పుట:Womeninthesmrtis026349mbp.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

79

భర్తపైన వివరింపబడిన యవస్థలలో నున్నప్పుడు భార్య యాతనిమాట వినుటకూడ ప్రమాదహేతువే కావచ్చును గావుననే యీమె యాతనిమాట నుల్లంఘించుట కంతస్వల్పమగు శిక్షవిధింపబడినది.

కొన్నిసమయములలో భర్తపట్ల ద్వేషభావమును గల్గియుండు స్త్రీని భర్త వదలివేయరాదు.

     ఉన్మత్తంవతితం క్లీబమబీజం పాపరోగిణం
     న త్యాగో౽స్తి ద్విషంత్యాశ్చ న చ దాయాపవర్తనం.
(మను 9-79 )

(పిచ్చివాడు, పతితుడు, నపుంసకుడు, బీజములేనివాడు, కుష్ఠియగు భర్తనుద్వేషించిన స్త్రీని భర్త వదలిపెట్టరాదు. ఆమెకుదాయము నీయకుండ నుండరాదు)

అట్టిహీనస్థితిలోనున్న భర్త భార్యనువదలుచో నాతని స్థితి మఱింత హీనమగునను హేతువుచేతనో భర్తయైనను నట్టిస్థితిలో నుండునపుడు ద్వేష మణుమాత్రమైనను గన్పపఱువకుండుట సామాన్య స్త్రీలకు సాధ్యముకాదు కావున దానికి పెద్దశిక్ష వేయుట మంచిది కాదను హేతువుచేతనో యామెను త్యజింపరాదని చెప్పబడినదికాని యామె దోషవంతురాలు కాదనుభావముతో కాదు. వ్యాధితుడగు భర్త నవమానించు భార్య కుక్క పందియై పుట్టునని పరాశరుడు చెప్పుచున్నాడు.