పుట:Womeninthesmrtis026349mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

స్మృతికాలపుస్త్రీలు

పాణిగ్రహణము వలన గల్గిన భార్యాత్వము సప్తపది వలన స్థిరపడును.

తేషాంనిష్ఠాతులిజ్ఞేయావిద్వద్భిస్సప్తమేపదే.

(మను. 8-217)

శేషహోమముతో వివాహసంస్కారము పూర్తియగును. సప్త పదియైనపిమ్మట వరుడు వధువు నగ్నికి ప్రదక్షిణము చేయించును. వరుడు వధువు నగ్నికి చుట్టును త్రిప్పుట చేతనే వివాహమునకు పరిణయము అను నామము కల్గినది.

గృహ్యసూత్రములలోని క్రమము ననుసరించి స్థాలీపాకాది కర్మకలాపమంతయు వరుని గృహముననే జరుగవలెను.

(ఆ.గృ.సూ. 2-5-23)

మద్రచితమైన "వేదకాలపుస్త్రీలు" అను గ్రంథమున సూర్యాసోముల వివాహవర్ణనావసరమున వివరింపబడిన వైవాహికమంత్రములే గృహ్యసూత్రములలో గూడ విధింపబడినవి గాన వాని నిట మఱల వివరించుట పునరుక్తియగు నను నూహతో నవి యిట వదలివేయబడినవి.

వివాహమునకు పూర్వము జరుగు సంబంధనిశ్చయమును గూర్చి యొకింత చెప్పవలసియున్నది. వివాహాంగముగ చెప్పబడిన కన్యావరణము కేవలము సంస్కారమాత్రమే యనుట స్పష్టము.