పుట:Womeninthesmrtis026349mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

స్మృతికాలపుస్త్రీలు

     స్వగోత్రాద్భ్రశ్యతేనారీ ఉద్వాహాత్సప్తమేపదే
     భర్తృగోత్రేణ కర్తవ్యందానం పిండోదకక్రియా
(లిఖిత. 1-27)

(వివాహములో సప్తపదియగుటతోడనే వథువు పితృ గోత్రమునుండి భ్రష్టయగుచున్నది. పిమ్మట దానము, పిండోదక క్రియమున్నగువానిని భర్తృగోత్రముతోనే చేయవలెను)

స్థాలీపాకమైన పిమ్మట మూడుదినములు వధూవరులు బ్రహ్మచర్యము పాటించవలెను. క్రిందపరుండవలెను. చేదు, ఉప్పుగల పదార్థములను తినరాదు.

త్రిరాత్ర ముభయోరధశ్శయ్యా బ్రహ్మచర్యం క్షారలవణ వర్జ నంచ.

(ఆ.గృ.సూ. 3-8-8)

ఇట 'ఉభయో:' అని చెప్పుటచేతను తర్వాతిసూత్రములో 'వారిమధ్యను దండము నుంచవలె'నని చెప్పుటచేతను వధూవరులిరువురు నొకేశయ్యపై పరుండవలెనని స్పష్టమగు చున్నది. కావుననే యీ సూత్రములో బ్రహ్మచర్య నియమనము ముఖ్యమగు చున్నది. వథువు అప్రాప్తవయస్కయైనను వరుడు ప్రా ప్తవయస్కుడగుటచే బ్రహ్మచర్య భంగము గలుగుట కవకాశముండుటచే నది పాటింపబడవలెనని స్పష్టముగ చెప్పబడినది.