పుట:Womeninthesmrtis026349mbp.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

స్మృతికాలపుస్త్రీలు

(బ్రాహ్మణుల కగ్నిగురువు. వర్ణములకు బ్రాహ్మణుడు గురువు. స్త్రీలకు భర్తగురువు. అభ్యాగతు డందఱకు గురువు)

భర్తృశుశ్రూషవలన లభింపనిఫలమే లేదని శాస్త్రములు చెప్పుచున్నవి.

    భర్తృశుశ్రూషయైవ స్త్రీ కాన్నలోకాన్ సమశ్ను తే
    దివఃపునరిహాయాతా సుఖానామం బుధిర్భవేత్
(కాత్యాయన 9-13)

(పతిశుశ్రూషచే సతి యేలోకములను పొందలేదు? ఆమె స్వర్గమునకుబోయి తిరిగివచ్చి యిట సుఖసముద్రమగును)

భార్యభర్తపట్ల కన్పఱచిన భక్తి సాపేక్షమైనది కాక కేవలము నిరపేక్షమైనదని యిదివఱలో చూచియున్నాము. కొన్ని కొన్ని పరిస్థితులలో భర్తను భార్య నిర్లక్ష్యము చేసినచో నామెకు లౌకికమగు శిక్షకూడ కలదని మనువు చెప్పుచున్నాడు.

    అతిక్రామేత్ప్రమత్తం యామత్తంరోగార్తమేవ వా
    సాత్రీన్‌మాసాన్ వరిత్యాజ్యా విభూషణపరిచ్ఛదా.
(మను 9-78)

(భర్త ద్యూతాదిదుర్వ్యసనములు గలవాడు, మద్యపానాదులచే నొడలు తెలియనివాడు, రోగముచే నార్తుడునై యున్నపుడు భార్య యాతనిమాట విననిచో నామెకు శిక్షగ భర్త యామె వస్త్రభూషణములను తీసికొని మూడుమాసములు వదలి వేయవలెను.)