పుట:Womeninthesmrtis026349mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

స్మృతికాలపుస్త్రీలు

కును వైరుద్ధ్యము గన్పట్టుటకుగల హేతువులను విచారించుట యిట నప్రస్తుతమగుటచే నది వదలివేయబడినది.

కర్మకును నందువాడబడు మంత్రములకును వైరుద్ధ్యముకన్పట్టినట్లే గృహ్యసూత్రకారులు చెప్పిన కర్మక్రమమునకును వారిననుసరించి నేడు చేయబడు చున్న కర్మకును కొంత వైరుద్ధ్యమున్నది. పైననీయబడిన 'శేషగ్ సమావేశనేజపేత్‌' అనుటనుబట్టి 'ఆరోహోరుమ్‌' మున్నగుననువాక శేషము. సమావేశనమందు జపింపబడవలెనని స్పష్టమగుచుండగా శేషహోమమైనవెంటనే ప్రస్తుతము కొందఱు జపించుచున్నారు. వీరిమతములో సమావేశన మప్పుడే జరుగవలెనని కాబోలు! కాని యప్రాప్తవయస్కకు సమావేశనము గావించుట శాస్త్రీయము కాదని భావించికాబోలు వీరు జపమును మాత్రమే యిపుడు కావించి సమావేశనమును ముందునకు నిలిపి వైచు చున్నారు. వంగదేశము మున్నగు కొన్ని ప్రాంతములలో వధువప్రాప్తవయస్కయైనను నపుడే సమావేశనము గావించుటకలదని తెలియుచున్నది. కాని 'శేషగ్ సమావేశనేజపేత్‌' అనుదానినిబట్టి యిట్టి చిక్కులను పడవలసిన పనిలేదు. ఏమన ఆపస్తంబుని మతము అనువాక శేషము సమావేశములో జపింపవలెననియే కాని సమావేశన మిప్పుడే కావింపవలెనని కాదని స్పష్టముగ తెలియుచునే యున్నది.