పుట:Womeninthesmrtis026349mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాధ్యాయము

61

నాల్గవనాటి తెల్లవారుజామునకు దీక్షముగియును. అపుడు జరుగుహోమము తో వివాహము ముగియును. దానికే శేష హోమమని పేరు. 'ప్రజాపతేనత్వంమే' అను మూడుఋక్కుల నపుడు జపింపవలెను. ఇక మిగిలియున్నది సమావేశనము.ఇది వివాహములో నంతర్భూతమా కాదా యను నంశమును ముందు చూతము. 'ఆరోహోరుమ్' అను ననువాకశేషమును సమావేశనములో జపింపవలెను.

ఉత్తరాస్తిస్రోజపిత్వా శేషగ్ సమావేశనే జపేత్

(ఆ.గృ.సూ. 3-8-10)

పైన తెల్పబడిన కన్యాదానము, పాణిగ్రహణము, సప్తపది, శేషహోమము - అను నాల్గుఘట్టములలో నొక్కొకదాని కొక్కొకప్రాముఖ్యము గలదు. కన్యాదానము వలన వరునకు కన్యపై స్వామ్యము గల్గునని మనువు చెప్పుచున్నాడు. ప్రదానం స్వామ్యకారణం.

పాణిగ్రహణమువలన నామె వరునకు భార్యయగును

పాణిగ్రహణికామంత్రాని యతందారలక్షణం

(మను. 8-227)

(పాణిగ్రహణమంత్రములు భార్యత్వము గల్గించును) ఈ పాణిగ్రహణమువలననే భార్యాభర్తలకు కర్మలలో సహత్వము గల్గును.)

పాణిగ్రహణాద్ధిసహత్వం కర్మసు

(బో.ధ.సూ. 11-14-17)