పుట:Womeninthesmrtis026349mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాధ్యాయము

69

కాన నామంత్రము నిపుడు జపింపను నక్కరలేదు; సమావేశనము నిపుడు కావింపను నక్కరలేదు. ఈసూత్రభాగమునకు కొందఱీ క్రిందివిధముగ నన్వయమును జెప్పుచున్నారు. "అనువాక శేషము నిప్పుడే జపింపవలెను. ఇదియే సమావేశనజపము. సమావేశనమన్ననో ముందెన్నడో కాదగును. ఇట సమావేశన మనగా సమావేశన జపమనియే యర్థము." ఈసమాధానము కూడ యుక్తియుక్తముగనే కన్పట్టుచున్నది. వాగ్రూవసంస్కారమాత్రమున నిపుడు సమావేశనము జరుగవలెనని చెప్పినంత మాత్రమున క్రియారూపసంస్కారముకూడ నిపుడే జరుగవలెనని తేలదు. దీనికి గృహ్యసూత్రముల నుండియే యనేకోదాహరణములను జూపవచ్చును. గృహ్యసూత్రములలో కన్యావరణము మున్నగునవి రెండుసార్లు చెప్పబడినవి. ఇందొకటి మాత్రమే క్రియారూపము.

సుస్తాం రుదంతీం నిష్క్రాన్తాం వరణేపరివర్జయేత్.

(ఆ.గృ.సూ. 1-3-11)

ఇది సంబంధనిశ్చయమునకు పూర్వము చేయబడు కన్యావరణమునకు సంబంధించిన విషయము.

సుహృదన్సమవేతాన్మంత్ర వతోవరాన్ ప్రహిణుయాత్.

(ఆ.గృ.సూ. 2-2-1)

ఇది సంబంధనిశ్చయమునకు పిమ్మట వివాహసమయమున చేయబడు కన్యావరణమునకు సంబంధించినది.