పుట:Womeninthesmrtis026349mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాధ్యాయము

77

(మనోవాక్కాయ నియమముగలదై యిట్టి ప్రవర్తన గల స్త్రీ యీలోకములో కీర్తిని పరమున పతిలోకమును పొందును.)

ఈధర్మముండుట స్త్రీ కెంత శ్రేయస్కరమో యిది లేకుండుట యంత వినాశకరము. భర్త నుల్లంఘించుటయే స్త్రీకి మహాదోషము.

    భర్తారం లంఘయేద్యాతు స్త్రీజాతి గుణదర్పితా
    తాంశ్వభిఃఖాద యేద్రాజాసంస్థానే బహుసంస్థితే
(మను 8-371)

(ఏస్త్రీ పుట్టింటి వారి స్థితినిబట్టి గర్వించి భర్తనవమాన పఱచునో యామెను రాజు నిండుసభలో కుక్కలచే తినిపింప వలెను.)

    భర్తృశాసనముల్లంఘ్య యాచస్త్రీ విప్రవర్తతే
    తస్యాశ్చైవ సభోక్తవ్యం విజ్ఞేయా కామచారిణీ
(అంగిర: 69)

(ఏ స్త్రీ భర్తాజ్ఞ నుల్లంఘించి ప్రవర్తించునో యామె చేతియన్నము తినరాదు, ఆమె కామచారిణి)

స్త్రీకి భర్తనుమించిన సేవ్యవస్తువు లేదు.

     గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణోగురుః
     పతిరేకోగురుః స్త్రీణాం సర్వస్యా భ్యాగతో గురుః
(ఉశన: 1-47)