నిజంగానే
Wikisource నుండి
| శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు |
||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||
నిజంగానేనిఖిలలోకం
నిండుహర్షంవహిస్తుందా?
మానవాళికినిజంగానే
మంచికాలంరహిస్తుందా?
నిజంగానే, నిజంగానే
నిఖిలలోకంహసిస్తుందా?
దారుణదేషాన్ని పెంచే
దానవతంనశిస్తుందా?
బానిసలసంకెళ్ళు బిగిసే
పాడుకాలంలయిస్తుందా?
సాధుసతపుసోదరతపు
సాదుతత్తంజయిస్తుందా?
జడలువిచ్చిన, సుడులురెచ్చిన
కడలినృత్యం శమిస్తుందా?
నడుమతడబడి, సడలి, ముడుగక
పడవతీరం క్రమిస్తుందా?
నిజంగానే, నిజంగానే?

