Jump to content

అమెరికా సంయుక్త రాష్ట్రములు/అయిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

అమెరికా సుయుక్త రాష్ట్రములు.

అయిదవ అధ్యాయము.

{ఓడ వర్తకమును గూర్చిన
శాసనములు/

స్వతంత్ర యుద్ధమునకు కారణములు.

ఉత్తర అమెరికా వలవ రాష్ట్రముల వారాంగ్లేయ దేశ మునందు భక్తిగలిగి యాంగ్లేయ దేశగౌరవమును సంరక్షించుటకును తమ ప్రదేశము లను విస్తరింప చేసికొనుటకును యుద్ధములు చేయుట కెప్పుడును సుసిద్ధులుగ నుండిరి. "కాని తమహక్కులకు భంగముకలుగ చేసినపు డాంగ్లేయరాజును ఆయిన ప్రతినిధుల ధిక్కరిం చుటకును నొకప్పుడు తిరుగ బాటులుచే యుటకును వెనుదీయకుండిరి. స్వాతంత్ర్య యుద్ధ మునకు పూర్వము చాలాకా లమునుండియు నిగ్లాండునకును వలస రాష్ట్రములకును కొన్ని కలతలు కలుగుచునే యుండెను. ఇంగ్లాండు ప్రభుత్వమువారు పదునేడవ శతాబ్దపు మధ్య బాగము నుండియు(నానిగేషణన్ ఆక్టులు) ఓడవర్త కమును గూర్చి చేసిన శాసననము వలన నీ వలస రాష్ట్రము - వారికి మిక్కిలి యసంతృప్తి కలిగినది. ఇగ్లండు ప్రభుత్వము వారు వలన


రాష్ట్రము లింగ్లాండువకు ఎగుమతిచేయుసరుకుల నింగ్లీషు యోడలలోనే వంపవలెనని ప్రధమమున 1652 సంవత్సరమున చట్టము చేసిరి. తరువాత వలసరాజ్యముల వారు ఏదేశముతో వర్తకము చేసినను ఎగుమతి దిగు మతి యగు సరకు లన్నియు నింగ్లీషు వారిచే నడుపబడు నింగ్లీషు యోడల లోనే రాకపోకలు చేయు లెనని 1664 సంవత్సరమున మరియొక శాససమును చేసిరి. ఇంగ్లాంకు దేశముద్వారా తప్ప సరాసరి యూరపు ఖండములోని ఏదేశమునుండియు సరుకులను కొసగూడదనియు నాంగ్లేయులు తప్ప విదేశీయు “లెవరుసు నీ వలసరాష్ట్రము లో వర్తకులుగ నుండగూడదని యు 1662 వ సంవత్సరమున నింకొక చట్టము గావించిరి.

{ఎగుమతి దిగుమతి
పన్నులు}

ఆగ్లేయ ప్రభుత్వము వా రింతటితో నూరుకొ నక ఎగుమతి దిగుమతి వలస రాస్ట్రములలో నొక దాని నుండి మరి యొక దానికి ఎగుమతియగు వంట దినుసులమీదకూడ పన్నులు విధించి వలస రాష్ట్రముల లో ఫలించు ముఖ్యపంట దినుసు.ఇంగ్లాండు నకుతప్ప మరి యేదేశ మునకును యెగుమతి చేయకూడదని నిషేధించిరి. ఈచట్ట ములవలన వలసరాష్ట్రముల కన్ని టికిని అపారమగు నష్టము కలి గెను. ఇష్టము వచ్చిన దేశములలో చౌకగాని ప్రియము గా అమ్ముకొను వర్తక స్వేచ్చ నశించినది. వలసరాష్ట్రము కొన్ని ఈ చట్టములను తిరస్కరించి ప్రపవర్తించసాగెను. మేస షు సెట్సు రాష్ట్రమువారీ చట్టములను పదిసంవత్సరముల వరరకు అమలులో పెట్టుటకు నిరాకరించిరి. ఈ రాష్ట్రపు పతినిధిసభ వారు తమ రాష్ట్రమునకు నష్టకరమగునట్టియు తాము చేయు .

న్యాయమగు చట్టములకు వ్యతిరేకమయినట్టియు ఎట్టిశాసనము లైనను ఇంగ్లాండు రాజుగాని ఆంగ్లేయ ( పార్లమెంటు) ఈ ప్రతినిధిసభ వారు గాని చేసినయెడల దాన్ని తిరస్కరించెదమని ప్రక టనము గావించిరి. కాని 1688 సంవత్స్వము 2. వలస రాజ్యములన్నిటిలోను కలసి రెండు లక్షల కన్న ఎక్కువ ప్రజలు లేరు. బలహీనమగు స్థితిలో నుండి బలవంతమగు నీంగ్లాండుతో పోరాడలేకుండెను. కావున నెంత యసంతృప్తిని యాగ్రహము ను వెలి బుచ్చినను ఆంగ్లేయ ప్రభుత్వము వారి యుత్తరవు లకు లోబడక తప్పినదిగాదు 1679 సంవత్సరమున వలస రాష్ట్రము లో ని ఘనత వహించిన రాజు గారి ప్రజల హక్కుల కును స్వాతం త్యములాకుసు నీ పర్త క చట్టములు బంగకరముగ నున్నవని ఆంగ్లేయ పార్లమెంటు (ప్రతినిధీసభలో నీ వలస రాష్ట్రపు ప్రతినిదులు లేరు గావస ఐగుచేయు * ససమలు అమెరికావారిని బద్దులని చేయజాల వనియు మెసషు సెట్సు వలసప్రభుత్వమువారు ప్రకటించుచు, తామే ఇంగ్లీషువారు చేసిన చట్టము లను చేసి వాటినమలులో బెట్టిని. ఆ గ్లేయ ప్రభుత్వము వారీ యధికార ధిక్కారమునకు సహించక యుత్తర వలసరాష్ట్రము లన్నిటి యొక్కయు హక్కుల దానశాసనములను రద్దుపంచి న్యూయింగ్లాండు సాముదాయములో చేరిన మెసషు సెట్సు, కనెక్టుకటు, న్యూ హంపు పైరు, రోచుద్వీపముల రాష్ట్రములమీద సర్ ఎజ్మండు ఆండ్రాసను నాయనను నిరంకుశముగ పాలించుటకు గవర్న రుగ నియమించి సంపిరి. న్యూయార్డు రాష్ట్రము కూడ నీయన , కిందనే చేర్చబడెను. ఈ రాష్ట్రములలోని ప్రజాప్రతినిధి సంఘములు తీసివేయాబడెను. మూడునంవత్సరముల కాలము వరికీ నిరంకుశ ప్రభుత్వమున రాష్ట్రములన్నియు లోబడెను. న్యూయార్కు రాష్ట్ర ప్రజలు కలహించి యొక యొకె ప్రతినిధిసభను నొక గవర్నరును (రాష్ట్ర పాలకుని) ఎన్నుకొనిరి. కాని వీరెన్నుకొనిన రాష్ట్ర పాలకుని ఆంగ్లేయప్రభుత్వమువారు రాజ ద్రోహ నేరము కింద పట్టుకొని విచారించి యురితీసి ప్రజా ప్రభుత్వమును విచ్చేదము చేసిరి. ఈయనను ప్రజాస్వాతంత్ర్య ముకొరకు ప్రాణములర్పించిన ధీరునిగ ప్రజలు గౌరవించి ఆయన వస్త్రపు ముక్కలను జ్ఞాపకమునకై దాచుకొనిరి. ఈకలతలో వలసరాష్ట్రములు లోబడి నను దీనిలోను రాబోవు స్వాతంత్ర్య యుద్దములోను నిమిడియున్న సిద్ధాంతము లొకటే. మాత్స దేశము వలసరాష్ట్రముల ప్రభు త్వముతోను వారి వర్తతకపు స్వేచ్చతోను జోక్యము కలుగజేసుకొనవచ్చునా కూడదాయను విషయమే ముఖ్యమైనదిగ నున్నది.


1688 సంవత్సరమున నాంగ్లేయ దేశములో విప్లవము జరిగి రెండవ జేమ్సు రాజు ను దేశ భ్రష్టుని చేసి విలియం రాజును మేరీరాణిని పాలకులను చేసికొనిరి. ఈసమయమున నీవలన రాష్ట్రములు తిరుగ బాటుచేసి తమ రాష్ట్ర పాలకుడగు సర్ ఎక్మంతు ఆండ్రాననును వెడలగొట్టి ప్రజాప్రతినిధి సభలను స్థాపించుకొని విలియం రాజుకును మేరీ రాణికిని తమ రాజభక్తిని ప్రకటించినవి. ఆంగ్లేయు దేశములోని ప్రభుత్వం తొందరల వలన వారు చూచిచూడనట్లూరకొనిరి. మరి యొక గవర్నరును పంపిరి, మెగషు సెట్సు రాష్ట్రము వారు హక్కుల దాన శాసనమును తిరి గిమ్మని కోరినపుడు ఆంగ్లేయు ప్రభుత్వ మువారు

- పంపెడి గవర్నరువలననే ప్రధానోద్యోగులు నియమింపబడి వలెనను నిబందనను చేసి మరీయిచ్చిరి.

1713 సంవత్సరమున జరిగిన ఉట్రెక్టు సంధివలన ఇంగ్లాండు తో నే గాక స్పైన్ దేశముతోను వారి వలసరాజ్య ములతోను కూడ వర్తకము చేసుకొనవచ్చునని యెడంబడిక జరిగెను. దీనివలన కొంత స్వేచ్చకలిగెను. దీనిచాటున నీయమెరికా పలసరాష్ట్రములు యూరఫుఖండములోని ఇతర దేశములతోకూడ వర్తకము చేసుకొనసాగిరి. కొంతకాలము ఆంగ్లేయ ప్రభుత్వమువారు హర్షించి యూరకొనిరి. ఆకాల మున ఆంగ్లేయ రాజ్యమునకు ప్రధానమంత్రిగనున్న సర్ గాబర్టు వాలోలున కెటులయిన నీవలస రాష్ట్రములవారి పర్తకము వృద్ధియగుట యే యిస్టముగ నుండెను.

(2)

{పరిశ్రమల అభివృద్ది
కాటంకము}

కొని కొద్దికాలము లోనే తిరిగి కలతలు ప్రారంభమయ్యెను. వలస రాష్ట్రములలోని పరిశ్రమల యభివృద్ధి యాంగ్లేయ ప్రభుత్వము వారికి భంగము కలిగించెను. ఈ రాస్ట్రములు ఇంగ్లాండు మీద నాధారపడక స్వంతంత్రముగ నుండుట తమకిష్టము లేదని ఆంగ్లేయు పార్లమెంటు ప్రజాప్రతినిధి సభ వారు తీర్మానించి వలస రాష్ట్రములలోని పరిశ్రమలను నిరుత్సా హ పరుచుటకు నిశ్చయించిరి. 1782 వ సంవత్సర వ నొక వలస రాష్ట్రమునుండి మరియొక నలస రాష్ట్ర మునకు టో పీలు ఎమతి కాకూడదని వి షేధించి, లోహపు పరీశ్రమలేమియు వలస రాష్ట్ర ములలో చేయకూదని యుత్తరువు

చేసిరి. వెనుకటి యోడవర్తకపు శాసనములన్నియుతిరిగి అమ లులో బెట్టిరి. ఆసియా ఖండమునుండియు ఆఫ్రికా ఖండము నుండియు బియ్యము, పంచదార మాత్రము. తెప్పించుకోన వచ్చుననియు తక్కిన ఏవిధమయిన వర్తకమును ఆంగ్లేయ దేశ ముతో తప్ప మరియే దేశముతోను చేయకూడదనియు శాసించిరి. ఈ రాష్ట్రములోనికి దిగుమతి యగు సారాయముల మీదను పంచదార మీదను సు:కము ను విధించి. వీరి గలప వర్తకమసకు పెక్కు ఆటంకములను కలుగ జేసిరి. దీని వలన నీవలస రాష్ట్రములు ప్రజలలో మితిలేని యసంతృప్తి కలిగెను. మాతృదేశము నాకు తమవర్తకాభివృద్ధి కభ్యంతరము కలుగచేయు చున్నారనియు, తమ యిష్టమును వ్యతిరేకముగ తమమీద పన్నులు విధించుచున్నారనియు, సక్రమమగుచట్టము లసు తమమీద చేయి చున్నా రనియు, వలస రాష్ట్రులవారు మాతృదేశ ముమీద నేరా రోపణ చేయుచుండి. పలసరాష్ట్ర ముల ప్రజలు పొగరుబోతులుగను కృతఘ్నులు గను తుంటరు లగ సున్నారనియు, మాతృదేశము యొక్క సంరక్షణ క్రింద వృద్ధి చెంది ఇపుడు తమసంరక్షకుని కూలదోచుటకు సిద్ధముగ నున్నారయు నాంగ్లేయ ప్రభుత్వము వారు చెప్పుచుండిరి. ఉభయుల మధ్య మనస్పర్ధలు హెచ్చుచుండెను.

{బలవంతమగు
సైనిక కొలువు

కలతకు మరియొక కారణము కలిగెను. ఆంగ్లేయయుద్ధ నౌకలు వలసరాష్ట్ర, తీరములకు వచ్చి నపుడు ఆగ్లేయ నౌకాసేనాధిపతులు మనుష్యులవసరమయిన చో వలస ప్రజలను బలవం తముగా తీసుకొనిపోయి తమ కొలువులో చేర్చుకొనుచుండిరి.


ఇట్టియధికార మింగ్లీషు ప్రభుత్వమువారు వారికిచ్చిరి. వలన రాష్ట్రములవారు దీనికా గ్రహించుచు వీలయినపు డాంగ్లేయ నాశాసనాధిపతుల నెదిరించి తమ మనుష్యులను విడిపించుకొని తెచ్చుకొనుచుండిరి.

{ఆంగ్లేయ
గవర్నరుల
జీతములు}

ఆంగ్లేయ ప్రభుత్వమువారిచే పంపబడిన గవర్నరు లీవలస రాష్ట్ర ప్రజలమీద నాధార పడి యుండు టకై ప్రతి సంవత్సరమును వారి జీతములను వలస ప్రజా ప్రతినిధి సభలు ని ర్మానించు చుండిరి. ఇట్లు గాక వారికి నిర్నయమైన జీతములను ప్రతినిధిసభల తీర్మా నమునకు సంబంధము లేకుండ చేయు వలెనని యాంగ్లేయ ప్రభు త్వమువారు తలచి. వలసరాష్ట్రములలోనికి దిగుమతి యయ్యె సరకులమీద ఆంగ్లేయ, ప్రభుత్వము పన్నులు విధంచినను ఇక్కడ సుంకమును వసూలుచేయు యుద్యోగస్తులు వలసపౌరులై నందున సుంకమును వసూలు చేయకుండగనే నూటికి తొంబది పాళ్ళు దొంగతనముగా విడిచి పెట్టుచున్నారనియ దీనికేమైన ప్రతీకారము చేయవవలెనన్నీయు కూడ నాంగ్లేయు ప్రభుత్వము యోచించుచుండెను.


వీటికి ప్రతీకారముగ 1763 వ సంవత్సరమున నా గ్లేయ ప్రభుత్వ మువారు "అమెరికాలోని రాజుగారి ప్రజల యొక్క సంగ క్షణకొరకొక ( రివిన్యూ ) పన్నును వారిమీద వేయు న్యాయమును అవసరమునునై యున్నద"ని తీర్మానించి సారాయములు మొదలగు వివిధ సరకుల యమ్మకముమీద ఎగుమతి దిగుమతుల మీదను పన్నులను విధించిరి. ఈపన్ను లలో నుండి తాము నియమించెడి ( గవర్నరులు,) రాష్ట్ర పాలకుల, న్యాయాధిపతులు మొదలగు నుద్యోగీయులకు. తాము నిర్నయించిన జీతముల నివ్వవలెననియు నీయుద్యో గస్తు లాంగ్లేయ ప్రభుత్వముపొరి యిష్టమున్నంత కాలము మాత్రమే యుద్యోగములో నుందురనియు శాసించరి. మరియు నన్ను లో నుండి ఖర్చుచేసి ఇరువది పటాలమును నిలుపుటకు నేర్పాటుచేసిరి.

{ప్రాతినిద్యము లేని
పల్లులు చేయ వీలు లేదు}

వలస రాష్ట్ర ప్రజలీ పన్నులకు ఆకుమనీ మేర్పాటులకును తమ యసమ్మితిని ఇండితముగ డెలిపిరి. కాని చేయునది కనపడక కొంతకాలము లోబడిరి. అప్పటివరకు వారు కోరినది యంగ్లేయప్రజాప్రతినిది(పార్లమెంటు). సభలో తమకుకూడ ప్రాతినిధ్య మివ్వవలసినదని మాత్రమే. తమ ప్రతినిధులు లేనిది ఆంగ్లేయ పార్లమెంటు వారు చేసేడి చట్టములును వేసెడిపన్నులును తమకు బద్దులను చేయు నేరవని వారివాదము. "ప్రాతినిధ్యము లేనిది పన్నులువేయు నర్హతలేదని వారి సిద్ధాంతము, ఇంకను ఇంగ్లాండు నుండి స్వతం త్రముసుపొందుదమసు భావము వారిలో కలుగ లేదు. బాస్టన్ పట్టణములోని సుప్రసిద్ధ న్యాయవాదియగు జేమ్సు ఓటిను "ఆంగ్లేయ దేశములోని పార్లమెంటుకు వలస రాష్ట్రములు ప్రతినిధు నెన్నుకొని పంపనిది. వీరిమీద పన్నులు వేయుటకు నాంగ్ల పార్లమెంటున కెట్టి యర్హతయు నుండనేరదని యొక కరపత్రమును ప్రచురించెను. బాస్టన్ పట్టణలోన బహిరంగసభలో బ్రిటిషు పౌరసత్వపు హక్కును మేము కోరుచున్నాము. వారిచ్చిన హక్కుల దానశాసన ములను బట్టికాదు. ఈ శాసశాసనములు వట్టికాగితములకంటే.

యెక్కువ విలువ లేనివి గాని మేము ఆయలలో మన డుగా పుట్టినందున మేము సమాసహాక్కును చున్నా ము” అని సామ్యూయల్ ఆడశ్సును నాయనో చెప్పారు.

{ప్రజాహివృద్ధి

, పలస రాష్ట్ర ప్రజలు బహు త్వరితముగా సంఖ్య ఆభివృద్ధి చెందిరి. యూరోవుఖంతములలోని వివిధ దేశముల ప్రభుత్వమువారా కాలము తా మవలంబిచిన క్రైస్తవనుత శాఖకుతప్ప నితరశాఖల నవలంబిం చిన ప్రజలను పెక్కు విధముల హింసించు చుండరి. ఈ విధముగా బాధనొందుచుండిన వారు యీ అమెరికా వలన రాష్ట్రములలోకి కాపురమునకు వచ్చుచుండిరి. ఈ రాష్ట్రములలో సంపూర్ణుమగు ముత స్వేచ్చ గలిగియుండెను. రోమాను కాథలిక్కులు, ప్రోట స్టెంటులు, ప్యూరిటసులు, ఎమజన లలు, క్వేకరులు, ప్రస్బి టేరియనులు, బాప్టిస్టులు, లూధరులును మెడిలేలియనులు మొదలగు క్రైస్తన. మతములోని వివిధ శాఖల వారును వివిధ తెల్లజాతులకు చెందిన వారును సంపూర్ణమగు మత సహనముతోడను తమయిచ్చవచ్చిన రీతిని యీ శ్వరు నారాధించు. మత స్వేచ్చతోడును భ్రాతృభావముతో తమ రాష్ట్రముల యభివృద్ధికి కృషి సల్పుదుచు ఐక మత్యము గలిగి నివసించుచుండిరి. మరియు నీకొత్త దేశ ములో ద్రవ్యమును సంపాదించి మంచి స్టాయిని. పొందుటకు ను చాలా మంది వచ్చు చుండిరి. మొత్తంమీద బంగ్లాందు నుండి వలస వచ్చినవారే చాలా యెక్కము నండి ఆ తరునే నీ రాష్ట్రుడు లింగ్లాండునుడు. లోగియుండినవి. 68 వ నేరవశ్వర ను. వరికీ రాష్ట్రములో జన సంఖ్య ఇరువది లక్షులవరకు పెరిగెను.


స్వాతం త్య యుద్ధమునాటికి ముప్పదియైదు లక్షలు. ఈ రాష్ట్ర ముల వారు వ్యవసాయమువలనను పరిశ్రమలవలనను చాలధనము నార్జించు చుండిరి. కొద్ది కాలములో మిగుల ధనవతుల యిరి. జార్జియారాష్ట్రము యొక్క వరిపొలములను కారొలీనా రాష్ట్ర ముల నీలిమందు భూములను పర్జీ నియయొక్క పొగాకు తోటలను దున్నుటకు అయిదు లక్షల నల్ల (నీగ్రో, బానిస లను ని మించిరి. పాఠశాలలను స్థాపించుకొని చక్కగా పిల్లలకు విద్య చెప్పించుకొనుటలో న్యూ ఇంగ్లాండు రాష్ట్ర ముల వారు మార్గదర్శకు లైరి. తక్కిన వారు వారినను కరించి విద్య, ధనము, సంఖ్య వృద్ధి అయిన కొలదియు నీ రాష్ట్రముల ప్ర జల లో స్వాతంత్రము నందు పట్టుదల హెచ్చెను.

(3,

{స్టాంపు పన్నులు

17: వ ... - జంగ్లా సి ప్రధానమంతి) ₹్వలు అమెరికా మన రాష్ట్రముల -- కూడ స్టాంపు పన్నులు వసూలు సే సెదమని తెలియ పరచెను. ఈపన్నులను విధించవలదని ఆరు రాష్ట్రముల ప్రజాప్రతినిధి సభలనుండి అర్జీలను పంపుటయే గాక వారి తరఫున కొందరు ప్రతినిధుల నింగ్లాంకునకు 'రాయ బారముకూడ పంపిరి. అట్లు వెళ్ళినరాయ బారులలో సుప్రసిద్దుడగు బెంజమిన్ ఫ్రాంక్లె ను ముఖ్యుడు కాని వీరి రాయ బార ములకును ఆర్జీలకును పెడచెవిని బెట్టి 1765, సంవత్సరము మార్చి 22వ తేదీన నాంగ్లేయ పభుత్వము వారొక స్టాంపు చట్టమును చేసిరి. దీనిలో ఇరువది రెండు శిక్షనులు గలవు.

నలుబదినాలుగు పన్ను లను విధించిరి. అరఠావుకు మించని కరపత్రముమీదను పృతికమీదను ఆరు పెన్ని పన్ను మొదలు న్యాయవాదుల పట్టాల మీద పది సవరనులవరకును వివిధము లగు స్టాంపుపన్నులను విధించినది.


{వలస రాష్ట్రముల అసమ్మతి

దీనితో నీవలస రాష్ట్ర ప్రజలలో గొప్పకలవరము పుట్టి నది. "స్వాతంత సూర్యడ స్తమించెన”ని ఫ్రాంక్లిను చెప్పెను."విధేయతతోను మాటలాడ కుండగనుఆంగ్లేయ ప్రభుత్వ : వారి యాజ్ఞలను శిరసా వహించుటయు కర్తవ్యము". ఓటిను నుడివెను. కాని యౌవనులు లోబడుట కొప్పున లేదు. నిరాశను చెంద లేదు. వర్జీనియా రాష్ట్ర ప్రతినిధి సభలో 'యవ: కుడగు పాత్రికు హె యను సభ్యుడు వలస రాష్ట్రముల వారిమీద పన్నులు వేయుట కాం గ్లేయ పార్ల మెంటు వారి కెట్టి హక్కులేదని.... . . .తీర్మానము ల నా మో దింప జేసెను. ఆయన యుపన్యా సములో యొక వాక్యము సాధారణముగ స్మరింపబడుచుండును. " సీజరు నకు బ్రూటస్ గలడు. మొదటి చార్లెసు రాజునకు క్రామ్ వెల్ గలడు. మరియు మూడవ పార్టీ రాజు .." అని ఆయన చెప్పు చుండ రాజద్రోహము. రాజద్రోహమని సలు వైపులను ధ్వములు చెల రేగెను, అందుమీద "మరియు మూడవజార్షి రాజు వారి యుదాహరణములను చూచి నేర్చుకొనునుగాక " అని ఆయన యుపన్యా నమును ముగించెను. సీజరును బూటసు, మొదటి చార్లెసను రాజును , కాంజెలును హత్య గావించిరి. అందువలననే ' రాజు ద్రోహమను కేకలు వేయ బడినవి. పరీనియా ప్రతినిధి సభలో చేయబడిన తీర్మానములవంటి తీర్మానములనే న్యూ, యార్కు, మనషు నెట్సు, మొదలగు రాష్ట్రములచే కూడ చేయబడినవి

{స్టాంపు చట్ట బహిష్కారము}

స్టాంపుచట్టము నవంబకు నెలలో అమలులోనికి తేబడసున్నది. కావున మనషరాసెట్సు ప్రతినిధిసభ .వారు అక్టోబరులో న్యూ యార్కుర్కు పట్టణమున బహిష్కారము నొకక(కాంగ్రెసును) దేశీయ మహాసభ జరుగు నట్లేర్పాటుచేసిరి.కొంతకాల మాలోచించి మెసషు స్వ్ట్సు వారి యాహ్వానమును దక్షిణ కారొలీనా రాష్ట్ర ప్రతినిధి సభ వారంగీకరించిరి, శీఘ్రకాలములో తక్కిన రాష్ట్రములును దేశీయ మహాసభకు వచ్చుటకు సమ్మతించెను ఈ లోపున ప్రజలలో నాందోళనము వ్యాపించెను. ఆగస్టు నెలలోనే బాస్టను పట్టణ ప్రజలు ఆంగ్లేయ తంత్రి బూటుప్రభువు యొక్క యు బాస్టసులోని స్టాంపులనమ్ముట కేర్పడిన ఆవవరు యొక్కయు బొమ్మలనుచేసి పగలంతయు వ్రేలాడదీసి రాత్రి వేళ కాగడాల వెలుతురుతో ఆబొమ్మలను శవము లవలేమోసు కొని "స్వాతంత్ర్యము ఆస్తికావలెను. స్టాంపులు కూడదు” అని కేకలు వేయుచు వీధుల వెంట నూరేగించి జనుల గుంపలు సంతోషము కోలాహలము చేయు చుండగ తగుల బెట్టిరి. అప్పుడు కట్టబడుచున్న స్టాంపుల కచ్చేరి మీదపడి కూలద్రోసి నేలమట్టము గావించి సామానులను తగుల బెట్టిరి. ఆలిపేరు యొక్క ఇంటి కిటికీలను బ్రద్దలు కొట్టిరి. ఆలివరు కొద్ది దిన ములలో తన ఈద్యోగమునకు రాజీ నామా నిచ్చెనని ప్రకటించెను. కొలది దినములలో నే ప్రజ, అల్లరులు జరిపి

గవర్నరు, రాష్ట్ర పాలకుడగు హచిన్ నన్ యొక్క గృహమును దోచుకొనిరి. అల్లరి చేసిన కొందరిని ఇంగ్లేయ యుద్యోగ స్తులు పట్టుకొనిరి. ప్రజలు వచ్చి బలవంతముగ విడిపించు కొని పోయిరి. ఇందు కెవరిని శిక్షించలేక పోయిరి. న్యూహం పుషయిరు, న్యూజర్సి, న్యూయార్కు, పట్టణములలోని స్టాంపు మేస్టర్లు (స్టాంపులు, ఉద్యోగీయు లు) తమంతట తామే తము. పదవులను త్యజించిరి. మేరీలాండు, హౌసిల్వేనియా, రోడు అయిలండు, కనెక్టికటుటలోని స్టాంపుల యజ్యోగస్తులు ప్రజల భయమువలన రాజీనామాలనిచ్చిరి. ఇంగర్సాలను షాంపుల యుద్యోగి రాజీనామా నివ్వనందున అబుదు వందల మంది రయితులు కర్రలతో కెళ్ళిముట్టడించిరి. ఆతను లొంగి రాజీనామానిచ్చెను.

{దేశీయ మహాసభ}

పట్టి, అల్లరులతోనే నీ యందోళనము మగియు లేదు. బోస్టనులోని యొక పత్రిక అమెరికాలో స్వేచ్ఛ మరణించినదనియు స్వాతత్రం గర్యమను నొకకుమారుని వదలి పెట్టి. పోయినదనియు , ఇవియే వయస్సు వచ్చిన ప్రతివారియొక్క ఆశయనియు” వ్రాసెను. స్వాతంతమనగ నింగ్లాండుతో సంబంధము స్వతం త్యము. న్యూయార్కులోని మరియొక పత్రిక "చేరుము, లేనిచో మరణించుము.” అని వ్రాసెను. ఆక్టోబరు 7 వ తేదీన న్యూయా ర్కు పట్టణము న నిదవర కేర్పాటు జరిగిన ప్రకారము వలన రాష్ట్రముల దేశీయ మహాసభ ( కాంగ్రెసు ) సమావేశం మయ్యెను. మెసషు సెట్సు రోడు ఆయిలండు కసెకి న్యూ యార్కు, న్యూజర్మి, పెనిన్, సెల్వేనియ్జా డెల వేరు, మేరిలాండు, 'సౌతుకారొలీనా అనుతొమ్మిది రాష్ట్రముల నుండియు ప్రతిని ధులు వచ్చిరి. ఆంగ్లేయ రాజునకొక అర్జీని ఆంగ్లేయ పార్ల 'మెంటున కొక మహాజగును తయారుచేసి పంపిరి. వాటిలో తమకు ఆంగ్లేయ ప్రభుత్వము వారిచ్చిన దానశాసనముల సంగతి యుదాహరించలేదు. తమహక్కులను వాటిమీద యాధార పరచ దలచలేదు. సహజమైన మానవహక్కుల మీద నాధారపడదలచుకొనిరి. ఆగ్లేయ పార్ల మెంటులో తమకు పాతిధ్యము కావలెనని కోర లేదు. పదునె దువందల మైళ్లదూరమున నుండి అధిక సంఖ్యాకులగు నాంగ్లేయు ప్రతినిధులచే నిండిన పార్లమెంటులో తమకు కొంత పాతినిధ్య మున్నను ప్రయోజనములేదని ఎంచిరి. తామాంగ్లేయు ప్రభుత్వమునకు లోబడియే యున్నా మని యొప్పుకొనిరి. కాని 'తము యిష్టం లేని ది తమమీద పన్నులు వే యిట కాంగ్లేయ ప్రభుత్వమునకు హక్కు లేదని ఏips , కు pa / a s... ఏ దేశ ప్రజలమీద నయినను వారి యనుమతి లేనిది వారిమీద పన్ను లు వేయు.ట-ఎవ్వరికిని హక్కు లేదను 'సామాన్యసిద్ధాంతము నే నాధార పరచుకొసరి.

{స్టాంపుల చట్టము
రద్దు పడుట

అక్టోబరు 31 వ తేదీన గోల్డము మొదలగు నాంగ్లేయరాష్ట్రపాలకౌలెల్లరు మరుసటి దినము నుండి సాంపుచట్టము నమలులో పెట్టుదుమనిప్రమాణములు గావించిరి. కాని నవంబరు మొదటి తేదీన వలసరాష్ట్రములన్నిటిలో నొక స్టాంపుల నమ్ము యుద్యోగియైన లేడు. ఒక స్టాంపయినను. కంటిక గుపడ లేదు. ఆదినము ననేక పట్టణములలో ప్రజల యూ రేగింపులు జరిగి ,

స్టాంపుల చట్టమును నూరేగించి తగుల బెట్టుటనుగాని భూమిలో పాతి పెట్టుటనుగాని జరిపిరి. కొన్ని చోట్ల ప్రజలు స్వాతంత్య విగ్రహము నొకదానిని తయారుచేసి అది మరణించినట్లు శవ ముగ పరుండబెట్టి యూనించి దానిని సమాధిలో పాతి పెట్టి "స్వాతం త్యము పునస్టీవమును పొందిన ” (ని కేకలు వేయు చు సమాధిలో నుంచి బయటకు తీయచు వచ్చి.. ఆవుల నమ్మువా: యొక్కగాని కొనువాయొక్క గాని గతి ఏమగునో జాగ్రత్తగా నాలోచించుకొమ్మని బాస్టనులోని బజారులలో కరపత్రికలను పంచి పెట్టిరి. డిశంబరు 17 వ తేదిన ఆలివరును తీసుకొని వెళ్ళి యొక వృక్షము కింద రాజీనామామీద సంకము చేయించి యవృక్ష మునకు స్వాతంత్రవృక్షమని పేరు పెట్టిరి. అమెరికాలో నెప్పటికి స్టాం పుచట్టము ... అమలులో పెట్టుటకు తోడ్పడని ఆయుచే నొక గౌరవ దండ నాధికారి (ఆనం . 'మేజస్టీ"టు) ఎదుట ప్రమాణమును గైకొనిరి, న్యూయార్కులో మాత్రము ప్రజల్లరులను చేసిరి. రోడు అయి లండులో తప్ప మిగిలిన ప్రదేశ్ములన్నిటిలోను స్టాంపులు లేనిది చర్యలన్ని నశాస్త్రీయ మగు నేమో నను భీతితో న్యాయ స్థానము లన్ని మూసివేయబడెను. స్టాంపు కాగితములు లేకుండ సముద్రము మీద పయసము చేయుట వోడల యజమా సులు భయపడిరి. కాని కొలది దిశములలోనీభయముల నన్నిటిని నిర్లక్ష్యముచేసి స్టాంపులు లేకుండగనే యధాప్రకార ముగా వ్యాయస్థానము అమలు జరిపెను. నౌకలు సముద్ర ములమీద ప్రయాణములు చేసెను స్టాంపుల చట్టమును తీ సివేయు వరకును ఆంగ్లేయ దేశమునుండి వచ్చు వస్త్రములు

'మొదలగు సరకులను తాము బహిష్కరించెదమని వలస రాజ్యముల ప్రజలు శపధములను గావించిరి. ఈవిషయమున ఆమెరికను స్త్రీలు మిగులు పట్టుదలతో పనిచేసిరి. వారు ఆంగ్లేయచ్ఛస్త్రములు ధరించుటను మానివేసిరి. స్టాంపుల చుట్టము చేయబడిన నాటికిని దీని నమలులో బెట్ట నిర్నయించిన కాలమునమద్య నాంగ్లేయ మంత్రివర్గములో మార్పులు కలిగెను. గెంవిలు మంత్రియు నాయస సహచరు లును మంత్రి పదవులను వదలుకొనిరి. రాకింగుహాం ప్రధా నమంత్రి యయ్యెను. . ఈయపకు ఆమెరికా వలస ప్రజలయం దిష్టమేగానీ అప్పుడు రాజ్యముచేయుచున్న మూడవ జూర్షి రాజు మంత్రుల మీద బాగుగ సధికారము చలాయించుచుండెను. ఈ రాజద్రోహులగు ఆమెరికనులను బాగుగ శిక్షించవలెనని ఆయన పట్టుదల గలిగియుండెను. అయినను అమెరికాలోని వ్యవ హారములు విషమస్థితికి వచ్చుచున్నందున విశేష యనుభవజ్ఞు డగు విలియంపిట్టు యొక్క సలహాము తీసుకొనుటకు నిశ్చయించిరి. విలియంపిట్టు చాల ప్రఖ్యాతి వహించిన రాజనీతి కోవిదుడు. ఆయ న కొంతకాలము నుండియు సనారోగ్యముచేత పార్లమెంటుకు వచ్చుట లేదు. అమెరికా విషయమున నాలోచించుటకై నిర్లయ మైనదినమున నాయస పార్లమెంటు సభకువచ్చెను. అట్లాంటికు , మహాసముద్రమున కావలియొడ్డుననున్న నీతి పరులైనట్టియు ధైర్యశాలులయినట్టియు మూడుకోట్ల పౌరుల స్వతంతమును భంగపరచుచున్న సందర్భములో తాను తన యుభిప్రాయములను ఖండితముగ తెలుపుట కే వచ్చితిననియు, అమెరికావారింగ్లాండు యొక్క. ఫుత్రులేగాని దాసి పుత్రులు గారనియు,

ప్రాతినిధ్యపు హక్కులకు వారర్హులనియు వారి యనుమతి లేనిది పన్నులు వేయుట ఆక్రమ మనియు ఆయన చెప్పిను. ఇందు మీద పార్లమెంటు సభలో కొంత చర్చ జరిగెను, ఆ చర్చలో పార్లమెంటు సభ్యులలో నైకమత్యము లేక భేదా భిప్రాయములుఁడుటవలన అమెరికా వారి రాజద్రోహమునకు మంచి ప్రోత్సాహము కలుగనున్నదని గ్రెగ్వెలు చెప్పెను. అందుమీద విలియంపిట్టు "అమెరి కావలస ప్రజలు మూర్కపు పట్టుదలలో నున్నారని ఆయన ఆక్షేపించి యున్నాడు. అంతే కాదు. అమెరికా దాదాపుగా బహిరంగమగు తిరుగుబాటును చేయుచున్నది. అమెరికావారు మనను ఎదిరించినందునకు నేను సంతసించుచున్నాను. వెంటనే స్టాంపుల చట్టమును తీసివేయుడు. కాని మన దేశమునకు వలస రాజ్యముల మీదగల ప్రభుత్వాధికారమును మిక్కిలి బలమగు మాటల చే స్థిర పరచి వారి వర్తకమును, వారి పరిశ్రమలును, మన యధికారమునకు పూర్తిగ లోబడునట్లు చేయుడు. వారి యనుమతి లేకుండ వారివద్దనుండి బలాత్కారముగ సొమ్మును, మాత్రము వసూలుచే యవలదు” అని జవాబు చెప్పెను. విలియంపిట్టు యొక్క సలహా అంగీకరించబడినది. వెంటనే " అది అమలులో నుంచుటవలన అనేక ఇబ్బందులకాకరమగు ననియు ఈ రాష్ట్రముల వర్తకమునకు నష్టము కలుగ వచ్చు సనియు” నని స్టాంపుల చట్టమును ఆంగ్లేయ పార్ల మెంటువారు రద్దుపరచిరి, కాని అమెరికాలోని రాజు గారి రాజ్యములు రాజు గారిమీదను గ్రేటు బిటను యొక్క పార్లమెంటుమీదసు నెర్కుడు నాధారపడుటకై యధికార ప్రకటణా శాసనమును ఆకాలముననే చేసి.. ఈశాసనమున అమెరికాలోని వలన రాజ్యముల ప్రజలు గ్రేటు బ్రిటన యొక్క రాజునకును పార్లమెంటువారికిని లోబడియున్నారనియు వారు మీద ప్రతి హక్కుకును ఆధారపడియున్నార:య, ప్రతి విషయములోను పార్ల మెఁటు యొక్క సలహాతో రాజు చేయు చట్టములను ఉత్తరుపులను అన్నియు అమెరికా వలస ప్రజ లను పూర్తిగా బద్దులను చేయునియు, ఇటు బద్దులను చేయ నేరని వలస రాష్ట్ర ములలో నెవరైనను చేసుకొను తీర్మానములును అశాస్త్రీయము లై చెల్ల నేర వనియు ప్రకటించ బడెను.


అమెరికా వలస ప్రజలీ యధికార ప్రకటనా శాసనమును ప్రధమములో బాగుగమనించలేదు స్టాంపుల చట్టము తీసి వేయబడి నందుకు మిగుల సంతసించిరి దేవాలయము లో జయసూచకముగ గంటలు మోగించబడెను. బాస్టసులో మే 19 వ తేదీన అన్ని వ్యాపారములకును శెలవిచ్చిరి, ఇంగ్లాండు నుంచి వచ్చెడి వస్త్రములను ధరించుట మానివేసిన ఆమెరికను స్త్రీలు జూన్ 4వ తేదీన రాజు యొక్క జన్మదినమయినందున నూతన ఆంగ్లేయ వస్త్రములను కొని ధరించి పాత వస్త్రములను బీదల కిచ్చిరి.

(4)

ఈ అనుకూల పరిస్థితులు విశేష కాలము నిలువలేదు. ఆంగ్లేయ ప్రభుత్వము వారీవలస రాష్ట్రములనుండి పన్నులను

{తిరిగి పన్ను
వేయుట

తీసుకొను సుద్దేశ్యము:నుగాని వీరి వర్తకము తో జోక్యము కలుగ చేసుకొనుటకు గాని ఈవలస రాష్ట్రములలో పండిన దినుసులను జమైకా ద్వీపమునకు గాని డొమినికా ద్వీపము సకుగానీ ఎగుమతి చేయకూడదనియు , సట్లు ఎగుమతి చేసినచో సరుకులను పడవలను జప్తు చేయ బడుననియు నాంగ్లేయ ప్రభుత్వము వారు 1766 వ సంవత్సరములో నే యొక చట్టమునుచేసిరి. యిం గ్లాండు నుండి వలసరాష్ట్రములకు దిగుమతియగు గాజుసామాను తేయూకు, కాగిత్రములు, మొదలగు కొన్ని సరుకుల మీద పన్నులు వసూలు చేసి యూసొమ్ముతో ఇక్కడి న్యాధి పతులు మొదలగు నుద్యోగస్తులకు జీత మివ్వవలసినదని యూ సంవత్స రమే మ యొక శాసనము గావించిరి

.. అసంతృప్తికి మరియొక కారణముగలదు . తమమీది కెవరైన వచ్చినప్పుడు సంరక్షిచుకొనటకేమి ఆంగ్గేయ రాజ్మపు శత్రువులై యద్దములు చేయుటకేమి వలస రాష్ట్రముల ప్రజలు తమనుండియే సైకులను తయారు చేసి పంపుచువచ్చిరి, ఎప్పుడైనను ఆంగ్లేయు సైస్యము లిచటికి వచ్చినను వారి బసల 'సేర్పాటుచేయుటకు రాష్ట్రముల ప్రభుత్వములే చట్టములు చేసి తగిన ఏర్పాటు గావించెను. 1756 సంవత్సరమున • ఆంగ్ల సేనాధిపతి తన సైనికులకు ద్రవ్యము పుచ్చుకొనకుండ తగిన బసల నేర్పాటుచేయుట వలన రాష్ట్రముల విధియని చెప్పెను. 1765 సంవత్సరము మొదలు ప్రతిసంవత్సరమును రాజుగారి సైనికులకు కొన్ని సామగ్రులను నివసించుటకు బనలను వలన రాష్ట్రములవారిచ్చి తీరవలెనని ఆంగ్ల ప్రభుత్వము వారు అమెరిశారంయుక్త రాష్ట్రములు చట్టములను చేయుచువచ్చిరి. ఇట్టి నిర్బంథమున రాష్ట్ర ము లసమ్మతిని చూపెను. ఆంగ్లేయ సైనికులతో తమకు పని లేదనిరి. ఆంగ్ల పార్లమెంటువారు తమమీద నిట్టిచట్టములు చేయుటకు వీలు లేదనిరి. మెసషు సెట్సు, న్యూ మార్కు రాష్ట్రములు రెండును ఆంగ్లేయు సైనికులకు సామాగ్రుల నిచ్చుటకు సహకరించినవి. ఇందు మీద ఆంగ్లేయప్రభుత్వ మువారు న్యూయార్కు రాష్ట్రపుపాలనా హక్కులనన్నిటిని రద్దుపరిచిరి, ఆంగ్ల సైనికులకు అవసరమైన సామానులను సమకూర్చువరకును నీ రాష్ట్రములోని గవర్నరు, కార్యనిర్యా హక సభ, ప్రజా ప్రతినిధి సభ కే చట్టములను ఉత్తమనులను తీర్మాకములను చేయ కూడదని యాజ్ఞాపించిరి.

ఇందుమిద అమెరికా రాష్ట్రము లో ఇంగ్లాడు పై యాగ్రహము తీవ్రమయ్యెను. 17 6 సంవత్సరపు చివర భాగమున ఆగ్లేయ పార్లమెంటుకు వలన రాష్ట్రములమీద - చట్టములను చేయుటకును హక్కు లేదని స్పష్టముగా మేసషు నెట్సు ప్రజా ప్రతినిధి సభ వారు తీర్మానించిరి.

1766 సంవత్సగము జులై నెలలో రాకి గుహాం మంత్రి మానుకొని విల్లియంపిలు ఆంగ్లేయ రాజ్యమునకు ప్రధాన ముత్రియయ్యెను. కొద్దికాలములో శరీర రుగ్మతవలన నీయన రాజీ నామూ నివ్వగ నార్తు ప్రభువు ప్రధానమంత్రి అయ్యెను. 1767 డిశంబగు నెలో హిబ్స బనో ప్రభువు పలసరాజ్యముల మంత్రి అయ్యెను. మంత్రివర్గములో నెట్టి మార్పులు జరిగి నసు ఎవరుముంత్రులైనను ఆంగ్ల ప్రభుత్వమువారు వలన రాజ్య ము మీచ సంపూర్ణమగుయధి కారమును చలాయించ వలెననియు వలస రాజ్యములను నిర్బంధించి లోబరచుకొని వలెననియు మాత్రమే నిశ్చయించిరి. ఆమెరిశావారు తమక పాదాంతులగు వరకును నెట్టి కనికరమును వారియెడి జూపనని ప్రధానమంత్రి సార్తు ప్రభువు పార్లమెంటు సభలోచెప్పెను

అప్పుడు పరాసు దేశపు విదేశ వ్యవహార మంత్రియగు అయిసులు అమెరికా వారివద్ద కొక రాము వారిని పంపెను. ఇంగ్లాండులో అమెరికాతరఫున పనిచేయుటకు వెళ్ళిన బెండ మీ ఫ్రాంక్లినునకు ధనసహాయము చేయుచు డాను. అమెరికా వారికి సహాయము చేయుటకు వాగ్దత్తముచేసెను.

{ఆంగ్లేయ వస్తు
బహిష్కారము

1767 సంవత్సరము సనంబకు 20 వ తేదీ నుండియు నీనూతన పన్ను వసూలు చేయుదురు కావున ఆస్ట్రోజులు 18 వ తేదీన బాస్టను ప్రజలు సమావేశమై ఆంధేయ వస్తు ఆగ్లేయు దేశములో తయారయ్యే సరుకులను తెప్పించకూడదనియు ఉపయోగించు గూడదనియా తీర్మాంచిరి. సభకువచ్చిన వేనకు వేల జనులు లేచి యాంగ్లేయ సరుకులను బహిష్కరించెదమని శపధము లు చేసిరి, ప్రమాణవత్రిక నొకదానిని వ్రాసి దానిమీద ప్రజల సంతకములు తీసుకొనబడెను. అందరి సంతకములు తీసుకొనుటొక యుప సంఘమును నే ర్పాటు చేసిరి, ఈఆంగ్లేయవస్తుబహి ష్కార తీన్మానమును ఇతర రాష్ట్రము కన్నిటికిని వారు కూడఅవలంబించు టకై పంపిరి. ప్రతి రాష్ట్రమును ఇం గ్లీషు సరుకుల బహిష్కారం అవలంబించసాగెను. ఈలోపువ తమమీద పన్నులను విధించుట అక్రమమని వివిధ రాష్ట్రముల వారును ఆంగ్లేయ రాజునకును, పార్లమెంటుకును అర్జీలను పంపిరి. బాస్టనులోని వర్తకులు తామింగ్లీషు సరుకులను తెప్పించమని యొడంబడిక చేసుకొనిరి. తక్కిన వర్తకుల నందరిని నయముననో భయముననో తమ యొడంబడికలో చేరునట్లు చేయుటకై యొక పలుకుబడిగల యుపసంఘమును నియమించిరి. స్వాతంత్ర్య దేవతకు పుత్రికలగు అమెరికన స్త్రీలు తేయాకు త్రాగుటను చూసుకొని. తేయాకు నింగ్లాండు నుండి తెప్పిం చుకొనవలసి యుండినందుననద్దానిని బహిష్కరించి తేయాకు నీరు, తాగటయే మాను కొనిరి. స్త్రీలను పురషులను ఇట్టి యేక భావము తోడను పట్టుదలతోడను పని చేసిన జాతి స్వాతం త్ర్యమ న కర్హము గాదా? అమెరికా వారు పరాసు దేశముతో వర్తక యొడంబడికలు చేసుకొని ఆంగ్లేయులకుమారుగా తాము స్వంతముగ వెటనే తయారు చేసుకొ లేసి వాటిని పరానుదేశము నుండి తెప్పించుటకు న్చియించుకొనిరి. ఇం దుకు పరాసుమంత్రి ఛాయిసులు మిగుల తోడ్పడెను.


స్పైన్ చేశము కు లోబడియుండిన లూసియానా వలసరాష్ట్రములోని పరాసు ప్రజలు స్పెయిన్ ప్రభుత్వముపై తిరగబడి ప్రజాస్వామ్యమును స్థాపించుటకు యత్నించిరి. కొంతకాలము వరకది స్పైన్ వారిని పశుబలము వలన నణచి వేయబడినప్పటికిని ఆయద్యమముకూడ నీ ఆంగ్లేయ వలసరాష్ట్రములకు మార్గదర్శకమయ్యెను.

తాను చెప్పిన ప్రకారము నడచుకొన లేదని బాస్టనులోని గవర్నరు బెర్నార్డు ప్రజాప్రతినిధిసభ ను విచ్చిన్నము చేసెను. తిరిగి మరియొక సభన సమావేశ పరచుటకు నిరాకరించెను.

తానే ఆంగ్లేయ, ప్రభుత్వమువారి యుత్తరువుల ననుసరించి రాష్ట్ర పాలనను జరి పెదననెను. - వెంటనే ప్రజలు ఎన్నికలు జరిపి నూతన ప్రజాప్రతినిధినభను సమావేశ వరచుకొనిరి. ఆరాష్ట్రములోని ప్రతి భాగమునుండియు ప్రతినిధులు వచ్చిరి. గవర్నరీ సమావేశమును విడిపోవలసినదని యాజ్ఞాపించినను ప్రజాప్రతినిధి సమావేశము విచ్చిన్న మగుటకు నిరాకరించి రాష్ట్ర ప్రభుత్వమును గూర్చిన యావత్తుచట్టములను తీన్మాన ములు చేయసాగెను. ప్రభుత్వ న్యాయవాదియగు డి గ్రేసును తామిట్లుచేయుటవలన రాజద్రోహము క్రిందకు వచ్చెదమా యని సంప్రదించగా స్పష్టముగారాకపోయినను రాజద్రోహ నేరమున కొక వెంట్రుక వాసి సమీపం లో నున్నారని చెప్పెను.

{ఆంగ్లేయ సైన్యములు
ముట్టడించెను}

ఇంతలో వలసరాష్ట్రములలో స్థిరముగ నాంగ్లేయసైన్యముల నుంచెదరను సమాచారము తెలిసెను. 1768 సంవత్సరం సెప్టెంబరు 28 వ తేదీన ఆంగ్ల ప్రభుత్వము వారి ఏడు యుద్ధ సౌకలు బౌస్టన్ రేవులోనికి వచ్చెను. వానిలో నేడువందల మంది అగ్లేయ సైనికు లుండిరి. అక్టోబరు 11వ తేదీన నీ సైని కలు పడవలో నుండి దిగి పట్టణములోనికి రాగా అందరును బసలిచ్చుటకు నిరాకరించిరి. బవంతముగ కొన్ని గృహము లను స్వాధీనపరచుకొని వానిలో సైనికులు దించిరి. ఇంకను సైన్యములు రాసాగెను. ఒక సంవత్సరము లోపల షుమారు నాలుగు వేలమంది యాంగ్లేయ సైనికులు బాస్టన పట్టణమున నుండిరి. 1769 సంవత్సరమున రాష్ట్రీయ ప్రతి (5)

{ఆంగ్ల నౌకను
తగులబెట్టుట}

1772 సంవత్సరమున తిరిగి కలతలు ప్రారంభమయ్యెను. ఉత్తర కారొలీనా రాష్ట్రములోని ప్రజాస్వామిక వాదుల సణచివేయుట కాంగ్లేయ అధి కారులు ప్రయత్నించినందున వారు టెనెన్సీసది , పొంతములకు లేచిపోయి ఆంగ్లేకు సంబంధము లేని యొక స్వతంతమగు చిన్న ప్రజాస్వామ్యను స్థాపించు కొనిరి. ఆమెరిగా రాష్ట్రముల ప్రజలు పరాసుతత్వ శాస్త్రజ్ఞు లగు వాల్టెరు రూసో మొదలగువారు స్వతంత్రమును గూర్చియు, ప్రజాస్వామిక మును గూర్చియు, మానవసమానర్యమును గూర్చి , వ్రాసియుస్న గ్రంథములసు చదుపు చుండినందున స్వంత్రభావములు పూర్తిగా నాటుకొనుచుండెను.యుద్ద నౌకలనుగాని యుద్ధ సౌమానునుగాని సైనికుల యాహార పదార్తములను యుద్దపూర్వముగ తగులబెట్టిన వారికి మరణదండన వధించబడునని యొక శాసనము నాంగ్లేయ ప్రభుత్వం చేసియుండెను. రోడు అయిలండురాష్ట్రము లోనికి దొంగతనముగ ఏ దేశములనుండి తేయాకును తెప్పించు కొనుచున్నందున నట్టి దొంగతనము నాపుటకై ప్రొవిడ స్సను రేవులో నొక యాంగ్లేయ నౌక యుంచబడెను. దానిని అర్ధరాత్రి వేళ పట్టుకొని ప్రజలు తగులబెట్టిరి.(1762 సంవ త్సరం జూన్ 9 తేదీ). ఈ నేరము నెవరు చేసినదియు తెలి పినవానికి అయిదువుదల సవరముల నిచ్చెద మని ఆంగ్లేయ, ప్రభు త్వము వారు ప్రకటించినప్పటికీ ఎవరును సమాచారము తెలు పలేదు.ఏమియు సాక్ష్యము లేక ఆంగ్ల ప్రభుత్వమువారూరుకొనిరి.

{ఆంగ్లేయ తేయాకును
బహిష్కరించుట}

అన్ని రాష్ట్రములలోని వివిధ పట్టణముల మధ్య ఐక్యభావమును ఏకాభిప్రాయమును కలుగచేయుటకై , పతి పట్టణములోను నొక యువ సంఘమును ప్రజలే ఏర్పాటుటు చేసిరి. ముందు బాస్టనుపట్టణము దారి తీసెను. ఇతర రాష్ట్రము లలోని పట్టుణములును తోడ్పడెను. హాలెండునుండివచ్చు. లేదూకు తప్ప మరి యే తేయాకును ,ప్రజలు వాడుటలేసు. ఆంగ్లేను ప్రభుత్వ వారికి పన్ను వసూలగుట లేదు. వలస రాష్ట్రముల ప్రజలు కావలె ననిగోరకుండగ నే తేరూరుతో నిండిన పడవలు ఆంగ్ల దేశము-నుండి బయలు దేరి . వలస రాష్ట్రపు రేవులలో దిగెను. తేయాకు మీద పన్ను తగ్గించరి. అయిన ఆంగ్లేయు పడవలలో వచ్చిన తేయాకుతమ దేశములో దిగిననూ అమ్మకూడదనియు అమెరికను ప్రజలు దీక్ష వహించిరి. ఈ రాష్ట్రములలో స్స్వాతంత్ర పుత్రు సంఘమును ( son of Liberty) స్థాపించిరి. ఫిలడల్హియా, న్యూహాఅర్కు రేవులలో నుండి పడవలు వెనుకకు వెళ్ళి పోయెను. చార్లెసుట మరో పడవలో నుండి తేయాకు దింపికొట్లలో అమ్మడమునకై దెచ్చిరి గాని ఎవరు కొననందున కుళ్లిపోయెను. బాస్టన్ రేవు లోనికి పడవ వచ్చి తేయాకును దింపక కొన్ని రోజులు నిలువ యుంచిరి. తేయాకును యెడ్డునకు దింపకుండ నాటంక పరచుటకై ప్రజలు కిఆపలా కాసి యుండిరి. 1773 సంవత్సరం డిశంబరు 16వ తేదీన బాస్టసులో ఏడు వేలమంది ప్రజలు . వచ్చిన గొప్పబహి రంగసభ జరిగెను. చుట్టుపట్టుల నిరువది మైళ్ళ దూరమునుం డియు ప్రజలు వచ్చిరి. సొమ్యుయలు ఆడమ్సు, జోనయాక్విన్సీ మొదలగువారు తీవ్రమగు నుపన్యాసముల నిచ్చిరి. సాయంత్రము సభ ముగియగానే ప్రజ" గుంపులు గుంపులుగ సముద్రతీరమునకు పోయిరి. ఈప్రజలు చూచి కోలాహలము చేయు చుండగ ఎర్రయిండియను వేషములను ధరించిన బదిమంది అమరికనులు తేమూకుపడవలలోనికి పోయి వాటిలోనున్న 842 పెట్టెల తేయాకును సముద్రము లొ పడదోసి, వచ్చిరి. ఒక నెలతరువాత నా ఆంగ్లేయ యుద్యోగస్తునికిమొగమునిఁడ సల్ల తారుబూసి తల మీద యీకలు ధరింపజేసి. బాస్టసువీధులలో గుండ ప్రజలూ రేగించిరి. బాస్టన్ లోని పత్రికలు అమెరికా రాష్ట్రములన్నియు కలిసి యొక మానవ హక్కుల ప్రకటనమును గావింపవలెనని లేనిచో ప్రజాస్వా మ్యమును స్థాపింపవలెననియు వ్రాయుచుండెను.

{ఆంగ్లేయ పార్లమెంటు
వారియాగ్రహము}

ఈసంగతులు తెలిసి బిటిషుపార్లమెంటులో చాల నాగ్రహము గలిగెను. ఇంగ్లాండులో సమెరికాతరఫున ప్రతినిధిగ పనిచేయుచున్న బెంజటమిను ఫ్రాంక్లిన్ ను" ఆంగ్లేయ పొర్ల ఖయిదుచేయుదురను వాడుకలు పుట్టెను.గవర్నరును మార్చ వలసినదని మెసషుసెట్ను ప్రతినిధి సభ పక్షమున నాయన ప్రీప్ కౌన్సిలులో దాఖలు చేసిన అర్జీని విచారించకుండగనే తోసివేచిరి. బాస్టను రేవులోనికి నెట్టి సరుకులు పడవలును రాగూడదని షేధించుచు నొక చట్టమును చేసిరి. దీనివలన బాస్టనుల యొక్క వర్తకమునంతను నాశనము చేయ నిశ్చయించిరి. మెసషునెట్సు రాష్ట్రమున సొంగ్లేయ సైనికులుగానీ అధికారులు గాని శాంతిని స్థాపించు నపుడును తమ విధులను నెరవేర్చు.

సపుడును చేయునట్టి చర్యలకును రాష్ట్రీయప్రతినిధి సభవారు వారిని శిక్షించుటకు వీలులేదనియు పొరవిచారణ ఆంగ్లేయ ప్రభుత్వము వారు “నిర్ణ యించిన నేస్తలములోనైనను జరుగ వచ్చుననియు మరియొక చట్టమునుచేసిరి. ఇందువలన నీ రాష్ట్ర ములో ప్రజలను హత్య గావించెడి సైనికుల విచారణ ఇంగ్లాండులో జరుపవచ్చును. మెసషు సెట్సు రాష్ట్రము లోని ప్రజా ప్రతినిధి సభ వారుగా ఆంగ్లేయ గవర్నరే కార్యనిర్వాహక సభ్యులను, షేరీవులు, న్యాయాధిపతులు మొదలగు సద్యో గస్టులను నియమించవచ్చుననియు, గవర్నరు యొక్క అనుమతి " లేనిది ప్రజలు బహిరంగసభలు చేయకూడదనియు, మూడవ చట్టమునుచేసిరి. ఉత్తరఆమెరికా వలస ష్ట్రములలో సైనికు. లను ఉంచుటన గూర్చి నాలుగవ చట్టమును చేసిరి. -

ఉత్తర అమెరికాలోని క్విచకురాష్ట్రములో ఓహియో, మిషిగాను, ఇండియానా, ఇల్లినాయసు, విసుకొన్సీసు రాష్ట్రములనుచేర్చి అయిదవచట్టమును చేసిరి. పార్ల మెఁ టులో బర్కు. మొదలగు కొందరుసభ్యులీ చట్టములను ఖండించి గాని విశేష సంఖ్యాకులగు సభ్యులచే : నవి యామోదించబడెను. ఈచట్ట ములుచేయక ముందుపార్లమెంటులో కొంతచర్చజరి గెను. అందు లో " అమెరికా రాష్ట్రములు బ్రిటిషు ప్రభుత్వ ముసకు లొబడి . యుండవ లేనా లేక స్వతంత్రమును పొందవలెనా సనువదియే. యిపుడా లోచించవలసిన సమస్య” అని వెడరుబరం అను న భ్యుడు చెప్పెను. ఆంగ్ల దేశములో" కూడ కొద్దిమంది ప్రముఖులు ఆమెరికా వారు స్వతంత్రులుగా నుండవలెననియే వాందించిరి కాని ఆంగ్ల ప్రజలలో చాలమందికికలు క్యాస్వత ,.........

{అమెరికాలోని
వారి తాళము}

"ము పొందుట యసునది చాలకంటకముగ నుండెను. తాను చెప్పిన మార్గము. నవజంభించిన యెడల అమెరికాలో శాంతి నెమ్మగులు కలుగునని ' అమెరికాలోని ప్రధానమంత్రి నార్తు ప్రభువు చెప్పెను. పార్ల మెంటువారాయన చెప్పిన మార్గమున నే - యవలంభించి అయిదు చట్టములను చేసిరి. కాని ప్రధానమంత్రి చెప్పిన ఫలితము: కలుగలేదు, అమెకాలో శాంతికలగుటకు మారుగ ఆందోళనమః హెచ్చెను. బాస్టను రేవులోనికి వడనలు రాగూడడని చట్టము చేసిరను వార్త తెలియగనే వర్జీయూ రాష్ట్ర ప్రతినిధి సభ వారు దానిని తీవ్రముగా ఖండించిరి.. మరియు రాష్ట్రములోని రతి చోటను జూన్ 1వ తేదీన ప్రజలుతమ నివాస పత్రములను పిలిసి అమెరికా వారి సహజ హక్కులు నశించ కుండ కాపాడవలెల్ననియు అమెరికా ప్రజలు ...... .... ....... ...... అన్ని వద్దతుల చేతను తొలగించ కృషిసలుఫుటను తమకందగకునొకే బుద్ధి కలగ చేయవలెనని పరమేశ్వని ప్రార్దించపలసినదని తీర్మానించిరి. గవర్నరు వెంటనే నాప్రతినిధి సభను విచ్చిన్నము చేసెను. సభ్యులు మరియొక చోట సమావేశ మై యొక రాష్ట్రమునకు కలిగిన మూపద అన్ని రాష్ట్రము కు ను కలిగినట్లేయనియు అమెరికా రాష్ట్ర ముల దేశీయ మహాజన సభ (కాంగ్రెసు) ను వెంటనే కూర్చు టావశ్యకమనియు తీర్మానించిరి. మెసషు పెట్సు వారును ని దేవిధముగ సుద్దేశించి దేశీయ మహాజనసభ సెప్టెంబరు నెలలో ఫిలడల్ఫియాలో జరుగవలెవని సూచించిరి. ఈ లోపున రాష్ట్రములన్నిటిలోను

సమూవేళకు ప్రజలసభలు జరిగెను. పైరుఫాక్సులో జరిగిన సభకు జార్జివాషింగ్టన్ నధ్తక్షత వహించెను. ఆసభలోలో నింగ్లాండునకును వలస రాష్ట్రములకునగల బేదాబిప్రాయ విషయములన్నిటి మీదను నిరుపదినాలుగు తీర్మానములు గావించిరి.


(6)

{దేసీయ మహా
సబాసమావేశము}

1774 వత్సరము " 5 సెప్టెంబరు తేదీని ఫిలడల్పియాపట్టణములోన కార్పెంటరు పురమందిరములో (కాంగ్రెసు) అమెరిక దేశీయ దేశీయ మహా సభ కూడెను. దైవప్రార్ధనతో సభ ప్రారంభ మయ్యె ను. జార్జియా తప్ప మిగిలిన రాష్ట్రముల నన్ని టినుండియు ప్రతినిధులు వచ్చిరి . నక సమ్మకి చొఎందరు ప్రతిధులు వచ్చిననూ రాష్ట్రమునకొక సమ్మతి చొప్పున తీసుకొనబడెను..


"అమెరికాయంతయు నొకాటిగ చేయబడినది. నేను వర్జీనియనుగాను. అమెరికను నయి యున్నాను " అని పాట్రికు "హెన్రీ చెప్పెను. వచ్చిన ప్రతి. ధులలో సామ్యూయలు ఆడంసు, జూరి వాషింగ్టనులు కూడ నుండిరి. అమెరికా ప్రజల హక్కులు నిర్ణయము చేయబడెను.. ప్రతిరాష్ట్ర ప్రజలు గు తమ రాష్ట్ర పాల: కవసరమగు చట్టషుల సన్నిటిని చేసికొనుటకు హక్కు కలిగియుండవలెను. అమెరికా వారితర దేశములతో చేయువ్యాపారమును నడిపించుట కాంగ్లేయ పార్లమెంటువారి ధికార ముండవచ్చును. గాని అమెరికా ప్రజలనుండి పన్నులు వసూలుచేయుట కధికార మండగూడదు. జ్యూరివిచారణ హక్కును బహిరంగసభలు చేసుకొనుహక్కును ఉండవలెను. కార్యనిర్వాహక సభలను గవర్నరులు నియమించగూడదు. ఏరాష్ట్రములోను శాంతి సమయములో ఆ రాష్ట్ర ప్రతినిధినభయొక్క అనుమతి లేనిది ఆంగ్లేయ సైనికుల నుంచగూడదు"అని ప్రకటించిరి. పంచదార చట్టము స్టాంపుల చట్టము సైన్యములు - నుంచుచట్టము తేయంకుచట్టము బోస్టను రేపు చట్టము అమెరికాలో చేయబడిన నేరములకు ఆంగ్ల దేశములో విచారణ - చేయు చట్టము మోసషు సెట్సు క్విచెకు న్యూ యార్కు రాష్ట్ర ములను గూర్చి చేసిన చట్టములు మొద లగునవన్నియు వలస ప్రజల హక్కులకు భంగకరముగ చేయబడినవని తీర్మానించి. ఆంగ్లేయ దేశమునుండి వచ్చు సరుకులను కొనగూడదనియూ తీర్మానించిరి. గ్రేటుబ్రిటనులోని 'ప్రజలు తమ హక్కులనుగూర్చి యాందోళనము చేయవలెననియు ఆమెరికా ప్రజలందరిలోను నీ తీర్మానములను వ్యా పింప చేయవలెననియు తమ రాజునకొక రాజభక్తితో గూడిన మసవిని పంపవలెననియు, నిశ్చయించిరి. పార్లమెంటు వారి చట్టముల నన్నిటిని మెసష సెట్సు రాష్ట్ర మువారు తిరస్కరించుట కామోదమును చూపి, మెసషు సెట్సు ప్రజలు ఇబ్బందులు కలిగిన యెడల అమెరికా వారందరును వారికి తోడ్పడవలె పని తీర్మానించిరి. వలసరాష్ట్రముల సంఘములో చేరవల సినదని కనడా ప్రజల నాహ్వానించిరి.ఏబది యొక్క దినములు సమావేశమై పై తీర్మాగము లన్నియును చేసి అమెరికా దేశీయ మహాజనసభ ముగిసెను. తిరిగి దేశీయ మహాసభ 1775 సంవత్సరము మే 10వ తేదీన సమావేశ మగుటకు నిర్నయమయ్యెను. ఇగ్లాండుచేయు చట్టములను ధిక్కరించి ప్రవర్తించుట స్వతంత్రమును కోరుట యేయని యూరఫుఖం

డములో చాలమంది తలచుచున్నప్పటికిని అమెరికా ప్రజలింకను తాము స్వతంత్రమునకై యత్నించుచున్నామని తలుచలేదు. ఇంకను తాము ఆంగ్లేయు ప్రభుత్వ ల నుండి చీలిపో వలెనని కోరుట లేదని 1774 సంవత్సరం అక్టోబరు నెలలోనే జార్జి వాషింగ్ట నొక స్నేహితునికి వాసెను. "ప్రతి స్వేచ్చయుతమగు రాష్ట్రము యొక్కయు సౌఖ్యమున త్యావశ్వర మగునట్టియు, ఆస్తి, స్వాతంత్ర్యము, ప్రాణములను సంరక్షణ చేయునట్టియు, విలువగల హక్కుల నష్టముపకు మాత్రమే వలస రాష్ట్రము సహించ నేరదనియు, ఆంగ్లేయ మంత్రి వర్గము వారు మార్గపు పట్టుదలను బూసినచో ఉత్తర అమెరికాలో యిదివరక్కెన్నడును చూడని విధమున రక్త ప్రవాహములు జరుగుననియు నాయన వ్రాసెను.

{మెసషుసెట్సు ప్రజా
ప్రతినిధి సభ ధైర్యము.

ఇక్కాలమున 'మెసషు సెట్సు రాష్ట్రము ధైర్యము :తో ముందు నడచుచున్నది. అక్టోబరు 5వ తేదీన ప్రపతిధి సభ కూడవలసి యున్నది. ప్రధమహక్కుల శాసనము ప్రకారము కార్యనిర్వాహక వర్గమును ప్రజాప్రతినిధి సభవారే ఎన్నుకొనవలెను గాని ఈమధ్య బ్రిటీషు పార్ల మెంటు వారి హక్కును దీసి వేసి గవర్నరే కార్యనిర్వాహక వర్గమును నియమించ వలెనని శాసించిరి. దీని ననుసరించి గవర్నరు కార్యనిర్వాహక సభ్యులను నియమించెను, కాని మూడవ వంతు సభ్యులు తమ పదవులను గ్రహించుట కంగీకరించలేదు. మిగిలిన వారు ప్రజలకు భయపడి రాజీనామాల నిచ్చి, గనర్నరు నిగమించిన న్యాయాధిపతు లుద్యోగము చేయలేదు


గవర్నరు ప్రతినిధినభ ఎన్నికలు జరుగగూడదని నిషేధించెను. కాని ప్రజలెన్నికలను మానలేదు. సభ్యులందరును నెన్ను కొనబడిరి. ప్రతినిధి సభ్యులు సమావేశ మైరి. గవర్నరు. సమావేశము నుపక్రమించలేదు, ప్రతినిధి సభ్యు లేకలసి రాష్ట్రీయమహాసభ యని పేరిడిరి.. రాష్ట్రీయ వ్యవహారములను చర్చించ సాగిరి. గవర్నరరు జనరలు గోజు 'మెసషు సెట్సు రాష్ట్రమునకు పాలకుడేగాక ఉత్రత. అమెరికాలోని యాంగ్లేయ సైన్యముల కన్నిటిని సర్వ సేనాధిపతియు గూడ నై యుండెను. ఈయన వెంటనే పన్నెండు వేల సైన్యము నాయత్తపరచెను. సైనికుల కాహారపదార్ధములను యద్ధడసామగ్రులను సమ కూర్చెను. ఇందుకు స్వతి రేకముగ ప్రజాప్రతినిధులు తమ రాష్ట్రములోను తోటి రాష్ట్రము లోను ఇరువది వేల బాతీయ సైనికులను తయారుచేసిరి - కెనడావారి సహాయమును గూడ కోరి. " రాష్ట్రీయ మహాసభ వారి యుత్తరువులను ప్రజలు శిరసా వహించు చున్నారని కు మెసషు సెట్సు రాష్ట్ర ములో న్యాయస్థానములు గాని శాస్త్రీయమైన శాసన:సభగాని లేవనియు అల్లకలోలమగు నున్నదనియు అనేక భాగములో ప్రజ లాయుధపాణులై ప్రభుత్వము మీద కలహించుటకు సిద్ధ ముగా నున్నారనియు " నీగవర్న రాంగ్ల ప్రభుత్వము వారికి వ్రాసుకొనెను.

{విలియంపిట్టు}

నవంబరు 30 వ తేదిన ఆంగ్లేయ పార్లమెంటు సమావేశమయ్యెను. అమెరికా వలస ప్రజలు తన కవిధేయతను చూపుచున్నారనియు ఆంగ్లేయ సభుత్వ ధిక్కారమును తాను సహించననియు రాజు తన .. యువన్యాసములో చెప్పెను. ప్రభువుల సభవారు మెసషు - ట్సు రాష్ట్ర ప్రజలు చూపుచున్న చట్టధిక్కారమునకును తిరుగ చాటునకును తమ యాగ్రహమును 'అసహ్యమును వెలిబుచ్చు చు వీరిని తగువిధముగ శిక్షించ నిశ్చయించినందుసకు రాజునకు కృతజ్ఞతను తెలిపిరి. ప్రజా ప్రతినిధి సభవారు నిటులనే తీర్మా నించిరి. కానీ విలియం పిట్టు మాత్ర మీదినమున పార్ల మెంటు సభకు వచ్చి అమెరికా ప్రజలతో నెటులయిన సంధి గావింప వలెననియు బోస్టసునుండి పటాలములను తీసి వేయ వలెననియు వాదించెను. " ఆమెరికావారు చేసిన అక్రమ చర్యలను హర్షించమని నేను కోరుట లేదు. వారికి న్యాయము కలుగ చేయవలెనని మాత్రమే నేను కోరుచున్నాను. మీచర్యలను ఎదిరించుట వారి కనసరమును న్యాయమును నై యున్నది. నిరంకుశత్వమును ప్రత్యేళవ్యక్తు లవంభంచినను లేక సంఘము లవలంబి..చినసు నిరంగుశ చర్యలకు బ్రిటిషు పౌరులెవరును లోబడి యూరుకొన నేరరు. పార్లమెంటు సర్వాధికారి ' యని మీరుచేయు వృధాప్రకటనములును. వారు మీకు పాదా క్రాంతులయి తీరవలెనను పిచ్చి సిద్దాంతములును, మీతోడి పౌరులగు అమెరికనుల నమ్మక ములను మార్చుటగాని వారిని మీకు దాసులను చేయుటగాని నొనరించజాలవు. స్వాతం త్యముకొరకు నిలుపబడియున్న ప్రజల మీద ఆధర్మ యుద్ధము చేసి వారి రక్తమును చిందించునట్టి వారికి ఈశ్వర శాపము తగులును. బాస్టసుప్రజలను విచారించకుండగనే మీరు వారికి శిక్ష విధించి నారు. దోషులను నిర్ధోషులను కలిపి తారతమ్యము లేక శిక్షించి నారు. వారి రేవులో పెట్టి వర్తక ' ను జరుగను చేసి ముప్పది వేల ప్రజలను కరువులోను భిక్షకవృత్తిలోను. కూలడోసినారు. " "హేతువాదనలోను, దూరదృష్టిలోను, న్యాయబుద్ధిలోను, ముఖ్యముగ నిట్టి విషమదశలో, ఏజాతికిని ఏసంఘమునకును ఫిలడల్ఫియాలో జరిగిన అమెరికనుల సమావేశము తీసిపోనేరదని నేను స్పష్టముగ తెలియ చేయుచున్నాసు. అట్టి వారిమీద బానిసత్వమును విధించుటకును, బలవంతు లగు జాతిమీద నిరంకుశత్వమును స్థాపించుటకును మీరు చేయు ప్రయత్నములన్నియు విఫలములగుట నిశ్చయము. చిట్టచివరకు మనమే లోబడవలసి వచ్చును. మనము "వెనుకకు మరలి తీరవలసి వచ్చినప్పుడుగాక బుద్ధిపూశ్యకముగ వెనుకకు మరల గల స్థితిలో నున్నపుడే వెనకకు మరలుట యుక్తము " అని ఆయన గంభీరోపన్యాసము చేసెను. కాని పార్లమెంటు సభ్యులు హితబోధలను లక్ష్యము చేయలేదు, బాస్టను పట్ట ణముషండి యాంగ్లేయ సైన్యములు తీసివేయ వలెననియు అమెరికనులతో రాజీపడవలెననియు నాయన యుపపాదించిన తీర్మాసము లోడిపోము . అమెరికా వర్తకముసుగూర్చి పార్లమెంటువార పలంబించిన పద్దతులలో మార్పుకలుగుటా. వశ్యకమని లండను వర్తకులు పెట్టిన అర్జీలను నొక యువనంఘమునకు తోసి వేసిరి.

{వలస రాష్ట్రములలో
ఐక్యత

ప్రధానమంత్రి నార్తు ప్రభువు వలసరాష్ట్రము లను చీలదీయవ లెవని ప్రయత్నించెను, ఏరాష్ట్రమ యినను ఆంగ్లేయ యుద్యోగస్తులకు నిర్ణయము మైనజీతములిచ్చుటకును సైనికుల ఖర్చులు భరించుటకును తన ప్రతినిధిసభలోనే తీర్మానించుకొన్న యెడల


ఆంగ్లేయ పార్లమెంటువా రాష్ట్రముపై నీ పన్ను విధించుట మా నెరని తెయజేసెను. కాని ఈ రాష్ట్ర మాయనకు లోబడ లేదు. అన్ని రాష్ట్రములు కలసి ఐకమత్యముగనుం డెను. అందరు నుకలసి సామాన్య హక్కులకై పోరు సలుపు కృత నిశ్చయులై యండిరి. అమెరికను ప్రజలలో కొందరు విదేశీ యులగు నాంగ్లము ప్రభుత్వముతో చేరనిది ఆంగ్ల ప్రభుత్వ మేమి చేయగఃదు విదేశ ప్రభుత్వముల బలము వారి సైన్యములలోను సొవి కాదళను. లోటు లేదు, స్వదేశస్తులలో కొందరు చీలిపోయి వారితో చేరుటలోనున్నది. కావున . పదునై దువందల మైళ్ల దూరముగా నున్న బలవంతమగు నాంగ్లేయరాజ్యము అప్పటికి స్వల్పస్తిలోనున్న అమెరికను జాతిని లోబరచు గజాలకపోయిను.. బాస్తను వర్తకమును నాశనము చేసినను బాస్టను లోబడసంద'న న్యూయిం:గ్లాండు, న్యూజ గీ, 'ప్నెసిల్వేనియా, మేరీలాండు, వర్జీనియా, దక్షిణ కారొ లీవా, రాష్ట్రముల లోని ఏరేవులోనికి పడవలు రాకూడదని ఆంగ్ల ప్రభుత్వమువారు. శాసనమ'ను చేసిరి. కొద్దినెలలలో ఈ శాసనమును అమెరికా వలసరాష్ట్రములన్నిటికిని వ్యాపింప జేసిరి. అమెరికా ప్రజలని దేశ వర్తకమును రేవువర్తకమును నాశనము చేసి వీరిని లోబరచుకొనవలెనని ఆంగ్లేయ ప్రభుత్వము వారు నిశ్చయించిరి. ఈచట్టములు పార్లమెంటులో పచ్చిసపుడు " మానవస్వభావమును తృణీకరించి మనము మిక్కిలి ఉల్లాసముతోడను నీర్లక్ష్యముతోడను లక్షలకొలదిమానవులు కాహారము లేకుండ చేయయత్నించుచున్నారమ”నిబర్కు చెప్పెను గాని ప్రయోజవము లేదయ్యె.

{యుద్ధ
ప్రయత్నములు

అమెరికాలో తొందరగా పనులు జరుగుచున్నవి. మెనషుసెట్ను రాష్ట్రమువారు యుద్ధప్రయత్న యుద్ధ ప్రయత్నము చేయసాగిరి. ఆహార సామాగ్రుల ను యుద్ధపరికరములను సమకూర్చసాగిరి. రాబోవు యుద్ధ ములో గాయములు తగిలినవారి చికిత్సకుగాను పరికరములను గూడ తయారు చేసిరి. ఏబది వేల సవరనుల రుణమును , ప్రజల నుండి వసూలుచేసిరి. 1775 సంవత్సరం ఫిబ్రవరి 27 వ తేదీసనీ మొదటికలహము జరిగెడిది. కాని ఆకస్మికముగా తప్పిపోయెను. ఉనీలమను ప్రదేశములో యుద్ధసామాగ్రు లొక యింటియం దుంచబడెను. ఆంగ్లేయ సేనాధిపతి జనరలు గేజు వాటిని స్వాధీనపర్చుకొమ్మని వెస్లీ సేవానినుండి నలుబది మంది సెనికులను బంపెను. కాని వారు రాక ముందే , పజలీ సామాగ్రుల నచటనుంచి తీసి మరియొక చోట దాచిరి. ఈ దాచిన స్థలమునకు 'వెళ్ళవలెనని 'వెస్లీ సేనాని యత్నించెను. గాని మార్గముననున్న వంతెనలను ప్రజ లేత్తి వేసిరి. సైనిక లలో కూడ పడవల మీదనదిని దాట ప్రయత్నించిరి. అవ తలయొద్దున ప్రజలు గొడ్డళ్ళతో వేచియుండి వొడ్డుకొచ్చెడి పడవలను ముక్కలు ముక్కలుగ నరికివేయుచుండిరి. అప్పు డొక రాజీనామా కుదిరి ఆ సేనలను ప్రజలు నదిని దాటనిచ్చిరి.సేవలు యుద్ధ సామాగ్రులను స్వాధీనపర్చు కొనకుండ వెళ్ళి పోయిరి 1775 సంవత్సరం మార్చి 26 వ తేదీన వర్జీనియాలో నొక సమావేశము జరిగి యారాష్ట్రమును సంరక్షించుకొను

టకు వలయు పనుల నెల్ల చేయుటకు తీర్మానించింరి, ఇందుకొర కొకల యుపసంఘము నేర్పాటు చేసిరి. దీనిలో జార్జి వాషింగ్న్ల నొక సభ్యుడుగ నియమింపబడెను. తన జీవితమును అద్మ ష్టమును అమరికా స్వాతం త్యమునకై ధారవోసెదననియు తా నిదివరకే రిన్మాండు స్వాతంత్య పటాలము యొక్క సైన్యాధి పత్యమును వహించితిననియు అవసరమైన వో నింకను నెక్కువ సైన్యములను నడుపుటకు సిద్ధముగనున్నాననియు నీయనమార్చి 25 వ తేదీన తన సోదరుసకొక యుత్తరమును వ్రాసెను. పోరాటము నకంతయు సిద్ధమైనది. నిప్పుపుల్లగీసి వెలిగించుటమే మంటమండుటకు తడవుగనున్నది. -