పుట:Womeninthesmrtis026349mbp.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాధ్యాయము

65

మర్థమున్నది కాన నట్టివానిని 'అపతి' యని చెప్పవచ్చును. ఇట్టి 'అపతి' దేశాంతరగతుడై చిరకాలము తిరిగి రానిచో కన్య మఱొకని వివాహమాడవచ్చునని నారదుడును పరాశరుడును చెప్పుచున్నారు

    నష్టే మృతే ప్రప్రజితే క్లీబేచ పతితేపతౌ
    వంచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే
(పరాశర.4-30)

(అపతి దేశాన్తరగతుడై తిరిగి రాకపోయినను, చని పోయినను, సన్యాసియైనను, నపుంసకుడైనను, పతితుడైనను - నీ యైదాపత్తులలోను - స్త్రీలు మఱొక పతిని పొందవలెను.)

ఇచట అపతిశబ్దము సప్తమ్యేకవచనములో 'అపతౌ' అని యున్నది. దాని పూర్వపదము 'పతితే'అని యున్నది. సంధిలో 'అ' కారము లోపించి 'పతితేపతౌ' అని యైనది ఇచట సంధిలో 'అ' లోపించినదని భావింపక శబ్దమే 'పతౌ' అని యున్నదని భావింపరాదు. ఏలన నార్షములో మాత్రమే పతిశబ్దమునకు సప్తమ్యేకవచనము 'పతౌ' అగును కాని లౌకికముతో 'పత్యౌ' అనియే యుండును. అది యైనను షష్ఠ్యంతము పూర్వమందున్నపుడే యగును (పాణిని 1-4-9) ఇచట షష్ఠ్యంతము లేదుకాన నార్షమనుటకు వీలులేదు. అంతేకాక, అని యుండవలెను. చక్కని యర్థము కుదురుచున్న పదమును వ్యర్థముగ నార్షముగ విరుచుట న్యాయ్యముకాదు. కావున 'అపతౌ' అనియే పదచ్ఛేదము చేయవలెనని తేలుచున్నది.