పుట:Womeninthesmrtis026349mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాధ్యాయము

67

నాపూర్వగ్రంథములో సహేతుకముగ దెల్పియుంటిని. ఆమంత్రములే గృహ్యసూత్రములలో వివాహమునకు విధింపబడినవి. గృహ్యసూత్రములును ధర్మసూత్రములును నొకేకాలమున రచింపబడినవని యందఱు నంగీకరింతురు. ఆ కాలమున రజస్వల కాకుండ వివాహము చేయుటయే ప్రశస్తముగ భావింపబడు చుండెనని చూచియుంటిమి. అట్టి వివాహములలో రజస్వలా వివాహమునకు వర్తించు మంత్రములను వాడుట యసంగతము గనే కన్పట్టును కాని యట్లు గృహ్యసూత్ర మా దేశించుట మన కాశ్చర్యమును గల్గింపనక్కరలేదు. మంత్రమునకును కర్మకును సంబంధము గన్పట్టని ఘట్టములు కర్మకాండలో చాలగలవు. సాయంసంధ్యావందనములో సూర్యోవస్థానమునకు వరుణ దేవతాకమంత్రము చెప్పబడుచున్నది. అంతేకాదు వరుడు చెప్పవలసిన 'అహంగర్భమదధామ్‌' (నేను గర్భము నిచ్చితిని) అను మంత్రముతో వథువు నితరుడైనను నభిమంత్రింప వచ్చునని యాతపస్తంబ గృహ్యసూత్రము తెల్పుచున్నది.

అన్యోవైనామభిమంత్రయేత

(ఆ.గృ.సూ. 3-8-11)

ఇట్లే వథువు రజస్వలయని సూచించు మంత్రములను నగ్నికా వివాహములో వాడుటకు గృహ్యసూత్ర కారు లాదేశించుటలో నాశ్చర్యములేదు. స్మృతికారులకు నగ్ని కా వివాహమే సమ్మతమను సిద్ధాన్తమునకిది యీషణ్మాత్రము భంగకరము గాదు. కర్మకును నందుపయోగింపబడు మంత్రముల