అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మీఁదికి దాడివచ్చినప్పు డంతయు తమసైన్యములను ఎల్లల కడకు పంపుచుండిరి. మొగలాయీలు తాము బిజాపూరుమీఁదికి దాడి వెడలినయెడల గోలకొండవారు తమసైన్యముమీఁదికో తమరాజ్యముమీఁదికో దండెత్తివచ్చి బిజాపురమువారికి సహాయము చేయుదురని ఎఱఁగియుండిరి.

మాదన్న ఈమార్గమునే యనుసరించెను; బిజాపురము వారితో విరోధింపలేదు, న్నేహమే చేయుచుండెను. కాని బిజాపురవ్యవహారము ఇప్పుడు చాల గందరగోళముగానుండెను. అంతఃకలహములు జరుగుచుండినవి. ఇట్టిరాజ్యముతో న్నేహము ఈ కాలమున అసాధ్యముగాను నిరుపయోగముగాను నుండెను. ఈవిషయము లెల్ల మాదన్న ఆలోచించెను; నిరంతరము జయముగాంచుచుండిన మహారాష్ట్రులతో స్నేహము మొదలు పెట్టెను; శివాజీతో నుత్తరప్రత్యుత్తరములు ప్రారంభించెను.


ప్రకరణము 7 - శివాజీ

క్రీ. శ. 1674లో శివాజీ పట్టాభిషేకము చేసికొనెను. ఆందుచే నాతనిబొక్కసము చాల తగ్గిపోయెను. తర్వాత నతఁడు బిజాపూరు రాజ్యమునందు చాలచోటులలో దోపిడి చేసినను ఎక్కువధనము దొరకలేదు. దక్షిణాపథమునందలి పలుచోటులను ఆతఁ డప్పటికే దోచియున్నాఁడు. ఈతని దాడికి భయపడి పెక్కువ్యాపారస్థలములు పాడై పోయినవి. దక్షిణ దేశమున నేటి మదరాసుతీరము సుభిక్షముగా నుండుటయే గాక శివాజీ కంట నింకనుపడలేదు. ఈదేశమందలి జనులు నిరాడంబరజీవులై సౌఖ్యముగ నుండిరి. ఇచ్చటి రేవుపట్టణములు అతిప్రాచీన కాలమునుండియు విశేషవ్యాపారముల కాటపట్టు లగుటయేగాక ఇచటిగనులు తఱుగని సౌభాగ్యముగా నుండినవి. ఈ ధనమంతయు చాలవఱకు దేవాలయములకును ధర్మకార్యములకును ఖర్చగుటయేగాక విశేషముగా జనులకు దాఁచుకొనుటకును ఆభరణములు చేయించుకొనుటకును మిగులుచుండెను.

విజయనగరసామ్రాజ్యము పడిపోయినతర్వాత దక్షిణదేశము పెక్కు రాజ్యము లాయెను. వీనిలోవీనికి కలహము లేర్పడెను. తమకు సాయముచేయుటకై ఈరాజ్యములు గోలకొండ బిజాపూరు మొదలైన మహమ్మదీయరాజ్యముల సాయమును వేడుటచే తురుష్కుల పలుకుబడి హెచ్చసాగెను. మొగలాయీల బలముచే ఉత్తరమున రాజ్యమును విస్తరించుట అసాధ్యమైనందున బిజాపుర గోలకొండరాజ్యములు దక్షిణమునకు వ్యాపించుటకు ప్రయత్నించుచుండినవి. ఇందుచే గోలకొండవారు కడప, ఉ త్తరార్కాడు జిల్లాల భాగమును పాలారువఱకును జయించిరి. బిజాపూరువారు కర్నూలు, బెంగళూరు, ఉత్తరముననున్న మైసూరు భాగములను, పాలారు కొల్లడముల నడిమి మదరాసుభాగమును, వేలూరు మొదలు తంజావూరువఱకు ఆక్రమించిరి. శివాజీ సోదరుఁడైన వెంకాజీ తండ్రివలెనే ఆడిల్‌షాక్రింది సర్దారుగా నీ ప్రదేశములను పాలించుచుండెను. ఇతనికి జింజిప్రాంతభాగము తండ్రివలన వచ్చినట్టిది.

ఈలోపున మధురనాయకులకును తంజావూరి ప్రభువులకును స్పర్థలువచ్చి తంజాపురిపాలకుని మధురవారు చంపివేసిరి. గతించిన రాజుయొక్క కొమారుఁడు బిజాపూరు ఆడిల్‌షాకు మొఱపెట్టుకొనఁగా నాతఁడు వెంకాజీని సాయము పొమ్మనెను. వెంకాజీ తంజావూరిని జయించి మధురవారిని పాఱద్రోలి ఆరాజ్యమును తానేహరించెను; చుట్టునున్న వారినికూడ జయింప యత్నించుచుండెను. ఈనడుమ క్రీ. శ. 1675 సం. ఏప్రిలునెలలో శివాజీసైనికులు బిజాపురభూములలో కొల్లగొట్టుచు గోలకొండ రాజ్యములోనికి ప్రవేశించి ఏతగిరి (నేటి యాద్గీర్)ని పూర్తిగా దోచుకొని హైదరాబాదువఱకును వచ్చి వెడలిపోయిరి,

మాదన్నమహామంత్రి ఆలోచించెను. విజయాపురమందలి దక్షిణప్రదేశములను జయించి ఆంధ్రసామ్రాజ్యమున చేర్పఁదలంచెను. ఇట్టిసందర్భమున శివాజీతో సంధి కుదుర్చుకొని అతనితోచేరి దకిణదేశమును జయించి పంచుకొనుట మంచిదని ఆతనికి తోఁచినది. వెంటనే శివాజీతో సంధికి తానీషాను అతఁడు ఒడంబరుపసాగెను - బిజాపురములోని కర్ణాటక దేశమును తానాషాగారికొఱకు శివాజీ జయించి ఇచ్చి వేయవలసినది ; దండయాత్రాకాలమున దొరకిన లూటీనంతయు శివాజీ తనకు గ్రహింపవలసినది - ఇట్లు నిబంధనలు కుదుర్చుటకు మాదన్న ప్రయత్నింపసాగెను.

శహాజీ చనిపోవునప్పుడు వెంకాజీ బాలుఁడు. ప్రపంచానుభవము చాలని తనకుమారునికి సాయముగా రఘునాథనారాయణహనుమంతె అనువానిని ఏర్పాటుచేసి శహాజీ మరణించెను. ఇంతకాలము ఈ హనుమంతె తానేప్రభువైనట్లు ఎల్ల కార్యములను జరుపుచుండెను. వెంకాజీ నేఁడు పెద్దవాఁడు; హనుమంతుని పెత్తనమును సహింపలేకపోయెను. పైగా హనుమంతె నానామాయోపాయములచేత విస్తారము ధన మార్జించియుండెను. వెంకాజీ హనుమంతుని పాతలెక్క లడిగెను. హనుమంతె వెంటనే తనయుద్యోగమునకు రాజీనామా నిచ్చి కాశీయాత్రకు పోవునట్లు నటించి తన ఆస్తినంతయు తీసికొని జనార్దనుఁడను తమ్మునితోకూడ బయలుదేరెను తంజాపురినుండి బిజాపురమునకు పోయెను. అచ్చట తనసామర్థ్యముచే నొక మంత్రిపదవి సరిపాదించెను. ఇంతలో శివాజీ ఇతనిని తనకడకు పిలిపించెను. హనుమంతె పూనానగరమునకు పోయిచేరెను.

వెంకాజీమీఁద పగ తీర్చుకొనవలయునని హనుమంతె తలఁచియుండెను. అందులకై శివాజీని దక్షిణదేశముపై దండెత్తుమని హనుమంతె పురికొల్పుచుండెను. శివాజీకి తమ్ముని రాజ్యముమీఁద ఇంతవఱకు అపేక్షలేదుగాని హనుమంతుని దుర్బోధవలన ఇప్పడు ఏర్పడసాగెను. ఈకాలమునకు సరిగా రాజకీయపరిస్థితి శివాజీకి అనుకూలమాయెను. మొగలాయీ పాదుషా పంజాబులో యుద్ధ మొనరించి ఢిల్లీకి వచ్చియుండినను ఆతనిసైన్యము లింకను పంజాబునం దేయుండెను. బిజాపూరు సుల్తాను సికందరు బాలుఁడు. అందుచేత వజీరుపదవికి అంతఃకలహములును హత్యలును జరుగుచుండినవి. భలోల్ ఖాన్ అను నతఁడు క్రొత్త మంత్రియాయెను. మొగలాయీలు మఱియెుకని మంత్రిత్వమునకు సహాయము చేయఁగోరి బిజాపూరువిూఁదికి దండెత్తిరి. కాని వారిసైన్యము లింకను రాలేదు,

ఇట్టిసమయమున మాదన్న బిజాపురమును రక్షింపనెంచెను. భలోలుఖాను శివాజీతో న్నేహముకోరెను. మాదన్న కోరినదియు నదియే. వెంటనే మాదన్న శివాజీతో భలోలు ఖానునకు సంధి కుదిర్చెను. భలోలుఖాను బిజాపురమువారితరపున శివాజీకి మూఁడులక్షలరూపాయలు బహుమతిగా నిచ్చుటకును, తమ తూర్పువైపు కృష్ణాతీరపుటెల్లను కాపాడుటకును మొగలాయీలను తఱుముటకును లకహొన్నులు, (బంగారు నాణెములు) ఏటేట ఇచ్పుటకును మాదన్న మాటమీఁద ఒప్పుకొనెను. ఈసందర్భమున శివాజీ ఉత్తరమునుండి తనకెట్టి ఆపదయు రాదని గ్రహించెను. ఈకట్టుబాట్లను ఎక్కువ కాలము జరుపవలయునని ఆతనియుద్దేశము కాదు గాన తాత్కాలికము గా అనుకూలమని ఆతఁడు ఒప్పుకొనెను. నిలుకడలేని బిజాపూరు ప్రభుత్వముతో ఎట్టిన్నేహమును చాలకాలము జరుగదని ఆతఁడు ఆలోచించెను. బిజాపూరువా రిచ్చిన ధనమును మాత్రము గ్రహించెను, అప్పడు శివాజీ ఒక ఉపాయము చేసెను, మొగలాయీ వారినుండి బిజాపురమును కాపాడునపనిని తప్పించుకొనెను. ఎట్లనఁగా బిజాపురముమీఁదికి దండెత్తనుండిన మొగలాయీ రాయబారితో తానొక సంధి కుదుర్చుకొనెను, అంతకు రెండేండ్ల నుండి మొగలాయీలు శివాజీతో యుద్ధముచేసి విసిగియుండిరి; తమకు భయపడి భలోల్ ఖాను శివాజీతో చేరఁగానే వారికిని కొంతకష్ట మైనది, భలోలుఖానుమీఁద పైయెత్తుగా మొగ లాయీ రాయబారి తానును శివాజీతో సంధి కోరినందువలన శివాజీకి మంచిదేయైనది, తన ద్రవ్యాకర్షణమునకును దక్షిణ దేశ దండయాత్రకును అనుకూలమని శివాజీ వెంటనే ఒప్పు కొని, తాను కర్ణాటక దేశముమీఁద దండెత్తి తిరిగివచ్చులోపల దాదాపొక సంవత్సర కాలము బిజాపురమునకు మొగలాయిల వలన బాధ లేకుండిన తాను శ్రమపడకయే వారిని రక్షించిన ట్లగునని, అట్టియేర్పాటుమీఁద సంధిషరత్తులు కుదిర్చెను.

ఇన్ని వ్యవహారములలోను మాదన్నమంత్రియున్నాఁడు. శివాజీయుద్దేశము నాతఁడు కొంతవలలికు గ్రహించెను. దక్షిణ దేశముల విూఁదికి శివాజీ కొల్లగొట్టుటకు బయలుదేరిన గోల కొండ గతి యేమగును? బిజాపురమును తాత్కాలికముగా కాపాడుటయైనది, మొగలాయిబాలవలన భయము లేదు, వులకి శివాజీనికూడ న్నేహితుని చేసికొనిన మొగలాయీలను పూర్తి గా నిలుపవచ్చునని తలఁచి మరల శివాజీతో రాయబారము జరిపెను, బిజాపురమునకును శివాజీకిని సఖ్యము కలిపినవాఁడు తానేగదా. శివాజీకి మాదన్నకడకుండి రాయబారముపోయి గోలకొండవారికిని మహారాష్ట్ర నేతకును సఖ్యము కుదిరినది. మాదన్న సంవత్సరమునకు ఒకలక్షహొన్నులు శివాజీకి గోలకొండను కాపాడుట కిచ్చుట కొప్పుకొనెను. ప్రహ్లాదనిరాజీ అను మహారాష్ట్రుని శివాజీ తనరాయబారిగా గోలకొండకు పంపెను.

శివాజీకికూడ గోలకొండవైభవమును చూడ వేడుకాయెను. హైదరాబాదునకేఁగు తనరాయబారి కాతఁడు తనయభిప్రాయమును తెలిపెను. ప్రహ్లాదనిరాజీ అందులకు తగిన సంవిధానమును కుదుర్పుమని మాదన్నను వేడెను. అప్జల్ ఖానును కూల్చినవానితో ఏకాసనమందు కూర్చుండిన నేమగునోయని తానాషా మొదట భయపడెను. ప్రహ్లాదనిరాజీ చాలనమ్మకము కలుగునట్లు పలికెను. మాదన్నయు శివాజీ తమకుద్రోహ మొునర్పఁడనియు నాతనికి మొగలాయీలే వైరులనియు దృఢముగా తానాషాను నమ్మించెను. పైగా శివాజీతో ముఖాముఖిగా మాటలాడుటవలన పెక్కు అనుకూలము లున్నవనియు తెలిపెను. తానాషా సమ్మతించెను. శివాజీతరఫున ప్రహ్లాదనిరాజీ తమదక్షిణ దేశవిజయములలో కొంతభాగము తానాషాకిచ్చుట కొప్పుకొనెను,