Jump to content

అడిదము సూరకవి/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూఁడవ ప్రకరణము

చీపురుపల్లికిఁ గాఁపురము మార్చుట.


సూరకవి . తనతండ్రియగు బాలభాస్కరుని మరణా సంతరమున స్వగ్రామమగు రేగను విడిచి చీపురుపల్లెకు (విజయ నగరమునకు నీశాన్యముగా నిరువది మైళ్ళ దూరమున నున్నది) మిక్కిలి సమీపముననున్న రామచంద్రపురమును (గులివిందాడ) దనకు నివాసస్థలముగ నేర్పంచుకొని యామరణాంతమచ్చటనే నివసించియుండెను. కవికిని నింకొకరికి నీ బద్యరూపమున జగిన సంభాషణ వలన నితఁడు చీపురుపల్లెయుందున్నట్టు తెలియ వచ్చెడిని.


క, ఊరెయ్యది ? చీఁ పురుపలి .
పేరో? నూరకవి యింటి , పేరడిదమువార్
మీరాజు విజయరామ మ
హారాజతఁడేమి సరసుఁ డా ? భోజుడయా.


రేగయందు వలెనే కవికి చీపురుపల్లె'కు దగ్గఱనున్న కంచ రాములో మాస్యముండెడిది. ఇప్పటివలేఁ గాక సూరకవి రామ కవిగార్ల కాలమున రేగమాన్యము లేమి కంచరమునఁ గల మాన్యము లేమి ప్రతిసంవత్సరము పండెడివి కావు. ఈమాస్యముల పంట పర్యాయములనుగూర్చి యే సూరయిట్లు చెప్పియున్నాడు.


 చ. గరిసెలువ్రాఁ తే గాని యొక • గంటెఁడెఱుంగము మన్య దేశముల్
దిరిగి యభీష్టవస్తువులు , తెచ్చి భుజింతుము సర్వకాలమున్
సురుచిర సత్కవిత్వనిధీ సూరకవీంద్రుని కేలగల్గెగం
చరమును రేగ మేఁక మెడ , చన్ను లవంటిని రెండు మాన్యముల్".


సూరకవి, తండ్రి గారు స్వర్ణులైన వెంటనే తన నివాస స్థలముకు మార్చుటకుఁ గల కారణములు తెలియకున్నవి. చీపురుపల్లె కు సమీపమునఁ గంచరములో మాస్య ముండుట' 'యు తనకిష్ట దైవమగు రామలిం గేశ్వరునకు మనికి పట్టుగు రామచంద్రుపురముకు దనకు నివాసస్థలముగాఁ జేసికొన నాసక్తి యు దాను ప్రతిసంవత్సరము వర్షాళనమున కై పోయి చూచెడు మన్యపు జమీలకుఁ జీపురుపల్లె మధ్యస్థముగ నుం డుటయు నను నీకార ణములతని స్వస్థానచలనమునకు హేతువులై యుం:సునని నాకు దోఁచెడిని. ఈ రామచంద్రాపురమునఁ గల శ్రీరామలింగేశ్వ రాలయమును 'అడిదము ' వారి కోవెలయని దానికి సమీప ముగ నున్న ప్రదేశము పూర్వము అడిదము వారే యింటి నివేశనమనియు నిప్పటికిని నచ్చటివారు చెప్పువాడుక గలదు. సూరకవి, యిరువదియైదు సంవత్సరముల ప్రాయమప్పుడు చీపురుపల్లె ప్రవేశించెను , తన జీవితకాలమంతయు సచ్చటనే యుండెను. కవిజనరంజ మాది గ్రంధరాజము లెల్ల మచటనే రచన మొనర్చెను. ఇతనికి నాగ్రామము వై దికులుకొందఱు శిష్యులై యుండిరి. ఆయ్యది యీ క్రింది పథ్య వవలను తెలియవచ్చు చున్నది.

.


 గీ. పారమందిరి యక్కిన ఆ పల్లివారు.
దుక్కి చేతను దీర దెం • దువుల కెల్ల
దూసికృష్ణుండు చదువంటే దుఃఖ పడును
ధీరుఁడై నిలిచె మురపాక • సూరనుక వీ.

ఈపద్య మునఁ "బేర్కొనఁ బడిన కుటుంబముల వారి సంతతివా రిప్పటికిని రామచంద్ర పురము (గులివిందాడ) నందుఁగాఁపురముండి యున్నారు.సాధారణముగా నాంధ్ర. కవీశ్వరులను జెట్టబట్టిన దరి దరిద్రాదేవత యొక్క కటాక్షవీక్ష్ణణములకు సూరకవి గూడ దూ రముగఁ దొలఁగి యున్న వాడు కాడు. సమీపగ్రామమున. నున్న యొక రాచకుమారుఁడు కవికిఁ జింతకాయ లిచ్చెదనని చెప్పి పలుసారులు తిప్పినట్లును, దానికి సూరన విసుగుఁ జెంద శంబాముగ్రామము బారికియగు 'రేగానిసన్ని గాఁడు చింతకా యలిచ్చి కవిని సంతోషపఱచి సట్లును నీక్రింది పద్యమువలనఁ డెలియుచున్నది.


 గీ. బండ్లు నోడలు పట్టవు • పలుకులైతే
చేరివేడిన నీఁడాయెఁ జింతకాయ
కొండకంబాములో రాచ , కొడుకుకన్న

  • శంబమున మేలు రేగాని సన్ని గాఁడు.

ఇతఁడిచట నున్న కాలమున మన్యపు జనాలకుఁ బోయి..

* పా! చాగముస, మేలు రేగాని సన్ని గాఁడు. 


ధనము సంపాదించి దానిచేఁ గాల క్షేపము చేయుచుండెడివాఁడు ఇదియే పూర్వోదాహృత పద్యమున ( మన్య దేశముల్ తిరిగి యభీష్ట వస్తువులు తెచ్చి భుజింతుము సర్వకాలమున్ ”అని చెప్పఁ . బడెను. ఇంతియ గాక యితఁడు చీపురుపల్లెలోను దానిసమీప గామములలోను స్వగ్రామమగు భూపాలరాజు "రేగడలోను వైశ్యుల యిండ్లకడ వివాహములు జరిగినపుడు తప్పక యచ్చటికిఁబోయి కవీశ్వర సంభావనలను గైకొనెడి వాడు. దీనిని గూర్చియే కవి తన రామలింగేశ్వర శతకములో * « కవులకీ! గలజాతి యొక్కటియు లేదు | వితరణము వైశ్యులకుఁ బెండ్లి వేళ కలదు ! కొంకుపఱతురు కుపతులా కూటికొఱకు | రామలింగేశ రామచంద్రపురవాస | ” అని వాసియున్నాడు. మొత్తము మీఁద సూరకవి చీపురపల్లెలోఁ దన జీవితమును నిబ్బంది లేకుం డఁగఁ జరిపినట్టు కనఁబడదు. ఇతఁడుతన తండ్రిగారి సంరక్షణలో


  • చినవిజయరామ మహారాజు గారి కాలమున నాయన 'యగ్రజుఁడు నీతారామరాజు గారు దివానుగా నుండి రాజకీయ వ్యవహారములలో సర్వా ధికారము జపుచుండెడి వారు. ఒకప్పుడాయన సూరకవి కోమటి పెండ్లిం డ్లపంభావనల నెపమున దర్బారు విడిచి పోఁగూడదని ఆజ్ఞ పెట్టెనంట. కాని నూరకవి మాత్రమట్టి యాజ్ఞను మన్నింపక విధిగాఁ గోమటి పెండ్లిండ్ల సంభావనలకుఁ బోవుచుండెడి వాఁడు. ఆషయమే యిచట సూచింపఁ బడినది.

హాయిగ నుండి సౌఖ్యమనుభవించినట్టుగ +* 'తండ్రి గల్గిన 'పెన్ని ధాన మేల" అను రామలింగేశ శతకములోని వాక్యమును బట్టి యూహింపనగును. సూరకవికి నతని తండ్రిగారు సజీవులై యున్నప్పుడే వివాహామాయెను. ఆ కాలమునఁ గోటిపల్లెయందు నివసించెడి వడ్డాది వారెపిల్లను నీతఁడు పెండ్లియాడెను. రైలు లేని యాదినములలో, నిట్టి దూర దేశపు సంబంధము మాకుటుం బమున కెట్లు కలిగెనో యూహింప వీలు లేకున్నది. ఒకానొకప్పు డు నితఁడేదియో రోగముచే బాధపడుచుండి యాసమాచారము నత్తవారికిఁ ' దెలియఁజేయ వారెవరును రానందులకు వగచి యాతని భార్య దానిని గూర్చి ప్రశంసింప నతఁడు తెలియని దానవు సుమ్మీ | పిలిచినపరుఁగెత్తి రాను పెండ్లా వడుగా”యని భార్య తోననెను. చీపురుపల్లెలో నున్న కాలముననే . సూరకవి సంతానవంతుఁ డయ్యెను. ఇతనికి నొక కుమారుఁడును నొక కొమా ర్తెయును గలిగిరి. కుమారునికి 'బాలభాస్కరుఁడనియు, కొమా ర్తెకు నరసమ్మయనియుఁ బేర్లు పెట్టెను. కొమా ర్తెను రెల్లివలస పాణంగిపల్లి వారికి చ్చెను. ఈసాణంగిపల్లి వారితో జేసిన సంబంధమును బట్టియే సూరకవికిఁ బిదపనాతని కటుంబ


1 ఇయ్యది భవభూతి మహాకవి యుతర రామచరితములోని . గీ. మంచి చెడ్డలుతండ్రి వీ క్షించుచుండఁ దల్లులును ముద్దుముచ్చటల్ "దలచుచుండఁ | గొ త్తప్రియు రాండ్రతోఁ గూడి • కులికినట్టి | క్షణములని తమ్ముఁ డారావు • కదమఱింక! ” అను శ్రీ రాముని వాఖ్యములను జ్ఞప్తి కి చ్చుచున్నది. మువారు వెల్లివలసను దమకు నివాసస్థానముగఁ జేసికొనిరి. సూరకవి తన కుమారునిఁ 'బెంచి పెద్దవానిని జేసి విద్యాబుద్ధులు గజపెను గాని యతఁడే విషయమువను బజ్ఞావంతుఁడై ప్రసిద్ది గని తండ్రిగారి కీర్తిని నిలిపినట్లఁగపడదు. ఇతఁడే సూరకవి. 'మరణించిన పిదప చీపురుపల్లె' నుండి రెల్లివలసకుఁ గాఁపురము : మార్చెను..


ఒకానొకప్పుడు భోజన సమయమున సూరకవిగారి బార్య (ఈమె పేరు సీతమ్మ) సూరకవితో 'ఏమండీ ; అందర మీఁదను 'బద్యములు చెప్పుదురు గదా : మనబాచన్నమీదట నేల యొక పద్యము చెప్పరాదు? " అని కోరఁగా సూరకవి యిట్లోక పద్యమును జెప్పెను,

క. బావా బూచుల లోపల బాచ స్నే పెద్దబూచి పళ్ళుందామన్ బూచంటే రాత్రి వెఱతురు బూచన్నను జూచిపట్ట • పగరే వెఱతుర్ ,

రూపసికానట్టి తమ కుమారుని స్వభావోక్తిగ వర్ణించుట యిష్టము లేనిదైన యామె భర్తతో చాలునండి. మా గొప్పపద్యము చెప్పినారు. మా బాచబాబు కేమి తక్కువ! . యని భర్తయెడల సురాళించుకొనెను. సూరకవి యీమెని నెగతాళిచేయ నెంచి యిది జరిగిన యొకటి రెండు దినము

వఱకు మామూలు మాటలలో సహితము పరియాచకమునకై నడుమనడుమఁ బద్యరూపముగ సంభాషించుచు. వచ్చెనంట. • వంటయేమి చేయుదు ' నని భార్య యడిగినపుడు సూరకవి «« 'పులగములోపలికి పచ్చిపులుసే కాదా? "యని చెప్పిన పద్య 'పాదము మీఁది యంశమును రుజువు చేయఁగలదు.

వాడుక ననుసరించి చెప్పఁబూనినచో సూరకవి యొక మాదిరి లావుశ రీరమును,నల్లని శరీరచ్చాయయుఁ గలిగి పొడువుగ నుండెడివాఁడని చెప్పవలెను. ( అతని వేషంబంతయు (బండితరీతి నుండక మొగలాయి విధంబున నుండు. కావునఁ దదనుగుణమైన లాగు, పాగా, యంగరఖాలను దాల్చి యొక ప్రక్క గంటపుటోర యును, రెండువదిక్కున బాకును బూని | ఇదం “బ్రహ్మ్యంబ్రాఃమ్యమిదం క్షాత్రామను రీతినుండి యేరైన మీరెవరనియడిగిన నేనడిదము సూరుఁడననుచుండు. " (గు!! శ్రీరామమూర్తి గారి కవి జీని తములు.)