పుట:Womeninthesmrtis026349mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమా ధ్యాయము

73

పురుషుడు భార్యయుండగా మఱొక భార్యను చేసికొనుటకు వీలున్నను నాతనికి ద్వితీయవివాహమాత్రమున ప్రథమ భార్యతోడి దాంపత్యము నశింపదు ('పునర్వివాహము' అను నధ్యాయము చూడుడు) భార్యను వదలివైచినను నమ్మివైచిననుగూడ నామెతోడి దాంపత్యము నశింపదు.

    ననిష్క్రయవినర్గాభ్యాం భర్తుర్భార్యావిముచ్యతే
    ఏవంధర్మం విజానీమ: ప్రాక్ప్రజాపతివినిర్మితం.
(మను. 9-46)

భర్తయెట్టివాడైనను భార్య యాతనితో భార్యాత్వమును గల్గియుండుటయే కాక యాతని నచంచలమైన భక్తితో సేవించుచుండవలెనని స్మృతులు చెప్పుచున్నవి. కాని భార్యలో కొన్నిలోపములుండుచో భర్తయామెను వదలివేయుటకు స్మృతులంగీకరించు చున్నవి. దీనింబట్టి దాంపత్యములో భార్యకంటె భర్త కెక్కుడు నధికారమును స్మృతులంగీకరించు చున్నవని స్పష్టమగుచున్నది. అంతియేకాదు, భార్యాభర్త లొండొరులపట్ల ప్రవర్తింపవలసిన విధానములో గూడ పురుషుని యాధిక్యము వ్యక్తమగుచున్నది. పురుషుడెంత నీచుడైననుగూడ భార్య యాతని నవమానింపరాదు. ఆతనిసేవను వీడరాదు.

     విశీలఃకామవృత్తోవాగుణైర్వా పరివర్జిత:
     ఉపచర్యః స్త్రీయాసాధ్వ్యాసతతం దేవవత్పతిః
(మను 5-154)