Jump to content

అంటువ్యాధులు/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి


తొమ్మిదవ ప్రకరణము

సహజరక్షణశక్తి

సూక్ష్మజీవులు మన కపకారముచేయకుండ నెల్లప్పుడును మనలను కాయుచుండు ప్రాకరము లనేకములు గలవని చెప్పవచ్చును. అందు మన చర్మము మొదటి ప్రాకారము. గాయము లేనంత కాలము సూక్ష్మజీవులు చర్మముగుండ మన రక్తములోనికి వెలుపలినుండి ప్రవేశింపనేరవు. కాని కొన్ని సూక్ష్మజీవులను చర్మముమీదపెట్టి గట్టిగా రుద్దినయెడల నా సూక్ష్మజీవులు చర్మముగుండ లోపలికి పోగలవు. లోపల ప్రవేశింపగానే యీ సూక్ష్మజీవులు మన గజ్జలు చంకలు మొదలగు స్థలములలో నుండు గ్రంధులచే నాపివేయబడును. ఇవి రెండవవరుస ప్రాకారములోని కోట బురుజులని చెప్పవచ్చును. ఈ గ్రంధులు సూక్ష్మజీవులును ఖయిదీలుగా పట్టి యుంచు స్థలములు. ఇక్కడ మన సైన్యములగు తెల్లకణములు ఈ సూక్ష్మజీవుల నెదిర్చి పోరాడును. వీనిని గెల్చిన పిమ్మటగాని సూక్ష్మజీవులు మన రక్తములోనికి పోజాలవు. ఒక్కొకచో నిక్కడనే యిరుతెగలవారికి ఘోరయుద్ధమై చీము ఏర్పడి గడ్డగా తేలును. సుఖవ్యాధులలో నీ గ్రంధులు పెద్ద వైనప్పుడు వానిని అడ్డగర్రలనియు బిళ్లలనియు చెప్పుదురు.

సూక్ష్మజీవులశక్తికంటె తెల్లకణములశక్తి హెచ్చినప్పుడు బిళ్లలు కరిగిపోవును. తెల్లకణములశక్తిసూక్ష్మజీవులక్రౌర్యమునకు లోబడినపుడు చీము యేర్పడి కురుపుగా తేలును. అనేకమందికి మెడయందును, ఇతర స్థలములందును బిళ్లలు వరుసలు వరుసలుగా పుట్టును. ఇవన్నియు ఏవోసూక్ష్మజీవులు శరీరములో ప్రవేశింపవలెననినప్పుడు వానితో పోరాడుటకై చేరియుండు తెల్లకణముల సమూహములచే నుబ్బియున్నవని గ్రహింపవలెను. క్షయయందును, సవాయమేహము (Syphillis) నందును ఈ బిళ్లలు ఉబ్బును. తేలుకుట్టినప్పుడు గజ్జలలో బిళ్లలు నొప్పి యెత్తునది విష మక్కడ నిలిచిపోవుటచేతనే కలుగుచున్నది.

మన నోటిగుండ సూక్ష్మజీవులు ప్రవేశింపవలెననిన వానికెందరు విరోధులున్నారో యాలోచింతము. మననోటిలో నూరు ఉమ్మి యనేకజాతుల సూక్ష్మజీవులను తొలుతనే చంపివేయును. అక్కడనుండి పోయినతర్వాత మన ఆహార కోశము (Stomach)లో బారుచుండు జాఠరరసము (Gastric Juice) యొక్కపులుపు అనేకరకముల సూక్ష్మజీవులను నశింప జేయును. ఇవిదాటి సూక్ష్మజీవులు పేగులలోనికి పోయినను అన్నియెడలను సూక్ష్మజీవులు మనకపకారము చేయలేవు. మన పేగులయందు సర్వత్ర ఆవరించి యొకదళమైనట్టియు మృదువైనట్టియు పొర (Mucous Membrane) గలదు. ఈ

6

పొరలో గాయములు లేకున్నంతకాలమును, వ్యాధిగాని బలహీనతగాని లేకున్నంతకాలమును సూక్ష్మజీవుల నిది మన రక్తములోనికి చొరనియ్యదు. దొమ్మ సూక్ష్మజీవులను చుంచులకు ఆహారములో కలిపి యెన్ని పెట్టినను వానికి వ్యాధి రాదు. గాయముగుండ చర్మములోని కెక్కించినను, మెత్తని పొడిచేసి పీల్పించినను వెంటనే వ్యాధి అంటును. ఇవిగాక స్త్రీల యొక్క సంయోగావయవములలోనుండి యూరుద్రవములలో నొకవిధమైన ఆమ్లపదార్థముండి యది సామాన్యముగా సూక్ష్మ జీవుల నన్నిటిని చంపును. ఆభాగమునందేదేని గాయము గాని, వ్యాధిగాని యున్నప్పుడే సుఖవ్యాధు లంటునుగాని, మిక్కిలి యారోగ్యదశలో నీ యవయము లున్నయెడల సుఖవ్యాధులు తరుచుగ నంటవు. మనము విసర్జించుమూత్రము నందుకూడ సామాన్యముగా కొన్నిసూక్ష్మజీవులను చంపు గుణముకలదు. పైని వివరింపబడిన కాపుదలలేగాక మన శరీరమునందు సూక్ష్మజీవులు సులభముగ చేరకుండ మనలను రక్షించుటకు మిక్కిలి క్లిష్టములగు వ్యూహము లెన్నియో గలవు. అవి యన్నియు మనకింతవరకు తెలియవు. తెలిసినవరకు మిక్కిలి ముఖ్యములగు విషయములు దినదినమున నుపకరించునవి కొన్ని గలవు. మనశరీరములో సూక్ష్మజీవులకు తగిన ఆహారముండగా నవి ఎందుచేత మన శరీరములో ప్రవేశించినప్పుడు పెరుగవు? ఏవో వీనికి హానికరములగు పదార్థములు

వీని కెదురుపడి పోరాడుచున్నందున వీనిదండయాత్రలునిలుచుచున్నవికాని వేరుకాదు. ఇట్లు పోరాడు మన సిబ్బందిలో రెంటినిగూర్చి మన మిదివరలో వినియున్నాము. ఇవి మన నెత్తురులోనుండు తిండిపోతు తెల్లకణములు విరుగుడు పదార్థములే.

నెత్తురుయొక్క స్వరూపము

1884 సం॥ర ప్రాంతమున మెచ్నికాఫ్ అనునతడు నెత్తురులోని కొన్ని తెల్లకణములు సూక్ష్మజీవులను పట్టి తినునని కనిపెట్టెను. ఈ తెల్లకణములలో రెండువిధములు కలవు. కొన్ని జంగమ తెల్లకణములు; కొన్నిస్థావర తెల్లకణములు. వీని భేదములను చక్కగా గుర్తెరుగుటకై యెకనెత్తురుబొట్టు నెత్తి దానిని సూక్ష్మదర్శినిలోనుంచి పరీక్షింపవలెను. 27-వ పటమును జూడుము.

27-వ పటము.

ఒక నెత్తురు చుక్క సూక్ష్మదర్శినిలో కనబడు రూపము. 400 రెట్లు. తె-తెల్లకణములు. ఎ-ఎర్రకణములు.

ఈ నెత్తురుచుక్కయొక్క పటమును చూచినయెడల పెక్కులుగ గుండ్రని బేడకాసుల దొంతరలవలెనున్న కణములును అక్కడక్కడ వివిధాకారములుగల కొంచెము పెద్దకణములు చూడనగును. ఈ తెల్లకణములు నెత్తురులో నున్నప్పుడు కొంచెము నీలపు రంగుకలిగిన యుండలవలె కనుపించును. ఈ యెర్రకణములును తెల్లకణములునుగాక రక్తములో వీని కాధారమగు ద్రపదార్థముగలదు. ఈ ద్రపదార్థమునకు రసము (Serum) అనిపేరు. ఈ రసములో తేలుచు నెత్తురు కాలువలో నీకణములుకొట్టుకొని పోవుచుండును. ఇందు రమారమి 500 ఎర్రకణములకు ఒక తెల్లకణము చొప్పుననుండును. ఎర్రకణములు ఊపిరి తిత్తులలోనికిపోయి ప్రాణవాయువును తెచ్చి శరీరమునకిచ్చుచు నక్కడనుండి అంగారామ్ల వాయువు (Carbonic Acid Gas) తీసికొనిపోయి ఊపిరిగాలి గుండ బయటికి విడిచివేయును.

తెల్లకణములు

తెల్లకణములలో 5 భేదములుకలవు. సాధారణముగ నన్నికణములలోవలె ఈ కణములన్నిటియందు మూలపదార్థమును జీవస్థానమును నుండును. వీనియందలి భేదముచేతనే తెల్లకణములో నీ యయిదు భేదము లేర్పడినవి. ఈ ప్రక్కనున్న 28-వ పటమును జూడుము.

28-వ పటము


1. బహురూప జీవ స్థానము గల తెల్ల కణములు. (1200 రెట్లు పెద్దది) 2. ఆమ్లకరణములగు తెల్లకణములు. 3. చిన తెల్ల కణములు 4. జీవ స్థానమేకముగనున పెద్ద తెల్ల కణము 5. మధ్యమ తెల్ల కణము.

తెల్లకణములు





1. బహురూప జీవస్థానముగల తెల్ల కణములు (Polymorpho-nuclear Leucocyte). ఇవి నెత్తురులోనితెల్ల కణములలో నూటికి 70 వంతున ఉండును. పటము జూడుము. వీనియందు అర్ధచంద్రాకారముగను (c), లావత్తువలెను () తెనుగు లెక్కలలోని హళ్లి (‘) వలెను అనేక రూపములుగల జీవస్థానములుండును. మూలపదార్థములో సన్నని నలుసు లుండును.

2. ఆమ్లాకర్షణములు. (Eosinophill Leucocyte) ఇందు గుండ్రమైనట్టికాని, పలవలు గలయట్టికాని జీవస్థానము లుండును. మూలపదార్థములో మోటుగనుండు నలుసులుండును. ఈ నలుసులు ఇయోసిౝ మొదలగు ఆమ్లవర్ణముల నాకర్షించును. (Oxyphill). ఇవి నూటికి 2 మొదలు 4 వరకు నుండును.

3. జీవస్థాన మేకముగనున్న పెద్ద తెల్లకణములు. (Large Mononuclear Leucocyte) ఇందు పెద్ద జీవస్థానమును, దానిచుట్టుకొంచెము మూలపదార్థము నుండును. ఇందు నలుసు లంతగా కానరావు. ఇవి నూటికి 2 మొదలు 4 వరకుండును.

4. చిన్న తెల్ల కణములు (LymPhocyte) ఇందు గుండ్రని చిన్న జీవస్థానమును, కొద్దిపాటి మూలపదార్థము నుండును. ఇందును నలుసులు కానరావు. ఇవి నూటికి 20 మొదలు 25 వరకుండును.

5. ఇవిగాక జీవస్థాన మేకముగ గల పెద్ద తెల్లకణములకును, బహురూప జీవస్థానముగల తెల్లకణములకును మధ్యమున కొన్ని తెల్ల కణములు కలవు. వీనికి మధ్యమ తెల్లకణములు (Transitional Leucocytes) అని పేరు. ఇందు జీవస్థానము బొబ్బర (అలచంద) గింజవలె మధ్య పల్లమును రెండు అంచుల లావుగనుండును. ఇవి క్రమముగ బహురూప జీవస్థానముగల తెల్లకణములుగా మారును.


పైని చెప్పిన కణములలో ముఖ్యముగ సూక్ష్మజీవులను పట్టితినునవి బహురూప జీవస్థానములుగల తెల్లకణములు. జీవస్థానమేకముగ గల పెద్దకణములకును, నెత్తురులోగాక కండలు నరములు మొదలగు సంహతుల నడుమనుండు కొన్ని కణములకు కూడ సూక్ష్మజీవులను పట్టి తిను శక్తికలదు. ఇందు కొన్ని యొక చోటనుండక యెల్లపుడు తిరుగుచుండును. కావున వానికి జంగమకణములని పేరుకలిగెను.

స్థావరకణములు

పైని వివరించినవిగాక తాము నివసించుచోట్లనే కదలకయుండి దొరికినినప్పుడెల్ల సూక్ష్మజీవులను పట్టితినుశక్తిగల కణములుకొన్నికలవు. మన పేగులయందలి ఆమ్లపు పొర యందును గ్రంధులయందును లోపల వైపున పరచియుండు అంతశ్చర్మ కణములును, ప్లీహము (Spleen) నందును ఎముకలలోని మూలుగు (Bone Marrow) నందు నుండు కణములును ఒకానొకప్పుడు నరములలోని కణములను, కండలలోని కణములును కూడ సూక్ష్మజీవులను పట్టిచంపును. ఇవి యన్నియు స్థావరకణములు.

కణవాదము

తిండిపోతు తెల్లకణములు

సూక్ష్మజీవులను చంపు నీ జంగమకణములకును స్థావరకణములకును కూడ తిండిపోతుకణములని పేరు. మెచ్ని

కాఫ్ అనునతడు మొదట నొక ఈగయొక్క రక్తములోని తెల్లకణ మొకటి సూక్ష్మజీవుల గ్రుడ్డు నొకదానిని పట్టితినుట కనిపట్టెను. పిమ్మట ఇతడు కొన్నికప్పలకు దొమ్మవ్యాధి నెక్కించి ఆ దొమ్మవ్యాధి సూక్ష్మజీవులను కప్పలలోని తిండిపోతుకణములు తినుట చూచెను. అటుతరువాత నెక్కడ సూక్ష్మజీవులు ప్రవేశించినను, అక్కడకెల్ల నీ తిండిపోతు తెల్ల కణములు పరుగులెత్తుకొని వచ్చుచుండుట నితడు కనిపెట్టెను. చచ్చిన సూక్ష్మజీవుల శవములును, వానినుండి పుట్టిన యేవో కొన్ని మాంసకృత్తు పదార్థములును తెల్లకణములను సూక్ష్మజీవులవద్ద కాకర్షించుననియు మిక్కిలి యుధృతమైన క్రౌర్యముగల సూక్ష్మజీవుల విషములయందు తిండిపోతు కణములను దూరముగ తోలుశక్తి గలదనియు కొందరు శోధకులు కనిపట్టి యున్నారు. సూక్ష్మజీవులేగాక సూక్ష్మజీవుల గ్రుడ్లను గూడ తిండిపోతు తెల్లకణములు మ్రింగును. కాని అవి సాధారణముగ జీర్ణముకావు. తెల్లకణము లీ గ్రుడ్లను మోసికొనిపోయి మరియొకచోట విడిచినప్పుడు మిక్కిలి తీవ్రముగ పెరుగ నారంభించి వేనవేలయి తిరిగి యక్కడ హానిజేయుటకు ప్రారంభించునని మెచ్ని కాఫుకనిపట్టియున్నాడు. నెత్తురులోని తిండిపోతుకణముల సంఖ్యనుబట్టి యొకానొక వ్యాధియందు సూక్ష్మజీవులు గెలుచునా మనశరీరము గెలుచునా యను విషయమెల్లప్పుడును తెలిసికొనవచ్చు ననియు, నీ తిండిపోతు

కణములే మనలను సూక్ష్మజీవులనుండి కాపాడుటకాధారమనియు మెచ్ని కాఫుయొక్క వాదము. ఈతని వాదమునకు కణవాదమని పేరు.

పైని జెప్పిన ప్రకారము తిండిపోతు తెల్ల కణములు మనకుచేయు నుపకార మొప్పుకొన తగినదేకాని, ఈతని కణ వాదము పూర్ణముగా నంగీకరింప తగినది కాదని యిటీవలి వారు నిర్ధారణము చేసి యున్నారు. నెత్తురునుండి తెల్లకణములను ఎర్రకణములను అన్నిటిని వడపోసి తీసివేయగా మిగిలిన రసమునందుకూడ సూక్ష్మజీవులను మనము వేసినప్పుడు అవి చచ్చుననియు, కావున రక్తమునందలి రసమునకుకూడ సూక్ష్మజీవులను చంపు గుణము గలదనియు నిటీవలివారు కనిపట్టి యున్నారు.

ఇట్లు సూక్ష్మజీవులను చంపుగుణము రక్తమును 55 డిగ్రీలవరకు అనగా మనము చెయ్యి పెట్టలేనంత వేడివచ్చు నంతవరకు కాచినయెడల నశించిపోవును. ఇతర మాంసకృత్తుల (Proteids) తోపాటు ఈ పదార్థములను కూడ వడపోసి తీయవచ్చును. ఆరబెట్టి పొడిచేయవచ్చును. తిరిగ నీళ్లలో కలపవచ్చును. ఇట్లు చేసినను వాని శక్తిపోదు. కాని ఈ పదార్థమును విడిగా తీయవలెనన్న శక్యము కాలేదు. కొద్దిపాటి వేడిగాని వెలుతురుగాని ప్రాణవాయువుగాని తగిలిన తోడనే దీని శక్తి నశించిపోవును.

కావున నీ పదార్థములను విడదీయుటకుగాని ప్రత్యేకముగ నిలువచేయుటకుగాని సాధ్యము గాకయున్నది. పైని చెప్పిన తిండిపోతు కణములును రసములోని యేవో పదార్థములును రెండును, సూక్ష్మజీవులు మన శరీరములో ప్రవేశించినప్పుడేగాక మన శరీరముతో సంబంధములేని ఇతర పదార్థమేదయిన మన శరీరములో ప్రవేశించినప్పుడుకూడ పుట్టుచున్నవి. ఒక పిల్లిచర్మముయొక్క లోతట్టున నుండు భాగము లోనికి కోడిగ్రుడ్డు సొనలోని తెల్లని పదార్థమునుగాని గోధుమలోని జిగురు పదార్థమునుగాని బోలుగనుండు సూదితో నెక్కించినయెడల (Hypodermic Injection) కొద్ది దినములలో నా ప్రదేశమునందు తెల్ల కణములును ద్రవపదార్థములును అధికమై మనము చొప్పించిన కొత్తపదార్థ మంతయు నీరువలె కరిగి జీర్ణమైపోవును. శస్త్రవైద్యము చేయునపుడు శరీరమునందలి లోపలి భాగములందు ఉపయోగింపబడు నారి (Catgut) మొదలగు కుట్టుత్రాళ్లను కరగించి జీర్ణముచేయు శక్తిగలవి ఇవియే. మన శరీరములో ప్రవేశించిన యేపదార్థము నైనను ద్రవరూపముగ జేయుగుణము తెల్లకణములనుండియే పుట్టుచున్నదనియు ఇట్లే తెల్లకణములనుండి పుట్టిన పదార్థములే యేవో రసమునకు సూక్ష్మజీవులను చంపుశక్తినిగూడ కలిగించుచున్నవనియు నిప్పుడనేక శాస్త్రజ్ఞులయభిప్రాయము. మన శరీరములోప్రవేశించిన యే పదార్థముతోనైన నెదిరించి,

పోరాడునట్టియు, హరించివేయునట్టియు ఈ తెల్లకణములకు పరభుక్కణములు (Phagocytes) అనియు, నీ తెల్లకణముల నుండి పుట్టిరసములో జేరియుండు సూక్ష్మజీవులను నాశనము చేయు శక్తిగల యితరపదార్థములకు పరభుక్దాతువులు (Alexins) అనియు పేరు. ఈ పరభుక్కణములును పరభుక్ధాతువులును సూక్ష్మజీవులనేగాక సూక్ష్మజీవులనుండి పుట్టు విషములను, తేలు, పాము మొదలగు మన విరోధులవలన కలిగిన సమస్థ విషములను కూడ విరచివేసి మనలను కాపాడుచుండును. ఇవియే మనకుగల సహజరక్షణశక్తికి మూలాధారములు.