Jump to content

అమెరికా సంయుక్త రాష్ట్రములు/పదకొండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

నీగ్రోబానిసత్వము .


పదకొండవ అధ్యాయము ,

నీగ్రో
బానిసత్యము.

ఆఫ్రికా ఖండవానులగు నీగ్రోలు నల్లనివారు. వీరిని వేనకు వేలుగ యూరపుబండ వాసులగు తెల్ల,వారు బలవంతముగనో మోసముచేసియో బానిసలుగా పట్టుకొని తీసుకొని వచ్చి అమెరికాఖండములో తెల్లవారికి అమ్ముచుండెడివారు. ఒకప్పుడు అమెరికాలోని తెల్ల వారే ఆపికాకు పోయి నీగ్రోలను పట్టుకొని తెచ్చుచుండెడి వారు. నీగ్రోబానిసత్య వ్యాపారమువలన యూరపు అమెరికా ఖండములలోని తెల్లజాతులవారికి విశేషమగు లాభమువచ్చు. చుండెడిది. అమెరికా ఆఫ్రికాఖండములు యూరపు జాతుల వారిచే కనిపెట్టబడినప్పటి నుండియు నీగ్రోబానిస వ్యాపారము చేయబడినది. ఇంగ్లాండు దేశమును ఎలిజబెత్తురాణి పాలిం

చుచున్న కాలమున సర్ జాన్ హాకిన్సుగారు ఆప్రికామండి నీగ్రోలను బానిసలుగా పట్టితెచ్చుటను ప్రారంభించెను. అమెరిశా ఖండములోని హిస్పానియా యందు నివసించుచున్న తెల్లవారు నీగ్రోబానిసలను విశేషము కొనుదురని విని ఆయన' 1562 వ సంవత్సరమున నీగ్రో బానిస వ్యాపారము వలన విశేషధనము సంపాదించవలెననికృత నిశ్చయుడై ఆ ఖండములోని సిగావిమోర్ తీరమునకు పోయి అచట కొంతకాలముండి కొంతవరకు కత్తులు,తుపాకులు మొదలగు -ఆయుధముల సహాయమువలనను కొంతవరకు ఇతర సౌధనముల వలనను మూడువందల నీగ్రోలను బాలిసలుగా పట్టుకొని పోయి హిస్పానియాలో విక్రయించి విశేష లాభమును గడించెను. మరుసటి సంవత్సగము లీస గుప్రభువు పెంబ్రోకు ప్రభువు మొదలగు రాజబంధువుల సహాయమున నీగ్రో బానిసన్యాపొ రమునకై యొక సంఘమును స్థాపించి నీగ్రోలను తెచ్చుటకు అయిదు పడవలను ఆఫ్రికా ఖండము నకు గొనిపోయెను. ఈ బందిపోటు దొంగ నరహంతకుడు " కేపు వర్దికి పోయి అచటి కాపరస్తులు మిగుల సాధువులుగను మర్యాదస్తులుగను ఉండుట చూచి వారినెట్టు లెన పట్టుకొని పోవలెనని యత్నించెముగాని వారీయనకు చిక్కలేదు. తరువాత రియోగ్రాండి తీరమునకు తనమనుష్యులతో కూడ పోయి ప్రతిదినమును అచటి గ్రామములను తగుల బెట్టుచు పారిపోవుచున్న కాపరస్తుల ను బాసిన లుగా పట్టుకొనుచువచ్చెను. వారిని అమెరికాలోని స్పైన్ వారికమ్మి చాలసొమ్మును తెచ్చెను. ఈధీరుని ఆంగ్లేయ జాతియు ఆంగ్లేయరాణి ఎలిజబెత్తును చాల గౌరవించిరి. రాణి ఆయనకు బిరుదముల నొసంగెను. ఈయన చేయుచున్న గౌరవనీయ మైన వ్యాపారములో రాణికికూడ భాగముండెను.


తరువాత రాజులుగవచ్చిన మొదటి జేస్సు మొదటిఛార్లెసు రెండవఛార్లెసు రాజుల కాలమున ఆంగ్లేయ దేశములోని వాని సవ్యాపారులు విశేషముగ ప్రోత్సాహము పొందిరి. రాణ “బంధువుడగు యూర్కు ప్రభువు బానిస ప్యొపార సంఘమున కధ్యక్షుడుగ నుండెను. కొంతకాలము వరకు నీగ్రో బానిస వ్యాపొరము కొన్ని పత్యేక సంఘముల చేతులలో నండెను. గాని విలియం రాజు సంఘముల ప్రత్యేకహక్కులురద్దు పరచి ఆంగ్లోయులందరును నీగ్రోబానిస వ్యాపారసు చేయవచ్చునని శాసించెను. ఆంగ్లేయు వ్యాపారులు ప్రతిసంవత్సరమును ఆఫ్రికాలోని నీగ్రో బానిసలను వేలకు వేలుగ పట్టుకొనుచుండెడివారు అమెరికాలో ఆంగ్లేయ వలసరాజ్యములలోనికి 1680 మొదలు 1726 సంవత్సరము వరకు దిగుమతి అయిన నీగ్రోబానిస లసంఖ్య ఇరువది ఇరువది లక్షల ముప్పది వేలు. 1718 సంవత్సరమున ఉట్రెక్టువద్ద ఇంగ్లాంను సకును స్పైన్ కుసు జరిగిన సంధిలో పతిఏటను పశ్చిమ యిండియా ద్వీపములలోని 'స్పైన్ వారికి ఆంగేయుప్రభుత్వము వారు నాలుగు వేల ఎమిది వందలమంది నీగ్రో బానిసల చొప్పున ముప్పదిసంవత్సరములకాలము తెచ్చి యిచ్చి నట్లును కొంతసొమ్మును స్పైస్ వారు ఆంగ్లేయులకిచ్చు నట్లును ఒకంబడిక చేసుకొనిరి. ఒక్క ఆగ్లేయులేగాక యూరపు జాతుల వారుందరును నీగ్రోబానిస వ్యాపారమును చేయుచుండిరి. ఇందుకొరకై ఆఫికా ఖండతీకములలో గిడ్డంగులను (factories) కట్టుకొనిరి. 1791 వ సంవత్సరముస ఆఫ్రికాతీరము

లలోగల నలుబది గిడ్డంగులలో పదునాలుగు ఆంగ్లేయులవి పదునేను వచ్చివారివి మూడుపరాసులవి నాలగుగుపోర్సుగీసు వారివి నాలుగు డేనులవి. 1790 వ సంవత్సరమున ఆంగ్లోయులు రవానాచేసిన నీగ్రోబానిసల సంఖ్య ముప్పది ఎనిమిది వేలు. పరానువారు చేసినవారు ఇరువది వేలు. డచ్చి వారు. చేసినదినాలుగువేలు. డేసులు ఎగుమతి చేసినది రెండు వేలు. పోర్సు గీసువారు ఎగుమతి చేసిన సంఖ్య పదివేలయ్యుండెను. బానిసత్వపు చరితనువ్రాసిన గ్రంధకర్త ఇటుల వ్రాసియున్నాడు. ఉత్తరాఅప్రికా తుర్కీ మొదలగు దేశములలోని మహమ్మదీయుల కొరకు బానిసలను అమ్ముపద్దతి అదివరకుగూడ కొంతవరకుగలదు, కాని తెల్లజాతులవారిమితిలేని దురాశ వలనను దుండగులవలనను మానవులను వేటాడిదొంగిలించి బానిసలగచేయు పద్దతి అతి విశేషముగ వృద్ధి చెందినది. వీరుతరుచుగా రాతివేళ గ్రామములపై బడి తగులబెట్టి పారిపోవుచున్న నల్లవారిని స్త్రీలను పురుషులను పిల్లలను పట్టుకొని బానిసలుగ చేయుచుండిరి ఎదిరించిన వారిని తుపాకులతో కాల్చి చంపుచుండిరి. మోసకృత్యములకు మేరయేలేదు. రాక్షసస్వభావము సంపూర్ణముగ ప్రదర్శింపబడెను. " తెల్లవారవలంబించిన క్రైస్తవ మతమునకును వారుచేయుచున్న అమానుష కృత్యముల కును సంబధము లేకుండెను. "అట్లు బానిసలుగా పట్టుకోనబడిన వారు సముద్రతీరములోని గిడ్డంగుల వరకుము అటుతరువాత సముద్రముల మీద పడవలలో అమెరికా ఖండమునకును తీసుకొనిపోబడుటలో పొందిన బాధలు వర్ణనాతీతము, వారు తీసికొనపోబడిన పడవలు నరకకూపములు. బానిసల పడవలు


లోవలే అంత చిన్న స్తలములో అంతవి శేషమగుదౌర్భాగ్యము మరి యెచటను నింపబడియుండ లేదు " సర్ విలియం డోల్యను వ్రాసినట్లు నీగ్రోలను ఒక అడుగున్నర యెడయెడముగ యుడుగు భాగమున నాపడవలలో వరుసగ నందరి కలిపి పరుండ బెట్టి వారిచేతులను పాదములనుకట్టి వేసి పొడుగాటి యినుపగొలుసులచే బంధించిరి. వారావిధముగ షుమారు తొమ్మిదివారములు గాలిచొరనట్టియు యిరుకై నట్టియుఅనారోగ్యకరమైనట్టియు నాపడవలలో యడుగుభాగమున ప్రయాణము చేయుచు మిగుల దుష్టమగు అంటువ్యాధులకు లోనైరి. వారి శరీరములు కుళ్లుచుండెను. అప్పుడప్పుడు వారిని పరీక్ష చేయుటకు వచ్చిన వారు చనిపోయిన వారి శవములను ఆవరుసలోనుండి గొలుసులూడ దీసి యెత్తి పారవేయుచుండిరి. అట్లు ఎత్తిపారవేయు వరకును రోజులకొలది కుళ్ళి వాసనకొట్టుచున్నను ఆశవములు బ్రతికి యున్నవారి పక్కన వారితో కలిపి బంధింపబడియే యుండెను. ఆఫ్రికాలో పట్టుకొనబడిన బానిసలలో సగము మంది మాత్రమే అమెరికాలోని దుకాణములలో అమ్మ బడుటకు అర్హులుగా జీవించి యుండిరి.

బానిసల
దౌర్భాగ్య
స్థితి.

పంతొమ్మిదవ శతాబ్దప్రారంభము నకు (బ్రెజీలు లోఇరువదిలక్షల బానిసలును అమెరికా సంయుక్త రాష్ట్రములలో తొమ్మిదిలక్షల బానిసలును ఇంగ్లాండు యొక్క పాలసము క్రిందనుండిన తక్కిన వలసరాజ్యము లన్నిటిలోను ఎనిమిదిలక్షలమంది బాననలును , స్పైన్ పోర్చుగలు రాజ్యముల వలస దేశములలో ఆరు


లక్షల బాసినలును ఫ్రాన్సుయెక్క వలసరాజ్యములలో రెండులక్షల ఏబది వేలమంది బానిసలంను ఉండిరి. బానిసలు పారిపోకుండ కఠినమగు చట్టములు చేయబడెను. సౌకర్యములు చేయబడెను. బానిసలకు ఆస్తియుండ నేరదు. బానిసలకు ఆత్మలు లేవనియు వారు యజమానుల లాభముకొరకు పుట్టినారనియు తెల్లవారు నమ్మిరి. బాని సలు న్యాయస్థానములలో సౌక్ష్యమిచ్చుటకు అర్హులు కారు. బానిసలు యజమానుల తాలూకు ఆస్తి, కుర్చీలు బల్లలు సొమానులు పశువులవంటి ఆస్తి అయియుండిరి. వారి శారీరమును యజమాను లేమి చేసినను చేయవచ్చును. బానిన స్త్రీలను మానభంగము గావించుట దోషమేకాదు. బానిసల కెంత కఠినశిక్షలు విధించినను వారిచేత ఎట్టికఠినమగు మోయు లేని బరువుగల పనిచేయించినను యజమానులను అడుగువారు లేరు. యజమానుల క్రూరత్వమువలనను యజమానుల నిర్ణయ దురాశ వలనను బానిసలు అతివి శేషముగా పనిచేసి విశేషముగా మరణించుచుండిరి. బానిసలజాతి అమెరికాలో న్వేచ్చగల బాతులవలె వృద్ధినొందుటకు మారుగా క్షీణించుచుండెను. గావున కొత్తబానిసలను ఏటేట వేలకు వేలుగ ఆఫ్రికా నుండి తెప్పించుచుండిరి. ఉత్తర ఆమెకాలో అనేక రాష్ట్రయిలలో బానిసలు చదువుకున్నసు వారికి చదువు చెప్పినను శిక్షలు విధించు చట్టములు చేయబడెను. చదువు చెప్పిన వానికి ఆరునెలల ఖైదు పది హేనువందల రూప్యముల జరిననాము విధించబడు చుండెను. బానినత్వమునకును విద్య నేర్చుకొనుటకును విరోధమని యజమానులు గ్రహించిరి. నిరంకుశముగా, పాలించు హరికి తమక్రిందనున్న జాతివారు విద్య నేర్చుకొని జ్ఞానమును పొందుట స్వభావముగా ఇష్టముండ నేరదు. కావున వీరివిద్యాభివృద్ధికై విశేషముగా తోడ్పడరు. బానిసత్వమువలన యజమానిలో దురాక దురాగ్రహము ఆధర్మబుద్ధి నిరంకుళత్వము నిర్దయ వృద్ధి చెందును - తనకు కొంచెము అవిధేయతను చూపిన సహించ నేరము గోపము వచ్చిన కత్తితోసరుకును. తుపాకీతో కాల్చును. ఏమి చేసినను అడుగురారుండరు. దానికి (tyrants mentality) నిరంకుశ బుద్ధి అని పేరు. బానిసలో పిరికి తనము, అబద్దము లాడుట యజమాని మెప్పునకై ఎట్టి నీచపుపసులైనను చేయుట ఆత్మగౌరము నశించుట ఆత్మవిశ్వాసము లేకుండుట మొదలగు నైచ్యగుణము లలపడును. దీనికి ( Slave mentality} బానిస బుద్ది అని పేరు కాని సత్వము యజమాని లోను బానిసలోను మనుష్యత్యమును నిర్మూలింప జేసి యజమాజని రాక్షసిగను, బానిసను నీచజంతువుగను, చేయును. వ్యక్తుల కెట్లో జాతులకును అట్లే నిరంకుశముగ పాలించు జాతికి నిరంకుశ బుద్ధియు బానిసత్వము లోనున్న జూతికి బానిన బుద్ధియ ఏర్పడును.


అమెరికా స్వతంత్ర యుద్దమువలన అమెరికాలోని తెల్ల వారికి మాత్రమే స్వతంత్రము లభించినది. కాని నీగ్రోలు గాని ఎర్రయిడియనులుగాని రాజకీయ హక్కులు పొందక ఫోగా ఆ ఖరుకు బానిసత్వము నుండియైన విముక్తి చెందలేదు.

(2)

అమెరికా
వాఅరి అభివృద్ధి.


అమెరికా వారు స్వతంతమును పొందినతరువాత ఉలి ఘనీసుపర్వతములను దాటి పశ్చిమము నసున్నదేశ ముసంతను ఆక్రమించుకొని వలస నేర్పురచుచుండిరి. కొత్తగా రాష్ట్రములను స్థాపించి వాటిని సంయుక్త రాష్ట్రములలో చేర్చుకొను చుండిరి. అచటి. ఎర్రయిండియనులు నాశనము చేయబడిరి. అమెరికా వారు, వ్యాపించి సకొలదియు ఎర్రయిండియనులు అదృశ్యులైపోయిరి. తిరిగి కూనవులకంటికి కనపడలేదు. వారి సేద్య భూములు తోటలు, గనులు, అడవులు అమెరికనులకు శాశ్వతముగా పశమయ్యెను. అతిత్వరితముగా అమెరికనుల ఐశ్వర్యముషు జనసంఖ్యయు పెరిగెను. యూరఫుఖండమునుండియు క్రొత్త వారు అమెరి కాకువచ్చి చేరుచుండిరి. ఐర్లాండు దేశీయులు చాలమంది తమ దేశములో ప్రబలియున్న బాధ సహించ లేకను పైగా ఆంగ్లేయుప్రభుత్వమువారు పెట్టుచున్న నిర్బంధములకు కఠిన శాసన ప్రయోగములకు తాళజూలకయు అమెరికాకు కాపురమునకు వచ్చి. ఎప్పటికైన అమెరికా నుండి తమ మాతృదేశమగు ఐర్లాండు, స్వతంత్రముకొరకై ఆంగ్లేయులతో పోరాడవలెననియే వీరు తయారగుచుండిరి. 1848 వ సంవత్సరమున జర్మనీలోని ప్రజలు స్వతంత్రమునకై చేసిన ప్రయత్నములు విఫల మైనందున తమరాజు చేత నిర్బందములు పడక చాలమంది. జర్మనులు అమెరికాకు కాపురమునకు వచ్చిరి. కావురమునకు వచ్చినవారు ఆంగ్లేయులైనను. ఫ్రెంచివారైనను జర్మనులైనను ఐర్లాండు దేశీయులైనను అందరును అమెరికనులైరి. వీరందరి హృదయములలోను తమ మాతృదేశమగు అమెరికా సంయుక్త రాష్ట్రములయందు సంపూర్ణ మగుదేశాభిమానమును అమెరికా పొందుచున్న అత్యాశ్చర్యకరమగు ఐశ్వర్యాభివృద్ధియందు స్వభావమగు గర్వమును ప్రజ్వ రిల్లుచుండెను. స్వతంత్ర యుద్ధము నాటికి పదమూడు రాష్ట్రములుండెను. 1860 వ సంవత్సరమునాటికి ముప్పది మూడు రాష్ట్రము లేర్పడెను. మరియు మూడుకోట్ల పదిలక్షల ప్రజలుండిరి.


బానిసత్యము
గూర్చి బేదాభి
ప్రాయములు.


కాని ఉత్తర రాష్ట్రములవారికిని దక్షిణ రాష్ట్రముల వారిని బానిసత్వమును గూర్చిన భేదాభిప్రాయములు దివదినమునకు వృద్ధియై తీవ్ర రూపము దాల్చుచుండెను. ఉతరరాష్ట్రములో తెల్లవారే స్వయముగా పరిశ్రమలు వర్తక వ్యాపారములు వ్యవసాయము మొదలగు పనులన్నియు చేసుకొనిరి. తామాక్రమించిన ప్రదేశములలోని ఎర్రయిండి యనులు దొరికినచో నాశనము చేయుటయా లేదా తరిమి వేయుటయు మాత్రమే చేసిరి. కాని బానిసలుగా చేసికొనలేదు. క్రమముగా తమక్రిందనున్న నీగ్రో బానిసల కందరకును వ్యవసాయము నిమిత్తమును తోటలు వేయు నిమిత్తమును ఆఫ్రికాఖండము నుండి నీగ్రోలను బానిసలుగ దిగుమతి చేసికొనిరి. వేలకు వేల బానిసలను ప్రతిసంవత్సరమును

తెచ్చుకొనుచుండిరి. 1789 వ సంవత్సరమున పదమూడు సంయుక్త రాష్ట్రములకును రాజ్యాంగవిధానము, వాసికొని నవుడు బానిసత్వము అశాస్త్రీయమని దానిలో వ్రాయవలె పనియే కొందరు ప్రముఖులుద్దేశించిరి. కాని దక్షిణరాష్ట్రములు చీలిపోవునని భయమువలన బానిసత్వమును గూర్చిన ప్రస్తావనను పూర్తిగా విడిచి పెట్టిరి. అందువలన ప్రతిరాష్ట్రమును బానివత్వము విషయమున తన ఇచ్చవచ్చినటుల ప్రవర్తించెను. ఉత్త రాష్ట్రములు పరిశ్రమల కాకరములు.. బానిసలను తెచ్చినచో సామాన్యులగు తెల్ల వారికి జీవనములో, పోటీ ఏర్పడును. సొమ్ముపుచ్చుకొను కార్మికులు పనిచేసినటుల ఊరికె నిర్బంధముగ పనిచేయు బానిసలు పని చెయ్యరు. అందువలన క్రమముగా ఉత్తర రాష్ట్రములన్నియు బానిసత్వమువకు విముఖులై బానిసత్వ మశాశ్రియమని శాసించెను. దక్షిణరాష్ట్రములు వ్యవసాయమున కునికి పట్టులు. విశేమగుభూములుగల గొప్ప తెల్లభూఖామందులతో నిండియుండెను. వీరు బానిసలచే వ్యవసాయము చేయించుకొసరి. బానిసత్వము న్యాయమైనదని అంగీకరించిరి.


బానిసత్యమును
రూపుమాప వలెనను
ఆందోళనము.


పందొమ్మిదవ శతాబ్దములో యూరపు ఖండమునబానిసత్యమును రూపు మాపపలెనను గొప్ప ఆందోళసము బయలు దేరెను. ఈ ఆందోళనము అమెరికాకును వ్యాపించెను. పారంభములో చాలా సంవత్సరముల వరకు సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వములో దక్షిణ రాష్ట్రముల వారికి యెక్కువ పలుకుబడి యుండెను. బానిసత్వము పోవునను భీతివలస కూడ దక్షిణ రాష్ట్రముల ప్రతినిధు లందరును యేకమై ఒక టేవిధమున సమ్మతుల నిచ్చుచుండిరి. దక్షిణ రాష్ట్రముల ప్రతినిధులమాట యెక్కువ చెల్లుబడి యగుచుం డెను. 1881 వ సంవత్సరమున యూరపు ఖండమున రైలు యంత్రము కనిపెట్టబడి మొదటి రైలువే (ధూమ శకటము) 'వేయబడెను. 1835 వ సంవత్సరమున తంతివార్త (టెలిగ్రాఫు) యూరపు ఖండమున ప్రధమమున కనిపెట్టబడినది. 1819 వ సంవత్సరముననే మొదటి పొగయోడ (స్టీమురు) అమెరికా నుండి బయలు దేరను. 1840 న సంవత్సర ప్రాంతముల రైలు వేలు (ధూమ శకటముల) విశేషముగ వేయ బడియు యంత్రశాలలు స్థాపించబడియు అమెరికాలోని ఉత్తర రాష్ట్రము లలో నైక్యతకును విశేషముగు సంపదకును కారణ మయ్యెను. ఉత్తర రాష్ట్రములు దక్షణ రాష్ట్రములలో పోటీ బడుటకను మించుటకును సర్వవిధముల తగియుండిరి. బానిసత్వమును అమెరికా సంయుక్త రాష్ట్రము. అన్నిటిలోను సంపూముగ గద్దు పరచవ లెసను కక్షి యొకటి ఉత్తరమున బయలు దేరెను.


మానవులను బానిసలుగ చేయుట యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిద్దాంతములకువ్యతి రేకమని ఆందోళసము చేయబడినది. కాని సత్వమును రూపుమాపుటకై సంఘములు స్థాపించబడెను. తెల్లవారగు అమెరికనులును స్వచ్చను పొందిన బానిసలును ఇందు సభ్యులుగా చేరిది. నీగ్రోలలో విద్యా వ్యాపకము H చేయబడెన. అనేక పాఠళలలును కొన్ని కళాశాలలుసు కూడ స్థాపించబడెను. అమెరిక సులు మిగుల ఉదార హృదయులై విశేషమగు ధనసహాయము చేసిరి. దక్షిణ రాష్ట్ర ములనుండి బానిసలగు నీగ్రోలను దొంగతనముగ ఉత్తర రాష్ట్రములకు తెచ్చి యిచట స్వేచ్ఛ నిచ్చుటకు గొప్ప యేర్పాటులు చేయబడెను. బానిస యిచట అడుగు పెట్టిన తోడనే స్వేచ్చము పొందును. పారిపోయి వచ్చిన వారిని తిరిగి యజమానులు పట్టుకొని పోవుటకు వీలు లేకుండ శాసనములను చేసిరి. 1860 వ సంవత్సరము వాటికి ఉత్తర రాష్ట్రములలో నాలుగు లక్షల మంది స్వేచ్ఛను పొందిన నీగోలుండిరి. నీగ్రో లను విముక్తి చేయుట కేర్పడిన సంఘములవారు దక్షిణరాష్ట్రములనుండి బానిసలను బహువిధములగు పాద్దతులచే యెత్తుకొని వచ్చిరి. ఒక్కొకప్పుడు వర్తక సరుకులతో పాటు బానిసలను పెట్టలలో పెట్టి రైళ్ళమీదను స్టీమరులమీదను పంపిరి. ఇచట చేరగానే పెట్టెలను మిగుల ఆత్రతతో తెరచి లోపలి వారిని బయటకు తీయచుండిరి. 1857 వ సంవత్సరమున నొక నీగోయువతిని బాల్టిమోరునుండి ఒక సామాను పెట్టెలో పెట్టి ఫిలడల్పియాకు వడవమీద రవానా చేసిరి. ఈ పెట్ట తోవలో ఒకటి రెండుసార్లు తలక్రిందు చేయబడెను . ఫిలడల్ఫియా చేరినతరువాత ఒక రాత్రియంతయు నాపెట్టె తెరువబడ లేదు, మరువాడుదయము పది గంటల వరకును ఆపెట్టెలో పిల్లయున్నటుల తెలియదు. అపుడు తెరచి లోపలనుండిన యా యువతిని బయటకు తీరుగా ఆమె స్పృహతప్పి యుండెను. కొంత వైద్య చికిత్స చేసిన

తరువాత భగవదసుగ్రహమువలన ఆమె స్వస్థతను స్వేచ్చను పొందెను. అనేక మారులు స్త్రీలు పురుష వేషములు ధరించియు పురుషులు స్త్రీ వేషములను ధరించియు పారిపోవు చుండిరి. తరుచుగా స్వేచ్చావంతనుగు రాష్ట్రమును చేరుట, అరణ్యములగుండను కొండల గుండను వందల కొలది మైళ్లు నడచు చుండిరి. దక్షిణ రాష్ట్రములవారు మిగుల పట్టుదలతో బానిసవ్యాపారమును స్థిరపరచుటకై పనిచేసిరి. బానిసలమీద నెక్కున కఠిన పద్దతులను ప్రయోగించిరి. వారికి సహాయము చేయు వారిని కఠినముగ శిక్షించిరి. ముగ్గుకు బానివలను ఉత్తర రాష్ట్రములకు రవానాచేసిన ళామ్యుయలుస్మిత్తును పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వమువారు విచారించి ఎనిమిది సంవత్సరముల కథిన ఖైదు వేసిరి. బానిసలలో రహస్య సంఘము లేర్పడెను. అక్కడక్కడ స్వతంత్రములకై బానిసలు తిరుగ బాటుచేసిరి. 'ఆతిరుగబాటులను ప్రభుత్వము వారు మిగుల ఘోరమగు పద్దతులచే నణచిరి. తప్పించుకొని పోవుటకు రహస్య సంఘములో చేరినటుల తెలిసినచో బానిసను క్రూరవధ గావించిరి. గాని స్వేచ్చను పొందుటకు కోరికయు పట్టుదలయు బానిసలలో హెచ్చెను. ఏమాత్ర మవకాశమున్నసు స్వతంత్రమును పొందగోరుట మానవస్వభావము. దక్షిణరాష్ట్ర ములలో గూడ బానిస వ్యాపారమువలన తెల్లవారిలో గొప్ప భూఖామందులకు మాత్రమే లాభముగాని బీదస్థితి లోనున్న చిన్న వ్యవసాయికులును కార్మికులుసునగు తెల్లవారికి బావినల వలన నష్టమే కలుగుచుండెను. బానిసలు లేకుండిన వీరే

కూలి పుచ్చుకొని పనిచేసియుందురు. వీరి జీవనాధారమునకు బానిసలు పోటీగా నుండిరి. గాని వీరికిగూడ నల్లవాడగు నీగ్రోపుట్టుకవలన తక్కువవాడనియు బానిసత్వము వారి స్వభావస్థితియనియు నమ్మికయండెను. తమకు కొంచెము సైతివర్పడినచో ఒకరిద్దరు సల్లవారిని బానిసలుగకొని పనిచేయించుటకు వీరికి ఎట్టి అభ్యంతరము లేకుండెను. దక్షిణరాష్ట్ర ములలోని శాసనసభలలో స్వభావముగా గొప్ప భూకామందులకే పలుకుబడియుండి బానిసవ్యాపారమున కనుకూలమగు చట్టములను చేయుచు దావిపక్షమున ఆందోళనచేయు చుండిరి. ఉత్తరమున బానిస వృత్తికి వ్యతిరేకముగ ఆందోళనము దృఢపడిన కొలదియు క్రమముగా దక్షిణమునగూడ తెల్లవారిలో సామాన్యజనులలోను మతగురువులలోను కొందరికి బానిసత్వము ఈశ్వరునికి వ్యతిరేకమను అభిప్రాయములు కలిగి అట్టివారు బానిసలు తప్పించుకొని పోవుటకై సహాయ పడుచుండిరి



దక్షిణ రాష్ట్రములలో చేరిన వర్జీనియా రాష్ట్ర నివాసియగు జాన్ బ్రౌను అను తెల్లవాడు మిగులయోగ్యుడు.దైవభక్తి గలవాడు. బానిసలను యజమానులు పెట్టుబాధలు చూడ లేక చిన్న తనమునుండియు బానిసత్వపు నందత్యంత మగు అసహ్యమును కలిగి యుండెను. బానిసత్వమును రూపుమాపపలెపను కక్షిలోచేరెను. చాలమంది బానిసలు తప్పించుకొని పోవుటకై సహాయము చేయుచుండెను. బానిసలలో స్వేచ్చను పొందుటకై ఆత్మవిశ్వాసమును స్వయం కృషిని పురిగొలిపెను. 1850 వ సంవత్సంమున ఆయనయును

ఇరువదియిద్దరు నీగ్రోలునుకలిపి వర్జీనియాలోని బానిసల నందరసు స్వతంత్రవంతులుగ చేయవలెనని కుట్రలుపన్నిరి. అవసరమైనచో ఆత్మసంరక్షణకొరకు కొన్ని ఆయుధ రులను కూడ సేకరించిరి. " 16వ అకోలకు తేదీన వర్జీనియా రాష్ట్ర ప్రభుత్వమువారు సేనలను బంపి యాయన యున్న గ్రామమును ముట్టడించి ఈయనను గొనిపోయిరి. ఈయనను ఈయన యొక్క నలుగురు కుమాళ్ళను ప్రభుత్వమువారు విచారించి ప్రభుత్వ విద్రోహులని తీర్మానించి డిశంబరు రెండవ తేదీన ఉరితీసిరి.


ఇట్టి పరిస్థితులేర్పడి బానిసత్వమునుగూర్చి తీవ్రమగు రెండు కక్షలేర్పడియున్న సమయమున 1860 వ సంవత్సరమున అమెరికా సంయుక్త రాష్ట్రముల కాంగ్రెసు ( శాసన సభ)లకు ఎన్నికలువచ్చెను. అమెరికా సంయుక్త రాష్ట్రము లలో సంపూర్ణముగ బానిసత్వము నిర్మూలము కావలెనా లేదా యను నమస్య మీదనే ఎన్నికలు జరిగెను. సృష్టిలో మానవులు సమాసలుగ పుట్టినారను సిద్ధాంతము కల్పితమనియు ఈశ్వరుడే కొందరిని ఎక్కువవారిగమ కొందరిని తక్కువ వారిగను పుట్టించినాడనియు ఎక్కు వవారికి తక్కువవారు కొలువవలెననియు బానిసత్వము ఈశ్వర నిర్మితమైనదనియు దక్షిణపు వారు వాదించిరి. వారు విశేష ద్రవ్యము ఖర్చు పెట్టిరి. గొప్ప ఆందోళసముచేసిరి. నల్లవాడు కూడ తక్కిన మనుష్యులవలెనే పుట్టినాడనియు అతనికిని ఆత్మ బుద్ధి, మనస్సాక్షి, తెలివి తేటలు గలవనియు దానిని నిర్బంధించి వానిబుద్దిని, ఆత్మను వికసింపకుండునట్లు అణచివేయుట పాపం కృత్యమనియు బానిసత్వమునకు వ్యతిరేకులగు ఉత్తగాది కక్ష వారు ఆందోళనమును చేసిరి. మానవ స్వాతంత్యమునకై ప్రాణములర్పించిన ధీరు లగు జాన్ బ్రౌను యొక్కయు ఆతని నలుగురు కుమాళ్ళ యొక్కయు, ఆకారములు ఓట్లనిచ్చు ప్రజల యొక్క దృష్టిలో కనపడుచుండెను. 1860 వ సంవత్సరము నవంబరు నెలలో శాసనసభల ఎన్నికలు పూర్తి అయ్యెను. బానిసత్వమును సంపూర్ణముగా రద్దుపర్చవలె నను కక్షికి చెందినవారే అధిక సంఖ్యాకులుగ ఎన్నుకొనబడిరి. ఆకక్షి నాయకుడగు అబ్రహాం లింకను అమెరికా సంయుక్త రాష్ట్రములకు అధ్యక్షుడుగ నెన్ను కొనబడెను. లోకము లోని దీనులకొరకును దార్భాగ్యులకొరకును పశ్చాత్తాపపు నొందు పాపులకొరకును సిలువమిద ఘోర మరణము నొందిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధలకు జయము కలిగెను.

దక్షిణ
రాష్ట్రముల
తిరుగుబాటు.


ఇందు మీద కొన్ని దక్షిణరాష్ట్రములలో పుట్టిన క్రోధమునకు మేర లేదు. 1860 వ సంవత్సరము డిశంబరు నెల 17 వ తేదిన దక్షిణ రాష్ట్ర ములలో చేసిన దక్షిణ కారొలీనా రాష్ట్రము వారు సంయుక్త రాష్ట్ర ప్రభుత్వము బానిసత్వమును రద్దుపర్చుటకు బద్దకంకణులై యున్నది గావున తాము సంయుక్త రాష్ట్ర ములలోనుంచి చీలిపోయి స్వతంత్రమును స్థాపించుకొని నామని ప్రకటించుచు బానిసత్వము సంగీకరించు తక్కిన 'రాష్ట్రముల వారును తమువలెనే స్వతంత్రమును ప్రకటించవలెపని కోరిరి. కాని మెటనే దక్షిణరాష్ట్రములన్నియు సం

యుక్త ప్రభుత్వమునుండి చీలుటకు సమ్మతించలేదు. ములు రాష్ట్రము లలో బానిసత్వమునందెంత, పేరుగలదో సంయుక్త ప్రభుత్వ పధతి యందునుకూడ సంత ప్రేమగలదు. 1861 వ. సంవత్సరము' ఫిబ్రవరి 1 వ తేదీవరకు ఆరురాష్ట్రములవారు దక్షిణ కారోలినా రాష్ట్రమువారి మార్గము ననుసరించి సంయుక్త ప్రభుత్వమునుండి చీలుటకు తీర్మానించిరి. ఇంకను నాలుగు రాష్ట్రముల వారు బాని సత్వము: సందు ప్రేమయున్నను. సందేహ మనస్కులై నిరీక్షించుచుండిరి.


విడిపోయిన
రాష్ట్రములు


1861 వ సంవత్సరము పిభ్రవరి నెల 4 వ తేదీన విడిపోయిన ఏడు రాష్ట్రముల ప్రతినిధులును విడిపోయిన రాష్ట్రముల ప్రతినిదులు మాంగొమరీ పట్టణమున సమావేశమై యొకసంయుక్త రాజ్యంగ విధానము నేర్పరచుకొనిరి. ఈ నూతన ప్రజాస్వాహ్యమునకు పునాది బానిసవ్యాపారము. అమెరిళాఖండమున బానిసలు కావలసిన తెల్లవారందరును, ఇందు చేరవచ్చునని ప్రకటించబడెను . " నల్లగాడగు నిగ్రో తెల్లవానికన్న తక్కువ వాడనియు ఆతని స్వభావముగు స్తితి బానిసత్వమనియునను గొప్పసత్యమే ఈ నూతన ప్రజా స్వామ్యమునకు పునాది రాయి" యని ఉపాధ్యాక్షుడగువెన్నగారు చెప్పిరి. మిసిసిపీ ప్రాంత కాపరస్తులగు జెఫర్చ సుడేవిసు నూతన సంయుక్త ప్రభుత్వమున కధ్యక్షుడుగ నెన్నుకొనబడెను. ఫిభ్రవరి నెల 18 వ తేదీనుండియు నీ ప్రభుత్వ, ముసాగించబడెను. త్వరగ నావికాదళము, సైవ్వలు, బొక్కసము, న్యాయవిచారణా శాఖ,తంతి,టపాలా, మొదలగు వయన్నియు అమర్చుకోబడెను. ప్రతి వానికిని బానిసలను ఆస్తిగా నుంచుకొను హక్కు గలదని శాసించబడెను


యుద్ధము

(కాంగ్రెను), శాసనసభలు ఎన్నికలకై అభ్యర్థులుప్రయత్నము చేయుచున్నప్పుడే, ఎక్కువ మంది బానిసత్వమునకు వ్యతిరేకు లగువారు ఎన్నుకొనబడివచో తాము విడిపోదుమని దక్షిణ రాష్ట్రములలో చాలమంది బెదరించుచుండిరి. కాని నిజముగా రాష్ట్రములు విడిపోవునని ఉత్తరముననున్న ప్రముఖులు తలచలేదు. దక్షణ కారొలీనా బెదిరించినను బుజ్జగించగనే తిరిగివచ్చి చేరు " సనిమాత్రమే తలచిరి. ఇన్ని రాష్ట్రము లొకటిగా చేరునని తిలచ లేదు, బానిసత్వం కూడదను వారు తమయభిప్రాయ ములను దక్షిణ రాష్ట్రములమీద బలవంతముగా అంట కట్టుట సరికాదని శాసనసభలోని యొక కక్షివారు వాదించ సాగిరి. మూడు నెలలకాలము కాంగ్రెసువారు రాజీనామా "మయత్నములలో నిమగ్నులై యుండిరి. కాని రాజీనామా కుదర లేదు. తమను శాంతముగా విడిపోనిచ్చెదరనియు శాం గౌసువారుగానీ, కొత్తలధ్యక్షుడుగాని తమజోలికి రారనియు దక్షణాదివారు తలచిరి, మార్చి 4 వ తేదీన ఆబ్రహాము లింకను (ప్రెసిడెంటు) అధ్యక్ష పదవిని స్వీకరించెను. కాని 'సల యజమానులగు తెల్లవారు ఆయనను హత్య చేయుదురనియు అధ్యక్ష పదవిని స్వీకరించ సివ్వరనియు వదంతులు ప్రబలెను గాని అట్టిది సంభవించ లేదు. ఆయన ప్రధమము నుంచియు " బానిసత్వము అక్రమమైనదనియు, సగము స్వేచ్చా వంతముగను నగము బానిషత్వములోను ప్రభుత్వము శాశ్వ తముగనుండుట అసంభవమనియు, సంయుక్త రాష్ట్రములు ప్రభుత్వము బెదిరింపులతో కూలి పోదనియు "యెమ కి ని చీలిపోవుటకు హక్కు లేదనియు, చెప్పుచుండెను. ఆయన అధ్యక్ష పదవిని స్వీకరించు దినమున యెట్టి యాటంకములు కలుగకుండ స్కాటు నేనాని సైన్యములతో ముఖ్యపట్టణమును కాచుచుండెను. కొంతకాల మాయన తగిన సూతన యుద్యోగస్తుల నేర్పరచు కొనుటలో గడపవలసి వచ్చెను. మొదటనే బానిసత్వమును రద్దు పర్చుటకోరకై తాను యుద్ధము చేసెదనని ప్రకటించ లేదు. కానీ తాను విడచిపోదలచిన 'రాష్ట్రములను బలవంతపర్చి సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వ ముక్రింద నుంచెదననియు యిందు కవసరమైనచో యుద్దమును చేసెదననియు చెప్పెను. ఎట్లయినను ఉభయపక్షముల వారును పోరుసకు తయారగుచుండిరి. తిరుగ బాటుదార్లే యుద్ధమును , ఫారంభించినవారైరి. దక్షిణ కారొలీనా రాష్ట్రములోని కొన్ని కోటలను సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వమువారు స్వాధీనమందు చుకొనియున్నందున వాటిని వెంటనే తమకు స్వాధీన పరచవలసినదని యాసేనాధి పతిని దక్షిణకారొలినా వారుగోరిరి. సేనాధిపతి తిరస్క.రించెను. దక్షిణ కొలీనావారు సైన్యములనుబంపి ముట్టడించి యాకోటలను స్వాధీనమును పొందిరి. ఇందుమీద అబ్రహాము లింకను నూతన ప్రభుత్వము పై యుద్దమును ప్రకటించెను.


పైన చెప్పిన యేడు రాష్ట్రము లేగాక మిగిలిన నాలుగు రాష్ట్రములును వీటిలో చేరెను. యిరువదిండు రాష్ట్రములు సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వ పక్షమునను పదకొండు


రాష్ట్రములు నూతన ప్రభుత్వ పక్షమునను నిలువబడి పోరాడినవి. అబ్రహాము లింకను కోరగనే ఒక లక్ష మంది ఐచ్చిక భటులు ఉత్తర రాష్ట్రములనుండి యుద్ధము జేయుట నేనలలో జేరిరి. యుద్ధము 1861వ సంవత్సరము జులై నుండి 1865వ సంవత్సరము యేప్రిలు వరకును జరిగెను. జరిగిన యుద్ధములను వర్ణించుట కీచిన్న పుస్తుకమలో తావు లేనందున వదలి వేసితిమి. ప్రారంభమున దక్షిణ ప్రభుత్వము కొన్ని జనుములను పొందినను అబ్రహామలింకను పట్టుదలతో యుద్ద ముసాగించి సంపూర్ణ జయయులను సంపాదించెను. మధ్యమధ్య కొన్ని రాష్ట్రములు లోబడెను. వీటికి ఆయనసంపూర్ణమగు క్షమాపణ నిచ్చుచువచ్చెను. 1864 వ సంవత్సరము సెప్టెంబరు 19 వ తేదీన గెట్టీసుబర్గులో యుద్ధములో మరణించిన వారి స్మశాన వాటికను తెరచుచు అబ్రహాం లింక నిటుల చెప్పెను. “ఎనుబదిఏడు సంవత్సరములకిందట మనపూర్వ ఖండములో స్వతంత్రమును పొందినట్టియు అందరుమనుష్యులును సమానులునను సిద్ధాంతమును నమ్మునట్టియు నొకజాతిని ఏర్పరచి నారు. ఆజాతిగాని లేదా అట్టి సిద్ధాంతములుగల జాతి గాని చాలకాలము నిలుచునా లేదా యసు సమస్యాపరిష్కా రమున మసమొక గొప్ప అంతర్జాతీయ యుద్ధములో నిపుడు మునిగియున్నాము. ఆయద్దములోని యొక గొప్ప యుద్దభూమిలో మనమిపుడు సమావేశమైనారము. ఆజాతి ప్రపంచమున స్థిరముగ నిలంచుటకుగాను తమ ప్రాణములనర్పించిన ధీరులకు విశ్రాంతి స్థలముగా నీభూమిలో కొంతభాగము ఏర్పరచుట కచటికి చేరినారము, మిగతాపనిచేయుట ఎంతయు ఆర్దమై


యున్నది. కాని ఈ స్తలమును పవిత్రవంతముయిన దానినిగా మనము చేయజాలము. ఇచట పోరు సలిపిన ధీరులు - మరణించినవారును బ్రతికి యున్న వారును -- దీనిని పవిత్ర పరచి యున్నారు. మనము అల్పులము. మసుమేమి చెప్పినను దానిని ప్రపంచము లక్ష్యము చేయదు. వారు చేసిన దానిని శాశ్వతముగా గ్యాపక ముంచుకొనును. బ్రతికియున్న వార మైన మనయొక్క విధి యొక్కటే మనమును వారితోవసు సడచి మీరు చేసిన మహాత్కార్యమును పూర్తిచేసి పవిత్రవంతులవలు కావలసి యున్నాము. ఈ చనిపోయినవారు వృథాగా తమ ప్రాణముల సర్పణ చేయ లేదని మనమివుడు తీర్మానించవలసి యున్నది. పరమేశ్వరుని అనుగ్రహమువలన ఈజాతి స్వతంత్రయుతమగు పునార్జన్మను పొంది తీరునని మనమిపుడు దృఢ దీక్షతో నిచ్చయింతము. ప్రజల లాభముకొరకు ప్రజలచే చేయబడెడి ప్రజా పరిపాలనము భూమి మీద నుండి నాశనము చేయబడ జాలదని మనము త్రికరణ శుద్దిగా ప్రకటింతము." అని ఆయన చెప్పెను. 1866 వ సంవత్సరము మార్చినెలలో నూతన సంయుక్త ప్రభుత్వ సేనలు విచ్ఛిన్నమై పోయెను. మార్చి 29వ తేదీన వారి రాజధానియగు పీటర్సు బర్గులో సంయుక్త రాష్ట్రముల సేనలు జొరబడి స్వాధీనమును పొందెను. ఏప్రియల్ 7 వ తేదీన వారి సేనాధిపతులు సంయుక్త రాష్ట్రములకు లొంగి ఇబ్రహాం లింగసుచే క్షమించ బడిరి. యుద్ధము ముగిసెను. అమెరికా సంయుక్త రాష్ట్ర ముల ఐక్యత కాపాడబడెను. అమెరికా సంయుక్త రాష్ట్రములలో బానిసత్వము సంపూర్ణముగ రద్దుపర్చబడెను. 1865 వ సంవత్సము జనవరిజల 31 వ తేదీన నే బానిసత్వము విషయములో అమెరికా సంయుక్త రాష్ట్రముల చట్టం సవరణ గావింపబడెను. " ఇతటినుంచియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో గాని వాటి క్రిందనున్న ప్రదేశములలో గాని బానిసత్వముగాని నిర్బింధమగు నౌకరీగాని యుండవు." అని శాసింపబడెను. తిరుగబాటు చేసిన దక్షిణ రాష్ట్రముల లోనివారిని క్షమించి నిజమైన స్నేహభావమును శాంతమును అన్ని రాష్ట్రముల మధ్యను నెలకొల్పుటకు అబ్రహాంలింకను యత్నించుచుండెను. ఇంతలో ఏప్రిల్ నెల 14 వ తేదీ రాతి) నాటకశాలనుంచి వచ్చుచుండగా ఆబ్రహాం లింకమను బానిసత్వ పక్షపు కుట్రలో చేరిన యొక దుష్టుడు' తుపాకితో కాల్సి చంపెను. మానవ స్వాతంత్ర్యమునకై ప్రాణము లర్పించిన యుత్తమ పురుషులలో ఆబ్రహాం. లింకను పేరెన్నిక గన్న వాడు.