సాహసి
Wikisource నుండి
| శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు |
||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎగిరించకు లోహవిహంగాలను!
కదిలించకు సప్తభుజంగాలను!
ఉండనీ,
మస్తిష్కకులాయంలో!
మనోవల్మీకంలో!
అంతరాళ భయంకర
ప్రాంతరాలనా నీ విహారం?
ముళ్లదారినా నీ సంచారం?
పలికించకు మౌనమృదంగాలను!
కెరలించకు శాంతరంగాలను!
హృదయంలో దీపం పెట్టకు!
మంత్రనగరి సరిహద్దులు ముట్టకు!