Jump to content

అప్పకవీయము/భాషాపరిచ్ఛేదము

వికీసోర్స్ నుండి

భాషాపరిచ్ఛేదము

ప్రథమాశ్వాసము



భోజతనూజస
త్యాభామాసహిత తార్క్ష్యహనుమద్యుత భ
ద్రేభాధిపపోషణ తుల
సీభూషణ కామెపల్లి శ్రీగోపాలా.

1


క.

అవధారు శబ్దశాసనుఁ, డవనిఁ గలియుగమున కాది నా రాజమహేం
ద్రవరంబునం జెప్పిన యం, ధ్రవచోవ్యాకరణసూత్రతతిఁ దెనిఁగింతున్.

2


క.

భాషావిరూపణం బా, ర్యాషట్కమునందుఁ దొలుత నంధ్రకవిశిరో
భూషణమగు నన్నయ సవి, శేషంబుగఁ జెప్పి సంకుచితవాక్యములన్.

3

భాషాపరిచ్ఛేదమూలసూత్రంబులు

ఆర్యావృత్తశ్లోకంబులు

విశ్వశ్రేయః కావ్యం త దదోషౌ పరికృతౌ చ [1]వాగర్థౌ
సా వా గ్యా రసవృత్తి స్సాద్యో హి రసా యథాతథం కవిభిః.

1


స్వస్థానవేషభాషాభిమతా స్సన్తో రసప్రలుబ్ధధియః
లోకే బహునన్యన్తే వైకృతకావ్యాని చాన్య దపహాయ.

2


ఆద్యప్రకృతిః ప్రకృతి శ్చాద్యే ఏషా తయో ర్భవేద్వికృతిః
కేవలతయానుసర్ప త్యుభే చ యేయం యథాతథా భాషా.

3


తజ్జా సమా చ దేశ్యా గ్రామ్యా చేయం చతుర్విధా భవతి
ప్రకృతిద్వయజా తజ్జా తుల్యా తు సమా ప్రవాహినీ దేశ్యా.

4


సిద్ధి ర్లోకా ద్దృశ్యా లోకో౽నన్యాదృశ శ్చ నిత్యశ్చ
సంస్కారార్థో నియమో౽నియమా ద్గ్రామ్యం హి యత్త్వపభ్రంశః.

5

విరళాన్ పేచోషాదికశబ్దాన్ ప్రవ్యాహరంతు శబ్దజ్ఞాః
ఇహ తు ప్రవ్యాహార్యం సఙ్కేతితసుప్రసిద్ధమేవ పదమ్.

6

ఇతి శ్రీసకలభాషావాగనుశాసన నన్నయభట్టవిరచితాంధ్రశబ్ద
చిన్తామణౌ భాషాపరిచ్ఛేదః ప్రథమః

వ.

ఈ శ్లోకంబు లాఱునుం బండ్రెండు సూత్రంబు లయ్యె నవి యెల్ల నిందు వివరించెద.

పూర్వగ్రంథనామసంగ్రహము

తే.

సంస్కృతమునకు నాంధ్రభాషకును దొల్లి, లక్షణములు శాకల్లెమల్లనసుధీంద్ర
విన్నకోటపెద్దనసుకవిప్రముఖులు, క్షితి నొనర్చికి లోకోప[2]కృతిగఁ బెక్కు.

4


వ.

అవి యెయ్యెవి యనినం బ్రతాపరుద్రీయంబును, గువలయానందంబును, [3]జంద్రా
లోకంబును, రసమంజరియును, సాహిత్యచంద్రోదయంబును, సాహిత్యరత్నా
కరంబును, వృత్తరత్నాకరంబును, జమత్కారచంద్రికయు, షడ్భాషాచంద్రి
కయును, షడ్భాషావివరణంబును, ద్రివిక్రమవృత్తియు, హేమచంద్రఫక్కిక
యును, గవిభల్లటఫక్కికయును, నధోక్షజఫక్కికయును, శబ్దానుశాసనీయంబును,
గవిరాక్షసీయంబును, గవికంఠపాశంబును, గవిమూషికమార్జాలంబును, గవిగజాం
కుశంబును, గవిసర్పగారుడంబును, గవిజనాశ్రయంబును, గవిలోకసంజీవనియును,
గవికంఠాభరణంబును, గావ్యాలంకారచూడామణియును, గావ్యచింతామణియు,
నథర్వణచ్ఛందంబును, గోకర్ణచ్ఛందంబును, శ్రీదరచ్ఛందంబును, ననంతామాత్య
చ్ఛందంబును, [4]ఛందోదర్పణంబును, నలంకారసంగ్రహంబును, నలంకారరత్నా
వళియు, నాంధ్రభాషాభూషణంబును, రేఫఱకారనిర్ణయంబును, లక్షణవిలాసం
బును, సులక్షణసారంబును, సర్వలక్షణసారసంగ్రహంబును, లక్షణదీపికయును,
శారదాదీపికయను, శారదాముకుటంబును, శారదాతిలకంబును, [5]వాగీంద్రచూడా
మణియును, నరసభూపాలీయంబును మొదలుగా నీక్షింప లక్షణగ్రంథంబులు
లక్షోపలక్షలు గల వందు.

5


క.

ఒకదానికంటె మఱి వే, ఱొకటి విశేషంబుఁ జెప్పుచుండుకతమునన్
సకలగ్రంథములును జదు, వక తెలియునె లక్షణప్రపంచం బెల్లన్.

6

ప్రబంధమహిమ

క.

ఇది చదివినపిమ్మట మఱి, యెదియేనియుఁ జదువుబుద్ధి యేలా వొడమున్
బదపడి గ్రంథము లన్నియు, వెదకి వెదకి సార మెల్ల వివరింపంగన్.

7

తే.

పర్వతము లెల్ల నొక్కదర్పణమునందుఁ, జూపడు తెఱంగునను గవిత్వోపయోగ
లక్షణములన్నియును సరళంబుగాఁగ, నెఱుఁగఁబడు నిందుఁ దెలియ నూహించిరేని.

8


క.

సౌరభాషకు శబ్దశాస్త్రంబుపగిదిఁ [6]దెనుఁగు(న) కావశ్యకం బిది దీనిఁ జదివి
చెప్పిన ప్రబంధము జగత్ప్రసిద్ది నొందు, నుఱక రచియించినది యప్రయోజకమగు.

9


క.

రత్నములకు నిల సత్కృతి, రత్నములను మఱి తురంగరత్నములకు స్త్రీ
రత్నములకు లక్షణములె, యత్నంబునఁ జూడవలయు నండ్రు మనీషుల్.

10


క.

ఈక్షితిని రాజరాజున, భిక్షునిగాఁ దిట్టఁ గూటిపేదను యక్షా
ధ్యక్షునిగా దీవింపను, లాక్షణికుఁడె యెన్నిభంగుల సమర్థుఁ డగున్.

11


క.

ఉత్తముడు లక్ష్యలక్షణవృత్తవేది పరఁగు మధ్యముఁ డన లక్ష్యపద్యవేది
సొరిది నధముఁడు లక్షణశ్లోకవేది, లక్షణజ్ఞుల కివియ పో లక్షణములు.

12


తొలుతను లక్షణసూత్రం, బు లెఱింగి పిఱుంద లక్ష్యములు దెలియంగా
వలయను గావున లక్షణ, ములు లక్ష్యంబులును బాఠముగఁ జేయఁదగున్.

13

శబ్దానుశాసనమూలసూత్రము—

విశ్వశ్రేయః కావ్యమ్.

1


క.

ధర్మములలోన నుత్తమ, ధర్మము కావ్యము నిజంబు ధర నెవ్వని కా
ధర్మము చేకుఱు నతఁడు సు, ధర్మను వసియించుఁ బెక్కుదైవతయుగముల్.

14


తే.

తనయుఁడు చెఱువును గావ్యం, బు విధానము గుడి వనంబు భూదేవస్థా
పనమును నను నియ్యేడును, జను శాస్త్రములందు సప్తసంతతు లనఁగన్.

15


తే.

దుష్కృతము లెన్ని చేసినఁ దుదిని సప్త
సంతతులలోన నొక్కటి సలుపునతఁడు
కుతుకమునఁ దననూటొక్కకులమువారి
నరకములు బాపి ముక్తికి నడపు నిజము.

16


క.

ఇల సప్తసంతతులలో, పలఁ గావ్యము దక్క దేవభవనవనాదుల్
ఖిలము లగుఁ గొన్నివర్షం, బుల కని చంపువు రచించె భోజుం డెఱుకన్.

17


తే.

నిలిపి రెక్కడ నచటనె నిలిచియుండు, నగ్రహారాదిసంతతు లరసి చూడ
నవియు కృతిముఖరచనచే నఖిలదిశల, నెగడుఁ గావునఁ గావ్య మన్నిటికి దొడవు.

18


క.

పురివఱదనీరు గోదా, [7]వరిఁ గలసిన యోగ్య మైనవడువునఁ గడుదు
శ్చరితుం డైనను గావ్యాం, తరమునఁ జెప్పబడి పావనచరిత్రుఁ డగున్.

19

క.

క్షితి నెవ్వనినామము స, త్కృతి నెన్నిదినంబు లుండు దివి నా పుణ్య
ప్రతుఁ డంతకాల ముండును, ధృతి నింద్రద్యుమ్నునునికి దృష్టాంతముగాన్.

20


క.

తనకు హితార్థము లెఱిగిం, చు నఘంబు లడంచు ధనము శోభనము యశం
బును గూర్చు నఖిల[8]సురులన్, గనఁబడఁగాఁ జేయు నెపుడుఁ గావ్యము కవికిన్.

21


తే.

మేటిబ్రహ్మర్షి యయ్యె వల్మీకభవుఁడు, గాంచె రవిని మయూరుండు గడియలోన
[9]హరిణరోగము వాసె శ్రీ[10]హర్షణునకుఁ, గావ్యమునఁ జెందరానిసద్గతులు గలవె.

22


చ.

అలరఁ బురాణకావ్యముల [11]నార్యులు చెప్పినవారు దక్కఁగాఁ
దెలియఁ జతుర్యుగంబులను దీవుల నేడిట నెంద ఱెందఱో
యిల జననంబు నొంది [12]మని యేఁగిరి పుణ్యచరిత్రు లందులో
పల నిపు డొక్కఁడేనియును బ్రస్తుతి కెక్కు టెఱుంగ మెక్కడన్.

23


తే.

రామకథలోనఁ గపులు వారాశిఁ గట్టి, రనుచు వాల్మీకి చెప్పంగ నఖిలజనులు
సేతు వనుచు నెఱింగిరి చెప్ప కున్న, నదియు నొకసోగ దీవి య టండ్రు గాదె.

24


క.

[13]వివరించె యజుర్వేదము, కవి యగువిప్రుండు శుచి జగంబుల నేత
త్ప్రవిమలకావ్యము మిక్కిలి, పవిత్ర మగుఁ గపిలగోవుపాలతెఱఁగునన్.

25


తే.

ఉపమ కలిగిన శయ్యల నొప్పియున్న, నంఘ్రిభవునికావ్యంబు గ్రాహ్యంబు గాదు
పాయసం బైన సంస్కారపక్వ మైనఁ, గాక [14]జుష్టంబు హవ్యంబు గానియట్లు.

26

కావ్యభేదంబులు

సీ.

ఉచ్చారణక్రియ నొప్పారు వర్ణంబు వర్ణసంచయమున వఱలుఁ బదము
పదవితానముచేత భాసిల్లు వాక్యంబు వాక్యభేదమున నివ్వటిలు నర్థ
మర్థవశంబున నమరును భావంబు భావసంగతిఁ గనునట్టు రసము
[15]రససుప్రశస్తిచేఁ బొసఁగును బద్యంబు పద్యరాశిని గూర్పఁబడును గావ్య


తే.

మట్టికావ్యంబు ద్వివిధ మై యతిశయిల్లు, బరువడిఁ బ్రబంధచాటుప్రబంధము లన
సర్గముల సంస్కృతమున నాశ్వాసములను, దెనుఁగునఁ బ్రబంధ మనునది తనరుఁ గృష్ణ.

27


సీ.

పురమును ఋతుషట్కమును బ్రయాణంబును శైలంబు వేఁటయు సాగరంబు
మౌనీంద్రపుణ్యాశ్రమంబును మంత్రంబు ద్యూతంబు పిదప నద్భుతరణంబు
విజయంబు మద్యపానజవికారంబును వనవిహారంబును వారికేళి
కన్యాంగసౌందర్యకథనంబు హిమకరాభ్యుదయంబు విప్రలంభోదితంబు


తే.

పద్మమిత్రోదయంబును బరిణయంబు, సురతమును దౌహృదంబును సుతజననము
ననఁగ నిరువదిరెండు వర్ణనలు గూర్చి, చెప్పవలయుఁ బ్రబంధంబు శ్రీనివాస.

28

క.

కనుఁగొన సంఖ్యాబద్ధం, బు నసంఖ్యాకంబు నాఁగ భువి నిరుదెఱఁ గై
తనరారుఁ బూర్వకవిమత, మున నా చాటుప్రబంధములు జలజాక్షా.

29


తే.

నాల్గుదెగల యుదాహరణములు ముక్త, కాదిపంచదశమును సంఖ్యాన్వితములు
గద్యరగడద్విపదదండకమును మంజ, రులును సంఖ్యారహితచాటువులు నృసింహా.

30

ముక్తకాది [16]పంచదశం బెద్ది యనిన

సీ.

దనరు ముక్తక మన నొక్కపద్యము ద్వికం బగు రెండు త్రికము మూఁడైనఁ బంచ
రత్నంబు లైదు వారణమాల యెనిమిది నవరత్నములు పద్యసప్తక మైన
భాస్కరమాలిక పండ్రెండు శశికళ పదియాఱు నక్షత్రపంక్తి యిరువ
రియు నేడు త్రింశదాహ్వయము ముప్పది రాగసంఖ్య వెండియు రెండు సాగెనేని


తే.

వరుసఁ [17]బంచాశదాఖ్య మవ్వల శతకము, నష్టసమధికశతకంబు ననఁగ వెలయు
నేఁబమియు నూఱు నూటిపై కెనిమిదియును, సప్తశతి సప్తశతమైన శార్ఙ్గపాణి.

31

శబ్దానుశాసనమూలసూత్రము—

త దదోషౌ పరికృతౌ చ వాగర్థౌ.

2


తే.

కృతికి [18]నెప్డు శబ్దార్థముల్ రెండు వలయు, నవి యలంకారయుతములు నఖిలదోష
రహితములు గాఁగఁ జూచి కూర్పంగ వలయుఁ, గామెపలి బాలగోపాల గానలోల.

32

శబ్దార్థలక్షణాలంకారసీసమాలిక

సీ.

సర్వలక్షణ[19]సారశబ్దార్థయుగళంబు మహితశుద్ధసువర్ణమణులభంగిఁ
బదపద్యభూషణప్రచయరూపంబు బై లలిఁ గావ్యలక్ష్మి నలంకరించు
కారణంబున నలంకారాఖ్యలను జెంది బహుభేదములను జూపట్టుఁ గృతుల
నఖిలకావ్యములకు నాత్మలు రీతులు ప్రాణముల్ వానికిఁ బ్రాణదశక
మోలి వైదర్భికాగౌళికాపాంచాలికాలాటికాఖ్యనకలిత లైన
[20]నాల్గునురీతు లెన్నంగ నర్థవ్యక్తి సౌకుమార్యౌజఃప్రసాద[21]కాంతి
[22]మధురతౌదార్యసమాధిసామ్యశ్లేషములు పదియును బ్రాణములు దలంప
శయ్యాచమత్కారశబ్దస్ఫురణపదావృత్తిరీతి ప్రాణవితతు లెల్ల
శబ్దలక్షణము లై జగతిపైఁ బొగడొందు నుభయవిస్ఫురణంబు నొప్పునట్ల

వదలక మును గొన్న వర్ణంబు కృతులను బలుమాఱు నుడివినఁ బ్రాస మయ్యె
నది సుఖకర దుష్క రావసాన ద్వి త్రి చతు రను సంజ్ఞల సప్తవిధము
లయ్యె ననుప్రాస మందులోపల ఛేకవృత్తిలాటము లన ముత్తెఱంగు
లేకార్థశబ్దంబు లేకపద్యంబులోఁ బునరుక్తిదోషంబు పొందకుండ
నుడుగక నేమాఱు [23]నుడువఁగ లాటాఖ్యఁ జను ననుప్రాస మై జరగుచుండు
లాటంబులో శృంఖలన్యాయబంధంబు ప్రతిషేధశృంఖలబంధనంబు
మాలికాదీపసమాఖ్యయు సారంబు నేకావళియు నన నెసఁగు నైదు
పలుమాఱు నొకభంగిపలుకులు పలుకుచో సర్ణంబు వేఱైన యమక మదియు
నాదిగతంబు మధ్యగతంబు నంతగతాఖ్యంబు నాదిమధ్యమగతంబు
నాద్యంతగతము మధ్యాంతగతంబును జరణత్రయగతంబు సర్వగతము
నుపమానపదగోపనోక్తియు నన నవవిధములై యమకముల్ విస్తరిల్లు
సరిగమపధను లోష్ఠ్యనిరోష్ఠ్యములు తలకట్లును గుడులు శృంగములు నేక
[24]వర్ణంబులు నభీష్టవచనసంఘట్టనంబులు నాదిగా నిట్లు వొదలు టెల్లఁ
జిత్రకవిత్వప్రసిద్ధనామంబులై పెంపొంది వీనుల కిం పొనర్చు
సరవి గూఢచతుర్థచరణవర్ణముఁ జతుర్విధకందమును బంచవిధసువృత్త
పద్యంబు సీనరూపద్విపదాఖ్యయుఁ గందగర్భితమణిగణనికరము
మొదలు గా నొకపద్యమునఁ బెక్కుపదియంబు లిమిడి ఛందో౽ర్థదోషములు లేక
కనుపట్టునవి యెల్ల గర్భకవిత్వవిఖ్యాతిచే శ్రవణసుఖం బొనర్చు
గోమూత్రికాఛత్రగుచ్చకుండలినాగకంకణమర్దలఖడ్గచక్ర
పంకజసర్వతోభద్రమాలా[25]క్షురప్రభృతిబంధంబు లేర్పడఁగఁ జెప్పు
వృత్తము ల్బంధకవిత్వవిశ్రుతములై కవులకుఁ జెవులపండువులు సేయుఁ
బ్రాసాదిగాఁ జెప్పఁబడిన వన్నియు శబ్దవితతి కలంకారవితతు లయ్యె
ధర నలంకారప్రధానతానురసప్రధానతావస్తుప్రధానతలును
భాసిల్లు నారభటీసాత్వతీభారతీకైశికీనామధేయవృత్తు
లర్థస్ఫురణసమాఖ్యయు లాంగలీఫలపాకమృద్వీఫలపాకములును
గడు ముఖ్యగౌణలక్ష్యధ్వనివ్యంగ్యముల్ గణుతింప నర్థలక్షణము లయ్యెఁ
జర్చింపఁ గృతులకు జాతిగుణంబులు ద్రవ్యక్రియలు జీవితంబు లగుట
నది యేతెఱంగున నమరు నట్లన చెప్ప వఱలు జాతియు స్వభావంబు ననఁగ
నది మొదల్కొని మూఁడుపదులపై నెనిమిది యెసఁగుతద్భేదంబు లెఱుఁగవలయు

జాతియు నుపమయు సద్రూపకంబును భ్రాంతిమంతంబు నపహ్నుతియును
దీపకత్రయము నాక్షేపంబు [26]శ్లేషంబు నుత్ప్రేక్షయును దుల్యయోగితయును
వ్యతిరేకమును నుదారతయుఁ బ్రేయస్కంబు నెసఁగ విరోధ మావృత్తివిధము
భావికాఖ్యానంబుఁ లతివృత్తియును సమాహితము నప్రస్తుతస్తుతిపరంబు
వ్యాజస్తుతియును బద్యాయోక్తియును విశేషోక్తి వక్రోక్తి సహోక్తిసంజ్ఞ
లూర్జస్వియును సమానోక్తిసమాఖ్యయు జగతి విభావనాసంకరములు
రసవంతమును నిదర్శనమును సూక్ష్మంబు లవనామకంబు హేతువుఁ గ్రమంబు
నాశీర్వచనము నర్థాంతరన్యాసంబు నతిశయోక్తియు నుదాత్తాభిధంబు
నన నొప్పు నిన్నియాు నర్థంబులకు నలంకారభేదంబులై కానఁబడును
దొలుతటి రూపకాదులు తమలోఁ దాము కలసి సంసృష్టిసంకరము లనఁగ
ద్వివిధంబు లగు నందుఁ దిలతండులన్యాయసంసృష్టిఁ గృతులఁ బ్రశస్త మయ్యె
సంకరంబులు రెండు బరగు దుగ్ధోదకన్యాయనృకేసరిన్యాయములను


తే.

క్షితిని శబ్దార్ధసంసృష్టిఁ జెందునట్టి, సంకరంబులు మఱియును జాలఁ గలవు
వరుస నవి యెల్లఁ దెలియంగవలయఁ బూర్వ, శాస్త్రలక్షణలక్ష్యోక్తసరణివలన.

33

శబ్దార్థదోషసీసమాలిక

సీ.

కనుఁగొన దుష్ప్రయోగము వైరివర్గంబు ధరఁ దత్సమాపశబ్దక్రమంబు
నపసంస్కృతాఖ్యంబు నప్రయుక్తంబు విసంధి దుస్సంధి పసందిపదము
లవల నకారశూన్యంబు హీనోక్తియుఁ గొఱలు దీర్ఘపుకాకుఁ గుఱుచకాకు
సమసనభంగంబు ఛందోయతిప్రాసభంగంబులు ననంగఁ బదియు నాఱు
శబ్దగతప్రదోషంబులై యెప్పారుఁ గృతులు సాగవు వీని నెఱుఁగకున్న
న్యూనోపదోపమయును నధికపదోపమయు నప్రసిద్ధోపమావిధంబ
నసదృశోపమయు మహాధికోపమయును నీచోపమయు వ్యర్థవాచకంబు
దేశసమయలోకదిక్కాలమైత్రీవిరోధాగమకళావిరోధములును
వ్యాకీర్ణకము ససమర్థ మపార్థంబు విరసంబు నతిమాత్రవిశ్రుతంబు
నశుభలజ్జాజుగుప్సాశ్లీలములు సంశయంబు సందిగ్ధనేయార్థములును
బ్రక్రమభంగం బపక్రమంబును గ్రమభంగంబు శ్రుతికటుపరుషములును
క్లిష్టగూఢార్థం బపుష్టార్థకము నసంగతదోషము [27]సతత్ప్రకర్షణ మధి
కపదంబు మఱి సమాప్తపునరాత్తంబును హీనపదంబు నిర్హేతుకంబు
నవిమృష్టకవిధేయకాంశ మన్యార్థంబు నప్రతీతికము ననర్థకంబు
భిన్నసంబంధంబు భిన్నలింగము భిన్నవచన మలంకారవర్జితంబు

క్షితి న[28]ప్రయోజనశ్లిష్టంబు నేకార్థకంబును బునరుక్తకంబు ననఁగఁ
దొడరు నేఁబది యర్థదోషంబు లివి ముందు తెలియక కృతి [29]సేయ నలవి గాదు
పదపడి మును పల్కుప్రాసాదులను గూర్చి చెవులకు [30]నింపుగాఁ జెప్పిరేని
ధీరులు సద్గుణాధికతచే నవియ చేపట్టుదు రొక్కొక్కపట్టునందు
శ్రుతిసంస్కృతియు మధురతయు నస్పష్టార్థమునకు నర్థవ్యక్తియును బతత్ప్ర
కర్షంబునకు ధాత్రి హర్షవాక్యము సూక్తితంత్ర [31]మశ్లీలాభిధానమునకు
గ్రామ్యంబునకు నెల్లఁ గాంతియు ననుచితార్థంబుల కెల్ల నుదాత్తతయును
సంధిదోషముల కూర్జస్వియు శ్రుతిపరుషంబుల కెల్లను సౌకుమార్య
మప్రతీతికమున కా ప్రసాదంబుఁ బ్రేయస్కంబుఁ బరుషసమాఖ్యమునకుఁ
గ్రమభంగమునకు సంక్రమతయు న్యూనాధికపదంబులకు సామ్యకల్పనంబు
మెడియు నిబ్భంగి వెదకి గుణాధిక్యములు గూర్చి దోషముల్ దొలఁగఁ జేసి


తే.

రచన గావించు కృతి బుధరచనలందుఁ, దనరు నాచంద్రభాస్కరతార మగుచుఁ
గావున నలంక్రియాశాస్త్రకథితఫణితి, నరయఁ దగు వీని నెల్ల భూసురపురీశ.

34

వాక్యలక్షణము

మూ.సూ.

సా వా గ్యా రసవృత్తిః

3


క.

రసమునకు [32]నాశ్రయంబై, యసదృశ మగు నెద్ది యది గదా శబ్దము రా
క్షసదమన రసికు లనఁగా, వసుమతిఁ దద్విధ మెఱుంగువారలు సుమ్మీ.

35

రసవివేకము

మూ.సూ.

సాధ్యో హీ రసో యథాతథం కవిభిః

4


తే.

తగ రసాశ్రయవాక్యసంతతులు గూర్చి, కావ్యము లొనర్చువార పో కవు లనంగ
నట్లు గావున నేభాష నైనఁ గవిత, పలుకువారికి సాధింపవలయు రసము.

36

పంచవిధభావసీసమాలిక

సీ.

రమణ మనోవికారము బహిర్వ్యాప్త మై భాసిల్లు నది సుమీ భావ మనఁగ
నదియ విజ్ఞానసమాఖ్యచేఁ జెన్నొంది యాత్మకు మనసుచే నబ్బుచుండు
నామనంబున కింద్రియములచే నగు వాని కైదింటికిని విషయములవలనఁ
[33]గలుగు నాత్మజ్ఞానకలితమౌ భావంబు తరుణులయందును బురుషులందు
నాత్మసముద్భూత మై నవరసముల [34]నమరఁ జేయుచు విభావానుభావ
సాత్త్విక[35]వ్యభిచారిసంజ్ఞలచే నాల్గుచందంబు లగు నందుఁ జను విభావ

మాలంబనోద్దీపనాహ్వయంబుల రెండు తెఱఁగుల ధాత్రి నుద్దీపనాఖ్య
మాలంబనోక్తగుణాలంబనవిచేష్టితాలంక్రియాత్మవిహారలీల
లనఁ జతుర్విధములఁ దనరారు ననుభావ మంగవేష్టోద్భూత మగుచు వెలయు
ధర మనోవృత్తి సత్త్వం బనఁబడు నందు సంభవించినయది సాత్త్వికంబు
గణుతింప నా సాత్త్వికము కంప ఘర్మ సంస్తంభ వైవర్ణ్య [36]వైస్వర్యబాష్ప
విలయరోమాంచసంజ్ఞల నష్టవిధముల బరగు నవ్వల వ్యభిచారికంబు
స్థాయిభావమున నిత్యత్వంబు నొందక వ్యభిచరించుచు సాగరాంతరమునం
బొదలు భంగముభంగిఁ బొడముచు నడఁగుచు సంచారిభావసంజ్ఞతయును దాల్చి
వ్యాధ్యసూయావాగహర్షలజ్జామర్షదైన్యావహిత్థనిద్రావిషాద
శంకామదగ్లానిచపలతావస్మారసుప్తీచింతాత్రమౌత్సుక్యమరణ
గర్వమోహాలస్యనిర్వేదసంత్రాసధృతిజడతోగ్రతాస్మృతివితర్క
మతిసుసంబోధనోన్మాదనామంబులఁ బేర్చు ముప్పదిమూఁడుభేదములను
బ్రకటంబు లై స్థాయిభావంబు లన దోషశమజుగుప్సాభయోత్సాహశోక
హాసవిస్మయరతు లనఁగఁ దొమ్మిది యొప్పు నవరసోదయకారణంబు లగుచుఁ
బంచవిధంబులై పరఁగు భావంబులు స్థాయిభావసమన్వితము లగుచు


తే.

వీని నన్నింటి నెఱిఁగిన[37]వెనుకఁగాని, నవరసంబులు పుట్టుచందములు వాని
భేదములు లక్షణంబులు నాది గాఁగఁ, దెలియఁ బోలదు తలగెడదేశవాస.

37

శృంగారరససీసమాలిక

సీ.

వెన్నముద్దకుఁ బాకవిధిచే ఘృతత్వంబు దనరుభంగిని నన స్థాయిభావ
ములకు విభావప్రముఖ్యభావంబులవలన రసత్వంబు గలుగుచుండుఁ
దద్రసం బంతయుఁ దనకుఁ గావ్యాదులందు నాట్యంబులందు ననారతంబు
గలుగుఁ గాని రసంబు గలుగ దారోప్యంబు కావున నటియించు కాంతలందు
గరిమ నా రసము శృంగారంబు హాస్యంబు రౌద్రంబు కరుణ బీరంబు నద్భు
పఠన పస్థాయిభావముల; జెప్పన కలియె విధానాదరుజనముల
తంబు భీభత్సంబు దారుణంబును శాంతమును నాఁగ నవవిధంబుల మెలంగు
పరనవస్థాయిభావములలోఁ జెప్పిన రతియె విభావాదిరంజనముల
నయ్యెను శృంగార మది నీలవర్ణంబు వెన్నునిమొన సామవేదవంశ
వర్యంబు గడు సౌకుమార్యంబు కైశికీవృత్తిని మధురతావిధమునందు
సుప్రసాదాభిదానప్రాణ[38]ఫణితిని విరచింప నొప్పుఁ గవిత్వమునను

బెనుదాయ బీభత్సమున కది సంభోగభవమును విప్రలంభజము ననఁగ
ద్వివిధ మయ్యెను బంచవిధభావకథితప్రపంచకపోష్య మై పరఁగునట్టి
సందర్శనాలాపసంస్పర్శనాశ్లేషనఖరదక్షతచుంబనక్రియాద్య
మవనిపై సంభోగభవము తద్విప్రలంభజ మనునది మూఁడుభంగు లయ్యె
నంగప్రభూతం బయత్నసంభవమును నైసర్గికంబు ననంగ నందు
[39]వింశతీంగితములై వెలఁదుల కొప్పారు యౌవనగుణచేష్ట లందులోనఁ
దనరారు నంగజాతము మూఁడుభేదంబులై హాసభావహేలాహ్వయములు
నప్రయత్నజ మయినది సుశోభాకాంతిదీప్తిప్రగల్భతాధీరతలును
మధురతోదారతాభిధములు నన నేడుచందంబు లయ్యె నైసర్గికమ్ము
కిలికించితవిలాసలలితలీలాఖ్యలు విచ్ఛిత్తిబిబిబ్బోకవిభ్రమములు
కుట్టమిసంబును మోట్టాయితంబును విహృతంబు నన దశవిధము లయ్యె
భావంబు మొదలుగా భావోదయక్రియావింశతి యన నవి వినుతి కెక్కు
కుంభినిపై విప్రలంభశృంగారోపకరణంబులై రసాకరము లగుచు
శ్రవణసందర్శనప్రణయవిరోధప్రవాసాదికలనలవలనఁ బొడమి
వెలఁదులకును బురుషులకును వరుసతో నొదవు నవస్థలు పదియు రెండు
నయనసంప్రీతిమనస్సంగసతతసంకల్పప్రతాపజాగరకృశత్వ
విషయానుభవపరద్వేషలజ్జాత్యాగసంజ్వరోన్మాదమూర్ఛామృతాహ్వ
యంబుల రతిరహస్యకళాప్రవీణులు జగతిఁ బ్రతాపంబు సంజ్వరంబు
నను రెండుదశలును గొనక యవస్థలు పదియ కా నెంతు రేపట్టునందుఁ
[40]బ్రకృతకథాసమాప్తికరంబు నహితంబు నశుభప్రసంగంబు నగుటఁ జేసి
[41]ద్వాదశదశ పురాతనకథాక్రమమునఁ గాని వర్ణింపరు కావ్యములను


తే.

గవులు దీని నెఱింగి శృంగారరసము, గులుకునట్లుగఁ గావ్యముల్ గూర్పకున్న
ఖ్యాతి కెక్కునె రసికసభాంతరముల, సర్పతటినీపురందరాశానివేశ.

38

అష్టరససీసమాలిక

సీ.

రసపోషణము లన నెసఁగు విభావముఖ్యంబులవలన సువ్యక్తభంగి
బడయు నవస్థాయిభావముల్ నిజగుణస్తత్త్వంబు లగుచు రసత్వ మొందు
వందు శృంగారరసాంతరభేదసంతతు లెల్ల మున్ను భాషితము లయ్యె
నింక హాస్యాదుల నెనిమిదింటను గల్గుభేదముల్ చెప్పెద వేఱువేఱఁ
బూర్వోక్తహాసంబు భువిని హాస్యం బయ్యె నది యల్పమృదుపు సామాన్వవాయ

మర్జునచ్చవి కుంజరాననుచేరువఁ గరుణాభియాతి శృంగారభవము
సొంపొందు మధురతాసుప్రసాదములకు భారతీవృత్తిని బద్యములను
మూఁడుభేదంబులు మొలచె నుత్తమమధ్యమాధమంబు లనంగ నందులోన
సంసితన్మీతము లుత్తమాఖ్యలు గహసితప్రహసితంబులు మధ్యభావితములు
క్షితి నపహసితంబు నతిహసితంబును జనుఁ గావ్యములఁ గనినను బ్రశస్తిఁ
బంచమభావసంభవమహాక్రోధంబు రౌద్రరూపము దాల్చె రక్తనిభము
హరుని[42]యూడిగ మదర్వాన్వయప్రభపంబు భ్రుకుటిప్రయుక్త మద్భుకవిపంథి
యుద్ధ్భతార్థము ప్రసాద్రౌజంబులను గూర్చి యారభటీవృత్తి నమరఁ జెప్ప
[43]వెనుకఁ జెప్పిన[44]శోకమున కయ్యెఁ గరుణ దా మహి నథర్వామ్నాయవిహిత[45]కులజ
సమవర్తిదాసి కాషాయసన్నిభకాంతి హాస్యాద కార్ద్రరసాత్మజాత
సౌకుమార్యమునఁ బ్రసాదమాధుర్యంబులను గైశికీవృత్తిఁ జను రచింప
స్థాయీభావోదితోత్సాహంబు దా వీరరస మయ్యె [46]నెఱుపు సాధ్వసవిరోధి
కించిత్ప్రగల్భితోదంచితమోజఃప్రసాదసాత్వతులను జరగుఁ గవిత
ప్రథమవేది సుపర్వభర్తరాణువ మూఁడువిధములై యది ధాత్రి వెలయు నమర
వారంబు వితరణవీరంబు గారుణ్యవీర్యంబు నన భావవేద్య మగుచు
విస్మయాహ్వయమున వెలయుభావంబు విభావాదులచే నద్భుతాభిదాన
మున నొప్పు నాశ్వలాయనసూత్రజము కమలాసమ[47]దళవాయి యరుణకాంతి
రౌద్రరసాదివీరరసప్రసూతంబు స్వల్పమృదుత్వ మోజఃప్రసాద
విధముల భారతీవృత్తిఁ గావ్యంబులయందుఁ జెప్పఁగ నొప్పుఁ బొందుగాను
నవభావభేదమధ్యవిభాషితతజుగుప్సబీభత్స మనఁగ నొప్పిదముఁ గాంచు
నారభటీప్రసాదౌజసవిధములు నొప్పుపద్యముల నత్యుద్ధృతంబు
సన్నుతాపస్తంబసంతతి శృంగారశత్రువు నందికేశ్వరునిబంటు
కాలవర్ణము ద్విప్రకారమై యది చెప్పఁబడు జుగుప్సాఖ్యబీభత్సరసము
పెనుపొంద వైరాగ్యబీభత్సరసమును ననఁగ నీభేదంబు లరయవలయు
మునుపు తొమ్మిదిభేదములలోన నెన్నినభయము భయానకాహ్వయముచేతఁ
బరఁగు యాజుషము బీభత్సంబుపట్టి ధూమ్రాభంబు వీరరసాహితంబు
ధర మహాకాళునిదళవాయి సాత్వతి నోజఃప్రసాదసంయుక్తి నమరుఁ
గవితల నీషత్ప్రగల్భంబు సర్వాంగకంపనవైస్వర్యకారణంబు
శమము శాంతం బయ్యెఁ జంద్రసన్నిభము నిర్వైర మొందును బరబ్రహ్మలెంక

క్రమమున ధర్మార్థకామమోక్షములను [48]పూరుషార్థములను బొందఁజేయు
నల్పమార్దవముఁ కావ్యములఁ బ్రసాదమాధుర్యభాషాఖ్యవృత్తులఁ బొసంగు


తే.

నీ రసాంతరభేదంబు లెల్ల వరుస, నెఱిఁగీ సమయోచితములుగా హృదయములకు
నింపు పుట్టంగఁ గృతుల వర్ణించవలయు, శ్రీగిరీశాన్యభాగధాత్రీనివేశ.

39

నాయకనిర్ణయసీసమాలిక

సీ.

నవరసంబులకు జన్మస్థానములు నలుగురు ముఖ్యులగు నాయకులు దనర్తు
రొగి ధీరలలితధీరోద్ధతధీరప్రశాంతధీరోదాత్తసంజ్ఞకు లనఁగ
గలరు వెండియు నొకనలుగురు శృంగారరససంభవాస్పదప్రథితగుణులు
ధారుణి ననుకూలదక్షిణశఠధృష్టు లనఁగ వీరలకు సహాయపరులు
మహి నలువురు పీఠమర్దవిదూషకవిటచేటకు లనంగ వెలయువారు
మదనకళాశాస్త్రవిదులచేఁ బూరుషజాతులు నాలు గెంచంగఁ బడియెఁ
బాంచాలదత్తకభద్రకకూచిమారాభిధానంబుల నవియుఁ గాక
నుపజాతు లన వెండియును మూఁడు శశవృషహయనామకములఁ జెన్నారుచుండు
వసుధ నాయకు డెంత రసికుఁ డైనను గాంత వెలి గాఁగ రసము సంధిలదు గాన
నాయికాభేద మంతయు విస్తరంబుగాఁ తెలిపెద నవరసాధీన లైన
యంగనలకు స్వకీయయుఁ బరకీయయు సాధారణయు ననఁ జనుఁ ద్రివిధము
లందులోన స్వకీయ యను భామినికి గుణభేదములను మూఁడు భేదము లగు
నుర్వి ముగ్ధయు మధ్యయును బ్రగల్భయు నన నొక్కచందంబున నుండు ముగ్ధ
మధ్యాఖ్యఁ జను తనుమధ్య ధీరయును ధీరాధీరాయును నధీరాభిధయును
నను మూఁడుదెఱగుల వినుతి గాంచుఁ బ్రగల్భ యనునదియును నట్ల నతిశయిల్లు
ధృతివిశేషములచే ధీరాదికామినీమణులు జ్యేష్ఠామధ్యమాకనిష్ఠ
లగుదురు వరుసతో నవని నా పరకీయ [49]ద్విప్రకారంబుచేఁ దేజరిల్లుఁ
గరపరిణీతయుఁ గన్యకయును ననఁ బరిణీత వర్ణింపఁబడదు కృతులఁ
గన్యక పురుషాభికాంక్షిత గాన నంగరసంబులను బరికల్పిత యగు
శృంగారరసనిధానాంగన లెనమండ్రు చర్చింప వాసకసజ్జికయును
నభిసారికయు ఖండితాఖ్యయు స్వాధీనపతికయుఁ బ్రోషితభర్తృకయును
విగ్రహాంతరితయు విగ్రహోత్కలికయు విప్రలబ్ధయు నన వీరలకును
దూతిక [50]లార్గురు ప్రాతివేశినియు శిల్పినియుఁ గారువును లింగినియు సఖియు
ధాత్రీతనుప్రజాతయు వీరు లేకున్నతఱి నేర్పుమై బ్రియతంత్రములకుఁ
దమకుఁ దా మైనను దగ దూతిభావంబు గైకొని నడపుట కార్యసరణిఁ

గా కామశాస్త్రమునందుఁ గామినీమణులకు వెలయు జాతులు నాల్గువిధము లగుచుఁ
జింతింప బద్మినీ శంఖనీ చిత్తినీ హస్తిను లన వీరి కందఱకును
నలువొంద ముత్తెఱంగుల నుపజాతులు హరిణియుఁ దురగియుఁ గరిణియును నన
లలి భావరసనాయకులయందుఁ గలిగిన భేదంబు లెల్లఁ దెల్పితి వరుసను
గ్రంథ[51]విస్తారశంకను వానిలక్షణంబులు లక్ష్యములు నిందుఁ బలుకనైతి


తే.

న ట్లనుట భావరసనాయకావిభేద, సంచయమున కలంకారశాస్త్రవితతి
వలన లక్షణలక్ష్యముల్ దెలిపి పిదప, రసము వర్ణింపఁదగుఁ గవిరాజులకును.

40

సుకవిమాహాత్మ్యము

తే.

మణివలన గంకణమును గంకణమువలన, మణియును బ్రకాశ మగునట్లు మదిఁ దలంప
సుకవివలన నాయకుఁడు నాయకునివలన, సుకవియుఁ బ్రసిద్ధిఁ గాంతురు సకలదిశల.

41


తే.

నాకుజాతునిచే రఘునాయకుండు, వ్యాసుచేఁ బాండవులు కాళిదాసుచేత
భోజుఁడు ప్రసిద్ధినొందిరి భువినిని దమదు, నడక లెల్లను గథలుగా [52]నుడువుకతన.

42


క.

ఇమ్మహిని మునులచే వెల, సె మ్మును కావ్యములు "నానృషిః కురుతే కా
వ్య"మ్మను వచనార్థం బే, సమ్మతిఁ గలివేళ సుకవిజనులే మౌనుల్.

43

తత్కవిలక్షణము

క.

ధరణీసురుఁడు ప్రశాంతుండు, గురుభక్తుఁడు శుచియుఁ గల్పకుఁడు పూర్వకవీ
శ్వరవాక్ప్రయోగదక్షుఁడు, కరుణామతి యెవ్వఁ [53]డతఁడు కవి యనఁ బరఁగున్.

44


క.

శ్రుతిశాస్త్రాంగపురాణ, ప్రతతియు నితిహాసకావ్యభరతాగమముల్
స్మృతిసంగీతరతికళా, గతులు నలంకృతులు నెఱుఁగఁగాఁ దగుఁ గవికిన్.

45

సప్తవిధకవులు

ఆ.

వినుతిఁ గాంతు రిల వివేకివాచకరౌచి, కార్థశిల్పభూషణార్థు లనఁగ
మార్దవానుగత[54]సమాహ్వయుఁడు ననంగఁ, గవులు సప్తనామకములతోడ.

46


సీ.

గణవర్ణశబ్దార్థగుణదోషనికరంబుఁ బరికించి కూర్చుఁ గబ్బము వివేకి
బహుతరానుప్రాసపదబంధనియమంబు వదలక కృతి సేయు వాచకుండు
మృదుమధురోక్తులు వెదకి కావ్యం బెట్ట రచియించుఁ బదపడి రౌచికుండు
మితశబ్దములలోన నతివిపులార్థంబు నిమిడించు నర్థాఖ్య నెసఁగునతఁడు

తే.

సెప్పు యమకంబు లెప్పట్ల శిల్పకుండు, పొందుపఱుచు నలంకృతుల్ భూషణార్థి
సరళపదవిరళార్థవిస్ఫురణముగను, జూపు రస మెందు మార్దవస్పుటకరుండు.

47

కుకవినిరసనము

తే.

జల్లిపదములు నాలుగు సంతరించి, గురువు లిడుచోట లఘువులు కొన్ని గూర్చి
విరతి గూడక మీఁదులు [55]వెదకికొనుచు, వచ్చు [56]పొల్లులుపై నుంచునతఁడు కవియె.

48


తే.

వ్రణము గని నిర్మలాంగంబు వదలునీఁగ
యనఁ గుకవి తప్పుఁ గని యొప్పు నడఁచిపుచ్చు
జల ముడిగి పాలు ద్రావు హంసకరణిఁ
దప్పు విడనాడి యొప్పు సత్కవి గ్రహించు.

49


తే.

తనకు తెలియని వన్నియుఁ దప్పు లనుచుఁ
గుకవి హాస్యంబు గావించు, సుకవివరుఁడు
దడవు యోజించి తెలియు నంతటను తెలియ
కున్నఁ దద్దయుఁ బెద్దలయొద్దఁ దెలియు.

50


క.

ధరఁ దమరు సత్కవుల మని, పరులు కుకవు లనుచుఁ గృతులఁ బరిహాస మొన
ర్తురు [57]గర్వమతు "లయోగ్యః, పురుషో నాస్తి" యనుమాట బుద్ధిఁ దెలిసియున్.

51


క.

భ్రష్టులు తామే సర్వో, త్కృష్టకవుల మనుచు సభఁ జరింతురు [58]"బాణో
చ్ఛిష్టం జగత్త్రయ" మ్మను, నష్టాక్షరమునను గాదె యడఁకువ మదికిన్.

52

కవితాప్రశంస

తే.

విబుధలోకంబు "కవితైవ విద్య" యనుచుఁ, జదువు వచనార్థమునను సంశయము గలదె
విద్యలకు నెల్ల నుత్తమవిద్య కవిత, దానిఁ దెలియుట విశ్వ మంతయును గనుట.

53


క.

ధారుణి నాకుజమారుతి, పారాశర్యులు చరించు భావకశిష్టా
చార [59]మవశ్యక మని కవి, తారతమతు లైరి కాళిదాసప్రముఖుల్.

54


మ.

జననాథాగ్రణి యాత్మరాజ్యమున నిచ్చల్ పూజ్యుఁ డాసీమఁ బా
సినఁ దా గవ్వయుఁ జేయఁ డన్నికడలన్ శ్రేష్ఠుండు విద్వాంసుఁ డా
యనకన్నం గవి మేటి యౌ “సుకవితా య ద్యస్తి రాజ్యేన కి"
మ్మను వాక్యంబు నిజంబు దీనిఁ గని కావ్యంబుల్ రచింపందగున్.

55


క.

వనితయుఁ గవితయుఁ దా నై, చనుదెంచుట గలుగునేని సరసం బగు ధా
త్రిని బల్మికోలు గావిం, చిన విరసం బగు నటంచుఁ జెప్పిరి విబుధుల్.

56

క.

ఛందోలంకారాదుల, యందలిపా ట్లెల్లఁ దుదిని వ్యర్ధము గావే
సుందరమగు వాక్యంబుల, పొం దెఱిఁగి రచించు బుద్ధి పుట్టక యున్నన్.

57


క.

విరచించు శక్తి పుట్టని, పురుషునిచదువులు ప్రకాశములు గావు వసుం
ధర దీపరహితసదనాం, తరమున రేయిఁ బడియున్న ద్రవ్యములక్రియన్.

58


తే.

ఆశుధారాకవత్వంబులందు శయ్య, లుపమ లుత్ప్రేక్షలును లేక యుండుఁ గాన
నెంత యోచించినను బద్య మంత సార, వంత మగుఁ గాన నిలుకడ వలయుఁ గృతికి.

59

దేశభాషావిశేషంబులు

మూ.సూ.

స్వస్థానవేషభాషాభిమతా స్సంతో రసప్రలుబ్ధధియః,
లోకే బహుమన్యంతె వైకృతకావ్యాని చాన్య దపహాయ.

4


మ.

నిజదేశంబులవేషభాషలపయి న్నిత్యాభిమానస్థులై
ప్రజ మెచ్చ న్రసలబ్ధబుద్ధు లగుచుం బ్రాజ్ఞుల్ స్వదేశ్యంబులే
నిజ మంచుం గొని యన్యదేశములవాని న్మెచ్చ రేపట్టునన్
గజరాజావన ప్రస్ఫుటార్థరసముల్ గా వంచు నెల్లప్పుడున్.

60


క.

తమతమబాసల కవితలు, తమతమదేశముల కొప్పిదము లగుఁ బరదే
శములకుఁ గూడ వొకింతయు, నమరోక్తులు సకలభూములందును వెలయున్.

61


క.

తలఁపఁగ సంస్కృతకావ్యం, బులు తమయర్థములు సకలభూజనములకున్
దెలిసినను దెలియకున్నను, బొలుపొందఁగ నిచ్చు నాల్గు[60]పురుషార్థంబుల్.

62


క.

హరికథ యైనను దమ క, ర్థరసానుభవంబు లేని రసవద్దేశాం
తరభాషాకావ్యంబులు, దొరకొని పఠియింప ముక్తి దొరకునె దానన్.

63


క.

ఆ యా దేశమువారికి, నా యా దేశంబుభాష నమరిన కావ్యం
బాయతపురషార్థంబులఁ, బాయక సమకూర్చు దేవభాషయపోలెన్.

64


క.

సురభాషార్థము దెలియని, తరుణులకు శూద్రులకును దమదమ సీమం
బరఁగిన మాటలఁ జెప్పిన, వరకావ్యము పఠనమున [61]కవశ్యక మయ్యెన్.

65


క.

క్షితి మ్లేచ్ఛభాష శ్రుతిగ, ర్హిత మగు న ట్లైన నా ధరిత్రిని దానిన్
మతి రోసి విడువఁగూడదు, సతతము వ్యవహారహాని సంధిలుకతనన్.

66


క.

నీతం బని దేశీయము, జాతీయంబును వచించు సమయమున నిజ
క్ష్మాతలభాషాకృతులకు, ఖ్యాతిగ మ్లేచ్చోక్తు లాదిగాఁ గూర్తు రజా.

67

ఆంధ్రకవితాపితామహుని చాటుధార

మ.

సమరక్షోణిని గృష్ణరాయల భుజాశాతాసిచేఁ బడ్డ దు
ర్దమదోర్దండ[62]బెడందకోట యవనవ్రాతంబు సప్తాశ్వమా
ర్గమునం గాంచి "శబా సహో హరి హరంగా [63]ఖూబు ఖాడాకితే
తుముకీ[64]భాయిల భాయిదేములికి" యంచు ర్మిటికిం బోవుచున్.

68

నంది తిమ్మన చాటుధార

శా.

రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్రక్రూరఖడ్గాహిచేఁ
గాయం బూడ్చి కళింగదేశనృపతుల్ "[65]కానిజ్ఝరీఫోషణీ
మాయాభీకుముటూకులోటుకుహుటామాయా[66]సడాజాహరే
మాయాగ్గేయమడే” యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్.

69

కాళహస్తిమాహాత్మ్యమునందు

సీ.

బిజ మాడుదేవర నిజకృపామహిమఁ జెన్నారునాయిల్లు బిడారు నీకు
నాకు నీ పాదార్చనము సేయ పడలింగమూర్తి సేకుఱె వచ్చి మూర్తిమాడి
యొడయచిత్తేశ నాయునికి నిమజ్జన మాడు శివార్చన మాడుబేకు
విచ్చేయుఁ డిది బూది వీడియం బందుకో జంగమస్వామి నా సదనమునకు


తే.

నోగిరంబులు మంచి మే [67]లోగిరములు, నావటించెదఁ బదుఁడు మీ [68]రారగింపఁ
బ్రతిదినంబును లింగమార్చనము లేక తనువు పడ నొల్ల రూపకందర్ప యనఁగ.

70

భాషాష్టకోత్పత్తివివరణము

తే.

భాష రెండుదెఱంగులఁ బరఁగుచుండు
సంస్కృతము ప్రాకృతము నన సంస్కృతంబు
ప్రకృతి యన నొప్పు దానికిఁ బ్రాకృతంబు
వికృతి యగుఁ దంగెడాహ్వయవిషయమున.

71


తే.

భారతీదేవిశైశవభాషితంబు, ప్రాకృతము పంచవిధ మయ్యెఁ బ్రాకృతంబు

శౌరసేనియు మాగధీసంజ్ఞికయును, గ్రమతఁ బైశాచికయు నపభ్రంశ మనఁగ.

72


క.

నామ మపభ్రంశం బని, సామాన్యముగాఁ దలంపఁ జన నది భాషా
భామాశిశుత్వభాషిత, మై మెలఁగుటచే సుశబ్ద మగు నెల్లెడలన్.

73


ఆ.

పద్మపత్రనేత్ర పైశాచికాభాష, యందు భేద మించుకంత గలిగి
సొంపు మీఱుచుండుఁ జూళిక పైశాచి, లెక్కలోనఁ దాను నొక్క టగుచు.

74


తే.

ప్రాకృతాదులు చెడి తజ్జపదము లగుచుఁ
బలుతెఱంగులఁ దనలోనఁ గలసియుండు
కతన నీ యంధ్రభాషయుఁ గవిమతంబు
నందుఁ బ్రాకృతభేదంబె యనఁగ నొప్పు.

75


క.

క్షితి భాష సంస్కృతప్రా, కృతసంజ్ఞల ద్వివిధ మయ్యె నెంచఁగఁ దత్ప్రా
కృతము వెస నేడు తెఱఁగుల, వితత మగుట నెల్ల నష్టవిధభాష లగున్.

76


తే.

సంస్కతము ప్రాకృతంబును శౌరసేని
జగతిపై మాగధియును బైశాచికయును
జూళికయు నపభ్రంశంబు సొరిది నాంధ్ర
భాషయును నివి చను నష్టభాష లనఁగ.

77


ఆ.

వరరుచిప్రణీతవాక్యంబులను బతం, జలికృతోరుభాష్యమునను వెలయు
పాణినీయసూత్రఫక్కిని జనియించు, శబ్దజాల మెల్ల సంస్కృతంబు.

78


క.

ఇలఁ ద్రివిక్రమరచితవృత్తులకు [69]హేమ, చంద్రసూరిప్రణీతభాష్యంబుచేతఁ
దనరు వాల్మీకి మూలసూత్రముసవలన, బ్రాకృతాదిషడ్భాష లుద్భవముఁ జెందె.

79


క.

తెలుఁగునకుఁ బొడము లక్షణ, ములు బాలసరస్వతిప్రముఖబుధకృతటీ
కలవలనను దెల్లంబై, చెలు వగు నీ యాంధ్రశబ్దచింతామణిచేన్.

80


సీ.

స్వర్గలోకప్రశస్తము సంస్కృతము మహారాష్ట్రదేశీయంబు ప్రాకృతంబు
శూరసేనాఖ్యఁ బ్రస్తుతి కెక్కునాటను జను లాడునదియెపో శౌరసేని
మగధదేశోక్తులు మాగధీభాష పిశాఛసంజ్ఞికములై జగతిఁ బొదలుఁ
[70]బాండ్యకేకయసాల్వబాహ్లికానూపగాంధారనేపాళకుంతలసుధేష్ణ

80


తే.

భోజకన్నోజకంబులఁ బొసఁగుమాట, లరయఁ బైశాచికాచూళికాహ్వయములు
వెస నపభ్రంశ మాభీరవిషయజాత, మాంధ్రభూమిభవం బాంధ్రమయ్యె శౌరి.

81


తే.

దేవభూసురమునిధరిత్రీతలేంద్ర, సచివకంచుకివిటవిదూషకవిరక్త
వారయోషిన్నృపామాత్యవనితలకును, జెప్పఁదగు సంస్కృతము సుధాసింధుశయన.

82

సీ.

[71]క్షపణకజైనాదికర్మహీనులకుకు భామాజకులకును బ్రాకృతంబు
క్షితి వైశ్యశూద్రప్రకృతిమధ్యమాధమజాతుల కెల్లను శౌరసేని
ధీవరలుబ్ధకాదివినీచజాతులమానవులకు నెల్ల మగధభాష
మొగిఁ బిశాచాసురముఖ్యుల కెల్లఁ బైశాచికానామభాషాద్వయంబు


తే.

పతితచండాలయవనాదిపరమనీచ, జాతినరుల కపభ్రంశ మీతెలుంగు
సీమవారికి నాంధ్రంబుఁ జెప్పవలయుఁ, గావ్యనాటకముల గోపికాభుజంగ.

83

ప్రకృతివికృతిభేదంబులు

మూ.సూ.

ఆద్యప్రకృతిఃప్రకృతిశ్చాద్యే[72]త్వేషాతయోర్భవేద్వికృతిః.


తే.

క్రమమునను సంస్కృతప్రాకృతములు రెండుఁ
బరఁగు నాద్యప్రకృతియు బ్రకృతి యనఁగ
వెలయు నీరెంటికిని [73]దెల్గు వికృతి యనఁగ
నందగోపాంగనాపుత్ర నలిననేత్ర.

84

తద్భవస్వరూపము

మూ.సూ.

కేవలతయానుసర్పత్యుభే చ యేయం యథాతథా భాషా.


తే.

ప్రకృతులను రెంట రెండు రూపముల నమరు
తద్భవములు ప్రత్యేక మాంధ్రంబు లగుచుఁ
జంద్రునకుం జందురుం డని సంస్కృతమునఁ
జందుఁ డని ప్రాకృతమున నీ చందమునను.

85


[74]ఇందుకు తెలివిడి శబ్దసూత్రము — ప్రయోగమూలం వ్యాకరణమ్.[75]

దీని అర్థము: శబ్దశాస్త్రము లోకమునందు ప్రవర్తించు ప్రయోగములే మూలముగా కలది. ఇటన్నందుచేతను వ్యాకరణశాస్త్రము లోకవ్యవహారము ననుసరించే చెప్పుచున్నది అనుట. అటు గాన లోకవ్యవహారసిద్ధములైనను తద్భవములకు లక్షణము తెలియవలెను. అది యెట్లంటేను: తెలుఁగునకు ప్రాకృతభాష ప్రకృతి అనిపించుకొనును. ఆ ప్రాకృతమునకు సంస్కృతభాష ప్రకృతి అనిపించుకొనును. అటు గనక ప్రకృతు లంటేను సంస్కృతప్రాకృతముల రెంటికిన్ని పేరు. ఆరెంటియందున్న కొన్ని తద్భవములు, ప్రత్యేకమున్ను ఒక్కొక్కదానను ఒక్కొక్కవిధమున పుట్టి రెండు రూపములనున్ను తెనుఁగులలోనూ గలసి యున్నవి. కనుక వాటి కన్నింటికిన్ని తెలిసేటట్టుగాను అందులోపల నొక చంద్రశబ్ధమునకు చెప్పుచున్నాము. సంస్కృతము నందు గల ద్విత్వాక్షరమునందు క్రిందకు జడ్డయై యుండేటి రేఫము ప్రాకృతభాషగాను పలికేటప్పుడు లోపముగాను అవును గనక ఆరేఫము లోపము గాక ప్రత్యేకమున్ను [76]ముందర ఒక యక్షరమై నిలుచుటచేతనున్న దకారముననుఁ బ్రాకృతమందు రాని కొమ్ము వచ్చుటచేతనున్ను జందురుశబ్దము శుద్ధసంస్కృతశబ్దముననే అయిన తద్భవము గాని సంస్కృతము చెడి అయిన ప్రాకృతమువలనను అయినది గాదు.

చజౌ తజ్జే ప్రాకృతే చ దంత్యావేవ న సంశయః.

టీ. తజ్జే = తద్భవమునందున్ను, ప్రాకృతే చ = ప్రాకృతమునందున్ను, చజౌ = చకారజకారములు రెండున్ను, దంత్యావేవ = దంత్యవర్ణములే అవును. తాలవ్యములు గా వనుట. సంశయః = సందేహము, న = లేదు. ఇటనే అధోక్షజఫక్కికావచనముచేతను ఇదిన్నీ సంస్కృతజాతమైన తద్భవము గనక మొదల నున్న చకారము దంత్య మయి తెలుఁగు తత్సమము చేస్తేను చందురుండు అని అయినది. ప్రాకృతమునే అయినట్లాయెనా చకారముక్రిందటి రేఫము లోప మౌను గాని, ప్రత్యేకాక్షర మై యుండదు. దకారమునకుఁ [77]బొల్లున్ను రాదు. అది యె ట్లంటేను.

ప్రాకృతవ్యాకరణసూత్రంబులు

కగచజటడతదపబమఃకఃపశో రుపర్యద్రే.


వృ.

ఉపరిస్థితానాం స్పర్శవర్గాద్యతృతీయానాం మవర్ణజిహ్వామూలీయోపధ్మానీయానాం శషసానా మేతేషాం సంయుక్తోపరివర్ణే లోపః స్యాత్ న తు ద్రశబ్దే.

టీ. ఉపరిస్థితానాం = [78]ద్విత్వాక్షరములందు మీఁదనున్నటువంటి, స్పర్శవర్గాద్యతృతీయానాం = కచటతప గజడదబలకు, మవర్ణజిహ్వామూలీయోపధ్మానీయానాం = (-ఃక-ఃప-అని-కపలకు ముం దర్ధవిసర్గసదృశము లయిన వర్ణములు జిహ్వామూలీయోపధ్మానీయంబు లనంబడు) మకారఃపఃపవర్ణములకు, శషసానాం చ = శషసలకును. లోపః = అదర్నశనము, స్యాత్ = అగును. ఇందుచేతను చంద్రశబ్దమునందు రేఫమునకు మీఁదను ఉండెడి దవర్ణమునకు లోపము వస్తేను 'నతు ద్రశబ్దే' ద్రకారము గల శబ్దమునం దైతేను లోపము లేదు. ఇటన్నందువలన దవర్ణము లోపము కాదాయెను.

సూ.

రవలా మధ శ్చ.


వృ.

అధస్స్థితానాం రవలానాం లోప స్స్యాత్.

టీ. అధస్స్థితానాం = జడ్డలు గల యక్షరములయందుఁ గ్రింద నున్నుటువంటి, రవలానాం = రేఫవకారలకారములకు మూఁటికిన్నీ, లోపః స్యాత్ = లోపమౌను. ఈసూత్రముచేతను దకారము క్రిందనున్న రేఫము లోపమైతేను చంద అని యుండెను.

సూ.

శేషాదేశస్యాహ్రోచోఖోః.


వ.

హకారరేఫవర్జిత స్యానాదేః శేషస్యాదేశస్య చాచఃపరస్య ద్విత్వం స్యాత్.

టీ. హకారరేఫవర్జితస్య = హకారమున్ను రేఫమున్ను గాక తక్కినటువంటి, అనాదేః = మొదలిది గానటువంటి, శేషస్య = లోపముకాఁగా చిక్కినదానికిన్ని, ఆదేశస్య చ = ఆదేశమైనదానికిన్ని, అచః పరస్య = అచ్చుకంటె పరమైనదానికిన్ని, ద్విత్వం = జడ్డ, స్యాత్ = అవును. ఇందువలనను హవర్ణము రవర్ణము గాదు గనకనున్ను శబ్దాద్యక్షర దకారమున్ను రేఫమున్ను సంయుక్తమైనటువంటి ద్రవర్ణమునం దధస్స్థిత మైన రేఫము లోపము కాగాను చిక్కినవి గనకనున్ను జకారముమీఁద నున్న అకార మచ్చు కనక దానిమీఁద నున్నది గనకనున్ను దకారమునకు జడ్డ వచ్చెనుగనక చంద్ద అయెను. ఇది ప్రాకృతభాష గనక మునుపు చెప్పిన యధోక్షజవచనమునను ఆది నున్న చకారము దంత్యవర్ణ మాయెను. అది తత్సమము చేస్తేను చందు డని నిలిచెను. కాబట్టి యీ మాట సంస్కృతమునఁ బుట్టిన ప్రాకృతముననే అయిన తద్భవముగాని శుద్ధసంస్కృతమున నైనది గాదు. ఈ రెండుశబ్దములున్ను ఆదిమకవిప్రయోగప్రసిద్ధములే గనక ఇటువంటివన్నిన్నీ ప్రకృతులను రెంటనున్ను రెండు విధములనూ పుట్టిన వని తెలుసుకొనేది. ఇందుకు ప్రయోగము.

నరసింహపురాణమునందు (ఆ. 3 ప. 97)

చ.

సురుచిరపానపాత్రమున సుందరి యొక్కతె కేల నిండుచం
దురుఁడు ప్రకంపితాంగములతోఁ దిలకించెఁ దదాననాంబుజ
స్ఫురితవికాసవైభవము సొంపు లడంకువ మ్రుచ్చలింపఁ జె
చ్చెరఁ జనుదెంచి కట్టుపడి చేడ్పడ భీతి వడంకు[79]చాడ్సునన్.

86

నైషధమునందు (ఆ. 1 ప. 50)

చ.

కెరలి మహాసివేమసహకృత్వరి తద్భటకోటిచాతురీ
తురి సమరాంగణంబులఁ జతుర్హవిదావరణంబులన్ యశో౽౦
బరముల [80]నేయుచుండు బహుభంగులఁ బున్నమనాఁటినిండుచం
దురునునుసోగవెన్నెలలతోఁ దులఁదూఁగెడు తద్గుణంబులన్.

87


ఆ.

తెలుఁగు లొక్కకొన్ని దేవతాభాషనె, తద్భవంబు లగుచుఁ దనరుచుండు
ధరణిఁ గొన్ని ప్రాకృకముననె యగుచుండుఁ, దెలియవలయు [81]వానితెఱఁగులెల్ల.

88


తే.

ప్రాకృతము నంటక నిలింపభాషనయ్యెఁ, దజ్జము సముద్రమునకు సంద్రం బటంచు
నాకిసద్భాష నంటక ప్రాకృతమున, నైనచో దానిని సముద్ద మనఁగ వలదె.

89

ఇందునకు తెలివిడి. కొన్ని తద్భవములు లోకమునం దాద్యప్రకృతివలననే యయినవి గాని ద్వితీయప్రకృతి నయినవి కావు. అవి యెటువంటి వంటేను : అందు లోపల సముద్రశబ్దమున కొక్కటికిఁ జెప్పుచున్నాము. మొదలిప్రకృతియందు లోప మయ్యేటిదకారము క్రిందటిరేఫము లోపము గాక నిలిచినందుచేతనున్ను, సంద్రశబ్దము ప్రథమప్రకృతి నైన తద్భవముగాని ద్వితీయప్రకృతి నైనది గాదు. అది తత్సమము చేస్తేను సంద్ర మయినది. రెండవప్రకృతినే అయితే "కగచజటడతదపబమఃకఃపశో రుపర్యద్రే" అన్నందునఁ జంద్రశబ్దమునకువలెనే సముద్రశబ్దమునందలి దకారమునకు లోషముగా వస్తేను "నతు ద్రశబ్దే” అనుటవలన లోపము రా దాయెను. "రవలానా మధశ్చ" అని మునుపు చెప్పినసూత్ర ముచేత దకారముక్రింది రేఫము లోపమైతేను సముద అని నిలిస్తేను "శేషదేశస్యా హ్రోచోఖోః" అనుదానివలనను మునుపటివలెనే దకారమునకు జడ్డ వచ్చె గనక సముద్ద యాయెను.అది తత్సమము చేస్తేను సముద్దము అని యుండవలెను. ఈమాట ఆదిమకవులు ప్రబంధములను వాడినవారు కాదు. సంద్ర మనే చెప్పుకొన్నాడు. అటుగనక నిలువంటి వెల్లా శుద్ధసంస్కృతముననైన తత్భవము లని తెలుసుకొనేది.

లక్ష్మీశబ్దమునకు

క.

నాకులభాషను ముట్టక ప్రాకృతమున లచ్చి దాఁ బరఁగు లచ్చి యనన్
నాకోక్తి యైన లక్ష్మికిఁ, బ్రాకటముగ లక్కిమి యని పలుకఁగ వలదే.

90

దీనికిం దెలివిడి. లోకమునందు తద్భవములు కొన్ని ప్రాకృతభాషవలన నైనవే కాని దేవతాభాష నైనవి గావు. అవి యె ట్లంటేను: లక్ష్మీశబ్దమునకుం జెప్పుచున్నాము.

సూ.

మనయానామ్.


వృ.

అధస్స్థితానాం మనయానాం లోప స్స్యాత్.

టీ. అధస్స్థితానాం = ద్విత్వాక్షరములయందుఁ గ్రింద నున్న, మనయానాం = మకార నకార యకారములకు, లోపః = లోపము, స్యాత్ = అగును. ఇందువలన క్షకారముక్రింద నున్నమకారమునకు లోపమయితేను లక్షీ యని యుండెను.

సూ.

క్షః


వృ.

క్షస్య ఛస్స్యాత్.

టీ. క్షస్య = క్షకారమునకు, ఛః = ఛకారము, స్యాత్ = అగును. దీనిచేత క్షకారమునకు ఛకారము వస్తే లఛి యనురూపము సిద్ధించెను. తెలుఁగునందు స్పర్శవర్గద్వితీయవర్ణములు లేవు గనక లచ్చి యని నిలిచెను. ఇది ప్రాకృతంబున నైన తద్భవము గాని, దేవభాషనైన తద్భవము గాదు. సంస్కృతమున అయితేను క్రిందనున్న మకారము ప్రత్యేకము స్పర్శవర్గద్వితీయము ముంగల నొక యక్షర మై నిలిస్తేను లక్షిమి యవును. ఆంధ్రమునందు షకారము లేదు గనుక అది లోప మై కకారమునకు ద్విత్వము వస్తేను లక్కిమి, వికల్పమున జడ్డ లోపమైతేను లకిమి యాయెను. ఈరెండువిధముల తద్భవములలోనున్ను బూర్వకవులు ప్రబంధములయందు లచ్చి యని ప్రయోగించినారు గాని లకిమి యని ప్రయోగించినవారు కారు కనక నిట్టి శబ్దము లెల్లాను ద్వితీయప్రకృతి నైనవని తెలిసేది. దీనికి బ్రయోగము —

విరాటపర్వమునందు (ఆ. 4. ప. 234)

ఉ.

వచ్చినవాఁడు పల్గునుఁ డవశ్యము గెల్తు మనంగ రాదు రా
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే
హెచ్చగుఁ గుందగున్ దొడరు టెల్లవిధంబుల కోర్చునట్లు గా
కిచ్చఁ దలంచి యొక్కమెయి నిత్తఱిఁ బొందగు [82]సేఁతయుం దగున్.

91

రామాభ్యుదయమునందు

[83](తే.

రాచపాఱునిజన్నంబుఁ గాచినాఁడు, లచ్చిపుట్టిల్లు కోలకుఁ దెచ్చినాఁడు
చాలుపేరింటితొయ్యలి నేలినాఁడు, పుడమి[84]నునుమించు ప్రొద్దువంగడమునందు.)

92


తే.

శౌరసేన్యాదిపంచభాషలును బ్రాకృ, తంబులో భేదములు గానఁ దద్భవములు
వానియందును బుట్టును వర్ణభేద, ములును బంచవిధంబులై తెలుఁగునందు.

93


తే.

శౌరసేని జూదంబు పైశాచియందు, సాన చూళిక యనియెడుదాన రాచ
కొల మపభ్రంశభాషోక్తివలన [85]మూఁగ, దనరు మాగధి జక్కులు తద్భవములు.

94

ఇందునకుఁ దెలివిడి. ద్యూతశబ్దమునకు—

సూ.

ద్యర్యోర్జః.


వృ.

ద్యకారస్య ర్యకారస్య చానయో ర్జకారాదేశ స్స్యాత్.

టీ. ద్యకారస్య = ద్య అనే అక్షరమునకు, ర్యకారస్య చ = ర్య అనే అక్షరమునకున్ను, అనయోః = ఈరెంటికిన్నీ, జకారాదేశ స్స్యాత్ = జవర్ణ మాదేశ మవును. ఇందున ద్యకారమునకు జకారము వస్తేను జూత మని యుండెను.

సూ.

దస్తస్య శౌరసేన్యా ముఖావచో స్తాః.


వృ.

అనాదే రచః పర స్యాసంయుక్తతకారస్య దః స్యా చ్ఛౌరసేన్యామ్.

టీ. అనాదేః = ముందటియక్షరము కానటువంటి, అచః పరస్య = అచ్చుకంటెం బరమైయున్న, అసంయుక్త = సంయుక్తము కానటువంటి. తకారస్య = తవర్ణమునకు, ద స్స్యాత్ = దవర్ణ మౌను, శౌరనిసేన్యాం = శౌరసేనియందు. దీనిచేత తకారమునకు దవర్ణము వస్తేను జూద మాయెను. ఇది శౌరసేనిభాష నైన తద్భవము.

ఇందునకుం బ్రయోగము

సభాపర్వమునందు (ఆ.2.183)

క.

జూద మిది యేల యుడుగుము, భేదము దమలోన బుట్టుఁ బెలుచన యుష్మ
ద్భేదమునఁ జేసి యెగ్గు, త్పాదిల్లు ధరిత్రిఁ బ్రజకు [86]భయజననంబై.

95

నైషధమునందు (ఆ.7.120)

క.

కాదంబరిఁ ద్రావింతును, జూదం బాడింతుఁ గతలఁ జొక్కులఁ బెట్టన్
బైదలుల నియోగింతును, 'వైదర్భతనూజమీఁది వల పుడిగింతున్.

96

శాణశబ్దమునకు

సూ.

శషసాః శుః.


వృ.

శషసాః శుసంజ్ఞా స్యుః.

టీ. శషసాః = శకారషకారసకారములు, శుసంజ్ఞాః = శు అనుసంజ్ఞ గలవి, స్యుః = అగును.

సూ.

శో స్సత్.


వృ.

శషసానాం సకార స్స్వా న్నిత్యమ్.

టీ. శషసానాం = శకారషకారసకారములకు, సకార స్స్యాత్ = సవర్ణ మవును, నిత్యం = నిత్యముగాను. ఈసూత్రమువలన శకారమునకు సకారము వస్తేను సాణ అని యుండెను.

సూ.

నో ణనోః పైశాచ్యామ్.


వృ.

ణకారనకారయోః నకార స్స్యాత్ పైశాచ్యామ్.

టీ. ణకారనకారయోః = ణవర్ణ నవర్ణములకు రెంటికిన్నీ, నకార స్యాత్ = నవర్ణ మవును, పైశాచ్యామ్ = పైశాచియందు. ఇప్పుడు చెప్పినదానను నవర్ణము వస్తేను సాన ఆయెను. ఇది పైశాచికభాష నైన తద్భవము.

రాజకులశబ్దమునకు

సూ.

గజడదబఘుఝఢధభాం కచటతపాః ఖఛఠథఫాః.


వృ.

స్పర్శవర్గతృతీయచతుర్థానాం తత్తత్ప్రథమద్వితీయాః క్రమేణ స్యుః.

టీ. స్పర్శవర్గతృతీయచతుర్థానాం = స్పర్శవర్గములయందు మూఁడవయక్షరములకున్ను నాలవవానికిన్నీ, తత్తత్ప్రథమ ద్వితీయాః = ఆయావర్గములయొక్క మొదలివర్ణములున్ను రెండవవర్ణములున్ను, క్రమేణ = వెంబడిగారు, స్యుః = అవును. ఈ సూత్రమున జకారమునకు చకారము వస్తేను రాచ యౌను. కులమునకు కొలము ఆయెను. అది సమము చేస్తేను రాచకొలము. ఇని చూళికాపైశాచికాభాష నైన తద్భవము.

మూకశబ్దమునకు

సూ.

అచోస్తావఖౌ కఖతథపఫాం గఘదధబభాః.


వృ.

అచః పరేషా మసంయుక్తానా మనాదీనాం - కతపవర్గ ప్రభవద్వితీయానాం తృతీయచతుర్థాః క్రమేణ స్యుః.

టీ. అచః పరేషాం = అచ్చుకంటె పరము లైనటువంటి, అసంయుక్తానాం = సంయుక్తాక్షరములు గానటువంటి, అనాదీనాం = మొదలివి గానటువంటి, కతపవర్గ ప్రథమద్వితీయానాం = కతపవర్గములయొక్క మొదలియక్షరములకున్ను, రెండవవానికిన్ని, తృతీయచతుర్థాః = తమవర్గములయందలి మూఁడవనాలవయవి, క్రమేణ = వెంబడిగాను, స్యుః = అవును. ఇది అపభ్రంశభాష నైన తద్భవము. ఇందువలనను కకారమునకు గకారము వస్తేను మూఁగ ఆయెను. ఇందుకుఁ బ్రయోగము —

సారంగధరచరిత్రమునందు (ఆ. 3.117)

చ.

తలవరు లేఁగ లేఁగఁబులితండము నెత్తుటిజొత్తుకై హలా
హలిమెయి రాఁగ ఱాఁగలయినట్టి వృకంబులు క్రొంబొదల్ రొదల్
చిలుకుచు నీఁగ నీఁగలును జీమలు దొంతరలై పయిం బయిం
బిలబిల [87]మూగ మూఁగవలె బెగ్గిలి పల్కఁగ లేక వేదనన్.

97

యక్షశబ్దమునకు

సూ.

ఆదే ర్యో జః


వృ.

ఆదే ర్యస్య జ స్స్యాత్.

టీ. ఆదేః = శబ్దాది నుండేటటువంటి, యః = యకారమునకు, జః = జకారము, స్యాత్ = అవును. దీనను మొదలి యకారమునకు జకారము వస్తేను జక్షః అని యుండెను.

సూ.

క్షః


వృ.

క్ష ఇత్యస్య జిహ్వామూలీయః స్యాత్.

టీ. క్ష ఇత్యస్య = క్ష అనేటటువంటి అక్షరమునకు, జిహ్వామూలీయః = జిహ్వామూలీయము, స్యాత్ = అగును. పాణినీయవ్యాకరణమునందు 'ఃక ఇతి జిహ్వామూలీయః' అన్నందుచేతను, జిహ్వామూలీయ మనఁగాను దాపలివిసర్గము గల [88]కకారమునకు బేరు గాన ఃక అనునదిరాఁగా జఃక యని నిలిచెను. మునుపు చెప్పిన అధోక్షజఫక్కికావచనమువలన తాజాక్షరము దంత్యాక్షర మాయెను. ఆంధ్రమునందు విసర్జనీయము లేదు గనక అది లోపమైతేను జక్క అని యుండె; అది తత్సమము చేస్తేను జక్కులు ఆయెను. ఇది మాగధీభాషనైన తద్భవము.

సీ.

కుక్క [89]గోలెం బోలి కూళ గుండము కంతి గుజ్జు కరాటంబు గజ్జి కట్టె
సిక చేఁత చిక్కంబు చిన్నె సింగము సెజ్జ లక్క లచ్చన సుద్ది లయ్య లాగు
ప్రోడ పొత్తము పోఁక పుడమి బన్నము బూది బీరంబు బికిరంబు పిట్టు పుటము
వదినె వెన్నుఁడు వంక వడుగు వీడెము వన్నె రక్కసి రవణంబు రిక్క పగ్గె


తే.

పీఁట దయ్యము తోరంబు పెట్టె మట్టి
బత్తి జతనంబు జాతర ముత్తియంబు
దాది కుప్పస మిటికె నిద్దంబు పెరిమె
యివము దెస డిగ్గి యనఁగఁ దద్భవము లయ్యె.

98

దీనికి వివరము — కుర్కురశబ్దమునకు కుక్క, గోళశబ్దమునకు గోలెము, [90]ఆలిశబ్దమునకు ఓలి, క్రూరశబ్దమునకు కూళ, కుండశబ్దమునకు గుండము, గ్రంథిశబ్దమునకు కంతి, కుబ్జశబ్దమునకు గుజ్జు, కరండశబ్దమునకు కరాటము, ఖర్జూశబ్దమునకు గజ్జి, కాష్ఠశబ్దమునకు కట్టె, శిఖాశబ్దమునకు సిక, చేష్టాశబ్దమునకు చేఁత, శిక్యశబ్దమునకు చిక్కము, చిహ్నశబ్దమునకు చిన్నె, సింహశబ్దమునకు సింగము, శయ్యకు సెజ్జ, లాక్షకు లక్క, లాంఛనకు లచ్చన, సూక్తికి సుద్ది, లంజకు లయ్య, లంఘకు లాగు, ప్రౌఢకు ప్రోడ, పుస్తకమునకు పొత్తము, పూగకు పోఁక, పృథివికి పుడమి, భగ్నమునకు బన్నము, భూతిక బూది, వీరశబ్దమునకు బీరము, భిక్షకు బికిరము, పిష్టమునకు పిట్టు, స్ఫుటకు పుటము, వధూనికి వదినె, విష్ణునకు వెన్నుఁడు, వక్రమునకు వంక, వటునకు వడుగు, వీటికి విడ్డెము, వర్ణమునకు వన్నె, రక్షశ్శబ్దమునకు రక్కసి, రమ్యకు రవణము, ఋక్షమునకు రిక్క, ప్రజ్ఞకు పగ్గె, విష్టరమునకు పీఁట, దైవమునకు దయ్యము, స్థూలమునకు తోరము - దూలము, పేటికి పెట్టి, మృత్తికకు మట్టి, భక్తికి బత్తి, యత్నశబ్దమునకు జతనము, యాత్రకు జాతర, మౌక్తికమునకు ముత్తి యము, ధాత్రికి దాది, కూర్పాసమునకు కుప్పసము, ఇష్టికకు ఇటిక, స్నిగ్ధకు నిద్దము, ప్రేమకు పెరిమె, హిమమునకు ఇవము.

సూ.

వాస్యా త్క్వచి ద్వకారో నాదిగత స్యాద్యవర్గసరళస్య.

అనియెడు నీ యాంధ్రశబ్దచింతామణి సూత్రమువలనఁ గకారమునకు వకారము వస్తేను ఇవ మని యనవచ్చు. దిశకు దెస, దీర్ఘకకు డిగ్గి. ఇట్టివి లోకంబున ననేకములు గలిగి యుండు నవి యెల్లఁ బ్రాకృతవ్యాకరణమువలనను సంస్కృతాదిభాషాప్తకంబున నుద్బవించి తద్భవముల వెలయు తెలుఁగుపలుకు లని తెలియవలయు.

త్రిలింగశబ్దతద్భవము

క.

శ్రీక్షితిధరకాళేశ, ద్రాక్షారామంబు లనఁగఁ దనరారెడు నీ
త్రిక్షేత్రంబులలింగము, లీ[91]క్షింపఁ ద్రిలింగసంజ్ఞ నెన్నిక కెక్కున్.

99


తే.

తత్త్రిలింగనివాసమై తనరుకతన
నాంధ్రదేశంబు దాఁ ద్రిలింగాఖ్య మయ్యెఁ
దెలుఁ గగుచుఁ దద్భవము దానివలనఁ బొడమె
[92]వెనుకఁ గొందఱు దానినే తెనుఁగు నండ్రు.

100

ఆంధ్రభాషాభేదచతుష్టయము

మూ.సూ.

తజ్జా సమా చదేశ్యా గ్రామ్యా చేయం చతుర్విథా భవతి.


తే.

దైత్యదమన తత్సమమనఁ దద్భవమన
దేశ్యమన గ్రామ్యభామ నాఁ దెనుఁగు నాల్గు
[93]విధము లందుఁ దత్సమమును విడిచి మూఁడు
నాంధ్రములె యెందు నందు గ్రామ్యంబు [94]దిరుగు.

101

తజ్జలక్షణము

మూ.సూ.

ప్రకృతిద్వయజా తజ్జా.

9


తే.

[95]వఱలు సిద్ధాక్షరములలో వర్ణసమితి, దూలఁ బోఁ
బల్క నర్ధంబు [96]దొడరుకొనుచు
సంస్కృతప్రాకృతాఖ్యభాషాద్వయమున, నుద్భవించిన తెలుఁగులు తద్భవములు.

102

తత్సమలక్షణము

మూ.సూ.

తుల్యా తు సమా.

10


క.

తెనుఁగువిభక్తుల కడపలఁ, దనరారఁగ నిలుప సంస్కృతప్రాకృతముల్
గనుపట్టుఁ దత్సమము లన, వనజాక్షుఁడు జముఁడు దనుజవరులకు ననఁగన్.

103

దేశ్యలక్షణములు

మూ.సూ.

ప్రవాహినీ దేశ్యా.

11


క.

ఏదేశము మానవులకు, నా దేశముభాష, దేశ్య మయ్యె గరుత్మ
త్సాది జనవ్యవహారము, చే దాని నెఱింగి కృతులు జెప్పఁగ నొప్పున్.

104

ఆంధ్రదేశ్యభేదంబులు

క.

జలశయన యాంధ్రదేశ్యం,బులు రెండు దెఱంగు లయ్యె భువి శుద్ధాంధ్రం
బులు నన్యదేశజాంధ్రం, బులు నాఁ గామెపలినామపురవరధామా.

105


తే.

ఆంధ్రదేశపురస్థాయు లైకసకల, జనములకును మఱుంగుదేశంబు లేక
తేటతెల్లమిగాఁ బల్కుమాట లెల్ల, నవని శుద్ధాంధ్రదేశ్యము లనఁగఁబడును.

106


క.

పాలును బెరుఁగును నెయ్యిని, వాలాయం బుట్టిఁ బట్టి వంచుక త్రాగెన్
ఱో లెక్కుక నీబిడ్డఁడు, [97]జోలి యిఁకేమున్నదన్న శుద్ధాంధ్రంబుల్.

107


క.

కేశవ యాంధ్రులు నానా, దేశంబులయందు నిలిచి తెలుఁగులె తత్త
ద్దేశోక్తు లంటఁ బలికిన, నా శబ్ధము లన్యదేశజాంధ్రము లయ్యెన్.

108


సీ.

ఆలంబు చివ్వ కయ్యము పోరు బవరంబు దుర మని యొంటరి దొమ్మి కలను
వెలఁది యింతి పడంతి యెలనాగ చెల్లి బోటి పొలఁతి తొయ్యలి నాతి మెలత నెలఁత
మేను వేసవి మోవి గౌను డెందం బక్కు వీను లుల్లము కేలు వెన్ను నొసలు
వావిరి యేడ్తెఱ వఱలుట కొఱలుట నలి నొగి మొఁగి బర్వి నలువు పొలుపు


తే.

నెల తునుక వాఁక వలవంత నెమ్మి నెఱక, లారజము సోయగము గొనయంబు చిలువ
[98]పొల్ల చెచ్చెర మక్కువ తెల్లమి యనఁ, దనరు నిటు లన్యదేశజాంధ్రములు పెక్కు.

109


క.

నెలకొను సంస్కృతతత్సమ, ములు దొరలక తజ్ఙదేశ్యముల మూఁటను సం
ధిని కేవలాంధ్రములు నా, నలరుఁ గృతుల నచ్చతెనుఁగు లండ్రు తెలుఁగునన్.

110


క.

తెలుఁగుమఱుంగులు ప్రాఁదెనుఁ, గులు తద్భవదేశ్యములును గూర్చి మృదుపదం
బులు గాఁగ నచ్చతెనుఁగులు, మెలకువతోఁ జెప్పఁ దగు శమిప్రాంతగృహా.

111


తే.

అబ్ధిమేఖల కుదయించినట్టి సీతఁ
జేకొనియె రాఘవుం డని చెప్పుచోటఁ
గడలిమొలనూలిచేడియ గనిన పడుచుఁ
దెచ్చుకొనె రాముఁ డనఁగను దెనుఁగు[99]మఱుఁగు.

112

క.

తొల్లింటిజనులవాక్యము, లెల్లను బ్రాఁదెనుఁగు లయ్యె నిప్పటివారల్
చెల్లుబడి నాడునవియే, [100]దెల్లమిగా నింకఁ బ్రాఁతతెలుఁగులఁ నృహరీ.

113


క.

పుడమియు సిరియును బడఁతులు, వెడవిలుతుఁడు పసిఁడికడుపువేల్పును గొడుకుల్
గడలి విడిమనట్టు పాపల, నడుచు [101]గుఱముసామి కనఁగ నచ్చతెనుంగుల్.

114

పూర్వకవిసమయసిద్ధపదంబులు

మూ.సూ.

సిద్ధిర్లోకాద్దృశ్యా లోకోఽనన్యాదృశశ్చ నిత్యశ్చ.

12


క.

కవులకు దేశ్యము లోక, వ్యవహారమువలనఁ దెలియనగు నా లోక
వ్యవహారము నిత్యంబును, భువి నిజదేశమున యోగ్యమును నగుఁ గృష్ణా.

115


తే.

అవనియందు లోకవ్యవహార మనఁగ, నాత్మదేశంబులను బెద్ద లైనవార
లాడు భాషావిశేషవాక్యములలోన, [102]వాడుకకు వచ్చునవి దుగ్ధవార్ధిశయన.

116


వ.

అవి యెయ్యవి యనిన.

117


సీ.

మదిరాక్షిచెవులు తొమ్మిదిలెక్క లనరాదు ముద్దియకనులు తమ్ము లనరాదు
శుకవాణిబుగ్గలు ముకురంబు లనరాదు చెలిపండ్లు మల్లెమొగ్గ లనరాదు
గజయానచండ్లు బంగరుకుండ లనరాదు సతిబొడ్డు సుడిని మెచ్చ దనరాదు
సరసిజాననముడ్డి సైకతం బనరాదు హరిమధ్యకా ళ్ళిగు ళ్లనఁగరాదు


తే.

క్రమత వీనికి వీనులు కన్నుదోయి
చెక్కులును బలువరుసలు నిక్కుఁజన్నుఁ
గవయుఁ బొక్కిలి పిఱుఁదు చొక్కంపుటడుగు
లనుచు మును వాడి రవియ చేకొనఁగవలయు.

118


తే.

రణము [103]వర్ణించుచో వీరరసమునందు
యుద్ధపంచకమునఁ దిక్కయొజ్జ సారెఁ
గా ళ్లటంచు రచించుట గాంచి కవులు
చెప్పుకొనిరి మీఁగాళ్లని చెలఁగి కృతుల.

119

సారంగధరచరిత్రమునందు సీసపాదము (1.120)

సీ.

ఉమ్మెత్తపువ్వు నా [104]నొరపైనకుచ్చిళ్లు [105]చెలఁగి మీఁగాళ్లపైఁ జిందులాడ

గ్రామ్యపదలక్షణము

మూ.సూ.

సంస్కారార్థో నియమోఽనియమాద్ద్రామ్యం హి యత్త్వపభ్రంశః


తే.

ఉక్తలక్షణవంతమై యుండునట్టి, కావ్యముల [106]నెర్గవలయు సంస్కార మనుచు
హీనలక్షణకావ్యంబు నెఱుఁగవలయు, గ్రామ్య మనుచు నపభ్రంశకంబు ననుచు.

120


క.

లక్షణవిరహితకావ్యము, పక్షిగమన గ్రామ్య మనఁగఁబడు నది పెద్దల్
వీక్షింపరు లక్షణయుత, మీ క్షితి నగ్రామ్య మని గ్రహింతురు ప్రీతిన్.

121


తే.

క్షితి నపభ్రంశపదములు కృతులయందుఁ, గమలలోచన చెప్ప నర్హములు గావు
గాన నాంధ్రకవీంద్రుల వానిఁ దెలియ, వలయు నీశాస్త్రమునఁ దమ తలపు నిలిపి.

122


తే.

చులుకఁగా గ్రామ్యజనములు పలుకునట్టి, తెనుఁగుమాటలు గ్రామ్యంబు లనఁగబడియె
వర్ణలోపంబు నొంది కావ్యములఁ జొరవు,పరులఁ దెగడెడుచో నొప్పుఁ బాలదొంగ.

123


తే.

అక్షరలోపమై యండునట్టి పలురు, గ్రామ్య మన నొప్పు నదె యపభ్రంశకంబు
ననఁగఁబడు ధాత్రి నాకడ కాడ యనుచు, నడుమ నున్నకకారంబు నుడువకున్న.

124


క.

వస్తాఁడా హరి సొమ్ములు, దెస్తాఁడా గొల్ల [107]డంట దిట్టక కరుణన్
జూస్తాఁడా కౌఁగిలి నేఁ, డిస్తాఁడా చెప్పు మన్న నివి గ్రామ్యోక్తుల్.

125

అగ్రామ్యపదలక్షణము

మూ.సూ.

విరాళాన్ పేచోషాదికశబ్దాన్ [108]ప్రవ్యాహరన్తు శబ్దజ్ఞాః,
ఇహ తు ప్రవ్యాహార్యం సఙ్కేతితసుప్రసిద్ధ మేవ పదమ్.


సీ.

ధరణిపైఁ బుట్టి మధ్యమపురుషంబున బహువచనంబునఁ బరఁగుచుండ
నట్టిపేచోషశబ్దాదులు కడు ప్రసిద్ధంబు లగు నైన శేషశయన
వేదంబునందు వావిరిఁ బ్రయోగంబులు [109]గలవు నవార్తికంబులును "నోఽధ
నాస్త్యప్రయుక్త" యటంచు మహాభాష్యమునఁ బతంజలి యుక్తములె యటంచుఁ

తే.

బలుకుటను సంస్కృతమున శబ్దజ్ఞు లప్ర, సిద్ధశబ్దంబులను గూర్చి చెప్పుచుందు
రాంధ్రమున సుప్రసిద్ధంబులైన పూర్వ, కవిసమయసిద్ధపదములుగాని చొరవు.

126


వ.

పేద యన్నందుకు ధాతువు 'డుపచష్సాకే' యననది. 'ఊష' యన్నందుకు ధాతువు
'వస నివాసే' యనునది.

127


తే.

గ్రామ్యమైన నాంధ్రకవులు సంకేతిక, సుప్రసిద్ధ
మనుచు సూత్రమునను
గలిమిఁ బూర్వసుకవికావ్యోక్తములు ప్రసి, ద్ధంబు లైనఁ గూర్పఁదలఁతు [110]రెపుడు.

128


వ.

అది యె ట్లనినఁ గనియె ననవలసిన భూతార్థక్రియాపదైకవచనంబునందు వర్ణ
లోపము చేసి కనెనఁట యని గ్రామ్యపదముగా వాగనుశాసనులు ప్రయోగించినారు
గనుక నది సాధనము చేసికొని యాంధ్రకవితాపితామహుఁడు కొనెయె ననుటకుఁ
గొనె నని చెప్పె నవి యెవ్వి యనిన.

129

ఆదిపర్వమునందు

క.

[111]వనకన్యకయఁట నేనఁట, వనమున గాంధర్వమున వివాహంబఁట నం
దనుఁ గనెనఁట మఱచితినఁట, వినఁగూడునె యిట్టిభంగి విపరీతోక్తుల్.

130

[112]విష్ణుచిత్తీయమునందు

ఉ.

పూని ముకుందునాజ్ఞఁ గనుబొమ్మనె [113]కాంచి యజాండభాండముల్
వానను మీఁదఁ బోవ [114]నడువంగొనె ద న్నన నగ్రనిశ్చల
త్వానచలత్వనిష్ఠలె సమస్తజగంబులజాడ్యచేతనల్
గా నుతికెక్కు సైన్యపతికాంచనవేత్రము నాశ్రయించెదన్.

131

కందగీతిగర్భచంపకమాల

చ.

నరహరి కేశవా వనజనాభ రమాధవ వంశహస్త బం
ధురసుగుణాకరా దురితదూర జనార్ధన దోర్బలాఢ్య గీ
ర్వర గిరిశస్తుజౌ మురహరా సురపూజీతముఖ్యపాద సుం
దరపురుషాగ్రణీ భుజగతల్ప శచీపతిపుత్రరక్షణా.

132

గర్భకందము

క.

హరి కేశవా వనజనా, భ రమాధవ వంశహస్త బంధురసుగుణా
గిరిశస్తుతా మురహరా, సురపూజితముఖ్యపాద సుందరపురుషా.

133

గర్భగీతము

తే.

వనజనాభ రమాధవ వంశహస్త, దురితదూర జనార్థన దోర్బలాఢ్య
మురహరా సురపూజితముఖ్యపాద, భుజగతల్ప శచీపతిపుత్రరక్ష.

134

ఆశ్వాసాంతగద్యము

ఇది శ్రీమదాపస్తంబసూత్ర, భారద్వాజగోత్ర, కామెపల్లీపురమందిర, నందనందన
చరణారవిందవందనాభిలాషమనీషాప్రాభవ, వెంగనార్యతనూభవ, విద్యావిశేషసురా
చార్య, కాకనూర్యప్పకవివర్యవిరచితంబైన యాంధ్రశబ్దచింతామణియను నాంధ్ర
వ్యాకరణశాస్త్రంబునందు గోవింద, కౌస్తుభ, వైజయంతీ, శ్రీవత్స, మురళీ, పంచా
యుధ, పీతాంబర, బర్హిబర్హ, లక్ష్మీ, క్షమా, నంత, గరుడ, విష్వక్సేన, మారుతి,
పరమభాగవత, విధాతృ, శారదా, శివ, భవానీ, గణేశ, గుహ, లోకాపాల, గ్రహ,
పురాతన వర్తమాన భావికవిగురునమస్కారంబును, స్వప్నప్రకారంబును, భగవ
ద్వాక్యంబును, గ్రంథప్రభావంబును, గర్తృవంశావతారంబును, గవివిచారంబును,
షష్ఠ్యంతములును, మూలసూత్రంబులును, బూర్వగ్రంథనామసంగ్రహంబును,
బ్రబంధమహిమయు, గావ్యభేదంబులును, శబ్దార్థలక్షణాలంకారదోషంబులును,
వాక్యలక్షణంబును, రసవివేకంబును, పంచవిధభావంబులుకు, శృంగారరసస్వరూపం
బును, అష్టరసప్రపంచంబుడు, నాయకనిర్ణయంబును, సుకవిమాహాత్మ్యంబును,
దల్లక్షణంబును, సప్తవిధకవులును, గుకవినిరసనంబును, గవితాప్రశంశయు, దేశ
భాషావిశేషంబులును, భాషాష్టకోత్పత్తివివరణంబులును, బ్రకృతివికృతిభేదంబు
లును, దద్భవంబులును, ఆంధ్రభాషాభేదచతుష్టయంబును, బూర్వకవిసమయసిద్ధ
పదంబులును, గ్రామ్యాగ్రామ్యంబులును గల భాషాపరిచ్ఛేదం బను ప్రథమాశ్వాసము.

—————

  1. శబ్దార్థౌ
  2. కృతికి (సూ)
  3. ఇది (సూ)లో లేదు.
  4. అనంతునిఛందమునకే ఛందోదర్పణ మని పేరు. ఈఛందోదర్పణము అనంతునికృతి కాదు; తాతంభట్టప్రణీత మని శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు అనంతునిఛందము పీఠికలోఁ దెల్పియున్నారు.
  5. వాదీంద్ర వాదాంగ - అని యితర లక్షణగ్రంథములు (రా).
  6. ఇందు నగాగమములేమి లక్షణవిరుద్ధము - 'తెనుఁగున కవశ్య మియ్యది దీనిఁ
    జదివి' అని సవరింపనగు (రా)
  7. వరిని గలసి (సూ)
  8. సురలన్ (గి)
  9. హరిణ = శ్వేత. హరిణరోగము = శ్వేతరోగము.
  10. హర్షణుండు (సూ)
  11. నాద్యులు (సూ)
  12. మఱి (సూ)
  13. వివరింప (సూ)
  14. మృష్టంబు (ఓ)
  15. రససం (సూ)
  16. పంచాశ త్తెట్టి దనిన (గి), పంచాదశల (సూ).
  17. పంచాదశాఖ్య (సూ)
  18. రెండు (వా,పె), మొదల (ప)
  19. యుక్తసర్వార్థ (పె), యుక్తశబ్దార్థ (ఓ)
  20. నాలుగురీతు (సూ)
  21. ఫణితి
  22. *ఈశబ్దము కావ్యగుణవాచకమైనయప్పుడు "మాధుర్య" అని యుండదగు. అట్లున్నచో ఛందోభంగము. "ధర్మ దర్మిణో రభేదః" అను న్యాయము రసవాచకమైన యప్పుడే చెల్లును. ఇచ్చట చెల్లదు. (గి). మధురసౌకర్య (సూ).
  23. నుడుగంగ
  24. వర్ణంబు లభికష్ట (సూ)
  25. క్షురి (సూ)
  26. శ్లిష్టంబు (సూ)
  27. సతత్ప్రకర్షణంబు, నధికపదంబు, సమాప్తపునరాత్తంబు (గి) ఇందు గణభంగము; కాన సపరింపబడినది (రా).
  28. ప్రయోజక (సూ)
  29. ఁజెప్ప (పె)
  30. విందు (పె)
  31. మశ్లిష్టా (సూ)
  32. నాస్పదం బై (పె)
  33. గలుగు నాజ్ఞాన (సూ)
  34. నడర (వా,పె)
  35. వ్యభిచార (సూ)
  36. వైస్పర్శ్య (సూ)
  37. వెనక (ప,వా,పె) ఇట్లే ఈమాట వ్రాఁతపుస్తకములో నున్నది.
  38. భణితి
  39. వింశతిగీతముల్ (అచ్చుప్రతి)
  40. ప్రకృతి
  41. ద్వాదశీదశ (సూ)
  42. యూడిగె (వా,పె )
  43. వెనక (స,వా,పె)
  44. శోకమున నయ్యె (సూ)
  45. జలజ (సూ)
  46. నెపుడు (సూ)
  47. జడవాలు (పె), పడిహారి (వా), దళవాయి (స), బడివారి (ఓ)
  48. పురుషార్థములను దా
  49. ద్విప్రకారంబులై తేజరిల్లు (పూ.ము.)
  50. లాఱ్గురు (పూ.ము. గి)
  51. శబ్దగ్రంథాదిసంబంధ మున్నపుడు విస్తర మనవలె, విస్తార మనరాదు. కాన గ్రంథవిస్తరశంక యని యుండ నగు; అట్లున్న గణభంగ మగును, శబ్దసంబంధమున విస్తార మను శబ్దమును సయితము కవులు ప్రయోగించియున్నారు. (రా)
  52. నుడుగు (సూ)
  53. డతనిఁ గవి
  54. సమాహ్వయుఁడును నాఁగ (సూ)
  55. వెతకి (సూ)
  56. పొల్లల (సూ)
  57. గర్వమతులు యోగ్యః పురుషో నాస్తి (సూ)
  58. వ్యాసో (ప్రా.ము.)
  59. అవశ్యకము - అనురూపము అసాధువు. చార మవశ్యం బని - అని సవరింపజను (రా). అవశ్యమ్మని (సూ)
  60. పురుషార్థములన్ (సూ)
  61. "కవశ్యంబయ్యెన్" అని సవరింపఁజనును. (రా)
  62. పుళిందకోటి (సూ)
  63. ఖూజు ఖోదాతెతే (ప); ఖూబు ఖోడాకెతే (వా); ఖూబు ఖోడాకెతే (పె)
  64. బాయబాయిదెమలికి (సూ)
  65. కానీఝరీపోషణీ, మాయాభీకుముటూకులోటుకుహుటూమాయాసటాజాహరే, మాయాగ్గేయమటా(వా); కానీఝరీపోషణా, మాయాభీకుముమీకులోమికుహుమీ మాయాపటాశాహరే,మాయాగ్గేయమడే (ప); కానీఝరీఫోపణీ, మాయాభీకుముటూకుటోటికుహుటీ మాయాసటాదోహరే, మాయాగ్గేయమటా (పె)
  66. సటా (సూ)
  67. లోగిరమున (సూ)
  68. రారగించ (పె)
  69. సోమ (సూ)
  70. బాండ్యకేకయహైవబాహ్లిసుహ్వగాంధార
  71. క్షపణజైనాదిక (సూ)
  72. 13-వ పేజీలో ఈశ్లోకక్రమము మాఱియున్నది. ప్రకృతిశ్చాద్యే ఏషా తయోర్వికృతిః. (సూ)
  73. దెన్గు
  74. దీనికి శబ్దసూత్రము (సూ)
  75. వృత్తి (సూ)
  76. ముంగల (వా)
  77. బొల్లును (గి)
  78. మీఁదనున్న ద్విత్వాక్షరములందు(గి)
  79. కైవడిన్ (పె)
  80. నేచు (ప,పె)
  81. దాని (వా,పె)
  82. నింతయు (సూ)
  83. ఈపద్యము పూర్వముద్రణలలో నెల్లఁ గుండలీకృతమై యున్నది. ఇది రామాభ్యుదయమునఁ గానరాదు. (రా)
  84. నన
  85. మూగ (సూ ప్రతిలో అరసున్న లేదు); ఇటీవల నాచూచిన యొక తాళపత్రప్రతి (శివ)లో 'మూUగ' అనురీతి వ్రాయబడియున్నది (రా). ఈ ప్రతిలో అరసున్న 'U'ఈరీతిగా వ్రాయఁబడియున్నది.
  86. భయజనకం బై (పె)
  87. మూఁగ మూఁగవలె (సూ). రెంటియందును అర్ధబిందుచిహ్నము శివప్రతిలోఁ గలదు (రా).
  88. కకారమునకు దాపలనున్న యర్ధవిసర్గమునకు జిహ్వామూలీయ మని సంజ్ఞ కాని అట్టి కకారమునకు గాదు. (పూ.ము.)
  89. గోలెము బవి (సూ)
  90. అవి శబ్దమునకు బవి (సూ). బవిశబ్దము నిఘంటులలోఁ గానరాదు (రా).
  91. క్షితిని (ప); క్షమను (పె,వా)
  92. వెనక (పె,వా)
  93. విధములగు నందుఁ దత్సమ విడిచి (సూ)
  94. దిగును (ప); దిగుడు (పె,వా)
  95. వరస
  96. దోఁపు (ప,పె)
  97. జోలెడి దేమమ్మ యనఁగ (సూ)
  98. యెల్లి (ప), యెల్ల (వా)
  99. లమరు (పె)
  100. దెల్లమిగా నెంతఁ బ్రాఁతతెనుఁగులు నృహరీ (నా); దెల్లమిగా వింక బ్రాఁతతెనుఁగులకు హరీ (ప)
  101. గుతురు (పె)
  102. వాడికకు (ప,వా,పె)
  103. వర్ణింపుచో (వా)
  104. నొకటై (ప), నొరవైన (పె)
  105. చెలికి (ప,వా,పె)
  106. 'నెఱుఁగవలయు' (పూ.ము.) వ్రాఁతఅచ్చుప్రతుడుల నటులున్నను పైరీతి స్వల్పమైన సవరణతో గణభంగదోషమును సవరించినాను. 'చూచి కాకెఱ్గవచ్చునె సుద్దఱాత' నన్ని-కుమా. ప్ర. యుక్తలక్షణ...కావ్యము నెఱుగవలయు (శివ).
  107. దండు (ప); దంట (వా,పె)
  108. ప్రత్యాహరన్తు—ప్రత్యాహార్యం (ప)
  109. గలవు గావున వార్తికంబునొద్ద "నాస్త్యప్రయుక్త" (ప), గలవు నవార్తికంబులును "నోఽధనస్తుప్రయుక్త" (వా)
  110. రెదను (వా); రెలమి (పె)
  111. ఈపద్యము పినవీరభద్రుని శృంగారశాకుంతలము(3 ఆ. 114 ప.)నందుఁ గనఁబడును గాని ఆదిపర్వమునందుఁ గనఁబడదు.
  112. ఇది ఆముక్తమాల్యదకు నామాంతరము (రా)
  113. దాల్చి (పె)
  114. తే. నడవం (ప,వా,పె)