పుట:Womeninthesmrtis026349mbp.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

స్మృతికాలపుస్త్రీలు

ఎన్నడు నొండొరుల నెడబాయుటకు వీలులేనివారు గనుకనే దంపతులిట్టి యైక్యమునొందినట్లు చెప్పబడినారు, ఒకసారి యొకనిని వివాహమాడిన స్త్రీ మఱొకనిని వివాహమాడరాదని చెప్పుట కీయైక్యమే కారణము.

    సకృదంశోనివతతి నకృత్కన్యాప్రదీయతే
    సకృదాహదదా నీతిత్రీణ్యేతానిసతాం సకృత్.
(మను. 9-47 నారద. 12-28)

(భాగమొకసారియే పంచబడును. కన్య యొక్క సారియే యీయబడును. దేనినైనను 'ఇచ్చుచున్నాను' అని యొకసారియే చెప్పుదురు. సత్పురుషులకీ మూడును నొకేసారి జరుగును)

    పాణిగ్రాహణికా మంత్రా: కన్యాస్వేవప్రతిష్ఠితాః
    నాకన్యాసుక్వచిన్నౄణాం లుప్తధర్మక్రియాహితాః
(మను. 2-224)

(పాణిగ్రహణమంత్రములు పూర్వము వివాహితలు కాని వారియందే వర్తించును. అకన్యలయందు వర్తింపవు వారు ధర్మక్రియా రహితలుగదా!)

ఒకసారి వివాహమైన స్త్రీకి మఱల దానము, పాణిగ్రహణముగూడ లేవని చెప్పుటచే స్త్రీకి పునర్వివాహము లేదని స్పష్టమగుచున్నది.