అంటువ్యాధులు/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

74

ఎనిమిదవ ప్రకరణము

AntuVyadhulu.djvu

2. రక్షణశక్తి (Immunity)

ఒకానొక అంటు వ్యాధి రాదగిన అవకాశములన్నియు నున్నను, ఆ వ్యాధిని మన కంటకుండ జేయు శక్తికి రక్షణ శక్తి యని పేరు. ఇట్టి రక్షణ శక్తి మనకు గలదను విషయము చిరకాలము నుండి ప్రజలకు కొంత వరకు తెలిసి యున్నదని చెప్పవచ్చును. ఒక్క సారి మశూచకము వచ్చిన వానికి తిరిగి మశూచకము రాదని మనవారల కందరకు తెలియదా? ఇట్లొక సారి మశూచకము వచ్చిన వానికి తిరిగి మశూచకము రాకుండుటకే వానికి రక్షణ శక్తి కలదని చెప్పుదుము. ఇట్టి రక్షణ శక్తి మశూచకమునకే గాక యింకను కొన్ని ఇతర వ్యాధులకును గలదు. ఒక సారి వ్యాధి వచ్చి పోవుట చేతనే గాక ఇతర కారణముల చేత కూడ మన రక్షణ శక్తి కలుగ వచ్చును.

మన చుట్టు ప్రక్కలను, మన శరీరము మీదను, మన పేగులలోను, నోటి యందును, ముక్కులందును, ఊపిరి పీల్చు గాలి యందును సూక్ష్మ జీవులు కోట్లు కోట్లుగా నున్నవని చెప్పియున్నాము. మన శరీరములో ప్రాణమున్నంత కాలము మన కేమియు అపకారము చేయలేని సూక్ష్మ జీవులు ప్రాణము పోయిన వెంటనే శరీరమును నాశనము చేయుటకు ప్రారంభించి 75

కొద్ది దినములలో తాము నివసించు గృహమును నామము నకైన లేకుండ క్రుళ్ళ పెట్టును. ప్రాణమున్నప్పుడీ దేహమునకు సూక్ష్మ జీవువు లపకారము చేయ కుండ మనలను రక్షించు శక్తి యొకటుండ వలెను. అది సహజముగ ప్రతి జంతువు యొక్క శరీరమునకును కలదు. అట్టి రక్షణ శక్తికి సహజ రక్షణ శక్తి యని పేరు. పైన చెప్పిన ప్రకారము ఒక వ్యాధి వచ్చి కుదిరి పోవుటచే గాని, టీకాలు మొదలగు నితర ప్రయత్నములచే మనము కల్పించుకునట్టి గాని రక్షణ శక్తికి కల్పిత రక్షణ శక్తి యని పేరు.

సహజ రక్షణ శక్తి యందును, కల్పిత రక్షణ శక్తి యందును కూడ అనేక భేదములు కలవు.

సహజ రక్షణ శక్తి పైన ఒకచో వివరించిన ప్రకారము (1) మన నెత్తురు నందుండు తెల్ల కణములు సూక్ష్మ జీవులను మ్రింగి వేయుట చేత గాని, (2) ఆ తెల్ల కణములనుండి ఉద్భవించు విరుగుడు పదార్థములు సూక్ష్మ జీవులను చంపి వేసి వాని విషములను విరిచి వేయుట చేగాని కలుగ వచ్చును.

ఇవిగాక మనకు సూక్ష్మ జీవు లంటుటలో కూడ రెండు భేదములు కలవని చెప్పి యుంటిమి. (1) కొన్ని సూక్ష్మ జీవులు శరీరములో ప్రవేశించిన తోడనే కోట్లు కోట్లుగా పెరిగి దొమ్మ మొదలగు వ్యాధులలో వలె రక్తము ద్వారా సకల అవయవములకు వ్యాపింప వచ్చును. (2). మరికొన్ని సూక్ష్మ జీవులు ధనుర్వాయువు నందు వలె ప్రవేశించిన చోటనే పెరుగుచు తమ విషములను మాత్రము శరీర మంతట వ్యాపింప జేయుచు ఆ విషములచే మన కపకారము చేయును. 76

ఇందు మొదటి రకము అంటు వ్యాధులలో సూక్ష్మ జీవులే మనకపకారము చేయును. రెండవ రకము అంటు వ్యాధులలో సూక్ష్మ జీవుల నుండి పుట్టిన విషములు మన కపకారము చేయును. దొమ్మ (Antrax ) క్షయ (Tubercle ) కుష్టువ్వాది (Leprosy ) మొదలగునవి మొదటి రకములోని అంటు వ్యాధులు. ధనుర్వాయువు, ( Titanus), కలరా (kholera) డిప్తిరియా (Diphtheria) అను నొక క్రూరమైన గొంతు వ్వాధి, ఇవి రెండవ రకము అంటు వ్వాధులు. ఈ రెండు రకములు గాక కొంత వరకు సూక్ష్మ జీవుల మూలమునను కొంత వరకు వాని విషముల మూలమునను మన కపకారము చేయు అంటు వ్వాధులు కొన్ని గలవు. టైఫాయిడు జ్వరము, ప్లేగు, (మహామారి), ఇన్ ప్లూయంజా జ్వరము, రణ జ్వరము (spetic Fevere) ఇవి యీ మూడవ జాతి అంటు వ్యాధులు.

ఇందు మొదటి రకము వ్వాధులలో రక్షణ శక్తి కలిగింప వలెననిన, సూక్ష్మ జీవులను జంపుటకు ప్రయత్నింప వలెను. అట్లు చంపు పదార్థములకు సూక్ష్మ జీవ నాశకములని పేరు. ఈ సూక్ష్మ జీవనాశకములగు పదార్థములను మన మేలాగునైన రోగి శరీరములో పుట్టించిన యెడల ఆ పదార్థము సూక్ష్మ జీవులను చంపును. మశూచకము మొదలగు వ్వాధులు రాకుండ టీకాలు వేయుట ఈ పదార్థములను మన శరీరములో బుట్టించుటకే. ఇట్టి టీకాలలో అనేక విధములు గలవు. వానిని క్రింద వివరించెదము. 77.

రెండవ రకము వ్యాధులలో అనగా సూక్ష్మ జీవుల విషయములచే మన కపకారము కలుగు వ్యాధులలో రక్షణ శక్తి గలిగింప వలెననిన నీ విషములను విరిచి వేయు పదార్థములను కనిపెట్టవలెను. ఇట్టి పదార్థములకు సూక్ష్మ జీవ విష నాశకములని పేరు. ధనుర్వాయువను వ్యాధి మిక్కిలి భయంకర మైనది. వ్వాధి అంకురించిన కొద్ది కాలములోనే దవడలు దగ్గరగా నొక్కుకొని పోయి, నడుము విలు వంపుగా ముందుకు వంగి కొయ్య బారి రోగి అతి ఘోరమగు బాధ నొంది మృతి చెందును. *అట్టి స్థితిలో కూడ ధనుర్వాయు సూక్ష్మ జీవ విష నాశకములగు పదార్థమును రోగి యొక్క శరీరములోనికి సన్నని బోలు సూదితో నెక్కించిన యెడల నిమిషలమీద రోగికి స్వస్థత కలుగును.

ఈ పదార్థము గుర్రము నెత్తురు నుండి ఈ క్రింది ప్రకారము చేయబడినది. ఒక గుర్రము యొక్క శరీరములోనికి ఆ

..............................................................................................................

  • ఈ మధ్య కొన్ని దినముల క్రిందట బెంగళూరు వద్ద నున్న కుప్పం అను గ్రామంలో నొక ఆమెకు కాలిపై ద్వార బంధము మీద నుండి మట్టిగడ్డ పడి, కాలిలో గాయమై ఆ గాయము గుండా కొంత మట్టి లోపలకు పోయి, పైని మూసికొని పోయెను. ఈ మట్టితో గూడ ధనుర్వాయు సూక్ష్మ జీవులు గాయములో ప్రవేశించెను. రెండు దినములు గడచిన పిమ్మట యొక నాటి సాయంకాలము ఆమెకు దవడలు దగ్గర పడిపోయి, శరీరము కొయ్య వలె నయి నిశ్చేష్ఠు రాలయ్యెను. వెంటనే వారు నాకు తంతి పంపగా ఇక్కడ నుండు నేను ధనుర్వాయు సూక్ష్మ జీవి విష నాశకమగు ద్రవమును (Titanus antitoxic Serum) తీసికొని వెళ్ళి బోలు సూది గుండ దండ లోని చర్మము క్రింద నెక్కింపగా వెంటనే నెమ్మదించెను. 78

గుర్రమును చంపుటకు శక్తి గల మోతాదులో 20 వ వంతు మోతాదుల కొలతగా ధనుర్వాయు వవ్చు సూక్ష్మ జీవులను ఎక్కింతురు. ఈ గుర్రమునకప్పుడు కొంచెము జ్వరము వచ్చి యది బాధ పడినను మోతాదు చాలదు గనుక చావదు. ఈ గుణము లన్నియు నయమైన తరువాతి కొన్ని దినములకు తిరిగి మొదటి మోతాదు కంటె కొంచెము ఎక్కువ ధనుర్వాయు సూక్ష్మ జీవులను ఆ గుర్రము యొక్క రక్తములోనికి ఎక్కింతురు. దీనిని కూడ గుర్రము జయించును. ఇట్లు అనేక సారులు చేసిన పిమ్మట ఎంత హెచ్చు మోతాదు ధనుర్వాయువు సూక్ష్మ జీవులను ఆ గుర్రము నెత్తురులోని కెక్కించినను అది లెక్క చేయదు. ఈ ప్రకారము చేయుట వలన ఆ గుర్రము యొక్క రక్తమునకు ఒక విధమైన రక్షణ శక్తి కలిగినది. దాని రక్తము నందు ధనుర్వాయువు కలిగించు సూక్ష్మ జీవుల విషమెంత వేసినను విరిగి పోవును. ఇట్లు చేయు శక్తి దాని నెత్తురు నందలి ద్రవ పాదార్థములో అనగా రసములో నున్నది గాన కణములలో లేదు. ఈ రసమును ఆ గుర్రమునుండి వేరు పరచి ఎంత పరిమాణము గల రసము ఎంత విషమును విరిచి వేయ గలదో శోధనలు చేసి నిర్థారణ చేయుదురు. ఇట్లు శోధించి ఒక తులము రసము ఇన్ని లక్షల సూక్ష్మ జీవుల విషమును విరిచి వేయునని ఏర్పరతురు. వ్వాధి యొక్క ఉద్రేకమును బట్టి వైద్యుడు ఈ రసమును తగిన మోతాదులతో ఉప యోగించు కొనవలెను. పైన చెప్పిన కుప్పములోని రోగికి 79

మోతాదు కొక్క తులము చొప్పున మూడు మోతాదుల రసమును ఉపయోగము చేయువరకు ప్రాణము పోవు చున్నదో అని అనుమానము గల ఆమె పూర్వపు ఆరోగ్యమును విచిత్రముగ సంపాదించు కొనెను. ఈ గుర్రపు రసము నందు ధునుర్వాయు విషనాశక మగు పదార్థము ఎద్దియో కలదనుట స్పష్టము. ఈ విషయమై ఇంకను క్రింది తెలిసి కొనగలరు. ఈ టీకా రస వైద్యము (Serum Therasphy) దినదినాభి వృద్ధి యగుచున్నది. ఇట్లె వివిధ జాతుల సూక్ష్మ జీవుల విషములను విరిచి వేయుటకు వేరు వేరు విధముల టీకా రసములు తగివవి ఇప్పుడు విక్రయమునకు దొరకును.

రక్షణ శక్తి ...... సహజ రక్షణ శక్తి, కల్పిత రక్షణ శక్తి యని రెండు విధములనియు, అంటు వ్వాధులలో సూక్ష్మ జీవులచే కలుగునని, వాని విషములచే కలుగునవి, అని రెండు విధములనియు ఈ వ్వాధుల నుండి రక్షణ శక్తి కలిగింప వలెననిన మొదటి రకము వ్యాధులకు సూక్ష్మ జీవ నాశకమగు పదార్థములను, రెండవ రకము వ్వాధులకు సూక్ష్మ జీవ విష నాశకములగు పదార్థములను మనము ఉపయోగ పరచ వలెననియు వ్రాసి యుంటిమి. ఇప్పుడు నీని యందొక్కొక్క విషయమును గూర్చి వివరించెదము.