Jump to content

అంటువ్యాధులు/పదునాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

152

పదునాలుగవ ప్రకరణము

దోమలచే వ్యాపించు వ్యాధులు

ఇంతవరకు అంటు వ్వాధులన ఏవియో నిరూపించి వానిని నివారించు పద్ధతులను సర్వ సామాన్యముగ నన్ని యంటు వ్యాధులలొ ముఖ్యమయిన వానిని కొన్నిటి నెత్తుకొని ఒక్కొక్కటి ఏ ఏ మార్గమున ప్రవేశించునో ఎట్లు వాని వ్యాపకమును నివారింప వచ్చునో సంక్షేపముగ తెలియ పరచెదము.

సామాన్యముగ మనదేశమునందు హెచ్చుగ వ్వాపించు మార్గములను బట్టి వానిని నాలుగు తరగతులగ విభజింప వచ్చును.

1. దోమలు చే వ్వాపించునవి:... చలి జ్వరము: బూద కాలు.

2. ఆహారము మూలమున గాని నీటి మూలమున గాని వ్వాపించునవి: కలరా, టైపాయిడు జ్వరము, గ్రహణి విరేచనములు.3. గాలిచే వ్యాపించునవి: మశూచికము, పొంగు, ఆటలమ్మ, కోరింగ దగ్గు, గవదలు మొదలగునవి. 153

4. ఇతర సంపర్కములచే వ్వాపించునవి: క్షయ, ప్లేగు, కుష్టము, పచ్చసెగ, కొరుకు, గజ్జి, తామర మొదలగునవి.

1. చలిజ్వరము (Malaria)

చలి జ్వరపు సూక్ష్మ జీవులలో నాలుగు తెగలు గలవు. ఒక తెగ సూక్ష్మ జీవులు దినదినమును జ్వరమును కలిగించును. ఇంకొక తెగవి రెందు దినములకొక సారియు, నాలుగవ తెగవి క్రమము తప్పి ఇచ్చ వచ్చినట్లును జ్వరమును కలుగ చేయు చుండును. ఈ జ్వరములను కలిగించు సూక్ష్మ జీవులు జ్వరముగల రోగి నుండి దోమ కడులోనికి పోయి ఆ దోమ యితరులను కరుచు నప్పుడు వారి రక్తములో ప్రవేసించును. 34.వ. పటమును జూడుము. ఈ సూక్ష్మ జీవులక్కడ దినదినాభి వృద్ధి జెంది లక్ష నెత్తురు కణముల కొక్కటి చొప్పున వున్నప్పుడు జ్వరము కలుగ జేయును. మనము అను దినము చూచు దోమలన్నియు చలి జ్వరపు సూక్ష్మ జీవులను జేరవేయవు. అందు అనాఫలీస్ అను జాతి లోని దైన దోమ మాత్రము చలి జ్వరమును చేరవేయును. 35, 36 వ పటములోని దోమలను చూడుము. ఇది వ్రాలినపుడు సిపాయి వలె నిటారుగా నిలువబడును.

నివారించుటకు పద్ధతులు. ఇందుకు రెండు విధములు కలవు.

1. క్వయినా యొక్క సహాయముతో నివారించునవి.

2. క్వయినా యొక్క సహాయము కోరకయే నివారించునది.


34.వ. పటము.

దోమ పొట్టలోనికి చలి జ్వరపు పురుగులు పోయి తిరిగి ఉమ్మి తిత్తులలోనుండి ఆపురుగులు బయట వెడలుమార్గమును చూపు పటము. బాణపు గుర్తులను చూడుము. 155

(1) క్వయినా యొక్క సహాయముతో నివారించు పద్దతి.

35.వ.పటము.

156

38.వ.పటము(క్యూలెక్సు దోమ....... గూనుగ వ్రాలునది. ఏనుగ కాలు దోమ.








వారమునకొక సారు 10 లేక 15 ను గురిగింజల ఎత్తు క్వయినాను 4 లేక 5 వుంసుల నీటిలో చేర్చి కొంచెము నిమ్మ పండ్ల రసము పిండి ద్రావకముగా చేసి కొని మాత్రలుగా చే గాని పుచ్చుకొన వలెను. ఇందుచే దోమలు తమ రక్తములో చలి జ్వరపు పురుగులను ప్రవేశ పెట్టినను, ఆపురుగులు వెంటనే.. 157

నశించి పోవును. ఇట్లు క్వయినాను పుచ్చుకొని సంవత్సరముల కొలది గడు మన్య ప్రదేశములలో చలి జ్వరమును జయించిన వారు గలరు. ఇందు వలన శరీరమున కేమియు చెరుపు లేదు. మన దేశమునందలి ప్రజలకు క్వయినా యెడల గల ద్వేషము పోయిన గాని చలిజ్వరము మనల నింతట విడువదని చెప్పవచ్చును.

2.క్వయినా యొక్క సామయ్మును కోరక యృ చలి జ్వరమును నివారించు పద్ధతులు.

1. ఈ జ్వరమును వ్యాపింప జేయు అనాఫలీసు దోమలను నశింప జేయుట. దోమలు అధిముగా గల ప్రదేశములలో ఎగురుచుండగా వానిని పట్టి చంపుటకు మన మనేక పటాలములను పెట్టినను వానితో మనము పోరలేము. కాని యీదోమలకు తమ పిల్లలను పెట్టు కొనుటకు తగిన చోటు లేకుండ మనము చేయ గలిగిన యెడల ఇవి యొక తరముతోనే నశించి పోవును. దోమలు తమ గ్రుడ్లను అరంగుళము లోతునకు తక్కువ కానట్టియు, ఒక చోట నిలకడగ నుండు నట్టియు నీటిలో పెట్టును. పొడి నేలయందు గాని ప్రవహించు నీటి యందు గాని ఇవి తమ పిల్లలను పెట్టవు. 37.వ.పటము చూడుము.

కావున గ్రామము నందును, గ్రామమునకు చుట్టు ప్రక్కలనుండు ప్రదేశము లందును దోమ పిల్లలు నివాసము 158

37.వ.పటముం.

నీటి ఉపరి తలము.





1. అనాఫలీసు దోమ పిల్ల. 2. క్యూలెక్సు దోమ పిల్ల.

(ఇవి రెండును దోమ గ్రుడ్లనుండి పిట్టిన నీటి పురుగులు. వీటి నుండియే రెక్కలు గల దోమలు పుట్టును.)

చేయుటకు తగి యుండు గోతులు బురద నేలలు మొదలగు వాని యందలి నీటి నంతయు నెప్పటికప్పుడు మురుగు కాలువల మార్గమున పోగొట్టి వేయవలెను. గ్రామమునకు అరమైలు దూరములోపల ఊడ్పు చేలుండ కూడదు. పంట కాలువలో గడ్డి మొదలగు తుక్కు పెరుగ నియ్యకూడదు.

గ్రామము నందలి పాడు నూతులను, దొడ్లలోను ఇటుకల ఆవముల వద్దను రోడ్ల ప్రక్కలను ఉండు కొలుములను పూడ్చి వేయవలెను. పూడ్చి వేయరాని పాడు నూతులలోనుండు నీటి పైన కిరసనాయిలును వారమున కొక సారి పోయు చుండవలేను. అట్లు చేయుటచే ఆనీటి యందలి దోమ పిల్లలు నీటి యుపరి తల 159

మునకు వచ్చి అక్కడ పీల్చుటకు గాలి లేక ఉక్కిరి బిక్కిరియై చచ్చిపోవును. ప్రజలకు ఉపయోగ కరములగు చెరువులలోను గుంటలలోను చేపలను పెంచ వలెను. ఈ చేపలు దోమ పిల్లలను తిని వేయును.

ఇండ్లలోనుండు నూతులలో దోమ పిల్లలను పెట్టు చున్న యెడల దోమలు చొరలేని దోమ తెరల వంటి ఇనుప వలలతో నూతులను రాత్రుల యందు కప్పివుంచ వలెను. ఇండ్లలోను, దొడ్ల లోనుండు కుడితి తొట్లలోను, పగిలి పోయిన డబ్బాలలోను, కుండ పెంకులలోను, నీరు నిలిచి యుండకుండ చేసికొన వలెను. లేని యెడల దోమ పిల్లలకు ఈ నీరు నివాస స్థానముగా ఏర్పడుడును. ఇండ్ల చుట్టు నుండు చెట్ల తొర్రలలో నీరు లిలిచి అందు దోమలు పిల్లలను పెట్టకుండ చూచుకొనుచుండ వలెను. చక్కెర డబ్బాల క్రిందను మంచము కోళ్ళ క్రిందను పెట్టు పళ్లెములలో నీరు రెండు మూడు దినముల కొక సారి మార్చు చుండవలెను. లేని యెడల వీనిలో పెరిగిన దోమ పిల్లలు ఇల్లంతయు క్రమ్మి వేయ గలవు.

గ్రామ ఉధ్యోగస్తులు గాని, శానిటరీ ఆపీసర్లు గాని జవానులు గాని వారమున కొక సారి ప్రతి యింటిని చక్కగ శోధించి, దోమలకు ఉనికి పట్టుగల స్థలములు ఎక్కడను లేకుండ చేయవలెను. దోమ పిల్ల లెక్కడెక్కడ పెరుగునో, వాని వలన గలిగెడు ఉపద్రవమెట్టిదో ప్రజలకు చక్కగ బోధించు 160

నిమిత్తమై చిన్న చిన్న వ్వాసములను ప్రచురించియు, లాంతరు పటములను గనుకరచియు (మాజిక్ లాంతరన్) విద్యాభివృద్ధి గావింప వలెను.

పెద్దవిగా పెరిగిన దోమలు సాధారణముగా దండెముల మీద వ్రేలాడ వేసిన బట్టల చాటునను, చీకటి గదులలోను దాగి కొనియుండును. గంధకము సాంబ్రాణి మొదలగు పదార్థములను పొగ వేసిన ఎడల దోమలు ఆ పొగను భరింప జాలక పారిపోవును.

2. ప్రతిమానవుని దోమకాటు నుండి కాపాడుట.

దోమలు రాత్రుల యందేకాని కుట్టవు. కావున ప్రతి మానవుడును రాత్రుల యందు దోమల తెరలో పరుండిన యెడల దోమలు ఇంటిలో నున్నను వారలను కుట్టనేరవు. మిక్కుటముగ చలి జ్వరము గల ప్రదేశములలో సయితము, అక్కడకు శోధనల నిమిత్తమై పోయిన వైధ్యులు నెలల కొలది యక్కడ నివశించియు చలి జ్వరము పాల బడకుండ దోమ తెరల మూలమున తప్పించు కొని యున్నారు.

కావున చలి జ్వరము నుండి తప్పించు కొనవలెననిన యెడల 1. చలిజ్వరపు పురుగులనైన నశింప జేయ వలెను. లేక 2. దోమనైన నశింప జేయవలెను. 161

2. బూదకాలు-ఏనుగుకాలు

(Elephantiasis)

ఈ వ్వాధి కాలునకేకాక చేతికిని, స్తనములకును, జన నేంద్రియములకును కూడ కలుగ వచ్చును. దీనిని బుట్టించు సూక్ష్మ జీవులు కూడ దోమల మూలముననే వ్వాపించును. బూద కాలు గల రోగిని కుట్టిన దోమ కడుపు లోనికి ఆవ్వాధిని కలిగించు సూక్ష్మ జీవుల నెత్తురుతో పాటు పోయి చేరును. మూడవ ప్రకరణము లోని పటములను జూడుము. ఈ దోమలు నీటిలో వడి చచ్చినప్పుడు వాని కడుపులోని సూక్ష్మ జీవులు ఆనీటిలో చేరును. ఆ నీటిని త్రాగిన వారికి జ్వరమును, బూద కాలును వచ్చును. బూద కాలు గల రోగిని కుట్టిన దోమలు ఇతరులను కుట్టి నప్పుడు కూడ ఈ వ్యాధి అంటుకొన వచ్చునని కొందరి అభిప్రాయము.

నివారించు పద్ధతులు

చలి జ్వరమునునకు అనాఫలీసు దోమ ఎట్లు సహకారియో బూద కాలునకు క్యూలెక్సు దోమ అట్లు సహకారి. ఇది వ్రాలి నపుడు కొంచెము గూని గలదిగా అగపడును. బూద కాలును నిర్మూలము చేయవలెనన్న ఈ దోమలను రూపు మాపవలెను. దోమలను సంహరించు పద్ధతులు 'చలి జ్వరము.' క్రింద వ్రాయబడినవి చూడుము.

మనము త్రాగు నీటి యందు దోమలు పడి చావకుండ ఎల్లప్పుడు నీటిని కాపాడ వలెను. త్రాగునప్పుడు నీటిని చక్కగ 162

కాచి త్రాగవలెను. అప్పుడు నీటిలో నున్న బూదకాలు సూక్ష్మ జీవులు చచ్చి పోవును. ఒక ప్రదేశము నందు ఈ వ్యాధి మిక్కుటముగ వ్యాపించి యున్న ఎడల ఆ ప్రదేశమునకు దూరము లోనున్న చెరువు నుండి దోమల సంపర్క మేమియు కలగ కుండ గొట్టముల గుండా నీరు తెప్పించు కొనవలెను. చెన్న పట్టణములో నిప్పుడిట్లు చేయుట వలన బూద కాళ్లు చాల వరకు తగ్గి పోయినవి.