పుట:Womeninthesmrtis026349mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

స్మృతికాలపుస్త్రీలు

వాగ్దాన ప్రాబల్యము మనుస్మృతిలోని యీక్రింది శ్లోకమువలన గూడ తెలియుచున్నది.

    ఏతత్తునవరే చక్రుర్నావరే జాతునాధవమాః
    యదన్యస్య ప్రతిజ్ఞాయ పునరస్యస్యదీయతే.
(మను 9-99)

(ఒకనికి కన్యను వాగ్దానముచేసి మఱొకని కామె నిచ్చుటను పూర్వనవీన శిష్టులలో నెవరును చేయలేదు.)

వాగ్దానము కూడ కొంత లౌకికాడంబరముతో జరుగు చుండెనని యూహింప వలసియున్నది. ఏలన వాగ్దానము ననుసరించి వివాహము జరుగకపోయినచో వాగ్దానమునకగు వ్యయము నెవరు భరింపవలెనను ప్రశ్న యాజ్ఞవల్క్యస్మృతిలో పరిష్కరింపబడినది.

దత్వాకన్యాం హరన్‌దండ్యో వ్యయందద్యా చ్చ సోదయం

(యాజ్ఞ 2-144)

(కన్యను వాగ్దానముచేసి మరల తీసికొనినవాడు వాగ్దానవ్యయమును వడ్డీతోకూడ నిచ్చుకొనవలెను.)

వివాహములోని యితరాంశములు "వేదకాలపుస్త్రీలు" అనుగ్రంథమున వివరింపబడి యున్నవి. అవియే గృహ్యసూత్రములలో గూడ గన్పట్టుచున్నవి. ఒకవిశేషము గలదు. సూర్యాసోముల వివాహమును వర్ణించు మంత్రములను బట్టి యా వివాహము రజస్వలా వివాహమని తెలియుచున్నదని