Jump to content

అప్పకవీయము/వర్ణపరిచ్ఛేదము

వికీసోర్స్ నుండి

వర్ణపరిచ్ఛేదము

ద్వితీయాశ్వాసము



మహితకొండవీటీ
నామకరమ్యగిరిదుర్గనగరాభిమత
ల్లీమకరవాహనహరి
ద్భూమిస్థితకామెపల్లిపురవరశరణా.

1


క.

అవధారు శబ్దశాసనుఁ, డవని గలియుగమున కాది నా రాజమహేం
ద్రవరంబునఁ జెప్పిన యాం, ధ్రవచోవ్యాకరణసూత్రతతిఁ దెనుఁగింతున్.

2


క.

శిష్టార్యావింశతి వి, స్పష్టముగా నక్షరప్రపంచము లోకో
త్కృష్టుఁడు నన్నయ సుకవుల, కిష్టాపత్తిగ వచించె నెంతయుఁ బ్రీతిన్.

3

వర్ణపరిచ్ఛేదమూలసూత్రంబులు

ఆర్యావృత్తశ్లోకంబులు

ప్రాణా స్సమాసతో౽చో బిందు రనుస్వార ఏ జథో వక్రః,
వక్రతమ ఐజ్ఝల స్స్యు స్సమాసతః ప్రాణినో ద్రుతాఖ్యో నః.

1


కచటతపాః పరుషాఖ్యా గజడదబా స్తు సరళాః స్థిరా ఇతరే,
ఏతా స్సంజ్ఞా స్సర్వా జ్ఞాత్వా పశ్చా త్ప్రవర్తయే దత్ర.

2


బాలేందుపరిధిశృంగావర్తకుశగ్రంథిదాత్రపరశుసమాః,
ఆద్యా ఇభకరతుల్యా స్తదీర్ఘా శ్శూలసన్నిభా వన్యౌ.

3


సిద్ధ స్సాధ్య శ్చానుస్వారః పూర్ణార్థభేదతో ద్వివిధః,
హ్రస్వా త్పూర్ణో౽పి భవే ద్ధీర్ఘా చ్చే త్ఖండ ఏవ స జ్ఞేయః.

4


ధరశార్ఙ్గపిప్పలధళాంకుశపన్నగసన్నిభాః క్రమా త్పరుషాః,
స్తంభవిరేఖాధిక్యై స్త ఏవ వర్గద్వైతీయవర్ణాద్యాః.

5

[1]కీరతరిహస్తిమస్తకశుక్తితులాసనవితర్దిసీరసమాః,
అంతస్థా శ్చోష్మాణో దంత్య చజౌ గురురలౌ చ బిందుయుతౌ.

6


ఆద్యాయాః పఞ్చాశ ద్వర్ణాః ప్రకృతేస్తు తే దశోనాః స్స్యుః,
సప్తత్రింశ దిహాన్యే చానుప్రవిశంతి శబ్దయోగవశాత్.

7


ద్వివిధా దిదుదేదో తోచో వక్రతమా వనుస్వారౌ,
కగచజయుగటడణతదన పబమయరయుగలయుగవసహాశ్య హలః.

8


వికృతిపదాదౌ ప్రథమాన్తస్థ తృతీయానునాసికౌ నస్తః,
అయిగవుగాదేశౌస్తః క్రమేణ సర్వత్ర వక్రతమయో ర్వా.

9


వా స్యా త్క్వచి ద్వకారో నాదిగత స్యాద్యవర్గసరళస్య,
అ ద్దన్త్యస్తాలవ్య శ్చు ర్వక్రః స్యా న్మిథ స్సవర్ణశ్చ

10


లఘవోఽలఘవశ్చేతి ద్వేథా న్తస్థా న్విదన్తి శాస్తారః,
అన్యేఽన్య వ్యాకరణస్పష్టా రస్త్వత్ర గృహ్యతే ద్వివిధః.

11


ఆద్యః క్రియాసు [2]భూతాద్యర్ధసముద్యోదితం వినా సర్వః,
యశ్రుతి మార్యా లఘుయం ప్రవదన్తి ప్రాణతః పరం ప్రాణమ్.

12


క్వచిదపి న స్త ఉదోతౌ దంతోష్ఠభవస్య వికృతి శబ్దాదౌ,
నాన్యేషాం వైధర్మ్యం లఘ్వలఘూనాం రయోస్తు నిత్యం స్యాత్.

13


శుభవర్ణా శ్శుభశబ్దా యే చ శుభగణా స్త ఏవ కావ్యాదౌ,
గ్రాహ్యాః పురాస్త్రరసగిరిరుద్రేష్వ[3]కచటహమాతృకా నింద్యాః.

14


[4]

ఆద్యో వళి ర్ద్వితీయో వర్ణః ప్రాసో౽త్ర పాదపాదేషు,
స్వస్వచరణేషు పూర్వః ప్రాస స్సర్వేషు చైక ఏవ స్యాత్.

15


వృత్తం జాతి శ్చేతి ద్వివిధం పద్యం గణై ర్నిసర్గాఖ్యైః,
సంబద్ధం వృత్తం స్యా దుపగణమాత్రాభి రన్వితా జాతిః.

16


శాస్తార ఏకమాత్రాం లఘో ర్ద్విమాత్రే గురో రితి వదన్తి,
గౌ లౌ గగలలసంజ్ఞౌ గ్లో హగణో లఘుగురూ లగో వగణః.

17


గత్రితయం లత్రితయం మనసంజ్ఞా వాద్యమధ్యమాంత్యార్ణాః,
గురవ శ్చే ద్భజసగణా లఘవో యది యరతసంజ్ఞి కాః క్రమతః.

18

మిశ్రా నగలా వింద్రా నలనగసలభరతా శ్చంద్రా మలఘుః,
రలరగతలతగనవనహ భలభగసలలనలలనగగసవసహాః.

19


దీర్ఘ స్సంయుక్తాద్యః పూర్ణానుస్వారపూర్వవర్ణశ్చ,
ఏతే గురవ శ్శేషా స్సర్వే లఘ్వక్షరా ఇతి జ్ఞేయాః.

20

ఇతి శ్రీసకలభాషావాగనుశాసన నన్నయభట్టవిరచితాన్ధ్రశబ్ద
చిన్తామణౌ వర్ణపరిచ్ఛేదో ద్వితీయః.

వ.

ఈ శ్లోకంబు లిరువదియును నలువదిరెండు సూత్రంబు లయ్యె నవి యెల్ల నిందు
వివరించెద.

4


తే.

కాంచనాంబర కవితాప్రపంచ మెల్ల, వర్ణరూపంబు గాన నా వర్ణములకుఁ
గలుగుభేదంబు లెఱుఁగక కవిత పలుక, వలను గామి వచించెద వాని నెల్ల.

5

వర్ణసంజ్ఞలు

క.

మాతృకలు వర్ణములు మఱి, భూతలమున వర్ణములు
[5]లిపులు వ్రాలు ననన్
దైతేయవిభంజన వి, ఖ్యాతము లగు నక్షరాహ్వయము లివి యైదున్.

6


సీ.

ఆదులు పదియాఱు నచ్చులు స్వరములు ముప్పదిమూఁడు కా మొదలు గాఁగ
నవనిపై హల్లులు వ్యంజనమ్ములు నయ్యె నీ వ్యంజనములలో నిరువదేను
స్పర్శము ల్మొదలి యక్షరములు పయి నాల్గు నంతస్థములు యకారాదికములు
పిదప శవర్ణంబు మొదలంగా నూష్మంబు లయ్యె నా స్పర్శంబు లైదునైదు


తే.

వర్ణములు గూడ నొక్కొక్కవర్గ మగును, వర్గవర్గంబుతుద లేను వర్ణములును
ధరణి సనునాసికము లనఁ బరఁగుచుండు, జమ్మికడఁ గామెపలినున్న చక్రపాణి.

7


సీ.

అత్వం బకారంబు ననఁ దలకట్టు నిక్కము దానిదీర్ఘ
మాకార మయ్యె
నిత్యం బికారంబు నిది [6]పిల్లగుడుసుపే రీ కార మన గుడి నెసఁగు దీర్ఘ
నుమరు నుత్వము నుకారము ననః గుఱుచకొ మ్మూకార మన దీర్ఘయుక్తశృంగ
మొనరు వట్రువ ఋత్వమును ఋకారము నన దీనిఁ జాఁపిన ఋత్వదీర్ఘ [7]మనఁగ


తే.

నేత్వ మేకార మైకార మైత్వ మయ్యె, నోత్వ మోకార మౌకార మౌత్వ మయ్యె
వసుధఁ బ్రత్యేకలిపులైన వ్యంజనముల, [8]పైనిఁ గూడిన నిమ్మాడ్కిఁ బలుకఁబడును.

8


తే.

అత్తు నాత్తును మఱి యిత్తు నీత్తు నుత్తు, నూత్తు నేత్తును వెస నైత్తు నోత్తు నౌత్తు
వరుసతొ నివి పదియును స్వరము లయ్యె, ముంగలఁ బ్రయోగములఁ దెలియంగవలయు.

9

క.

నిడుదలు నెఱయక్కరములు, పొడవులు చాఁపులును దీర్ఘములు నన నొకకై
వడి వ్రాలు కుఱచ లలరును, గిడిసులు గుజ్జులు ననంగ క్షితి హ్రస్వలిపుల్.

10


క.

సున్న యన బొ ట్టనంగా, నెన్న ననుస్వారసంజ్ఞ [9]లిల వలపల రెం
డున్నవి విసర్గ మనఁ జనుఁ, బన్నగపతిశయన ధవళపంకజనయనా.

11


ఆ.

గజడబలు మొదలుగా వర్గవర్గంలు, నందు మూఁడు మూఁడు హా యొకండు
యాదిలిపులు నాల్గు నన్యవర్ణయుతంబు, లైన శసలు ఘోష లనఁగఁ దనరు.

12


తే.

ఒత్తు జడ్డయు ద్విత్వసంయుక్తములును, మహిని సంయోగవర్ణనామంబు లయ్యెఁ
బై స్వరము లేక కడుఁ దేలఁబలుకఁబడిన, వ్యంజనంబులు పొల్లు లనం జెలంగు.

13


మూ.సూ.

ప్రాణ స్సమాసతోఽచో బిన్దు రనుస్వార ఏ జథో వక్రః
వక్రతమ ఐజ్ఝల స్స్యు స్సమాసతః ప్రాణినో ద్రుతాఖ్యో నః,
కచటతపాః పరుషాఖ్యా గజడదబా సరళా స్స్థిరా ఇతరే,
ఏతా స్పృజ్ఞా స్సర్వా జ్ఞాత్వా పశ్చా త్ప్రవర్తయే దత్ర.

1


సీ.

అచ్చులు ప్రాణంబు లని చెప్పఁబడు ననుస్వారంబు బిందుప్రశస్తి గాంచు
నేత్వంబు నోత్వంబు నెసఁగు వక్రము లన వానిమీఁదీని రెండు వక్రతమము
లిలఁ బ్రాణు లనుపేర నేపారు హల్లులు ద్రుత మనంగ నకార మతిశయిల్లు
వర్గాదులను గల వర్ణంబు లైదును బరుషనామంబులై ప్రణుతి కెక్కుఁ


తే.

బంచవర్గతృతీయముల్ పరమపురుష, సరళముల్ శేషహల్లులు స్థిరము లయ్యె
శబ్దశాస్త్రంబు గాన నీసంజ్ఞ లెల్లఁ, దెలిసి యీగ్రంథమునఁ బ్రవర్తించు టొప్పు.

14

వర్ణోత్పత్తిస్థానంబులు

క.

ఇమ్మహి ద్విస్థానోన్బూ, తమ్ములు వక్రయమవక్రతమయుగ్మవకా
రమ్ములు మఱి యేకస్థల, జమ్ము లితరవర్ణములు భుజంగశయానా.

15


సీ.

ఉదయించు నత్వంబు మొదలుగా రెండు రెండచ్చులు పరుసతో నఱుతఁ దాలు
పుల నోష్ఠముల నవుదల దంతములఁ గంఠతాలువుల గళోష్ఠతలములందు
బొట్టు నాసను గళంబున విసర్గంబును గాదివర్ణము లైదు నైదు గూడి
తగ గంఠతాలుమస్తకరదోష్ఠముల నంతస్థము ల్తాలుమస్తకరదముల


తే.

నూర్థ్వదంతాధరంబుల నూష్మలిపులు, క్రమతఁ దాలుశిరోదంతకంఠములను
బలువువ్రాయి శిరంబున బండిరాకు, స్థానభేదంబు లేదు దంతములఁ జజలు.

16


వ.

బలువువ్రాయి యనఁగా దొడ్డళకార మనుట.

17

తే.

[10]అలఘుఱళదంత్యచజలకు హ్రస్వవక్ర, ములకు నిందుఁ బ్రత్యేకించి పలుకనియెడఁ
గ్రమతఁ దత్తత్ప్రధానవర్ణముల కెవ్వి, యవియె వానికి నని తెలియంగ వలయు.

18


తే.

అచ్చు లొకవర్గ మయ్యె స్పర్శాక్షరంబు, లైదువర్గంబు లయ్యె యాద్యష్టకంబు
దలఁప నొకవర్గ మింకఁ కొందఱమతంబు, నూష్మములు నొకవర్గమై యొప్పుచుండు.

19

శుద్ధాంధ్రలిపిలేఖనక్రమము

క.

మొదల నకారాద్యచ్చులు, పదియాఱును వానిపిఱుఁద బాణాసురదు
ర్మదహర కాదిలిపులు ము, ప్పదిమూఁడును బుట్టి వాక్ప్రపంచం బయ్యెన్.

20


మూ.సూ.

బాలేందుపరిధిశృంగావర్తకుశగ్రంథిదాత్రపరశుసమాః,
ఆద్యా ఇభకరతుల్యా స్తద్దీర్ఘా శ్శూలసన్నిభా వన్యౌ.

2


సీ.

విజయచంద్రునిమాడ్కి వెలయు నత్వము దానికుడివంక శృంగంబుకొన గుణింపఁ
బ్రభవించుఁ దక్కినప్రాణంబు లెల్లను నడిమికి గుడిఁ జుట్టి విడువ నిత్తు
కుడి నాపుకొమ్ముకైవడి వ్రాయ నుత్వంబు క్రిందను సుడి నిల్ప ఋత్వ మయ్యె
వలపల మీనికి మెలి గొన్న ఌస్వర మెడమ నెత్వం బొప్పుఁ గొడవలిక్రియ


తే.

యామ్యమున గండ్రగొడ్డలియ ట్లొనర్పఁ, గ్రాలు నోత్వ మిన్నింటిదీర్ఘములు కుడిని
గరికరాకృతిఁ [11]దనరుడాకడవలపల, నమరు నైత్వౌత్వములు త్రిశూలములకరణి.

21

[12]వీనికి రూపములు

ా ఇది ఆకారము, ి ఇది ఇకారము, ీ ది ఈకారము, ు ఇది ఉకారము, ూ ఇది ఊకారము, ృ ఇది ఋకారము, ౄ ఇది ౠకారము, ౢ ఇది ఌకారము, ౣ ఇది ౡకారము, ె ఇది ఎకారము, ే ఇది ఏకారము, ై ఇది ఐకారము, ొ ఇది ఒకారము, ో ఇది ఓకారము, ౌ ఇది ఔకారము, "అనుక్త మన్యతః" అను న్యాయముచేత నీశబ్దానుశాసనసూత్రమునందుఁ జెప్పిన యనుస్వారమును, విసర్జనీయమును, సకలదేశప్రశస్తమైన నాగరలిపియందు నెటువలెనో యటులఁ దెలిసికొనునది. తత్స్వరూపంబులు ౦-అం ఇది పూర్ణానుస్వారము, ః-అః ఇది విసర్జనీయము, ఇవి యచ్చు లనంబడు.

అనుస్వారనిర్ణయము

మూ.సూ.

సిద్ధ స్సాధ్య శ్చానుస్వార పూర్ణార్థభేదతో ద్వివిధః,
హ్రస్వా త్పూర్ణో౽పి భవే ద్దీర్ఘాచ్చే త్ఖండ ఏవ స జ్ఞేయః.

3

సీ.

పొసఁగ దీర్ఘాఖండపూర్ణంబు లను పదంబులు సంజ్ఞలౌ గట్టిబొట్టులకును
హ్రస్వఖండార్థంబు లను శబ్దములు మూఁడు నరసున్నలకుఁ బేరు లగుటు నుండు
శబ్దంబుతోడనె జనియించు బిందువు సిద్ధంబు నాఁగఁ బ్రసిద్ధ మగుచు
బుడమి నకారంబు చెడి యైన యా యనుస్వారంబు సాధ్యసంజ్ఞము[13]న వెలయు


తే.

నిక్క మీ సిద్ధసాధ్యంబు లొక్కటొకటి, ఖండపూర్ణంబు లన ద్విప్రకార మయ్యె
నవియె క్రమ్మఱ హ్రస్వదీర్ఘాక్షరముల, మీఁద రెండు తెఱంగులై మెఱయుఁ గృష్ణ.

22


ఆ.

వెలఁది చెలఁగి నిన్ను దలఁచిన నన సిద్ధ, ఖండబిందు వయ్యెఁ గమలనాభ
పొంక మైన యింతిపొందు సాం పగు నన్న, సిద్ధపూర్ణబిందు విద్ధచరిత.

23


క.

భువిఁ గొలిచెదఁ గాళిందీ, ధవు ననుచును వికృతులకు ద్రుతంబుల చెడి బిం
దువు లైన వెల్ల సాధ్యో, ద్భవఖండము లయ్యెఁ గామెపల్లినివేశా.

24


క.

కెందమ్ములు చెంగలువలు, ముందర చెంగావిచీర ముంగొం గన నీ
చందము లెల్లను నందిత, బృందారక సాధ్యపూర్ణబిందువు లయ్యెన్.

25


మూ.సూ.

హ్రస్వాత్పూర్ణోఽపి భవేద్దీర్ఘాచ్చేత్ఖండ ఏవ వి(స)జ్ఞేయః.

4


క.

జగతిపై సిద్ధసాధ్యసంజ్ఞలఁ బొసంగు
ఖండములు హ్రస్వలిపులపై నుండె నేని
వానిఁ బూర్ణంబులను జేయవచ్చుఁ గృతులు
బూర్ణములు ఖండములు సేయఁ బొసఁగ వెందు.

26


క.

కొలఁకులకుఁ గొలంకులు నాఁ, దలఁపులకుఁ దలంపు లిట్లు తగ సిద్ధము లై
చెలు వందుఁ జిఱుతసున్నలు, వెలయును బూర్ణంబు లగుచు విషధరతల్పా.

27


క.

జలజాక్షుఁ గొలుతు ననుచో, జలజాక్షుం గొలుతు ననుచు సాధ్యార్థము భూ
తలమున నెరసున్నయు నై, చెలు వగుఁ గామెపలివాస సిద్ధోల్లాసా.

28


తే.

నిడుదలకు నక్కరములపై నిలిచినట్టి, యర్ధబిందువు [14]లన్నియు నరసి చూడ
ధరణి సిద్ధంబు లైన సాధ్యంబు లైన, ఖండములె కాని పూర్ణముల్ గావు సుమ్ము.

29


ఆ.

లోఁగ వించుకైన ఱాఁగతనంబున, దోఁచి వలువ లెల్ల దాఁచినావు
గీఁజు[15]బూర కొమ్ము నేఁ జన వలె నన్న, నిడుదమీఁద సున్న నిలుచు సగము.

30


తే.

హల్లులను బంచవర్గంబులందు మొదలి, వర్ణములకును మూఁడవ వర్ణములకుఁ
దక్క నితరాక్షరములకు దాపలికడ, నాంధ్రపదమధ్యమునఁ బుట్టదయ్యె బొట్టు.

31


సీ.

కొంకక వీఁకమై కొమ్మతోఁ జనుదెంచి ముంగల నాఁగిన మురు వధించె
మించి చె య్యాఁచక మేదినీసుతుఁ ద్రుంచి నెంజిలి రోఁజు కన్నియల గొనియె

మింటితోఁటను గల మేటివృక్షముఁ దెచ్చి మెండుగా వేఁడిన మెలఁత కిచ్చె
వింతసేఁతల గోపకాంతల వలపించి [16]పొం దూఁది బహువిధంబుల రమించె


తే.

కంపుతూఁపులు గల వన్నెకానిఁ గాంచెఁ, గంబమునఁ బుట్టెఁ దాఁబేటికరణి నొప్పె
నౌర హరి యనఁ బూర్ణంబు లర్ధములును, బరుషసరళాదులను గనుపట్టు నిట్లు.

32


తే.

సగముజాబిల్లివలె వ్రాయ సగముసున్న, నిండుజాబిల్లివలె వ్రాయ నిండుసున్న
యయ్యె నీభేదము లెఱింగి యాంధ్రకృతుల, వ్రాయఁదగు బిందువులు పాండవేయపక్ష.

33


వ.

ఁ ఇది యర్ధబిందువు. ం ఇది పూర్ణబిందువు. (ఇంకను అచ్చులన్ని వరుసకు వ్రాయుచున్నాము. (?))

34


మూ.సూ.

దరశార్ఙ్గపిప్పలదళాంకుశపన్నగసన్నిభాః క్రమా త్పరుషాః,
స్తంభ విరేఖాధిక్యై స్త ఏవ వర్గద్వితీయవర్ణాద్యాః.

5


సీ.

శంఖశార్ఙ్గద్విపాశనదళాంకుశపన్నగాకృతులను మీఁద నడ్డరేఖ
వలసల నొక్కటి నిలుపంగఁ బరుషంబు లైదును వరుసఁ జెన్నారుచుండుఁ
గ్రిందఁ గంబముపోల్కి గీఁటొక్క టిడిన నాద్యములు రెండవలిపు లై పొసంగుఁ
బైనున్నగీఁటు లిబ్బడి సేయఁ బ్రథమాక్షరంబులు సరళవర్ణంబు లగును


తే.

గంబమొక్కటి రేఖాయుగంబుక్రింద, వ్రాసినఁ దృతీయమును జతుర్థంబు నగును
నిలువుగీఁటులు రెండునుం గలసి తమ్ముఁ, గదియఁ దొల్లింటి వనునాసికంబు లగును.

35

[17]హల్లులకు రూపంబులు

s ఇది క్ కారము, క ఇది ఖ్ కారము, క్ ఇది గ్ కారము, క్ఽ ఇది ఘ్ కారము, క్ర ఇది ఙ్ కారము, చా ఇది చ్ కారము, ౘా ఇది ౘ్ కారము, ఛా ఇది ఛ్ కారము, చ్ ఇది జ్ కారము, ౘ్ ఇది ౙ్ కారము, చాఽ ఇది ఝ్ కారము, చ్రా ఇది ఞ్ కారము, టా ఇది ట్ కారము, టా ఇది ఠ్ కారము, ట్ ఇది డ్ కారము, టా్ఽ ఇది ఢ్ కారము, ౯్త ఇది త్ కారము, ౯్త ఇది థ్ కారము, ౯్త ఇది ద్ కారము, ౯్త్ఽ ఇది ధ్ కారము, ౯్త అది న్ కారము, బా ఇది ప్ కారము, భా ఇది ఫ్ కారము, బ్ ఇది బ్ కారము, భా్ఽ ఇది భా కారము, బ్రా ఇది మ్ కారము. ఇవి స్పర్శము లనంబడును.

మూ.సూ.

కీర[18]తరిహస్తిమస్తకశుక్తితులాసనవితర్దిసీరసమాః,
అంతస్థాశ్చోష్మాణో దంత్యచజౌ గుగురలౌ చ బిందుయుతౌ.

6

'తరి' అంటేను నావకు పేరు.

తే.

శుకతరిమతంగభవకుంభశుక్తిరాహుసన్ని, భంబు లంతస్థములు తులాభద్రపీఠ
వేదికాహలనిభములు శాదిలిపులు, దంత్యచజగురురరలకుఁ దనరు బొట్లు.

35

్య య్ కారము, ్ర-ఇది ర్ కారము. ్ఱ ఇది ఱ్ కారము, ్ల ఇది ల్ కారము, ్వ ఇది వ్ కారము. ఇవి యంతస్థము లనంబడు.

శ్రీ ఇది శ్ వర్ణము, నో ఇది ష్ కారము, నా ఇది న్ కారము, ్హ ఇది హ్ కారము, ్ళ ఇది దొడ్డ ళ్ కారము. ఇవి యూష్మము లనంబడు.

క.

పొల్లు లయి తాము పుట్టియు, హల్లుల ప్రాణములతోడ నంబుధితనయా
వల్లభ గూడి కదా తల, ముళ్లు గుడులు శృంగములుగను మొదలుగఁ దాల్చున్.

36


వ.

అది యె ట్లనిన.

37

క్ కారముతోడ నచ్చులు కూర్చి గుణించెడి విధము.

 ్క ఇది క్. క్ కారమునకు తలకట్టు ఇచ్చితే క. తలకట్టున దీర్ఘ మిచ్చితే కా. క్ కారమునకు గుడిచ్చితే కి. గుడిలో దీర్ఘ మిచ్చితే కీ. క్ కారమునకు కొమ్ము ఇచ్చితే కు. కొమ్మున దీర్ఘ మిచ్చితే కూ. క్ కారమునకు వట్రువసుడి యిచ్చితే కృ. వట్రువసుడిని దీర్ఘ మిచ్చితే కౄ. క్ కారమునకు ఌత్వ మిచ్చితే కౢ. ఌత్వమునకు దీర్ఘ మిచ్చితే కౣ. క్ కారమునకు ఎత్వ మిచ్చితే కె. ఎత్వమునకు దీర్ఘ మిచ్చితే కే. క్ కారమునకు ఒత్వ మిచ్చితే కొ. ఒత్వమునకు దీర్ఘ మిచ్చితే కో, క్ కారమునకు ఐత్వ మిచ్చితే కై. క్ కారమునకు ఔత్వ మిచ్చితే కౌ. క్ కారమునకు అరసున్న పెట్టితే కఁ. నెరసున్నపెట్టితే కం. క్ కారమునకు విసర్గములు పెట్టితే కః. ఇటువలెనే హల్లుల కెల్లా వ్రాయవలెనని తెలుసుకొనేది.

38

ఇది స్వరగుణితము.

తే.

ఎన్నిహల్లులు జడ్డలై యున్న నేమి, [19]పొల్లలకు మీఁద నుండెడుహల్లు లెల్లఁ
గడపటను వ్రాయ ద్విత్వ మొక్కటియె తాల్చు, దానితలకట్లు మొదలైన వానినెల్ల.

39


వ.

ప్రద్యుమ్నుఁడు — బ్రాఽక్్య౻బ్రా౯్త్ర౻౧టా౻ ఇటువలెఁ గ్రిందను వ్రాసిన
యొత్తులకే తలకట్లు మొదలైనవి వ్రాసేది. ఈ లిపియందు రేఫమునకు నొత్తులు
వ్రాసేది గాని వలపలగిలక లేదు. అది యె ట్లంటేను.

40

తే.

మొదట రేఫాక్షరంబు నా పిదప దాని
జడ్డయును గూర్చి యొకటిగాఁ జదువుకొనుచు
ముందు జడ్డయు వెస రేఫమునకు బదులు
గిలుక [20]లిఖియించియు వచింతం రిలఁ గుమతులు.

41


వ.

స్వర్గ మనుటకు నాక౮క్Uబ్రా౻ ఇటులాగే వ్రాసేది,

42


క.

పద్యాదిప్రాణంబుల, నాద్యంతాంతస్థములుగ నజ్ఞులు కృతులం
జైద్యహర వ్రాయఁదురు తము, విద్యాధికు లెల్లఁ జూచి వికవిక నవ్వన్.

43


క.

[21]ఇరు లీఁగ లుఱుత లూళ్లె, వ్వరు నేమిటి కొక్కఁ డోపు వాసిని నను నీ
కరణిపదంబుల మొదలివి, స్వరము లనుచుఁ దెలిసి వ్రాయఁజనుఁ బద్యాదిన్.

44


క.

బలుబొట్టులపై వర్ణం, బుల క్రిందట నవియె మరల మూఢమతులు జ
డ్డలు చేసి వ్రాయుచుందురు, విలిఖింపరు వాని నెందు ద్విత్వము లార్యుల్.[22]

45


ఆ.

[23]హల్లుమీఁద నున్న హల్లు దానికి ద్విత్వ, మొందుఁ గాని వేఱె యొకటి కాదు
సంధివేళ నది విచారించి వ్రాయుచోఁ, బాప రెందు దాని బ్రాజ్ఞు లెల్ల.

46

పంచాశద్వర్ణనిర్ణయము

మూ.సూ.

ఆద్యాయాః పంచాశద్వర్ణాః ప్రకృతేస్తు తే దళోనాస్స్యుః,
సప్తత్రింశదిహాన్యే చానుప్రవిశంతి శబ్దయోగవశాత్.

7


తే.

అయిదుపదు లగు సురభాష కక్షరమ్ము
లందుఁ బది ప్రాకృతమునకు నడఁగిపోవు
[24]దొలఁగి చనుఁ బదియును మూఁడు దెలుఁగుబాస
కెసఁగుఁ దత్సమపదముల నేఁబదియును.

47

వరరుచివచనము

శ్లో.

ద్విధాక ఏచోఽనుస్వారో విసర్గ ష్షోడశ స్వరాః,
స్పర్శా అంతస్థళోష్మాణ శ్చతుస్త్రింశ ద్ధలః స్మృతాః.

టీ. ద్విధా = రెండువిధము లైనటువంటి, అకః = ఆక్ప్రత్యాహారమున్ను, అక్కులనంగాను - అ ఇ ఉ ఋ ఌ అనేటి ఈ యయిదక్షరములకుఁ బేరు. అది యెట్లంటేను.

పాణినీయసూత్రములు

సూ.

హలన్త్యమ్.


వృ.

ఉపదేశే౽న్త్యం హ లి త్స్యాత్.

టీ. ఉపదేశే = [25]సూత్రమునందు, అంత్యం = తుదిది అయినటువంటి, హల్ = వ్యంజనాక్షరము (తుదపొల్ల), ఇత్ = ఇత్తనే సంజ్ఞ కలది, స్యాత్ = అగును. ఇందుచేత ఇత్తు అంటేను సూత్రముకొన నున్న పొ ల్లనుట.

ఆది రంత్యేన సహేతా.


వృ.

అంత్యేన ఇతా సహితః ఆదిః మధ్యగానాం స్వస్య చ స్జ్ఞా స్యాత్.

టీ. అంత్యేన = కడపటనున్న, ఇతా = ఇత్తుతోడ, సహితః = కూడుకొన్నటువంటి, ఆదిః = మొదటి అక్షరము, మధ్యగానాం = నడుమునుండేటి అక్షరములకున్ను, స్వస్యచ = తనకున్ను, సంజ్ఞ స్యాత్ = పే రగును. కడపట నున్న ఇత్తులో కూడుకొన్నటువంటినమొదటి అక్షరము నడుమ నుండే అక్షరములకున్ను దనకున్ను పేరగును. ఇటన్నందుచేత తుద నున్న కకారమునకు పొల్లు పనిలే దాయెను గనుక.

సూ.

తస్య లోపః.


వృ.

తస్య ఇతో లోప స్స్యాత్.

టీ. దానికొన నున్న యిత్తునకు లోప మవును, ఇందున్న కవర్ణము పొల్ల లోపము కాగాను జిక్కిన యయిదక్షరములున్ను హ్రస్వములుగానున్ను దీర్ఘములుగానున్ను నుచ్చరించితేను అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ అని పది యాయెను. ఏచః = ఏ, ఓ, ఐ, ఔ, చ్ అనేటి ఏచ్ ప్రత్యాహారమునందు మునుపటిలెనే కొననున్న చకారము పొల్ల గనక మిగిలినవి నాలు గాయెను.

సూ.

"ఏజ్ హ్రస్వో నాస్తి"

అనే సూత్రముచేతను ఈ యేచ్చునను హ్రస్వము లేదు గనుక ఏ, ఓకారములు గీర్వాణభాషయందు కుఱుచలు లేవు. అనుస్వారః = పూర్ణబిందు వొకటి (సంస్కృతమునందు పూర్ణమే కాని ఖండము లేదు.) విసర్గః = విసర్జనీయ మొకటి. ఇవన్నిన్నీ కూడంగాను, స్వరాః = అచ్చులు, షోడశ = పదహారు, స్పర్శాః = స్పర్శములు ఇరువై అయిదు, అంతస్థళోష్మాణః = అంతస్థములు నాలుగున్ను దొడ్డళకారమున్ను, ఊష్మములు నాలు గున్ను, హలః = వ్యంజనములు, చతుస్త్రింశత్ = ముప్పదినాలుగు, అచ్చులు పదహాఱు, హల్లులు ముప్పదినాలుగున్ను - ఉభయములున్ను గూడంగా నేఁబది వర్ణము లాయెను.

తే.

అచ్చు లొకపదియాఱును వ్యంజనములు
పాండుపుత్రసహాయ ముప్పదియు మూఁడు
దొడ్డళా యందులోపల దొరల నయ్యె
నమరభాషకు నేఁబది యక్షరములు.

49


సీ.

ఏకనీళము దేవహేళనంబు నటంచు యాజుషామ్నాయంబునందు లేదో
కాళవాళవ్యాళగోళహింతాళంబు లనుచు సంస్కృతభాషయందు లేదొ
గయ్యాళి త్రుళ్లు [26]నంగళ్లు వజ్రపుతళ్కు తాళి యటంచు నాంధ్రమున లేదొ
పాళం బెఱుంగని కూళ నివాళి పిసాళించు ననుచు దేశ్యముఁన లేదొ


తే.

యాగమజ్ఞులు దొడ్డుబీజాక్షరంబు, లందు లేకున్కి సన్నంబు నదియుఁ గూడ
నొకటిగాఁ జేసి బీజోపయోగి గాన, క్షాను జేకొని రది శబ్దసరణి గాదు.

50


వ.

ఆగమజ్ఞులు పంచాశద్వర్ణంబులలో నున్న క్షకారమును కూడుకొన్నందునకు మహావిద్యలోని శ్లోకంబులు—

51


శ్లో.

మూలాధారం గుదస్థానం స్వాధిష్ఠానం తు మేహనమ్
నాభిస్తు మణిపూరాఖ్యం హృదయాబ్ద మనాహతమ్,
తాలుమూలం విశుద్ధాఖ్య మాజ్ఞాఖ్యం నిటలాంబుజమ్
సహస్రారం బ్రహ్మరంధ్ర మిత్యాగమనిదో విదుః.


శ్లో.

ఆధార స్తు చతుర్దళో౽రుణరుచి ర్వాసాంతవర్ణాశ్రయః
స్వాధిష్ఠాన మనేకవైద్యుతనిభం బాలాంతషట్పత్రకమ్,
రత్నాభం మణిపూరకం దశదళం డాద్యం ఫకారాంతకం
పత్త్రైర్ద్వాదశభి స్త్వనాహతపురీ హైమీ కఠాంతాన్వితా.


శ్లో.

ద్వ్యష్టారం స్వరషోడశైశ్చ సహితం జ్వోతిర్విశుద్ధాంబుజం
హం క్షేత్యక్షరపద్మపత్రయుగళం రత్నోపమాజ్ఞాపురీ,
తస్మా దూర్ధ్వ మధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం
నిత్యానందమయీ సదాశివపురీ శక్త్యై నమ శ్శాశ్వతమ్.


తే.

కాకు షా జడ్డ యైన క్షకార మగుట, దలఁప కేఁబదిలిపులలో దాని గూర్చి
తొలుత భిన్నాక్షరంబైన దొడ్డళాను, విడిచి పెట్టె ననంతుండు వెఱ్ఱి గాఁడె.

52


వ.

ఛందమునందు ననంతుఁడు చెప్పిన విధము.

53

క.

యరతవ లంతస్థలు నాఁ, బరఁగును శషసహలు దేటపడు నూష్మ లనన్
సొరిది క్షకారము గూడుక, సరి నేబది యయ్యె వర్ణసంఖ్య ధరిత్రిన్.

54


క.

లళలకు భేదము లే దను, పలుకున ళా దొలఁగి యైదుపదు లగు వర్ణం
బులు సంస్కృతభాషకు మఱి, తెలుఁగున ఱళ లనఁగ రెం డధికమగుఁ గృష్ణా.

55

ప్రాకృతోనాక్షరపరిగణన

హేమచంద్రాచార్యవచనము

శ్లో.

ఋఌవర్ణౌ హ్రస్వదీర్ఘా వైజాద్యా వనునాసికౌ,
శషౌచ దశ తే న్యూనా? ప్రాకృతోక్తిషు సర్వతః.

టీ. హస్వదీర్ఘా = హ్రస్వమున్నూ దీర్ఘమున్నూ ఐనటువంటి, ఋఌవర్ణౌ = ఋకార ఌకారములున్నూ, అనగా ఋ,ౠ,ఌ,ౡ అనేవి ఈరెండున్నూ, ఐచ్ = ఐఔ లును, అద్యౌ = మొదటి వైనవంటి రెండున్నూ, అనునాసికౌ = అనునాసికములున్నూ, అనఁగా మొదటిరెం డనునాసికములైన ఙకార ఞకారములనేవి, శషౌచ = శవర్ణషకారములున్నూ, తే దశ = ఆపదివర్ణములున్నూ, ప్రాకతోక్తిషు = ప్రాకృతవచనములయందు, న్యూనాః = తక్కువ. ఆనగా సంస్కృతభాషకు చెప్పిన యేబదింటిలో ఋ,ౠ,ఌ,ౡ,ఙ,ఞ,శ,ష అను నీపదివర్ణములు ప్రాకృతభాషకుఁ దక్కువ యగుచున్న వనుట.

తే.

సప్తమస్వరముఖచతుష్టయము ద్వాద, శస్వరంబును లోకసంఖ్యాస్వరంబు
నుర్వి నాద్యమునాసికయుగము శషలు, ప్రాకృతంబున నిక్క మీ పదియు లేవు.

56


వ.

లోకసంఖ్యాస్వర మనఁగా గణితశాస్త్రోక్తసంఖ్యను జతుర్దశలోకములు గనుక పదు
నాలవస్వర మనుట. ఔకారమునకు పేరు.

57

ఆంధ్రభాషావర్ణసంఖ్య

మూ.సూ.

ద్వివిధాదిదుదేదోతోచో వక్రతమా వనుస్వారౌ,
కగచజయుగ టడణతదనపబమయరయుగలయుగవసహాశ్చహలః.


సీ.

అచ్చులలో సప్తమాక్షరం బాదిగా వరుస నాల్గును దుదివర్ణ మొకఁడు
స్పర్శాక్షరములందుఁ బంచవర్గములను సమములై యుండు నక్షరములు పది
మొదలువ్యంజనవర్గములను రెంటను దుది గనుపట్టుననునాసికద్వయంబు
నూష్మవర్ణము లన నొప్పునాల్గిటిలోనఁ బ్రథమద్వితీయాక్షరములు రెండు


తే.

నెన్న నీయొండు కడమగా నిరువదియును, జగతి శుద్ధాంధ్రదేశ్యభాషాపదముల
వెదకినను లేవు తత్సమపదములందుఁ, దనరు నిన్నియు నది సంస్కృతంబు గాన.

58


క.

తుదలను వికృతివిభక్తులు, గదియుటచే దెలుఁగులందుఁ గలసెను గాకో
యదువర తత్సమపదముల, మొద లాద్యప్రకృతిశబ్దములు దెలుఁ గగునే.

59

సీ.

దేవతాభాషను దీర్ఘంబులే కాని కల నైనఁ గుఱుచలు గాక యుండు
హరవిశ్వదివససంఖ్యాచ్చులు దెలుఁగులఁ గడు హ్రస్వములును దీర్ఘములు నగును
సంస్కృతంబునఁ దాలుజననమాత్రమె కాని జగతి నన్యస్థానసంభవంబు
చర్చింప నెఱుఁగనిచజ లాంధ్రమునఁ దాలుజాతంబులును దంతజములు నగును


తే.

దలఁప నేకప్రకారమై దైవతోక్తు, లందు భేదంబు లేని రేఫాక్షరంబు
రేఫము ఱకారమును నన రెండుదెఱఁగు, లగుచు వికృతులఁ దనరు దుగ్ధాబ్ధిశయన.

60


వ.

హరవిశ్వదివరసంఖ్యాచ్చు లనఁగాను గణికశాస్త్రోక్త సంజ్ఞను, హర అంటేను బద
నొకొండవ యచ్చు ఎకారము, విశ్వ మనఁగా బదుమూఁడవయచ్చు ఒకారము,
దివస మనఁగాఁ బదిహేనవ యచ్చు అఁ అనునది. యీ మూడచ్చులకున్ను దెలుఁ
గున హ్రస్వమున్ను దీర్ఘమున్ను గల వనుట. అం అనుదానికి దీర్ఘము వచ్చితేను
ఆం ఆయెను. ఇంతమాత్రమున కచ్చులమొదలను అకారంబును ఆకారంబును
రెండును ఉన్నవి. దానికిం జెప్పరాదా దీనికి జెప్పవలెనా అంటేను, ఇవి యాకార
మనకు చెప్పుట గాదు. అనుస్వారము ప్రత్యేక ముచ్చరింప శక్యము కాదు గనక
బాణిన్యాచార్యుల వ్యాకరణమునందు అం ఇత్యనుస్వారః అని అకారముతోఁ
గూర్చి చెప్పినాఁడు గనుక అం అనఁగా బిందువునకు సంజ్ఞ. ఆ బిందువునకు హ్రస్వ
దీర్ఘము లెటువలె కలుగు ననఁగా ముందలిపద్యముచేతను తెలిసికొనునది.

61


ఆ.

బిందువునకు రెండుభేదంబు లగు హ్రస్వ, దీర్ఘరూపములను దెలుఁగులందు
హ్రస్వ మనఁగ నొప్పు నర్ధబిందువు దీర్ఘ, మనఁగఁ బూర్ణబిందు వయ్యెఁ గృష్ణ.

62


క.

తక్కువపదియును దొమ్మిది, యెక్కువలిపు లాఱు నయ్యె నేఁబదిలో నీ
లెక్కను ముప్పదియును నే, డక్కరములు నిలిచె శుద్ధ మగు నాంధ్రమునన్.

63


వ.

తత్తద్వర్ణభేదాభేదంబు లెఱింగించెద.

64


మూ.సూ.

వికృతిపదాదౌ ప్రథమాంతస్థతృతీయానునాసికౌ నస్తః.


క.

తెలుఁగున యణకారంబులు, గలుగవు శబ్దాదులను యకారముపగిదిన్
బలుకఁబడునవి స్వరము లగు, ఖలపూర్వామరవినాశ కామెపలీశా.

65

క్రారకొమ్ములు

సీ.

క్రుఙ్ క్రుధ క్రూర శిగ్రు శ్రుతి [27]విశ్రుత శుశ్రూష నిఃస్రుతి స్రు క్స్రువములు
భ్రూణ భ్రుకుంశ బభ్రు బ్రువాణంబులు భ్రుకుటిత భ్రూలతా ప్రకటితములు
కద్రువ ద్రుపద ద్రుమ ద్రుహిణ ద్రుహి సౌరద్రు విద్రుమ శత్రువులును
ధ్రువమును ద్రుతమును భువిఁ గ్రారకొమ్ములై తనరారుఁ గాని ఋత్వములు గావు

తే.

వట్రువలు లేవు తెనుఁగున వానిపగిదిఁ, బలుకు లిపు డెల్లఁ గ్రారకొమ్ములు నిజంబు
దునుము నిందాఁకఁ జైద్యుఁడు ద్రుళ్లె ననఁగ, రోహిణీభర్త చరమాద్రిఁ గ్రుంకె ననఁగ.

65

నృసింహపురాణమునందు (ఆ.2.35)—

సీ.పా.

క్రూరకిల్బిషశైలకులిశనిపాతంబు ఘనకలుషోహగగరుడమూర్తి

66


వ.

మఱియు.

67

(ఆ.2.46) —

చ.

శ్రుతిమతధర్మయోగములు చోద్యపుమూల్యము లప్పురంబునన్
జతురతఁ బుణ్యవస్తువులు సారవిముక్తిపదంబు లమ్మువా
రతులితవిష్ణుశాసనసమాహితులైన మహాత్ము లంచితో
ద్ధతిఁ గొనువారు [28]భూరివిహతవ్రతపారగు లైన భోదనుల్.

68

కావ్యాలంకారచూడామణియందు (అ.2.22) —

క.

భావమె యించుక వదనా, వ్యావళితవికాస మైన హావము శృంగా
రావిర్భావనిదానము, [29]భ్రూవల్లీమందచలనమున నెఱుఁగఁబడున్.

69

ప్రభావతీప్రద్యుమ్నమునందు (ఆ.3.15) —

సీ.పా.

సురటి చేకొని భద్ర శుశ్రూక్ష గావింప.

70


తే.

అద్రున విద్రువ నను క్రియానపదంబులయందుఁ, [30]దగిలి వట్రసుడులపగిది నుండు
వ్రాలు తేలఁ బల్కఁ గ్రారకొమ్ములు గాని, వట్రసుడులు గావు వనజనాభ.

71

ఋత్వాక్షరంబులు

సీ.

ఋష్యమూకాద్రియు ఋష్యశృంగుండును ఋక్షమృగేందుండు ఋక్షపదము
ఋతము ఋత్విక్కు నైరృతి ఋతుషట్కమ్ము ఋతుపర్ణభూపతి ఋతుమతియును
ఋషభవాహనుఁడును ఋషియు ఋగ్వేదంబు బుభురాజుఋణమును ఋద్ధిఋజువు
నను నీపదంబుల కాదివర్ణంబుల సప్తమస్వరములై [31]జగతి వెలయుఁ


తే.

గృష్ణ వృత్రాంతకా హృషీకేశ మదన, జనక పృథ్వీకుమారరంజన యటంచు
హల్లులందును వట్రువ లమరి యుండు, సంస్కృతంబున యదువంశసార్వభౌమ.

72

వక్రభేదంబులు

ఆ.

ఏక మోక మిట్టు లేత్వంబు నోత్వంబు, నమరభాష నిడుద లగును గాని
హ్రస్వలిపులు కావు హల్లుపై నట్లన, యగును గేకి కోకిలాలి యనఁగ.

73


ఆ.

పెక్కు రేల కృష్ణుఁ డొక్కఁ డోపఁడె పసి, నెలవు నేల యరసి పొలము వోవ
ననఁగ నిట్టు దెనుఁగులందు వక్రయుగంబు, హ్రస్వములును నిడుదవ్రాలు నగును.

74

వ్యంజనలోపము

ఆ.

పూనె నెగసెఁ బొదవెఁ బొనరెఁ బొందె నటన్న, పలుకులందు మొదలఁ గలుగునట్టి
వ్యంజనంబు లడఁగి వానిపై స్వరములు, నిలుచు వలసినపుడు నీరజాక్ష.

75

పూని యనేటందుకు విష్ణుచిత్తీయమునందు (ఆ.1.4.)—

ఉ.

పూని ముకుందునాజ్ఞఁ గనుబొమ్మనె [32]కాంచి యజాండభాండముల్
వానను మీఁదఁ బ్రోవ నడవం గొనెఁ ద న్నన నగ్రనిశ్చల
త్వానచలత్వనిష్ఠలె సమస్తజగంబుల జాడ్యచేతనల్
గా నుతి కెక్కుసైన్యపతికాంచనవేత్రము నాశ్రయించెదన్.

76

హల్లు లోపమై ఊనె అనేటందుకుఁ బారిజాతాపహరణమునందు (అ.1.114)—

క.

మానవతి యిట్లు మానని, మానక్రోధము[33]లచేత మరలిచి చింతా
ధీనగతి నుండ మదిలో, నూనినప్రేమమున నంబుజోదరుఁ డనియెన్.

77

నెగసె అనేటందుకు నాదిపర్వమునందు (ఆ.5.177)—

ఆ.

కర్మబంధములను గ్రక్కునఁ బాయుదుఁ, ఋణ్యగతికి నెగయు పురుషునట్ల
బంధనంబు లెల్లఁ బాయుడు భీముఁడు, నీరిలోననుండి నెగయు దెంచె.

78

విరాటపర్వమునందు (అ.1.162)—

సీ.పా.

నెగసినకొనలతో నింగి యంతంతకు నవలఁ బోవఁగఁ దనరారుదాని

79

ఉద్యోగపర్వమునందు (ఆ.3.301)—

క.

ఎఱకలు విచ్చుదుఁ దుండముఁ, దెఱచుచు [34]వ్రేఁ గడరి సొగసి త్రెళ్లి వివశుఁడై
యఱచిన నోడకు మని హరి, నెఱి చక్కఁగఁ ద్రోచి యెత్తె నెగయఁగఁ గృపతోన్.

80

వ్యంజనలోప మైనందుకు శృంగారనైషధమునందు (ఆ.1.100)—

సీ.పా.

ఒంటికాలను నిల్చి యూర్మిమారుతములఁ జిగురుఱెక్కల రేకు లెగయుచుండ

81

పొదవె నన్నందుకు నృసింహపురాణమున (ఆ.3.69)—

తే.

అదరిపాటున [35]వెస విచ్చి పొదవికొనినఁ, [36]దొలఁగి పోవఁగఁ గూడక మలయపవనుఁ
డిందుఁ దలఁదూర్చుకొనియె[37]నో యిప్పు డనఁగ, నమరుఁ దాళవృంతముల మందానిలంబు.

82

అందే (ఆ.3.80)—

తే.

పొదవి యొండొండ దివియును భువియు దెసలుఁ
బొదవికొని యుండు చీఁకటిప్రోవువలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్లు
కరవటం బన జగదండ ఖండ మమరె.

83

అందే (ఆ.4.32)—

క.

అది యట్ల కాదె నిప్పునఁ, జెద లంటునె దేవదేవు శ్రీరమణీశున్
మది నుంచుకొన్నవానిని, బొదవునె యాపదలు రవిని బొందునె తమముల్.

84

[38]అచ్చునకుఁ జిత్రభారతమునందు (1.16)—

క.

తదనంతరంబు గ్రమ్మఱ, యదువిభుఁడు కృపావిధేయుఁడై వాణీశ
త్రిదశేశుల కాశ్చర్యం, బొదవ మనిచె నుభయసైన్యయోధుల నెల్లన్.

85

ఉద్యోగపర్వమునందు (ఆ.1.9)—

క.

పదపడి దుస్తర మగు నీ, పదమూఁడగునేడు గడపఁబడుట యరిది ద
మ్మెదు రెఱుఁగకుండ నాపద, లొదవఁగ సైరించి రిట్టి యునికుయుఁ గలదే.

86

పొనరె నన్నందుకు నుద్యోగపర్వమునందు (ఆ.2.35)—

క.

ధనమును విద్యయు వంశం, బును దుర్మదులకు మదంబుఁ బొనరించును స
జ్జను లైనవారి కడఁకువ, యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా.

87

అందే (ఆ.3.143)—

చ.

అని నిన్మెచ్చి వృకోదరుం డతఁడు కార్యం బింత తెల్లంబుగాఁ
బొనరం బల్కునె యంచుఁ బేరెలుఁగు సొంపుం జెంద వక్త్రంబుపొ
ల్పున దర్పం బొలయంగ నంగములకుం బొంగారు తద్బృంహిత
ధ్వనియై మించు మహోగ్రసింధురమిచందం బొంది పొల్చెం దగన్.

88

పకారములోని స్వరమే నిల్చినందుకుఁ బ్రబంధపరమేశ్వరుఁడు చెప్పిన [39]అహోబలమాహాత్మ్యమునందు —

క.

నిను నాశ్రయించియును నే, ననఘా కడ లేని వనట యను వననిధిలో
మునుగుదునె ప్రతీకారం, బొనరింపఁగదయ్య దీని కూహించి కృపన్.

89

హరిశ్చంద్రోపాఖ్యానమునందు —

చ.

ధనదునిపుష్పకంబునకుఁ దా నెన వచ్చు నటంచు లోకముల్
వినుతి [40]యొనర్చ బొల్పెసఁగి విద్రుమమౌక్తికనీలవజ్రకాం

చనయుతము న్సువేగహయసంఘటితంబును నైన తేరు సొం
పొనరఁగ నెక్కి మిక్కిలి సముత్సుకతం బురబాహ్యవీథులన్.

90

పొందె ననేటందుకు శంభుదాసుని లక్ష్మీనృసింహావతారకథయందు (ఆ.2.31)—

ఉ.

పొందవు దుఃఖము ల్భయము పొందదు పొందదు దైన్య మెన్మెయిం
బొందవు తీవ్రదుర్దశలు పొందుఁ బ్రియంబులు పొందు సంపదల్
వొందు సమగ్రసౌఖ్యములుఁ బొందు సమున్నతకీర్తు లెందు గో
విందపదారవిందపదవీపరిణద్ధగరిష్ఠచిత్తులన్.

91

[41]ఒదాదేశహ్రస్వంబులు

తే.

కాంచు హ్రస్వద్వితీయవక్త్రంబు నంద, ఱొక్కఁ డను వీనిరెండవయక్కరంబు
హ్రస్వ మగుఁ జోటను పదంబునందు మొదలి, వర్ణమును గబ్బములను గావలసినపుడు.

92

'అందొఱు' అనుట కాదిపర్వమున (ఆ.5.168) —

క.

[42]గిఱపునెడ సేయునెడ వడిఁ, [43]బఱపునెడం బెడఁగునెడ నపారబలంబుల్
మెఱయునెడ భీమునకు నం, దొఱు గీడ్పడఁ దొడఁగి రుద్ధతులు రాజసుతుల్.

93

ఆరణ్యపర్వమునందు (ఆ.1.269) —

సీ.పా.

శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు దురాధర్షు లందొఱును మనకు

94

ఒత్వము రానందుకు విరాటపర్వమునందు (ఆ.1.116) —

క.

ఎఱుక గలవారికైనను, గఱపక దక్క రుచితప్రకారము శుభమున్
గొఱలు హితు లట్లగుట నం, దఱకును జెప్పంగ వలయుఁ దగియెడుబుద్ధుల్.

95

ఒక్కొ అనేటందుకుఁ గర్ణపర్వమునందు (ఆ.2.352) —

మ.

సమదాటోపత వాయునందనుఁడు ధృష్టద్యుమ్నశైనేయు లే
కమనోవృత్తిఁ గడంగి తో నడుప దోర్గర్వంబు శోభిల్ల శౌ
ర్యము సొంపార నిలింపకోటి వొగడన్ రారాజుసైన్యంబు లొ
క్కొ
మొగిం బెల్లగిలంగ బె ట్టదిమె సక్రోధాంతరంగంబునన్.

96

మనుచరిత్రమునందు (ఆ.3.72) —

క.

ఇట నవ్వరూథినియు నొ, క్కొటఁ గతిపయసఖులు దన్నుఁ కొలిచి నడువఁగాఁ
గటకఝళంఝళరవపద, కటకసమాకృష్ణకేళికలహంసిక యై.

97

రాఘవపాండవీయము (ఆ.2.108) —

స్రగ్ధర.

ఆ రాజన్యోత్తముఁ డి ట్లనుదితరభసుండై భవర్సత్వరవ్యా
హారం బి ట్లోర్చి యు టన్యముగఁ గొనకు మాత్మాంగనాశుల్కతాదృ
క్సారోగ్రేష్వాస మ ట్లశ్రమజిత మగు టెంచంగ నాచేతికాటం
గ్రూరేష్వాసంబు లే దొక్కొఁడు గలుగునె మద్ఘోరయుద్ధంబు సైపన్.

98

ఒకారము రానందులకుఁ గాశీఖండమున (ఆ.1.108) —

ఉ.

కంటికి నిద్ర వచ్చునె, సుఖం బగునే రతికేళి, జిహ్వకున్
వంటక [44]మించునే, యితరవైభవముల్ పదివేలు మానసం
బంటునె మానుషంబు గలయట్టి మనుష్యున కెంతవానికిన్
గంటకుడైన శాత్రవుఁ డొకండు తనంతటివాఁడు గల్గినన్.

99

విరాటపర్వమునందు (ఆ.4.210) —

సీ.పా.

శక్రాదిసురలతో సంగ్రామ మొనరించి ఖాండవం బేర్చె నొక్కరుఁడు గాఁడె

100

చొటు అనేటందుకు ద్రోణపర్వమునందు (ఆ.2.251) —

క.

కటకట పేరినపె న్నె, త్తుట జొత్తిలి యున్నమోముతోడను గొడు కె
చ్చటఁ బడి యున్నాఁడో య, చ్చొటుఁ జూపెడువారు లేరె చూచెద వానిన్.

101

విష్ణుచిత్తీయమునందు (ఆ.4.145) —

మ.

స్ఫుటభూయోహృతిశంక వార్థి రవిరశ్ము ల్నిన్ను జేర్పం దటి
చ్ఛట [45]లౌర్వంబుగఁ గాఱుకొంచు ఘనమై క్ష్మాఁదీర వర్షింప న
చ్చొటునుం ద్రోచి గ్రసింపఁబోలుఁ గలశీసూనుండు గాకున్న నొ
క్కొటఁ దారాగ్రహభాస్కరేందుమణిశుక్తుల్ వ్యక్తమై తోఁచునే.

102

హ్రస్వము గానందుకు మనుచరిత్రము (ఆ.2.70) —

ఉ.

పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక నీవు ద్రోయ ని
చ్చొట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొను మంచుఁ జూపి య
ప్పాటలగంధి వేదన [46]నెపం బిడి యేడ్చెఁ [47]గలస్వనంబునన్
మీటిన విచ్చు గబ్బిచనుమిట్టల నశ్రులు చిందు వందఁగాన్.

103

వక్రతమభేదంబులు

పాణినీయసూత్రము

సూ.

తద్ధితే ష్వచా మాదేః.


వృ.

ఞితి ణితి చ తద్ధితే పరే అచా మాదే రచో వృద్ధి స్స్యాత్.


క.

హైయంగవీనమునకున్, నైయంవకశబ్దమునకు నైయ గ్రోధ
[48]స్త్రైయజితాదుల కాదిని, వ్రాయంగా వలయుఁ బ్రథమవక్రతమంబుల్.

104


క.

వైయర్థ్యత్రైయంబక, వైయాకరణాగ్రగణ్య వైయాఘ్రపదీ
వైయాత్యంబుల మొదలను, వ్రాయం దగు బుధులు ప్రథమవక్రతమంబుల్.

105


క.

యౌవనయౌవతకౌస్తుభ, సౌవర్ణకయౌవరాజ్యసౌవీరమహీ
దౌవారికశబ్దంబులఁ, దావుకొను ద్వితీయవక్రతమములు మొదలన్.

106


క.

సౌవగ్రామికశౌవన, [49]సౌవర్చససౌవిదల్ల సౌవస్యలస
త్సౌవరశబ్దములమొదల, వావిరి నిలుచున్ ద్వితీయవక్రతమంబుల్.

107

కౌస్తుభము అనుటకు నృసింహపురాణమునందు (అ.2.37) —

ఉ.

శ్రీస్తనకుంకుమద్రవనిషిక్తభుజాంతరభాగవిస్ఫుర
త్కౌస్తుభనూతనార్కరుచిగర్వితనాభిసరోజసౌరభ
ప్రస్తుతమత్తభృంగరవరాగరసోల్బణభోగిభోగత
ల్పాస్తరణుం దలంచు సుకృతాత్ము లపాస్తసమస్తకల్మషుల్.

108


క.

మెచ్చులగు కబ్బములలో, నచ్చతెనుఁగుపల్కులందు నైత్వౌత్వంబుల్
వచ్చిన నొం డగు రెం డగు, విచ్చలవిడి వలసెనేని విబుధస్తుత్యా.

109


మూ.సూ.

అయిగవుగాదేశౌ స్తఃక్రమేణ సర్వత్ర వక్రతమయోర్వా.


క.

క్రమమున వక్రతమములను, నమరు నయిక్కును నవుక్కు ననియెడు నాదే
శములు వికల్పంబున దై, త్యమదాపహ యాంధ్రభాషయం దెల్లెడలన్.

110


ఆ.

లోకహితముకొఱకుఁ బైకొని దుష్టుల, లయ మొనర్చి శిష్టు లయిన నృపుల
నేల యేల నిలిపెఁ గౌ లిచ్చి నలుదెస, దవిలి కృష్ణరాయఁ డవుర యనఁగ.

111

కవర్గాక్షరభేదంబులు

మూ.సూ.

వా స్యా త్క్వచిద్వకారాో నాదిగతస్వాద్యవర్గసరళస్య.


సీ.

పరుగులు పరువులు పగరంబు పవడంబు పగలుట పవలుట పగలు పవలు
నగుఁబాటు నవుఁబాటు నలుగురు నలువురు తగులాట తవులాట తొగలు తొవలు

త్రాగుట త్రావుట ప్రేగులు ప్రేవులు ప్రోగులు ప్రోవులు సోఁగ సోవ
యిగ మివ మగు నవు నిగురాకు లివురాకు లీగు లీవులు మ్రానిచేగ చేవ


తే.

తీగియలు తీవియలు పయిఁ దిగిచెఁ దివిచె
ననుచు నిబ్భంగి నొకవేళ నాదివర్ణ
ములకుఁ దక్కంగఁ గొన్నిమాటలకు గృతుల
బ్రథమసరళంబులకు వకారములు వచ్చు.

112

నైషధమునందు (ఆ.3.34) —

మ.

పవిసంగంబునఁ దాప మొందిన శచీప్రాణేశుకెంగేలికిం
చివురుంగైదువజోదు వైద్య ముపదేశించెన్ రహస్యంబుగా
నవనీహారపయోమిళన్మలయజస్నాలార్ద్రపర్యంతమై
యివతాళించు విదర్భరాజతనయాహృద్యస్తనద్వంద్వమున్.

113

శాంతిపర్వమునందు (ఆ.1.35)

చ.

వినుము నరేంద్ర విప్రుఁ డలివెన్ జమదగ్నిసుతుండు శాప మి
చ్చె నమరభర్త వంచనము చేసె వరం బని కోరి గొంతి మా
న్చె నలుక భీష్ముఁ దర్ధరథుఁ జేసి యలంచెం గలంచె మద్రరా
జనుచిత మాడి శౌరి విధి యయ్యె [50]నరుం డని జంపె గర్ణునిన్.

114

మార్కండేయపురాణమునందు (ఆ.7.123) —

చ.

ఘననిబిడాంధకారరిపు[51]ఖండనచండమయూఖరాజిచే
ననుదినముం బ్రభాతములయం దమృతాంశుమరీచు లేఁగఁగా
వనజము లుల్లసిల్లఁగ [52]దొవ ల్ముడుఁగం బ్రథమాద్రిఁ బొల్చు న
ద్దినమణికి న్నభోమణికి దేవశిరోమణి కేను మ్రొక్కెదన్.

115


తే.

ఆఁగె లోఁగెను వీఁగెను డాఁగె నేఁగె, వాఁగె ననునివి మొదలగు వాక్యములును
బొదలునక్షరములు [53]చిన్నబొట్లపై గ, కారములు గాని యనునాసికములు గావు.

116

చవర్గాక్షరభేదంబులు

మూ.సూ.

ఆ ద్దంత్య స్తాలవ్యశ్చు ర్వక్రః స్యాన్మిథస్సవర్ణశ్చ.

6


ఆ.

ధరణి దంత్యములకు దాలవ్యములు నన, వికృతిచజలు రెండువిధముల లయ్యె
వీనిఁ దెలియకున్న విశ్రమభంగంబు, దొడరి కావ్యములను దోష మొదవు.

117

ఆ.

దంతజంబు లెల్లఁ దలకట్టులును వాని, యందు దీర్ఘములును బొంది యుండుఁ
దాలుజాక్షరములు దనరారు హ్రస్వాది, వక్రయుతము లగుచు వనజనాభ.

118


ఆ.

ౘలము మాని కుడువు ౘట్టకేశవ ప్రొద్దు, ౘాల నయ్యెఁ [54]బసివ్రజంబు వెడలె
ౙతలు గూడి వచ్చి సఖులు చీరెద రేల, ౙా గనంగ దంతజంబు లయ్యె.

119


అ.

చెప్పరానిక్రొవ్వుచేఁ గంసుపంపునఁ, జెలఁగికొనుచు దన్నుఁ జేరి పెనఁగ
జెట్టి మట్టుఁబెట్టెఁ జిఱుతయే నందుని, పట్టి యనఁగఁ దాలుభవము లయ్యె.

120


ఆ.

చేతఁ జీర లైదు చేఁరెడు వరహాలు, జేనెఁ డంత జిత్తు చేక టొకటి
చేఁదుకొనియెఁ గృష్ణుఁ జేర్చుక యన నిట్లు, వఱSలుఁ గొన్ని దీర్ఘవక్రలిపులు.

121


తే.

దంత్యముల నరవంకలు దైవభాషఁ, గనము తాలవ్యములఁ దలకట్లు లేవు
ప్రాకృతమునందుఁ దద్భపపదమునందు, దంత్యములె కాని తాలుజాతములు లేవు.

122


వ.

వక్రములకుఁ దద్భవము వంకలు, అరవంక లనఁగాను గుఱుచ యెత్వములు అనుట,
దీర్ఘములకుఁ దద్భవములు తీఁగలు.

123


ఆ.

ౘందమాకు గాయఁ ౙక్కెరవిలుఁకాఁడు, ౙాజిపువ్వుటంపౙల్లు గురియఁ
ౙామ కాక కోర్వఁౙాలక హరి వచ్చు, దనుక బడలె ననఁగ దంత్యచజలు.

124


క.

చంద్రమశ్శబ్దమునకుఁ దజ్జంబు ౘంద, మామ జాతికి ౙాజి శ్యామకును ౙామ
శర్కరకుఁ ౙక్కెరయు నగు జలము ౙల్లు, (జమ్మికడఁ గామెపలి నున్న చక్రపాణి.)

125


వ.

చంద్రమశ్శబ్దతద్భవంబు ౘందమాను, ౙాజికి ౙాజి, శ్యామకు ౘామ, శర్కరకు
ౘక్కెర, జలమునకు "లళయో రభేదః” అను సూత్రముచేత జళము, దానికి
"లడయో రభేదః” అనుదానిచేత జడ మాయెను. అది ప్రాకృతముచేసిన నాది
వర్ణము దంత్యమాయెను. అది తద్భవము చేసి బహువచనము చేసిన జల్లు.

126


క.

తొడరు జటాశబ్దమునకు, ౙడ యనునది తద్భవంబు ౘదలును ౙానుం
గడు నచ్చతెనుఁగు లివి పద, పడి మూఁడును దంత్యములుగఁ బలుకఁదగు హరీ.

127


వ.

జటాశబ్దతద్భవము ౙడ.


ఆ.

ౙడలు మెఱయ వచ్చి సంయమిశ్రేష్ఠుఁడు, ౘదలుమ్రానిపువ్వు శౌరి కిచ్చె
సరస నున్న దనుచు ౙా నొప్ప భీష్మక, తనయ కిచ్చె నతఁడు దగ వెఱింగి.

128

పారిజాతాపహరణమునందు (1-44) —

సీ.గీ.

దేహకాంతు[55]లు బాలచంద్రికల నీన, ౙడలు మోక్షద్రుపల్లవశంకఁ జేయ

నైషధమునందు (ఆ.1.49) —

సీ.పా.

ౘదలేటింగారుజలరుహంబుల[56]తూండ్లు, భోజనంబులు మాకుఁ [57]బువ్వుఁబోఁడి

130

అనంతునిఛందమునందు (2-35) ౼

ఉపజాతి.

పినాకికోదండము బిట్టు ద్రుంచెన్, [58]తా నొప్ప గెల్చె న్జమదగ్నిసూనున్
ఘనుం డితం డుర్వి ననంగ రెంటన్, ౙానైనవృత్తం బుపజాతి యయ్యెన్.

131


క.

భూమినిఘంటునఁ 'జంచః పామరజాతీయ' యనుట పరికించి బుధ
గ్రామణులు చంచు లని వెసఁ దా మేత్వం బిడరు వడికి తలకట్టగుటన్.

132


తే.

ప్రాసముల రెండు నొకటిగా బలుకవచ్చు
వడికి స్వరమైత్రి లేకున్న నుడుగరాదు
పొట్టియెత్వములకు దంత్యములకుఁ దక్క
భేదములు లేవు చజలకు వేదవేద్య.

133


రాచనెలఁతలందు [59]నేచెలియకు భోజ, రాజతనయవంటియోౙి గలదె
ౘక్కఁదనముఁ గాక సద్గుణంబును గాంచెఁ, జెఱకుఁగోల ఫలముఁ జెందినట్లు.

134


తే.

దంత్యతాలవ్యచజలకు ధరణి వ్రాయు, తఱిని శుద్ధాంధ్రలిపిని భేదంబుకలిమి
[60]ద్వ్యర్థకృతులను దలకట్టు లనుచు నొకట, నిదియు నొకదాన నదియును నిడఁగరాదు.

135

రాఘవపాండవీయమునందు (ఆ.1.29) —

ఆ.

ఎందు వేఁట రారె యితరు లేమన సుతో
దారసంగసుఖము తప్పఁ ద్రోచి
తకట పాడురాజయశ మెన్నవై తతి
క్రూరదశరథేశకులము రోయ.

136


వ.

ఈ పద్యములోను రామాయణార్థమునందు 'అజయశ' మని సమాసము చేసి పలుక
జకారము తాలవ్య మాయెను. భారతార్థమునందు 'పాండురాజ' యని సంబుద్ధిగాను
బలికితేను ఆ వర్ణమే మరల దంత్యమున్ను ఆయెను, ఇటువలెనే యాదిమహాకవి
ప్రయోగంబులు చూడగానే, తాలక్యము అర్థాంతరమందు దంత్యముగా చెప్ప
రా దని యెట్లాగంటివోయి అంటేను ఆద్యప్రకృతియందు దంత్యచజలు లేవు గనక
శుద్ధసంస్కృతమైన పాండురాజశబ్దమునందు గల జకారము తాలవ్యమే కానీ
దంత్యము కానేరదు. ఇది తెలియక కేవలాంధ్రులు దంత్యాక్షరముగా నుచ్చరింతు
రది లాక్షణికమతము కాదు. అట్లు గనకనే సకలకవితాప్రవర్తకులైన సూరప
రాజుగారు ఇంతపట్టును విచారించే ప్రయోగించినారు.

137

పాణినీయసూత్రము

సూ.

ఛే చ.


వృ.

హ్రస్వస్య, ఛే పరే తుగాగమ స్స్యా త్సంహితాయాం విషయే.
'హలంత్య' మితి సూత్రేణ కకారస్య ఇత్సంజ్ఞా. "తస్య లోప” ఇతి లోపః తు,
“ఉపదేశే౽జనునాసిక ఇ" దితి (ఉకారస్యేక్సంజ్ఞాయాం తస్య లోప ఇతి) ఉల్లోపః.


సూ.

స్తో శ్చునా శ్చుః.


వృ.

స్తోః=సకారతవర్గయోః (శ్చునా=) శకారచవర్గాభ్యాం యోగే (శ్చు&=)
శకారచ వర్గౌస్తః. [61]శివచ్చాయా.


సూ.

ఆఙ్మాఙో శ్చ.


వృ.

ఏతయో శ్ఛే పరే తుగాగమ స్స్యాత్, ఆచ్ఛాదయతి, మాచ్ఛినత్,
'పదాంతా' ద్వేతి వికల్పాపవాదః.


సూ.

దీర్ఘాత్.


వృ.

దీర్ఘా ఛ్ఛే పరే తు క్స్యాత్. హ్రీచ్ఛతి, మ్లేచ్ఛతి.


సూ.

దాన్తాద్వా.


వృ.

దీర్ఘాత్పదాన్తాచ్ఛే పరే తు గ్వా స్యాత్, లక్ష్మీచ్చాయా, లక్ష్మీఛాయా.


సీ.

ఛాగపుచ్ఛచ్ఛటాచ్ఛందోయదృచ్ఛాసితచ్ఛత్రపద్మచ్ఛదచ్ఛలాచ్ఛ
విచ్ఛిత్తికచ్ఛాపకచ్ఛపరిచ్ఛేదపృచ్ఛాచ్ఛవిచ్ఛిరతుచ్ఛగుచ్ఛ
పదములు మొదలైన త్రిదశభాషాశబ్దముల నాదిమధ్యాంతములను గలుగు
సప్తమవ్యంజనాక్షరము హ్రస్వముమీఁదఁ దనక్రిందఁ దాన ద్విత్వ మగుచుండు


త.

నిడుదలగు నక్కరంబుల కుడిని నిలుచు, నప్పుడ వికల్పకంబున నట్లన యగు
బంధురవిలాస చంద్రికాభదరహాస, భర్మమయవాస శ్రీకామెపలినివాస.

138

టవర్గాక్షరభేదంబులు

ఆ.

ఠవర ఠీవి ఠేవ ఠావును ఢాకయు, మొదలుగా ద్వితీయములు చతుర్థ
వర్ణములును గలుగు వాక్యంబులను స్వదే, శ్యములు గాని వైకృతములు గావు.

139

విజయవిలాసమునందు (ఆ.3.56) —

క.

కొమ్మపయి నీవు పక్షము, లిమ్మెయి నెరపుదు వి దేల యేచెద వకటా
కమ్మఁగ నవాతుచక్కెర, గ్రమ్మఁగ మాటాడు ఠవర కలకంఠవరా.

140

మనుచరిత్రమునందు (ఆ.1.76) —

క.

దివి బిసరుహబాంధవసైం, ధవసంఘం బెంత దవ్వు దగ లే కరుగున్
భువి నంత దవ్వు మేమును, ఠవఠవ లే కరుగుదుము హుటాహుటినడలన్.

141

పాండురంగమాహాత్మ్యమునందు(ఆ.3.10) —

సీ.గీ.

సుఖులు పరిహాసకులు వెంటఁ జనఁగ యువతి, భుక్తనిర్ముక్తపరిధానయక్తుఁ డగుచు
నగరఘంటాపథంబున నగుచుఁ దిరుగు, నొఱపుగల ఠీవి జాతిమాత్రోపజీవి.

142

రామాభ్యుదయమునందు (ఆ.6.18) —

సీ.పా.

[62]ఠేవ మీఱఁ దటిన్నటీపంక్తిఁ బ్రేరించి కోపుగా మెఱుములు గొనఁగఁ జేసి

143

[63]సుభద్రాపరిణయమునందు (ఆ.1.85) —

శా.

దేవబ్రాహ్మణభక్తిప్రోవు ప్రియవక్తృత్యంబు కాణాచి వి
ద్యావైదుష్యము దిక్కు ధర్మమునకుం దార్కాణ మర్యాదకున్
ఠా వౌచిత్యము జీవగఱ్ఱ హితశిష్టవ్రాతసంతోషణ
శ్రీవజ్రాంగి యజాతశత్రుఁడు మహీభృన్మాత్రుఁడే చూడఁగన్.

144

శశబిందుచరిత్రమునందు —

క.

నాకౌకసు లైనను నీ, ఢాకకు నిల్చెదరె కటకటా మముబోట్లం
జేకొని సంరక్షింపక, నీ కిటు లుచితంబె యురవణింప నరేంద్రా.

145


సీ.

క్ష్వేళంబు క్ష్వేడంబు చోళుఁడు చోడుఁడు తాళంబు తాడంబు దళము దడము
క్రోళంబు క్రోడంబు నాళంబు నాడంబు నీళంబు నీడంబు గౌళి గౌడి
వ్యాళంబు వ్యాడంబు చూళిక చూడిక వళి వడి హేళి సర్వజ్ఞ హేడి
జలకేళి జడకేడి వెలలఁడు వెడలఁడు కేళంబు కేడంబు పాళి పాడి


తే.

నేవళము నేవడం బిట్లు నిర్జరాంధ్ర
భాషలను రెండు కొన్నిశబ్దంబులందు
నరయ "లడయో రభేద” యటన్నసూత్ర
మున ళకారంబునకు డత్వములు ఘటించు.

146

సీ.

డిండిరదీప్తిపోఁడిమి మీఱు నీకీర్తి దిండీరపాండిమఁ దెగడు నవ్వు
డంభ మిచ్చటను గూడదు కృష్ణ నీ వేఁగి దంభంబు మిత్రవిందకడఁ జేయు
డాడిమీఫల మియ్యెడకు నేల కొనిపొమ్ము దాడిమీఫలము [64]సుదంత కిమ్ము
డోలిక నూఁగువేడుక నీకుఁ గల్గిన దోళిక లక్షణతోడ నెక్కు


తే.

మనుచు నీ పద్యమునఁ జరణాదులందు, నిలుపు పదముల మొదటను గలుగువ్రాలు
డత్వరత్వంబులందు రెంటను బొసంగు, శాబ్దికమతంబునను వనజాతనయన.

147


తే.

డంభడిండిరడోలికాడాడిమాది, శబ్దముల కాదివర్ణంబు సంస్కృతమున
నుపరివర్గతృతీయమై యొప్పునట్ల, తెనుఁగున డకారము [65]దవర్ణ మొనరుచుండు.

148


తే.

దాక దగ్గఱ దిగ్గియ దాయ దోయ, దాపలను దిగ్గు మను వైకృతములమొదల
డాక డగ్గఱ డిగ్గియ డాయ డోయ, డాపలను డిగ్గు మని డా కడంగి నిలుచు.

149

రాజశేఖరచరిత్రమునందు (ఆ.3.167) —

శా.

డాకేల న్నిజకన్యకామణులు కంఠశ్రేణి గీలించి వీ
క్షాకంజాతము లాత్మపాదనఖరేఖం దార్చి సంగీతవి
ద్యాకౌశల్యము గానరా మదికి నాహ్లాదంబు సంధిల్ల గౌ
[66]రీకల్యాణముఁ బాడి రప్పుడు పురంధ్రీరత్నముల్ వేడుకన్.

150

ద్రోణపర్వమునందు (ఆ.5.381) —

చ.

డిగకుఁడు వాహనంబులు గడిందిమగంటిమి గోలుపోవ మీ
రు గడఁక [67]దక్కి పెట్టకుఁడు రూపఱ నాయుధము ల్మహాస్త్రశ
క్తి గెలుతు [68]నేన మత్కులితతీవ్రశరంబులవైభవంబు [69]భూ
రిగదవిహారభంగియు నరిప్రకరంబులు పిచ్చలింపఁగన్.

151

ఉద్యోగపర్వమునందు (ఆ.2.52) —

ఉ.

డక్కెను రాజ్య మంచు నకటా యిటు తమ్మునిభాగ మీక నీ
వెక్కటి మ్రింగఁ జూచెద వ దె ట్లరుగున్ విను మీను లోలతన్
గ్రక్కున నామిషంబుచవి గాలము మ్రింగినమాడ్కి సువ్వె యి
ట్లుక్కివుఁడైన నీకొడుకునుల్లము ని న్నిటు లాడఁ[70]గూడునే.

152

వైజయంతీవిలాసము (ఆ.4.36) —

తే.

డొంగవలె వచ్చి యిక్కడ [71]డొంగినా వ, దేమయా బావగారు పెద్దామె కోప
గించినందులకా బళా మంచివాఁడ, వేమనందును ముసలామెయే వివేకి.

153


వ.

డంభడిండీరాదిశబ్దములవలెనే యన్నందుచేతను రెండును గలవు గనుక డకారమునకు.

154

ఆరణ్యపర్వమునందు (ఆ.7.290) —

క.

జగముల నెల్లను నిండిన, [72]పొగడ్తకును వెలితి చేసి పొల్లయొడలికై
తగునే జన్మవ్రతములు, దిగ విడువక నిపుడు నాకుఁ ద్రిభువనదేవా.

155

ఉద్యోగపర్వమునందు (ఆ.2.9) —

క.

తగ నీలో నూహింపుము, దిగ విడువక ధర్మతనయు దృఢమతి వై పొం
దగుచందము కొడుకులకును, బ్రెగడలకును జెప్పి [73]తేర్పు పెం పేర్పడఁగన్.

156

పారిజాతాపహరణమునందు (ఆ.2.10) —

ఉ.

తామర[74]డోయలోఁ దవిలి దాఁటిడు తేఁటులువోలెఁ బెన్నెఱుల్‌
వేమఱుఁ జేతులం బిడిచి విప్పి విదిర్చి నఖాంకురంబులన్
గోమలలీల దువ్వి తెలిగొజ్జఁగినీ రటు జల్లి చల్లి గం
ధామలకంబు వెట్టె నొకయంగన కాళియనాగభేదికిన్‌.

157


తే.

పడఁతుక వడంకుగుబ్బలిపడుకచెంత, [75]గడము మ్రాఁకులకడ నుంచి గడఁకతోడ
వేఁడుకొనఁ దగు నాపువ్వుఁబోఁడి ననఁగఁ, గడలిపులు గావు సరళము ల్గాని కృష్ణ.

158

నృసింహపురాణమునందు (ఆ.2.14) —

సీ.పా.

వడిగాలి సుడిసిన మిడుఁగురులందందఁ బొదవినఁ దాలిమి [76]వదలనీక

159

(ఆ.3.185) —

చ.

కడిఁదివరంబు వారిరుహగర్భునిచే గొనినాఁడు వాఁడు మీ
యెడ ననిశంబు [77]పెన్పగయు నీసును రోషము నెమ్మనంబులో
జడిగొని యుండుఁ గావున నసాధ్యుఁ డవధ్యుఁడు దైత్యనాథుఁ డే
వడువునఁ బౌరుషంబు గొని వాని జయించుట వ్రేఁగు చూడఁగన్.

160

రాఘవపాండవీయమునందు (ఆ.1.19) —

సీ.పా.

పుడమిఱేఁ డీరీతిఁ గడఁగి డెందము మృగవ్యాపారఖేలన మభిలషింప

తే.

పోఁడిమియు నురవడియును నాఁడెమునను, బలుకులు దృతీయసరళముల్ వలసినపుడు
భువి స్వకీయానునాసికంబులును గాఁగఁ, బలుకఁబడు నాదికవుల కబ్బములకలిమి.

161

రంగనాథుని రామాయణమునందు ద్విపదము —

రాణివాసద్రోహి రావణుఁ బట్టి, పోణిమి చెఱుపవా బుధులు నుతింప

162

రాఘవపాండవీయమునందు ద్విరదగతి రగడము (ఆ.2.6) —

పోణిమిగ వకుళకుడపూగములఁ బూగముల, రాణఁ దనరారిన పరాగముల రాగముల

163

కర్ణపర్వమునందు (ఆ.2.148) —

తే.

సారవంతమై కర్ణునిసైన్య మురవ, ణించుఁగా కేమిటికి నిల్చు నృపవరేణ్య
పూని జేయంగ[78]ఁదగినదిగాన శార్య, మతని సమయించుటయె నాకు నది భరంబె.

164

శాంతిపర్వమున (ఆ. 2. 224) —

[79]చ.

యజనము దానకర్మములు నధ్యయనంబు తప స్సహింసయున్
బ్రజ కనురాగమైన పరిపాలన శాంతియు సంగరంబున
న్విజితవిభీతమై యురవణించుటయు న్నృపధర్మముల్ కురు
ప్రజతిలకాయమాన సమరంబు సుధర్మము వీనిలోపలన్.

165

చంద్రికాపరిణయమునందు —

ఉ.

నాణెము [80]సూడ నున్న దితినందను లందఱు నొక్కరాశి దు
ష్ప్రాణుఁడు వీఁ డొకండు నొక[81]రాశియుఁ జుండు జగంబు గాల్పఁ గ
ల్యాణవిదూరులౌ కడమ యందఱు పుణ్యజనాఖ్యులు న్జగ
త్ప్రాణసమాఖ్యుఁ డీఖలుఁడు నైరి సుడీ [82]విపరీతలక్షణుల్.

166

తవర్గాక్షరభేదంబులు

ఆ.

వెతకి వాని కతికె జతికిలఁ బడి యావుఁ, బితుక చీర లుతికెఁ గొతికె ననుచు
బలుకుచోఁ దకారముల దకారములును, వలసెనేని నిలుపవచ్చుఁ గృతుల.

167

కవిగజాంకుశమునందు —

క.

ఒదుగుచు లక్షణ మెఱుఁగక, కొదుకుచుఁ బ్రాసంబు వడియుఁ గూడక మీఁదుల్
వెదకుచుఁ బదసంధులు చెడ, నదుకుచు వెడకవిత చెప్పునతఁడుం గవియే.

168

ఆముక్తమాల్యదయందు (ఆ.1.83) —

చ.

కదళిగభీరపుష్పపుటికాచ్ఛటఁ జేతుల నిప్పపిండి పైఁ
గుదురుగ నిల్పి యోపుగతి గూనల నూనియ నించి త్రాట ము
న్నుదినశాటి వ్రేల నది నొక్కటఁ గ్రుం కిడి వత్తు రెంద ఱే
వదలక యాతనింట శనివారమునం [83]బరదేశవైష్ణవుల్.

169

చిత్రభారతమునందు (1-12) —

చ.

చదివినవారికి న్వినిసభ్యుల కున్నతి వాంఛ సేయు బ
ల్లిదులకు గల్గు విప్రులకు లేఁగలతోఁ గనుకట్టు లక్ష పె
న్మొదవుల నిచ్చునట్టి ఫలము న్హయమేధము సేయు పుణ్యమున్
గొదకక రాత్రి యంతయు యకుంఠితదాన మొనర్చు శ్రేయమున్.

170

కళాపూర్ణోదయమునందు (ఆ.4.56) —

చ.

అది శతతాళదఘ్న మను సార్థకనామముతోడ నుత్తమ
హ్రదములలోఁ బొగడ్తఁ గనినట్టిది యందునఁ బడ్డవానికిన్
బ్రదుకులె యంచు...

171

వసిష్ఠరామాయణమునందు (ఆ.1.7) —

చ.

కదిసిన [84]నోరు వోయి మఱి గబ్బపుదొంతుల సత్పదార్థముల్
గదుకుచు నెట్టివారిఁ బొడగన్నను గుఱ్ఱని స్నేహసౌఖ్యముల్
మదికి [85]నసహ్యమౌ శునకమార్గమునం [86]జరియించుచున్న త
త్పదకవు లెల్ల మత్కవిత తప్పులు పట్టక యూరకుండుఁ డీ.

172

అంతస్థులభేదంబులు

శబ్దానుశాసనమూలసూత్రము

మూ.సూ.

లఘవో౽లఘవ శ్చెతి ద్వేధా న్తస్థా న్వదన్తి శాస్తారః,
అన్యే౽న్యవ్యాకరణస్పష్టా రస్త్వత్ర గృహ్యతే ద్వివిధః.


క.

అలఘులఘునామకంబుల, నలరు నిరుదెఱంగు లగుచు నంతస్థము లీ
తెలుఁగున నయ్యెను రేఫము, యలవలు సెప్పఁబడి యుండు వ్యాకరణములన్.

173


క.

ఆద్యంతాంతస్థంబులు, చోద్యంబగు పాణినీయసూత్రమువలనన్
హృద్యములై యాగమసం, [87]వేద్యా లఘ్వలఘువు లన ద్వివిధము లయ్యెన్.

174

పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/187 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/188 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/189 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/190 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/191 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/192 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/193 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/194 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/195 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/196 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/197 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/198 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/199 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/200 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/201 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/202 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/203 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/204 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/205 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/206 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/207 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/208 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/209 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/210 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/211 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/212 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/213 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/214 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/215 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/216 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/217 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/218 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/219 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/220 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/221 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/222 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/223 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/224 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/225 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/226 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/227 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/228 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/229 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/230 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/231 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/232 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/233 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/234 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/235 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/236 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/237 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/238 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/239 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/240 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/241 పుట:అప్పకవీయము (కాకునూరి అప్పకవి).pdf/242

  1. కీరనౌహస్తి (ప,వా)
  2. భూతార్ధద్యోతిన మాద్యగం వినా
  3. కచటతపానింద్యాః (సూ)
  4. 15-20 శ్లోకముల వివరణము తృతీయాశ్వాసములో ఉన్నది.
  5. లిఫులు - అని ప్రాచీనముద్రణము
  6. పిల్లగుడికిఁ బేరు (సూ)
  7. మయ్యె (సూ)
  8. పైన (సూ)
  9. లీవలపల (సూ)
  10. అలఘురల (సూ)
  11. నిలుపంగ వరుసఁ దనరు (సూ)
  12. ఈ రూపములు సరియయినవి కావు, పూర్వకాలపువ్రాఁత ఎట్లుండెనో తెలియగోరువారు బర్నెలు వ్రాసిన 'సౌతిండియన్ పేలియాగ్రఫీ' అనే పుస్తకము గాని, ఆంధ్రవిజ్ఞానసర్వస్వముగాని చూడవలెను. (గి). వీనిరూపములు (శివ)ప్రతిలో భిన్నములుగా నున్నవి (రా).
  13. లెల్లను
  14. పోరకిమ్ము (ఓ,సూ)
  15. పొం దూఁచి (ప)
  16. చూ. పు. 48 అధస్సూచిక. (?) శివ. ప్రతిలో అర్ధబిందువునకు '‿' ఇట్టి రూపము వ్రాయఁబడినది. అచ్చుల కీగ్రంథమున రూపములు ముద్రితములు గావు. శివ. ప్రతిలో ఇంచుమించు నేటికాలపు అకారాదిరూపము వ్రాయఁబడి యున్నది (రా).
  17. నౌ (శివ)
  18. పొల్లు
  19. విభజించియు లిఖింతు రిలఁ గుమతులు.
  20. ఈప్రాఁతలిపులు ప్రతిపుస్తకమున వేఱువేఱుగా నుండుటంజేసి వీని కుదిరిక చక్కఁగాఁ తెలియఁబడదయ్యె (సూ.) శివ. ప్రతిలో దీని లిపిరూపము వేఱుగా నున్నది; పోల్చుకొనుటకు వీలుపడకున్నది (రా.)
  21. పూర్వులు నిట్లు జడ్డలు వ్రాసినట్లే కనఁబడుచున్నవి. అప్పకవి నాఁటికి మార్పుకలిగినది కాఁబోలును. (గి)
  22. పొల్ల. 'హల్లు' అనుట తప్పు (గి)
  23. దొలఁగిచనునవి పదమూఁడు
  24. సూత్రమునందు (పూ.ము.). సూత్రములేకాక ధాత్వాదులుగుడ ఉపదేశము అనఁబడును. ఉపదేశమాద్యోచ్ఛారణము.
  25. నగళ్లు (సూ)
  26. 'విశ్రుతి' పాఠాంతరము
  27. మీసువిహిత (సూ)
  28. భ్రూవల్లిమదంచనంబుకమును (సూ)
  29. గలిగి...గతిని నుండు (సూ)
  30. జగతిఁ బరఁగు (సూ)
  31. దాల్చి
  32. లఁజేత మాఱిచి (అచ్చుప్రతి)
  33. వ్రేఁ గడఁచి (సూ)
  34. వేసవి
  35. గలఁగి తలఁగి పోనేరక
  36. నా నింపొనర్చె (అచ్చుప్రతి)
  37. హల్లోపమునకు (సూ)
  38. నృసింహపురాణమున కిది నామాంతరము (రా)
  39. యొసంగెఁ (ప)
  40. ఓదా (పాఠాంతరము)
  41. కఱచు
  42. బఱచు
  43. మిందునే (పాఠాంతరము)
  44. గార్యంబుగ (పూ.ము.)
  45. నెపంబున నే
  46. గలస్వనంబుతో
  47. స్వైయకృతంబుల (సూ)
  48. సౌవర్చన సౌవిదల్ల సౌదశ్వ (సూ)
  49. నరుం డటు సంపె
  50. ఖండపిచండ
  51. దొవల్మగుడం; దొవల్మునుగం
  52. ఈపాఠము పొరపాటు; "చిన్నబొట్లపై గ, కారములు కాని యంతస్థములు గావు" అని సవరించ నగు (రా). అంతస్థము లనుట సరిగా తోఁచదు. "గ, కారము వకార మెప్పుడు కాదు కాదు" అని యుండనగు.
  53. ఈపాఠము ప్రాచీనముద్రణములోఁ గానరాదు (రా)
  54. లకాలచంద్రికల (అచ్చు పారిజాత.)
  55. తూళ్లు (ప)
  56. పువ్వుబోఁడి (సూ)
  57. జానొప్ప (పూ.మ. యతిభంగము.)
  58. నీచెలియకు (సూ)
  59. ద్వ్యర్థికృతులను (రా)
  60. శివ+ఛాయా (శివ+తుక్ = శివ+తు = శివ+త్+ఛాయా - శివ+చ్+ఛాయా—శివచ్ఛాయా).
  61. ఠేవ మీరంగఁ దటిన్నటి ప్రే రేచి క్రొవ్వుగా మెఱుపులు గొనఁగఁ జేసి (సూ)
  62. విజయవిలాసమున కిది నామాంతరము. (రా)
  63. సుదంతి (సూ)
  64. దవర్ణమునకు వచ్చు (ప), దవర్ణము నగుచుండు (వా)
  65. కల్యాణము వాడి (పూ.ము.)
  66. దక్కిటిల్లనుఁడు (వా); దక్కిదిల్లనుఁడు (ప)
  67. జంప దత్కులిశ (వా), ఁజావ దత్కులిశ (ప), గోత్రభిత్కులిశ (అచ్చు)
  68. భూరిగను విహారభంగుల (వా)
  69. గూఱునే (వా)
  70. డొంకి (ప,వా)
  71. అచ్చుప్రతిలో పాఠాంతరము లున్నవి.
  72. తీర్పు
  73. దోయలో (ప)
  74. గడిమిమ్రాఁకుల (సూ)
  75. ప్రిదుల (అచ్చు)
  76. పెన్బగ (పూ.ము.) పెను+పగ = 'పెన్పగ' అని కాని 'పెంబగ' (ప్రాఁతాదిసంధి) అని కాని యుండును, 'పెన్బగ' అను రూపము పొరపాటు. (రా)
  77. వలయుఁ బ్రధానకార్య, మతని సమయించుటయ (అచ్చు)
  78. అచ్చుప్రతిలో పాఠభేదము లున్నవి.
  79. నూదగొన్న (ప)
  80. రాశి యజుండు (పూ.ము.)
  81. విపరీతలక్షణన్ (వా)
  82. బరదేశి (అచ్చు)
  83. నోరువోవుదురు; నోరువోయియొరు
  84. నసహ్యమై
  85. జరియింపకున్న సత్పద; జరియింపుచున్న సత్పద; దుష్పథకవులెల్ల (సూ)
  86. వేద్యా లఘులఘువులనఁగ (సూ)