పుట:Womeninthesmrtis026349mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

పంచమాధ్యాయము

దాంపత్యము

భార్యాభర్తలిరువురు నొకే వ్యక్తియను వైదికాభిప్రాయము స్మృతులలో గూడ గన్పట్టు చున్నది.

యోభర్తాసాస్మృ తాంగనా.

(మను. 9-45)

(భర్తయే భార్య)

కావుననే భర్తలో భార్య యర్థ భాగమను నభిప్రాయ మేర్పడినది. ఇది కేవలము నామమాత్రమే కాక యాచరణములో గూడ నంగీకరింపబడినది. సురాపానము చేయుట పతితత్వాపాదకమగుటచే సురాపానముచేయు స్త్రీయొక్క భర్తలో నర్థభాగము పతితమగుచున్నదని మనుస్మృతి చెప్పుటచేతనే యిది స్పష్టమగుచున్నది.

పతత్యర్థం శరీరస్య యస్యభార్యా సురాంపివేత్.

(మను. 10-26)

(ఎవనిభార్య సురాపానము చేయునో యాతనిశరీరములో నర్థభాగము పతితమగుచున్నది.)