అన్నమాచార్య చరిత్రము/అన్నమయ స్వామిపై శతకము చెప్పుట
Appearance
నవగాహనము చేసి యా తేటనీట
ధవళంబుగా మును దాఁ గట్టుచీర-
నుదికి యాఱఁగవైచి యొకరాతి దండ-
నది యెండ నాఱెడు నంతలోపలనె
వితత వృత్తంబుల వేంకటపతికి
శతకంబు కుతుకంబు సమకూరఁజేసి
పదిరెండు నామముల్ బాగుగాఁ దీర్చి
సదమలాచార్యుఁడై చనుదెంచి యతఁడు
వరుసతో హరిపరివారంబుఁ గొలిచి
మరుగురు ద్వారసీమకు వచ్చి మ్రొక్కి
యలవేంకటేశ్వరు నపరంజి తగడు-
తలుపులు బీగముల్ దాఁచియున్నెడను,
వేంకటపతిమీఁద వివరస్తవముగ
వేంకటశతకంబు విన్నవించుటయు