంత్ర ప్రజాస్వామిక మగు 'మక్సికో దేశమును గలవు. సంయుక్త రాష్ట్రముల వైశాల్యము ముప్పది ఆరులక్షల పదునారు వేల చతురపు మైళ్ళును జనసంఖ్య పదికోట్ల తొంబది అయిదులక్షలును గలవు. ఇంగ్లాండు దేశపు వైశాల్యము ఎనుబది తొమ్మిది వేల చతురపు మైళ్ళు జవ సంఖ్య నాలుగుకోట్ల ఇరువది లక్షలు. బర్మాగాక మిగిలిన భరతవర్షము యొక్క వైశాల్యము పది హేసులక్షల డెబ్బది రెండు వేలచతరపు మైళ్లు జనసంఖ్య ము ప్పదికోట్లు, హిందూదేశము ఇంగ్లాండు కన్న వైశాల్యములో


పదునారు రెట్లును జనసంఖ్యలో ఏడు రెట్లును పెద్దది. సంయుక్త రాష్ట్రములు వైశాల్యమునందు హిందూదేశముకన్న రెట్టింపుగలను. ప్రస్తుతము జనసంఖ్యయందు మాత్రము హిందూదేశములో మూడవవంతుగలదు. కాని జనసంఖ్య త్వరితముగ పెరుగుచున్నది. సంయుక్త రాష్ట్రములలో వందొమ్మిది రాష్ట్రములలో పదిలక్షలకన్న తక్కువ జనసంఖ్య గలదు. అనగ కృష్ణాజిల్లా యొక్క జనసంఖ్యలో సగమైన లేకు న్నవి. బర్మాగాక మిగిలిన హిందూదేశము ఆంగ్లేయ పాలనము క్రింద పది రాష్ట్రములుగ మాత్రము విభజించబడినది. సంయుక్త రాష్ట్రములు నలుబది ఎనిమిది రాష్ట్రములుచేరియున్నది. సుయుక్త రాష్ట్రములివుడు లోకములో కెల్లమిగుల భాగ్యవంత ముగనున్నవి. వాటి ప్రభుత్వపు ఆదాయము ఇంగ్లాండుకన్న ఒక టింపాతికె రెట్లును హిందూదేశ ముకన్న పది రెట్లునుగలదు. హిందూ దేశములో ప్రతిమనుష్యునకును సగటున ఆదాయము సాలుకు ఇరువదిఅయిదు రూప్యములు సుయుక్త రాష్ట్రములలో ప్రతి మనుష్యునకును సగటున ఆదాయము సాలుకు ఎనిమిదినందం రూవ్యములు. హిందూదేశములో ముప్పది అయిదు వేల మైళ్ల పొడుగున రైలు వేలు (ధూమశకటయానములు), వేయబడిసవి. సంయుక్త రాష్ట్రములలో రెండులక్షల ఏబదినాలుగు వేల మైళ్ల పొడుగున వేయబడినవి. హిందూదేశము పరాధీన మైయున్నది. రెండువందల సంవత్సరములక్రింద లోక ములో కెల్ల భాగ్యవంతమైన దేశము నేను లోకములో కెల్ల దరిద్రవంత మైయున్నది. సుంయుక్త రాష్ట్రముల స్వపరిపాలన వనుభ వించుమన్నవి. లోకములో కెల్ల దరిద్రవంతమకు అట ప్రదేశములలోనుండి యభివృద్ధి చెంది నూట ముప్పది సంవ త్సరములలో లోకములో కెల్ల' భాగ్యవంతమయినవి. హిందూదేశములోని పరిశ్రమలు చేతిపనులు నశించి కేవలము వ్యవసాయముమీద ఆధారపడి యున్నది. సంయుక్త రాష్ట్రముల వ్యవసాయము, గనులు, పరిశ్రమలు, వర్తక వ్యాపారములు అనేక రెట్లుగా అభివృద్ధి గాంచి జాతీయ ధనము విశేషముగ హెచ్చుచున్నది. ఇరువదవ శతాబ్ద ప్రారంభము నకు లోకము యావత్తు యొక్క రాక్షసి బొగ్గలో మూడవ వంతును, రాగిలో సగమును, ఇమములో మూడవవంతును, సంయుక్త రాష్ట్రములలోని గసులలో తీయబడినది. సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము వారు విదేశ పవిశ్రమల పోటీవలన తమ దేశములోని పరిశ్రమలకు నష్టము కలుగ కుండుటకై విదేశ సరుకులమీద పన్నులు వేయు చున్నారు. హిందూ దేశములోని ఆంగ్లేయ ప్రభుత్వము వారు హిందూదేశముయొక్క తలుపులు బాగుగా తెరచి విదేశ సరుకులను అడ్డు లేకుండ రానిచ్చుచున్నారు. విదేశ సరుకుల పోటీవలన హిందూ దేశములోని పరిశ్రమలు తలయెత్త కుండనున్నవి. పైగా హిందూదేశములో స్థాపించ బడిన బట్టల యంత్ర శాలలలో తయారయ్యేడి నూలు మీదను వస్త్రముల మీదను హిందూ దేశ ప్రభుత్వమువారు పన్నులు వేసియున్నారు.


విధ్యా
పద్దతులు.

సంయుక్త రాష్ట్రములలో ప్రభుత్వము వారును రాష్ట్ర ప్రభుత్వములును పిల్లల విద్యకొరకు ధనమును అమితముగా ఖర్చు పెట్టుచున్నారు. ఆదేశములో

పుట్టిన ప్రతిపిల్లకును (మొగపిల్లగాడైనను ఆడపిల్ల అయినను) విద్యనిచ్చుభారమును ప్రభుత్వము వహించియున్నది. ఆ దేశములోని అన్ని తరగతులవారి పిల్లలయొక్క జీవితమును గూర్చియు, క్షేమమును గూర్చియు, అనగా వారి జననములు, మరణములు, రోగములు, ఆరోగ్యములు, నీతి, విద్య, పోషణము, మొదలగు సమస్త విషయములను గూర్చి సదా విచారంచేసి అవసరమైన చర్య తీసుకొనుటకు ప్రభుత్వములో నొక పత్యేక శాఖగలదు. దేశములోని పిల్లలే జాతీయ ధనములో ప్రధాన భాగమని ముపిల్లలను జాగ్రత్తగా పెంచుటయే ప్రధాన జాతీయ ధర్మమనియు నచటి ప్రభుత్వము గ్రహించినది. విద్యావిధానములో సాహిత్యమును శాస్త్రములను బోధించు , ప్రాధమిక, మధ్యమ, ఉత్తమపాఠశాలలును సర్వ కళాశాలలును అనేక ముండుటయే గాక, వర్తకము, వ్యాపారము, వ్యవహాయము వివిధములగు పరిశ్రమలు, మొదలగు వృత్తివిద్యను నేర్పుపాఠశాలలు లెక్కకు మించియున్నవి. శాన్ ప్రాన్ సిస్కోలో జరిగిన విద్యావిషయిక ప్రదర్శనలులో ప్రభుత్వ విద్యాశాఖవారు ఈ క్రింది విధముగా ప్రకటనమును కట్టినారు.


  • 1. తనపిల్లలకు చదువు చెప్పించని జాతి తనపిల్లలకు బాగుగా చదువు చెప్పించెడి జాతికి ఆర్ధిక దాస్యమును చేయును. విద్య లేని హేతువుచేత అనేక సార్లు జూతులు తమదేశములను పోగొట్టుకొనిరి.

ఈ దేశమును పోగొట్టుకొనకుండ స్వాధీన మందుంచు కొనుటకు మన పిల్లలను తయారుచేతమా?" -


2 "మనము గొప్పపారిశ్రామిక సైన్యమును తయారు చేసెదమా?


ఈనవీన యుద్ధమునకు పాఠశాల, సర్వకళాశాల, శాస్త్ర పరిశోధనాశాల, కర్మాగారము యుద్ధభూములు, పరిశ్రామిక పోరాటములో ప్రకృతి శాస్త్ర పరికరములు లేని వారు . ప్రకృతి శాస్త్ర పరికరములు గలవారిముందర ఎంత ధైర్య శాలులయినసు, ఆంగ్లేయ సేనాధి పతియగు కిచనరు. ప్రభువు యొక్క ఫింగుల ముందర ఓండర్మాను యుద్దములో పతీపక్షులగు దర్విషులను మతగురువులు ఎగిరిపోయినట్లు, తేలికగా పరాజయము గాంచెదరు. మన పిల్లలు పారిశ్రామిక ద్విషుషు లగుదురా?” కేవలము వృత్తి విద్యకు సంబందించిన పాఠశాలల సహాయార్దము 1924వ సంవత్సరమునల కోట్ల రూప్యములను సంయుక్త ప్రభుత్వం వారు ఖర్చు పెట్టియున్నారు. రాష్ట్రములును మునిసిపాలిటీలును ఖర్చు పెట్టునది గాక పై మొత్తమును సంయుక్త ప్రభుత్వము వారు ఖర్చుచేయుచున్నారు.


అమెరికాలో భాగ్యవంతులకు బీదవానికి వేరు వేరు పాఠశాలలు లేవు . అందరు మునుష్యులు సమానులుగావున అందరికని ఒకే పాఠశాలలు గలవు. ప్రాథమిక , మధ్యమ, ఉన్నత పాఠశాలలన్నిటిలో అయిదింట నాలుగువంతు స్త్రీలు ఉపా ద్యాయినులుగ నున్నారు. అమెరికాలో మొగపిల్లలు ఆడ


పిల్లలు కలిసి పాఠశాలలలోను సర్వకళాశాలలలోను చదువు కొనెదరు. ఆడపిల్లకు వేరు పాఠశాలలు లేననియే చెప్పు వచ్చును. కలిసి దువుకొనుటవలన నష్టమేమియు లేదనియా మర్యాద, పరస్పర గౌరవముగల అభ్యాసములు మాత్రమే పట్టుబడుననియు అమరికావాఎరొ యభిప్రాయము.


ఎర్ర
యిండియనులు


అమెరికనులు పూర్వకాపురస్తులగు ఎర్రయిండియనులతో పొరాడి వారిని నాశనము చేసి లేక తరిమి వేసి సంయుక్త రాష్ట్రుల సంతయు స్వాధీనముచేసికొనుట 1890 వ సంవత్సముతో ముగిసెను. ఆ సంవత్సరము డెకోటాలోని సియోక్సు జాతికి చెందిన ఎర్ర యిండియునులు తమదేశమును తమ కిందనే ఉంచుకొనుట కొరకై బహు దైర్యముతోను నిరాశతోను పోరాడి అమెరిక సులచే పూర్తిగ నాశనము చేయబడి). ఇదియే ఎర్రయిండియనుల ఆఖరు స్వతంత్ర పోరాటము. తెల్లవారు అమెరికా వచ్చుటకు పూర్వము ఎరయిడియములు ఎన్ని కోట్ల మంది అచట కాపురమున్నది చెప్పుట కష్టము, వారిజనాభ' ఎన్నడును తీసుకొని యుండలేదు. కాని దాదాపుగా ఎర్రయిండియను జాతియంతయు తెల్లవారిచే నాశనము చేయబడినదనుటలో అతిశ యోక్తి లేదు. చావగ మిగిలిన రెండులక్షల ఇగుపది అయిదు వేల మంది ఎర్రయిండియులు అమరికనులకు లొంగి సంయుక్త రాష్ట్రములలో కాపురముండుటకు నిర్ణయించబడిన ప్రత్యేక ప్రదేశములలో కాపురముండియున్నారు. వారిస్తితి అమెరికాలోని నీగ్రోల స్తితికన్న హీనముగనున్నది.


(2)

పౌరహక్కులు


సంయుక్త రాష్ట్రములలోని పౌరుల స్వతంత్రములనునిర్దిష్టముగా పొడుటకై రాజ్యాంగ విధాన ములో కొన్ని సవరణలు చేర్చబడినవి. అధికారుల నిరంకుశ చర్యలనుండి పౌరులను కాపాడుటకై ప్రతి స్వతంత్ర దేశములోను పొరుల స్వత్వములను సంరక్షించు. చట్టములు చేయబడును. విదేశ ప్రభుత్వముల వలనను నిరంకుశ చక్రవర్తుల వలనను పాలింపబడెడి దేశములో నట్టిచట్టములు పుట్టుట కవళాశ ముండ నేరదు.


1. ఇంగ్లాండులో చర్చి ఆఫ్ ఇంగ్లాండుశాఖకు చెందిన ప్రొటెస్టంటు క్రైస్తవమతము ప్రభుత్వమువారి మతమై యున్నది. అవగా రాజు తాను ఆ మతమునకు చెందినట్లును ఆను. తమును సంరక్షించు నట్లును ప్రమాణము చేయవలెను. ఆ మతపోషణకై కొంత సొమ్మును ప్రభుత్వ బోక్క సము లో నుండి యిచ్చెదరు. సంయుక్త రాష్ట్రములలో ప్రభుత్వము. కును మతమునకును యెట్టి సంబఁధము లేదనియు పౌరులు తమలచ్చవచ్చిన యేమతము నైన అవలంబించ వచ్చుననియు, మత స్వేచ్చను తగ్గించు ఏచట్టమును కాంగ్రెను (శాసనసభలు), చేయగూడదనియు రాజ్యాంగ విధానములో చేర్చబడినది. ఇది మొదటిది.

2. తను యిష్టమువచ్చిన అభిప్రాయములను ఉపన్యాస రూపమునగాని పత్రికా రూషముసగాని వెల్లడిచేయు


స్వాతంత్ర్యము సంపూర్ణముగా అమెరికా పౌరుల కివ్వబడినది. పతి స్వాతంత్యము, వాత్స్వాతంత్ర్యమ, సభలుచేయు స్వాతంత్యము, ప్రభుత్వమునకు ఆర్జీ లిచ్చుకొను స్వాతంత్ర్యము, - వీటిని సంకుచిత పరచుట కెట్టి చట్టములును కాంగ్రెను ( శానసభలు) చేయగూడదని రాజ్యంగ విధానములో చేర్చ బడినది. ఇది రెండవది. హిందూదేశములోవలె యిండియను పీనలు కోడ్డు 124 ఏ ఫెక్షన్ (రాజద్రోహము) 158 వ ఫెక్షన్ (జాతి విరోధము) ప్రొసీజరురోడ్డు 108 మొదలగు నేరములక్రింద పౌరులు అమెరికాలో విచారించబడ నేరరు. కేవలము అల్లరులు చేసినచో కొట్లాట నేరములక్రింద తప్ప . ప్రభుత్వమునకు వ్యతిరేకముగ యెట్టి అభిప్రాయమును వెలి బుచ్చినను పౌరులు అమెరికాలో శిక్షను పొందరు. (ప్రెస్సు 'ఆక్టు) పత్రికలమీద నిర్బంధములు కల్పించు చట్టములును, , సభలు చేయకూడదను నిషేధ చట్టములును (Seditious Meetings Acts) అమెరికాలో చేయబడ నేరవు.


3.. దేశములో పౌరు లందరును దేశ సంరక్షణకై తయారు కావలసి యున్నారు గావున పౌరులందరును తమ కిష్టమైన ఆయుధములను ధరించవచ్చును. కత్తి, తుపాకి, మొదలగు ఆయుధములను ధరించగూడదని యే చట్టమును అమెరికా శాసనసభలు (కాంగ్రెసు) చేయగూడదని రాజ్యం గవిధానములో చేర్చబడినది. యిది మూడవది. మామూ లుగా జీతము పుచ్చుకొని కొలుపుచేయు సిపాయీలుగాక ఆమెరికాలోని పదునెనిమిది సంవత్సరములకును నలుబదిఐదు


సంవత్సరములకును మధ్య వయస్సుగల శరీర దార్యముగల పురుషు లందరు సమయము వచ్చినపుడు సైనిక కొలుపు చేయుటకు సిద్ధముగా నుండవలెను. అందుకొరకు పౌరులు విధిగా సైనిక శిక్షణము పొందుదురు. పౌర సైన్యమే దేశ సంరక్షణకు ప్రధానమైన మూలబలము'.


4 ప్రమాణము మీద సాక్ష్యము పుచ్చుకొని సరియైన హేతువులు కలవని నమ్మి, యొక న్యాయాధిపతి సోదా చూడ వలసిన ప్రదేశమును, అందులోనుంచి పట్టుకొని రావలసిన మనుష్యులను, ఆస్తులను, స్పష్టముగా తెలియ జేయుచు నొక వారంటును (సోదాచూచు అధికారఘు) యిచ్చిన నేతప్ప, పోలీసువారు యెషరి యింటిని సోదా చూడగూడదనియు యును.మను ష్యులనుగాని కాగితములనుగాని దుస్తులనుగాని పట్టుకొని పోగూడదనియు అమెరికా రాజ్యాంగ విధానములో చేర్చబడినది. ఈ నిబంధన పోలీసువారు చేయు దౌర్జవ్యముల నుండియు అక్రమముల నుండియు పౌరులను కాపాడుచున్నది.


5. సైన్యములకును నౌకాదళములకును సంబంధించిన నేరములలో తప్ప తక్కిన ప్రతి గొప్ప నేరములోను ముద్దాయి నేరస్తుని మీద నేరము మోపక ముందు గ్రాండుజూరీ యెదుట విచారణ జరిగి వారిచే నేరస్తుడని తీర్మానించ బడవలసి యండును, అనగా , ప్రతి పెద్ద నేరము లోను మందుగా ముద్దాయి నేరము చేసెనా లేదా యను విషయము నిర్ణయించుటకు జూరీ యెదుట విచారణ జరుగవలెను. జూరీలో - 12 మంది మొదలు 24 మంది వరకు ఉందురు. దీనికి

గ్రాండుజూరీ అని పేరు. సదరు జూరీ సభ్యులలో యెక్కువ మంది ముద్దాయి దోషీయని నమ్మినయడల అటు పైన ముద్దాయిపైన నేర మారోపించి పెద్ద న్యాయాధిపతి యెదుట విచా రణ జరుగును. ఆ విచారణలో ఉభయపక్షమల సాక్ష్యుములు విచారించి ముద్దాయి నేరస్తుడని తీర్మాన మైనచో ముద్దాయికి శిక్ష విధింపబడును.


పతి విచారణలోను నేరము రుజు వైనవేతప్ప ముద్దాయి నిర్దేషియనియే యెంచబడవలెను, ముద్దాయి యేమి చెప్పినను అది ఆతనికి వ్యతిరేకముగా నుపయోగించబడ కూడదు, ముద్దాయి అబద్దము చెప్పి నను దారికి శిక్ష లేదు. ముద్దాయిని త్వరగాను, బహిరంగము గాను విచారణ చేయవలెను.క్రిమినలు కేసులలో తొందరగా విచారణ జరిగి త్వరితముగా తీర్పు చెప్పవలసిన దేగాని విశేష శాలయాపన జరిగినచో నేరారోపణ జరిగిన వారికి మిగుల మనోవ్యాకులత కలుగును. పతి క్రిమినలు కేసు లోను ఏజిల్లాలో నేరము జరిగినట్లు చెప్పబడునో ఆజిల్లాలోని నిష్పాక్షికమగు పన్నెందు మండి కిమించని జ్యూరీచే ముద్దాయి నేరముచేసెనా లేదాయని విచారణ జరుగవలెను. నేరము చేసినది లేనిది నిర్ణయించుటకు జ్యూరీకే అధికారము కలదు. జ్యూరీ ముద్దాయి నేరము చేసినట్లు నిర్ణయించినచో న్యాయాధీపతి శాస్త్ర ప్రకారము ఏమి శిక్ష విధించవలెనో నిర్ల యించును. ముద్దాయి. నిర్దోషియని జ్యూరీ చెప్పినచో న్యాయాధిపతి ముద్దాయిని విడుదల చేయవలసినదే. ఎనుబది రూవ్యములు , కిమ్మతుకు మించిన ఆస్తి విషయమైన సివిల్

. . దావాలలో కూడ జ్యూరీవిచారణగలదు. జ్యూరీవిచారణ హక్కుల ముఖ్యమైనది. ప్రతిస్వతం త్రదేశములోను ఈ హక్కు పౌరులకుగలదు. ఏజిల్లాకు నేర ముగాని, ఆ స్తిగాని సంబంధించి యున్నదో ఆజిల్లా కాపురస్తులగు ఆరుగురు మొదలు పన్నెండువరకు సంఖ్యగల పెద్దమనుష్యులు ఉభయపక్షముల సాక్ష్యమును విచారణ చేసి తగాదాహంశము నిజమా అబద్దమా అని నిర్ణయించుటవలన చాలవరకు యదార్థము తేల గలదు, ఫిర్యాది ముద్దాయిలయొక్క... పూర్వపు స్వభావములసు సాక్షుల యొక్క ప్రవర్తనను ఆస్తిశ్వభావమును నేరముయొక్క సాధ్యాసాధ్యములను జ్యూరరులు సాధారణముగ ఎరిగినవారై యుందురు. కావున వారికి సత్వము గోచరించి నట్లు కొత్త వాడైన న్యాయాధిపతికి గోచగించడు. న్యాయాధిపతి శాస్త్రమునకు సంబంధించిన వివయములనుగూర్చి మాత్రము తీర్పు చెప్పును. పైన చెప్పబడిన పెద్ద క్రిమినల్ నేరములలో ముద్దాయి ముందుగా గ్రాండు జ్యూరీవలన విచా రించబడి వారు నేరమును నమ్మి సపుడుమాత్రము 'పెద్ద న్యాయాధిపతియొద్దకు విచారణకు పంపబడును. ఆవిచారణలో గూడ జ్యూరీ ఉండును.

ముద్దాయి మీద ప్రతి అభియోగములోను ఏటు నేరము వచ్చినదో అది అతనికి ముందుగా తెలపవలేను. అతనికి వ్యతి రేశముగా సాక్ష్యమిచ్చువారిని అతనియెదుట విచారించవలెను. అతడు వారిని ప్రశ్నలడుగుటకు హక్కు గలదు. అతడు కోరిన సాక్షు


లందరిని న్యాయాధిపతి పిలిపించి విచారణ చేసి తీరవలెను. ముద్దాయికి ప్రతి అభియోగములోను ప్లీడరును పెట్టుకొనుటకు హక్కు గలదు. ప్లీడరును పెట్టుకొని లేనిచో న్యాయాధిపతియే ఆతని పక్షమున నొక ప్లీడరును నియమించును. విచారణయేప్పుడును బహిరంగముగ జరుగవలసినదిగాని రహస్యముగ చేయకూడదు. ఏముద్దాయియైనను ఒకే నేరముక్క ఒకసారికన్న ఎక్కువ పర్యాయములు శిక్ష అనుభ వించకూడదు.


ఏయభియోగములోను ముద్దాయిశక్తికి మించిన జామిను కోరగూడదు. అతి ఎక్కువ జుల్మానాలను, కూరమైన శిక్షలును విధించకూడదు. సరియైనట్టియు, బహిరంగ మైన ట్టియు, న్యాయశాస్త్ర సమ్మత మైనట్టియు విచారణజరిగి న్యాయాధిపతివలన తీర్పు లేకుండ ఏమనుష్యునియొక్క ఆస్తికిని, స్వేచ్ఛకును, ప్రాణమునకును , భంగముకలుగకూడదు,


ప్రభుత్వమువారు ఏపౌరునికి ఆస్తి తీసికున్నను దానికి సరియైన ఖరీదు ఆపౌరునికిచ్చి తీరవలెను. ఈ విధముగా పౌరుల యొక్క స్వేచ్చను కాపొడు నిబంధనలు సంయుక్త రాష్ట్రముల యొక్క రాజ్యాంగ విధానములో చేర్చబడినవి. ఇందువలన ఏపొరుడైనను జై లలో పెట్టక మునుపు ఒక న్యాయస్థానములో న్యాయశాస్త్ర ప్రకారము బహిరంగమైన జూరీతో కూడినవిచారణబడిన నేరస్తుడని శిక్ష విధింపబడవలెను. అంతేశాని 'అధ్యక్షుడుగాని కార్యనిర్వాహకవర్గమునకు చెందినవ యుద్యోగస్తుడుగాని పౌరులను నేరము చేసినట్లు అనుమానము మీద

కట్టుకొనిపోవుటకును, జై ల లోనుంచుటకును, మరియేశిక్ష విధించుటకును ఎట్టి సావకాశమును లేదు. హిందూదేశములో కొన్ని రెగ్యులేషను లక్రింద విచారణ లేకుండ వట్టి అనుమానము మీద కార్యనిర్వాహక వర్గము:కు చెందిన అధికారులు మనుష్యులను పట్టుకొనిపోయి జైళ్లలోగాని, యితర నిర్బంధవాసములలో గాని ఉంచుట తటస్తించుచున్నది. దేశ బాంధవ లాలాలజపతి రాయిగారిని అట్టి రెగ్యు లేషను క్రిందనే మాండలేకోటలో నిర్బంధావాసము చేయించియున్నారు, ఇప్పుడు బంగాళములోని కొందరు ప్రముఖులను విచారణ లేకుండపట్టుకొని జైళ్లలో పెట్టియున్నారు. ప్రభుత్వము వారి యిష్టము వచ్చినంతకాలము వీటిని జైళ్లలోనుంచవచ్చును. ఏ నేరమునకై వారిని పట్టుకొన్నది, వారికి వ్యతి రేకముగా ఏమి సాక్ష్యమున్నది, వారికి తెలుపనక్కర లేదు. విచారణ చేయ నక్కర లేదు. ఇట్టి నిరంకుశ చర్యలుయేమియు జరుగకుండుటకై అమెరికా రాజ్యాంగవిధానములో పైస చెప్పబడిన నిబంధనలు చేర్చబడినవి.


6. రాజ్యాంగ విధానములో కొన్ని పౌరహక్కులు మాత్రమే స్పష్టముగా చెప్పబడి యున్నందుస పౌరులకుగల యితరహక్కులను తీసి వేసి నట్టుగా భావించకూడని , గూడ మరియొక సవరణ చేశ్చబడినది.


7. సంయుక్త రాష్ట్రములలోను వాటిపాలనలోని, యిత ప్రదేశములలోను బానిసత్వముగాని నిర్బంథమగు నౌకరిగాని ఉండగూడదని మరియు సవరణ చేయబడినది.


8. సంయుక్త రాష్ట్రములలో పుట్టినట్టియు లేక పౌరులుగా చేయబడినట్టియు అందరు మనుష్యులకును సమానమైన హక్కు బాధ్యతలుగలవు. సంయుక్తరాష్ట్రముల చట్టములు అందరిని సమానముగా సంరక్షించును. సంయుక్త రాష్ట్ర ములలో గాని వాటిలో చేరిన ఏరాష్ట్రములో గాని జూతి, రంగు, యిది వరకు బానిసగా ఉండిన కారణము ఈ హేతువులలో దేని చేతస వోటుచేయు అధికారము (ఎన్నికలలో పాల్గొను నధికా రము) తీసివేయరాదు అనిగూడ మరియొక సవరణ గావించబడెను.

ప్రజలదే
రాజ్యము.


సంయుక్తరాష్ట్రములు స్వతంత్ర దేశము. ఆ ప్రభుత్వము ఆ ప్రజలలాభము కొరకై ప్రజాప్రతి నిధులచే చేయబడుచున్నది. కావున ఆదేశ ప్రభుత్వమునకు ఆదేశ ప్రజల ఆర్థిక, నైతిక, విద్యా విషయక , సాంఘిక అభివృద్ధితప్ప వేరు ఉద్దేశ్యము లేదు. స్వపరిపాలస ముక్రింద ఆదేశము అత్యాశ్చర్యకరముగా వృద్ది చెందుచున్నది. ఆదేశపు పౌరులు తమదేశములో నేగాక ప్రపంచములో ప్రతిచోటను మిగుల గౌరవముగ చూడబడుచున్నారు. విదేశములలో నెచ టనై నను ఆ దేశ పుపొరులలో ఎవరికైనను ఎట్టి అవమానము. జరిగి


నను వెంటనే ఆ దేశపు ప్రభుత్వ మువారు తగినచర్య తీసుకొని ప్రతీకారము చేసెదరు. ఆదేశముయొక్క ప్రతిపౌరునికి ప్రపంచములో నెచటసంచరించినను తనయొక్క జాతీయపతాకము తనను సంరక్షించునని సంపూర్ణ విశ్వాసము గలదు.