హరి యవతార మీతడు

వికీసోర్స్ నుండి
హరి యవతార (రాగం: ) (తాళం : )

ప|| హరి యవతార మీతడు అన్నమయ్య | అరయ మా గురుడీతడు అన్నమయ్య |

చ|| వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు | ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య |
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు | ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ||

చ|| ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు | ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య |
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు | హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ||

చ|| క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు | ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య |
ధీరుడై సూర్యమణ్డల తేజము వద్ద నున్నవాడు | ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ||


hari yavatAra (Raagam: ) (Taalam: )

pa|| hari yavatAra mItaDu annamayya | araya mA guruDItaDu annamayya |

ca|| vaikuMTha nAthuni vadda vaDi paDu cunna vADu | Akaramai tALLapAka annamayya |
Akasapu viShNu pAdamaMdu nityamai unna vADu | AkaDIkaDa tALLapAka annamayya ||

ca|| Ivala saMsAra lIla iMdirESutO nunna vADu | AvaTiMci tALLapAka annamayya |
BAviMpa SrI vEMkaTESu padamulaMdE yunnavADu | hAva BAvamai tALLapAka annamayya ||

ca|| kShIrAbdhiSAyi baTTi sEviMpucu nunnavADu | AritEri tALLapAka annamayya |
dhIruDai sUryamaNDala tEjamu vadda nunnavADu | ArItula tALLapAka annamayya ||


బయటి లింకులు[మార్చు]

HariAvataramitadu_Shobharaju





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |