పుట:Womeninthesmrtis026349mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాంఘిక సాంప్రదాయముల పునాదులనే విమర్శించి, ఖండించుచున్నగాని, మానవసౌభ్రాతృత్వము దుర్లభముగనుక, నైతికధర్మములు కూడ, మానవసంఘాభివృద్ధికై యెట్లు పరిణామమును పొందెనో, పొందుచున్నవో తెలుపుట, యీ విద్యాపీఠమువారి ముఖ్యాశయము - అహింసాసత్యములు మొదలగు ధర్మములు, నిత్యములు, అనాదులు కావనియు, వీనిలో కూడ సూక్ష్మస్థూలభేదములుండి తీరుననియు, యివన్నియు, సర్వకాలసర్వావస్థలయందును అనుల్లంఘనీయములని యెంచకూడదనియు, మన పురాతనవైదికగ్రంథములే చాటుచున్నవి. వీనినన్నిటిని మరియొక గ్రంథములో తెలిపెదము.

పై పునాది సూత్రముల నంగీకరించువారు, తమసాంఘిక సౌఖ్యమునకు గాను, యెట్టి మతాచారము నవలంబించి, తమకు నచ్చిన యే సంఘములో చేరియున్నను, తమలో తమకు తగవు లుండవలసిన పనియేలేదు. మానవుడు సాంఘికజీవి యగుటవలన, కొన్ని మతసాంఘిక సాంప్రదాయములతో కూడుకొన్న యే సంఘములో నైనను తాను చేరియుండక తప్పదు. కాని, యితనికి, పరమతములమీద అసహనము, అన్యమత స్వీకరణనిరసనము, మతావేశము, దురభిమానము, మూర్ఖపక్షపాతము మొదలగు దుర్గుణములుండవు. ఇతను,