Jump to content

అధిక్షేపశతకములు/కవి చౌడప్ప శతకము-పీఠిక

వికీసోర్స్ నుండి

కవి చౌడప్ప

అధిక్షేప శతక కర్తలలో విలక్షణ మార్గము ననుసరించిన వారిలో కవి చౌడప్ప ప్రముఖుడు. ఈ కవి ప్రస్తుతించిన మట్ల అనంతభూపాలుడు, తంజావూరు రఘునాథ రాయలు అనువారు పదునేడవశతాబ్ది పూర్వార్థమున జీవించిరి. ఆత్మ సంబుద్ధి పరముగ నీతిహాస్య అధిక్షేప ధోరణిలో పద్య రచన చేయుటలో ఈతనికి వేమన మార్గ దర్శకుడై యుండును. ఈ ఆధారము ననుసరించి చౌడప్ప పదునేడ శతాబ్ద్యంతమున జీవించి యుండెను.

చౌడప్ప కవి కుందవరము కరణము. ఈతని శతక పద్యములు పండిత పామర లోకమున బహుళ ప్రచారము నొందినవి. ఇతరాంశములతో పాటు అశ్లీలోక్తులు - బూతులు - ఈతని పద్యముల కట్టి ప్రశస్తిని కలిగించినవి. నగ్నసత్యమును నగ్నముగ చెప్పుటలో ఈతడు వేమనకు ఈడు జోడైనవాడు. చౌడప్ప రాజాస్థానము లందు సంచరించి పండిత కవుల సాహచర్యము నొందినవాడు. విశేష భాషాసాహిత్యజ్ఞాన సంపన్నుడు. కవిత్వ మాధుర్యమును సామాన్య ప్రజలకు ప్రసాదించిన మహానుభావుడు. కవిత్వము - దాని ప్రయోజనము-రసము-పాకము, కందపద్య రచన మున్నగు అంగములను గూర్చి ఈకవి తనకుగల అభిప్రాయములను స్పష్టముగా చాటినాడు.

చౌడప్ప చెప్పిన పద్యములు వేయికి మించి యున్నవని కొందరు పండితు లూహించిరి. కాని చౌడప్పశతకముగా ప్రకటింపబడిన ప్రతులలో దాదాపు రెండు వందల పద్యములు కలవు, అశ్లీలోక్తులు-బూతులు కల పద్యములను, అస్పష్టముగ నున్న వానిని పండితులు పరిష్కరించి నూరు, నూటపది పద్యములలో చౌడప్ప శతకమును ప్రకటించిరి. చౌడప్ప పద్యముల పరిష్కరణము జటిలమైన సమస్య. దీనిని గూర్చి అభిప్రాయ భేదము లెన్నియో కలవు. అశ్లీ లోక్తులను-'బూతు' పదములను పరిష్కరించుట కంటె-వానిని సూచ్య ప్రాయముగ నొనర్చి ముద్రించుట వలన చౌడప్ప కవితా ప్రశస్తిని గ్రహించుటకు పాఠకుల కవకాశము కలుగు సని -కొందరి అభిప్రాయము. చౌడప్ప వ్రాసినది వ్రాసినట్లే ముద్రించుట అశ్లీల సాహిత్యముకు ప్రచార మొనర్చుట వంటి నేర మనియు నాగరికతకు అది కళంక మనియు వానిని పరిష్కరించుట . సముచిత మైన పద్ధతి అనియు మరి కొందరి మతము.

అశ్లీలోక్తులు గల కావ్యములను. చాటపద్యములను, ప్రకటించు సంధర్భ మున పండిత వినుర్శకులలో వాదోపవాదములు ఎన్ని యో జరిగినవి. పదడు లను సంస్కరించక , పరిష్కరించక, సూచ్య ప్రాయమొనర్చి ప్రకటించు విధానమే కవి కవితారీతిని గ్రహించుట కవకాశము కలిగించుననుట అంగీకుతమైన విషయము. ఈ శతకములోని పద్యములీ దృష్టితో కొన్ని ప్రకటింపబడినవి.

చౌడప్ప | పాచీన కవితా రీతులలో సుపరిచితుడు, తిక్కన పెద్దసాదు లీతని అభిమాన కవులు. అలనాడు కంద పద్య రచనలో తిక్కన సిధ్ధ హస్తు డనియి, ఆ తరువాత అట్టి ప్రతి స్తి అని కే లభించినదనియు చౌడప్ప ఆత్మసుతి ప్రశంసా పూర్వకముగ చెప్పి కొనుటవలన కందపద్య రచనలో చౌడప్పకు గల ప్రావీణ్యము స్పష్టమగుచున్నది. కంద పద్యపు నడక , పూర్వార్థ పరార్థభాగ ములలో భావములను వివిధ పద్ధతులలో కూర్చిన విధాన మీతని కంద పద్య రచణ శిల్పము.కు తెలియజేయును. నీతులను బూతులను కూర్చి చౌడప్ప తనకు గల అభిప్రాయములకు స్పష్టాతిస్పష్టముగ చాటినాడు. బూతుల రూపమున నీతుల ముపదేశించుట ఈతని వైశిష్టము. చతురమైన హాస్యమును పోషించుట యందును చౌడప్ప సమర్థుడు, కామము - శృంగారము, సుహ్యాంగములు రతి క్రీడ. రసిక జీవనము మున్నగునవి ఈతని బూతులకు ఆలంబసములు. . సామాన్య దము లతో అశ్లీల భావములను వ్యక్తీకరించుట. బూకు మూటలతో అగే లార్థ మును, నగ్న రూపము - చ్యశ్రీకం ముకు-ఉపమానములకు అనుగుణముగ పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/60 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/61