అప్పకవీయము/పీఠిక
శ్రీరస్తు
అప్పకవీయము[1]
పీఠిక
| 1 |
తే. | కమల యెందును దనరూపు కాంచి యలిగి | 2 |
క. | వననిధినందన కుయ్యెల, యనువునఁ దనరారి వారిజాక్షునివక్షం | 3 |
తే. | కౌస్తుభంబును వనమాలికయును దనకు, దిగువగా [4]లచ్చి నొసలిపై దిద్దినట్టి | 4 |
మ. | ధరఁ గాళిందితటంబునం గలుగు బృందాకాననాంతంబునం | 5 |
సీ. | |
| కౌమోదకీసంజ్ఞఁ గని కృష్ణుదాపలిరెండవకరమున నుండు నెద్ది | |
తే. | శార్ఙ్గ మనఁ దనరారి కేశవునివామ, బాహుయుగమూలమునఁ గనుపట్టు నెద్ది | 6 |
తే. | కాలమేఘమునందుఁ బ్రకాశ మొందు, [8]కారుమెఱుఁగుతెఱంగునఁ గైటభారి | 7 |
క. | బాలతమాలాగ్రమునం, గ్రాలు శబీనాథుకార్ముకంబో యనఁగా | 8 |
క. | భువనగకచ్ఛప[9]కిరిమా, నవసింహాదిత్యభృగుజననరాఘవయా | 9 |
శా. | 10 |
క. | దాంతు హరిచరణ[12]భక్తి, స్వాంతు రసాతలనిశాంతు నత్యంతదయా | 11 |
తే. | నామదిఁ దలంచెద సుపర్ణనామధేయు, మురహరవిధేయు నమరసమూహగేయుఁ | 12 |
క. | తిన్ననివేత్రము కలుముల, కన్నియ [13]వన్నియను హస్తకమలతలమునం | 13 |
ఉ. | పాయక కొల్తు రామజనపాలుఁడు జానకిఁ జూడ నంపుచోఁ | 14 |
క. | శుక భీష్మ విభీషణ శౌ, నక రుక్మాంగద వసిష్ఠ నారద [14]బక దా | 15 |
వ. | అని యివ్విధంబున. | 16 |
క. | పాతతహేతి పరిజన, వ్రాతంబుగ శేషశయను వనరుహనయనున్ | 17 |
బ్రహ్మాదిస్తవము
చ. | తనజనికారణం బయిన తామరకున్ హితుఁ డౌటచే విక | 18 |
క. | శారద విద్యాజాలవి, శారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్ | 19 |
చ. | కడు కఠినంబు లద్రులు జగంబుల సందున సంభవించి పెం | 20 |
చ. | పరిణయవేళయందుఁ దనపాదముఁ [16]బట్టుక నన్నెకంటిపైఁ | 21 |
చ. | ననుఁ గని యొక్కయెత్తుననె దక్షజయు న్నిటలాక్షుఁడు న్ముదం | 22 |
చ. | జనకునిఁ గొల్వ వచ్చు నలచామరకర్ణునితేజి నందివా | 23 |
క. | హరిశిఖియమదైత్యాంబుప, మరుద్ధనపశివు లిభాజమహిషనరాంభ | 24 |
క. | 25 |
కవిస్తుతి
సీ. | వల్మీకభవుపాదవనరుహంబులు కొల్చి సాత్యవతేయుఁ బూజనము సల్పి | |
తే. | చోరుఁ గడుఁ బ్రస్తుతించి మయూరు నెంచి, మాఘు భూషించి భారవి మదిఁ దలంచి | 26 |
సీ. | శబ్దశాసనుపాదజలజంబులు భజించి యుభయసత్కవిమిత్త్రు [20]నభినుతించి | |
తే. | రామరాజవిభూషణరత్నఖచిత, చారుమస్తకలాపాదిహారివాక్య | 27 |
తే. | కాళిదాసమయూరాదికవుల కైనఁ, గలవు తప్పు లనంగ నన్యులకు లేవె | 28 |
వ. | అని వర్తమానకవులం బ్రార్థించి. | 29 |
క. | వినఁదగు వెండియుఁ బొత్తము, గనఁ దగు బుధజనుల నడుగఁగాఁ దగుఁగా కెం | 30 |
గురుస్తుతి
సీ. | ఆదిని రెండవవేదంబు చెప్పిన మార్తిసర్వన్నఁ గ్రమస్వరాదిఁ | |
తే. | స్మార్తకర్మంబు లెఱిగించి సభలఁ బూజ్యుఁ, జేయు నల[22]కొలిచలిమల్లసింగనార్యు | 31 |
క. | అని యిష్టదేవతాస్తుతి, యును సకలకవీంద్రులనుతియును గురునుతియున్ | 32 |
స్వప్నప్రకారము
సీ. | ధాతరెండవపరార్ధమున నాదిదినంబుపగటి వరాహకల్పంబునందు | |
తే. | నంగజాబ్దంబునను దక్షిణాయనమున, జలధరర్తువు [24]మొదలిమాసంబునందు | 33 |
సీ. | చక్రవాళాంతరక్ష్మామధ్యసంస్థితదైవతగోత్రంబు దక్షిణమున | |
తే. | 34 |
క. | కల్పోక్తమార్గమున సంకల్పము గావించి గోపికావిభుపూజల్ | 35 |
సీ. | |
తే. | 36 |
వ. | ఇట్లు నిలిచిన. | 37 |
క. | కరములు రెంటను దాల్చిన, పరికరములు చూచి యతనిఁ బరమేశునిఁగాఁ | 38 |
భగవద్వాక్యము
ఆ. | [33]మోడ్పుఁగేలు ఫాలమునఁ జేర్చుకొనియున్నఁ, గరుణ నతఁడు నన్నుఁ గాంచి పలికె | 39 |
ఉ. | 40 |
క. | వినియును గనియును నెఱుఁగని, ఘనఫక్కిం దెనుఁగుఁ జేయఁగా నెట్లగు నా | 41 |
గ్రంథప్రభావము
తే. | ఆంధ్రశబ్దచింతామణివ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ దెనుంగు | 42 |
వ. | ఆసమయంబున. | 43 |
తే. | 44 |
ఉ. | ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో | 46 |
క. | ఆ మూఁడుపర్వములలో, నా మాన్యుఁడు నుడువుతెఱఁగు లరసికొని కృతుల్ | 47 |
తే. | రాజరాజరేంద్రతనూజుఁ డార్య, సఖుఁడు సారంగధరుఁడు శైశవమునందు | 48 |
క. | 49 |
క. | ఆ లోకనుతుఁడు మొన్నటి, [42]కీలకసమమున మతంగగిరికడ నొసఁగెన్ | 50 |
క. | ఆదిని భీమకవీంద్రుఁడు, గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున నా | 51 |
క. | ఇల నెనుబదిరెం డార్యలు, గలిగి పరిచ్ఛేదపంచకంబునఁ దగు నీ | 52 |
క. | మును నారాయణధీరుఁడు, తనకు సహాయుఁడుగ సంస్కృతము వాగనుశా | 53 |
క. | సురభాషయందు నల్సా, క్షరముల బహుసూచితార్థసారము లిముడిం | 54 |
తే. | నారికేళపాకంబుగా నన్నయకవి, ప్రక్రియాకౌమిదిని [43]ముట్టఁ బలికెఁ గానఁ | 55 |
ఆ. | శబ్దశాసనుండు సంస్కృతగ్రంథంబు, గానఁ దెలుఁగుమాట గలయ రామి | 56 |
తే. | 57 |
చ. | రమణను సత్కవీంద్రులు పురాణచయం బితిహాసపంక్తికా | 58 |
క. | 59 |
తే. | ఆంధ్రభాషామహాకాననాంతరమున, సంతతంబును శబ్దాపశబ్దసరణు | 60 |
తే. | కవుల కుపకార మగుటచేఁ గలుగు సుకృత, లాభ [49]మందున నగు సర్వశోభివృద్ధి | 61 |
ఆ. | ధరణి నీకు నిష్టదైవ మెప్పుడుఁ గామె, పల్లె నున్నచక్రపాణి యగుట | 62 |
చ. | 63 |
క. | ఆ విపు నతిథిఁగా సం, భావించి భుజింపఁ బెట్టి భాషించునెడన్ | 64 |
క. | 'నన్నయభట్టీయములో, నెన్నఁగఁ బ్రథమార్య గాదె యీపొత్తములో, | 65 |
వ. | మదీయస్వప్నవిధం బంతయుఁ దేటపడ నెఱింగించిన నాకర్ణించి సకలజనంబులు | 66 |
క. | 'హరిఁ గాంచుటచే మోక్షము, సిరిచే నర్థంబు ధాత్రిచే భూమియు శం | 67 |
ఆ. | శ్రేయ మబ్బు ననుచుఁ జెప్పె విష్ణుఁ డనఁగ, మంచి కల యటంచు నెంచ నేల | 68 |
వ. | అదియునుం గాక. | 69 |
కర్తృవంశావతారము
సీ. | శ్రీవిష్ణునాభిరాజీవసంభూతుఁ డే, వసుమతీసురునకు వంశకర్త | |
తే. | యతఁడు తనరారు సర్వలోకైకయోగ్య, తారకాపథవర్తి విస్తారకీర్తి | 70 |
తే. | అమ్మహామౌనిగోత్రాబ్ధి నవతరించి, తమ్ములును దాను నన్యోన్యతను దనర్చి | 71 |
తే. | అతఁడు మధురను బుధసమూహములఁ దొడరి, వేదశాస్త్రపురాణాదివాదములను | 72 |
సీ. | |
తే. | 73 |
చ. | 74 |
తే. | గంగయందుఁ గుమారుని గాంచె నొకని, సోముని డని చెప్పుటెల్లను జోద్యమగునె | 75 |
వ. | [63]వా రెవ్వ రనిన. | 76 |
సీ. | అమరేశ్వరుండు భోగాతిశయంబున నమరేశ్వరుం డన నతిశయిల్లు | |
తే. | 77 |
సీ. | ఒకనివాకిలిఁ గాచి యుండఁ దెన్నటి కైన నుగ్రుఁడు గాడు దా నొక్కనాఁడు | |
తే. | డిన్ని సద్గుణములు గల్గెనేని పూని, జోడు సేయంగ పచ్చు నాసోముఁ గాకు | 78 |
సీ. | కొట్టించె నెవ్వఁడు గురువాసి వప్రదక్షిణభాగమున రొంపిచెర్లలోనఁ | |
తే. | క్షితిఁ దలంపఁగ సర్వజ్ఞశేఖరుండు, సత్పథవిహారి ద్విజరాజచారులక్ష | 79 |
ఉ. | 80 |
క. | వినుతమతిఁ గాకునూరిజ, ననమణి యగు సోమునగ్రనందనుఁ డగు వెం | 81 |
తే. | పల్లెనాటను నూటతొంబదియు నాల్గు | 82 |
ఆ. | కాకునూరి వెంగఘనుఁడు సేసమయందుఁ గాంచె మొదల నప్పకవిని నిన్ను | 83 |
క. | శ్రీగిరిని పిలిచి నీవును, భోగవిభీషణుని పట్టపుకవీంద్రుఁడవై | 84 |
సీ. | జగతి నాపస్తంభశాఖోక్తషట్కర్మపద్ధతిఖండనిబంధనంబు | |
తే. | లలితకవికల్పకాఖ్యానలక్షణంబు, మహితసాధ్వీజనౌఘధర్మద్విపదము | 85 |
క. | ఇట్టిమహాగోత్రంబున, బుట్టిననీ కిట్టిశుభముఁ బొందుట యరుదే | 86 |
| పరమోత్సుకతను నన్నయ, విరచించిన ఫక్కి వ్రాసి విప్రుని గాశీ | 87 |
కవివిచారము
క. | లోకంబునఁ గల విబుధా, నీకములో నెదిరిఁ బోల నేరుతు నైనన్ | 88 |
తే. | మహిని వాగనుశాసనమయుఁ డొనర్చు, నిమ్మహాగ్రంథ మను నాప యెక్కి యాంధ్ర | 89 |
ఉ. | ఎన్నఁగ నన్నయాఖ్యకవి యీ కలికాదిని జెప్ప దాని భీ | 90 |
క. | మూలము చెప్పిన నన్నయ, భూలోక హ్మ యతనిబుద్ధి దెలిసి వ్యా | 91 |
క. | ఎక్కడి మతంగపర్వత, మెక్కడి కామెపలి సుకపు లీలో లేరే | 92 |
క. | ఆతిక్కనముఖ్యకవి, వ్రాతముచే నీ తెలుంగువ్యాకరణము ధా | 93 |
వ. | మత్పురాతనజననఘనవరతపోవిశేషంబువలనన కదా యని నింతించి నితాంతసంతు | 94 |
తే. | తన యనుగ్రహమునఁ జెప్పు మనుచు నిన్నఁ, గలను వచ్చిన హరి తానె కలఁడు నాకుఁ | 95 |
వ. | ముందు బృందారకభాష నశేషవిద్యాజలజాసనుండగు శబ్దానుశాసనుండు సంక్షే | |
| బును నను నామంబుల నభిరామంబు లగు నాశ్వాసంబు లెనిమిదిగా నెలకూచి | 96 |
క. | దశమీసురగురువాసర, శశితారావజ్రయోగషష్ఠకరణయు | 97 |
వ. | ఇట్లు కృతప్రారంభుండనై మదీయేష్టదేవతం గాంచి నమస్కరించి వినుతించి | 98 |
షష్ఠ్యంతములు
క. | సాయసవేంకటపతిభూ, నాయకదత్తాగ్రహారనగరప్రాగ్దే | 99 |
క. | శ్రుతిశాస్త్రాగమజితగీ, షిపతి వట్టెము పెద్దనార్యసంపాదితపు | 100 |
క. | తంగెడసీమను నిర్జర, గంగాసమ నాగనిమ్నగాపూర్వమునం | 101 |
క. | కేతవరనామపట్టణ, దైతేయాశాసమన్వితనికేతునకున్ | 102 |
క. | అలఘుతరశీలునకు మం, గళగుణజాలునకు దనుజకాలున కింద్రో | 103 |
తే. | అంకితము గాఁగ నేఁ జేయునట్టియాంధ్ర, శబ్దచింతామణిగ్రంథసౌరపాద | 104 |
—————
- ↑
(వా) వావిళ్లవారిప్రతి
(ప) పరవస్తువారిప్రతి
(పె) పెండ్యాలవారిప్రతి
(గి) గిడుగు రామమూర్తిగారు పరిష్కరించిన వావిళ్లముద్రణప్రతి
(పూ.ము.) వావిళ్లవారి 5-వ కూర్పు
(రా) రావూరివారి సవరణ
(సూ) సూర్యాలోక ముద్రితప్రతి. (సూర్య)పీఠిక అని లేదు. ఇక్కడనుండియే ప్రథమాశ్వాసము ప్రారంభమగును. 1-17 పద్యములకు 'ఆయుధపరిజనసహితవిష్ణుస్తుతి' యని శీర్షిక.
(ఓ) ఓరుగంటి రామకవి వ్రాఁతప్రతి - ↑ కే
- ↑ వాంఛితఫలమున్ (వా), వాగ్విభవంబున్ (గి)
- ↑ నొప్ప (పూ.ము.)
- ↑ జనునంచా(సూ)
- ↑ యడమను బయికేల నమరు నెద్ది (వా)
- ↑ కృష్ణుని (రా)
- ↑ కాఱు మెఱుంగు (పూ.ము., సూ) అప్పకవియే రేఫాక్షరసీసమాలికలో దీనిని 'కారు' అని లఘురేఫముగా నిచ్చియున్నాఁడు.
- ↑ కిటి (సూ)
- ↑ విప్పొంద
- ↑ నిష్టముల్ (గి,సూ)
- ↑ వర్తి
- ↑ వన్నెయును
- ↑ బలి (సూ)
- ↑ హరతార, హరదరద, దరహార
- ↑ బట్టియు
- ↑ గణేశు (వా)
- ↑ నుండెడు (వా)
- ↑ సవన్ = క్రీడచే, 'సవో యజ్ఞఃసవా క్రీడా' అభియుక్తవచనము. (గి), 'చవి నిత్తురు' అనుపాఠ మున్న సరసముగ నుండునని తోఁచెడి. చవిన్ = ప్రీతితో (రా).
- ↑ నుచ్చరించి (వా), నుపచరించి (ఓ)
- ↑ భావికవుల (వా)
- ↑ కొలిచలమల (ఓ), కొలచలమల (సూ)
- ↑ క్రీ. శ. 1656
- ↑ మొదటి (సూ)
- ↑ మధ్యంబునను (సూ)
- ↑ నాంధ్రా (గి) వ్రాఁతప్రతులలో నన్నిచోటుల 'ఆంధ్ర'శబ్దమే కనఁబడుచున్నది.
- ↑ కంగేడ (సూ)
- ↑ వల్లెవా టొప్పు (సూ)
- ↑ భూషణంబులఁ జాలఁ (ప)
- ↑ బొదలువాఁడు (వా)
- ↑ బోల్చుఁ (వా)
- ↑ వెసను
- ↑ మోడ్పుకేలు (గి)
- ↑ సూ. శ్వసోవసీయ శ్శ్రేయసః. 5-4-80 పాణిని అష్టాధ్యాయి. శ్వశ్శ్రేయసం శివం భద్రం కల్యాణం మంగళం శుభమ్. అని అమరము.
- ↑ యాంధ్రము (గి)
- ↑ దెనుఁగింపుచు (గి అధస్సూచి), తెనిఁగింపుచు - ఇప్పటిరూపము (రా)
- ↑ యెంతయు నడఁచె (సూ)
- ↑ ద్రాక్షవాటి (సూ)
- ↑ తెనుఁగు (సూ)
- ↑ దనకాళ్లు చేతులు మతి చెడి (సూ)
- ↑ దరుగ (పూ.ము.)
- ↑ కీలకసమనామతంగ (సూ)
- ↑ బుట్ట
- ↑ బలుకులచెలికి నైన
- ↑ నెఱుఁగింపు (గి)
- ↑ తాతన - తాతంభట్టు
- ↑ నూత్నదండి - కేతన అభినవదండి బ్రిదాంకితుఁడు (రా)
- ↑ యైనన్ (సూ)
- ↑ మందును (సూ)
- ↑ చను (ప)
- ↑ కేదబద్దమని (వా)
- ↑ వరగుణస్థాని (సూ)
- ↑ తమ్ములనె పేరుననె సోము (సూ)
- ↑ బ్రహ్మరాక్షసుతోడఁ గ్రమము చెప్పుచు బండిగట్టిన గండభాగంబు మ్రోదె (వా)
- ↑ నివరళ
- ↑ రాముఁ డనఁగను (సూ)
- ↑ తమ్మన (సూ)
- ↑ ఆతఁడ (సూ)
- ↑ మగు (సూ)
- ↑ నందునకు (వా)
- ↑ సుమ్ము (గి, పూ.ము.), జుమ్ము (రా)
- ↑ వారి (సూ)
- ↑ వా రెవ్వ రంటేని (పూ.ము.)
- ↑ దలంప (పూ. ము.)
- ↑ తనయుల గన్నమాంబ (సూ). ఇందు 'గన్న' యని సరళాదిగా నున్నది.
- ↑ చిన్న (సూ)
- ↑ పోచ (ఓ)
- ↑ రాజు (ఓ)
- ↑ జ్యోతిష (సూ)
- ↑ గదియు' మనన్
- ↑ పేర్మి (సూ)
- ↑ నింకఁ దాఁ గన్నది
- ↑ బద్య (రా)
- ↑ దత్సమ
- ↑ గ్రియా (ఇవి ద్రుతముమీఁది పరుషము లగుట సరళము లగును. కానీ పూ.ము.లోఁ బరుషాదిగా నున్నవి (రా).