పుట:Womeninthesmrtis026349mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపూర్ణ సానుభూతి చూపించుచు, ముందంజవైచుటకు, కొంతవరకు తోడ్పడవచ్చుననియే మన పూర్వగ్రంథములలోని మతసాంఘిక సూత్రములను, ఉన్నవి ఉన్నట్లు, నిష్పక్షపాత బుద్ధితో తెలుపుచుందుము. మనలో యెట్టి బిన్నాభిప్రాయములు పూర్వకాలమునుండి యున్నను, మేము వానిలో నేవియును దాచము. మతసాంఘికాచారము లన్నియు మానవ కల్పితములే యని మా వాదనయైనపుడు, మాకు రుచించనివైనను దాచవలసినంత భయము మా కేల ? ఏమత గ్రంథము గాని అపౌరుషేయమనిగాని, అనుల్లంఘనీయమని గాని, పవిత్రమనిగాని మే మెంచనపుడు, దానిలోని విషయములను వ్యక్తీకరించుటలో మాకు దాపరికముండవలసిన పనిలేదు. మన మూఢమత విశ్వాసములేగాక, మన నైతిక ధర్మములు కూడ ప్రకృతియంతయు వలెనే, పరిణామజన్యములనియే మేము నొక్కి చెప్పుచున్నాము. మా విద్యాపీఠములలో, తక్కిన మతగ్రంథములతో పాటు, మన వేదశాస్త్రములను కూడ స్తనశల్యపరీక్షచేసి విమర్శించ సాహసించుచున్నాము. ఇంతామాత్రము చేత, వానియందును, ఆ గ్రంథకర్తలయందును మాకు గౌరవము లేదని భావించజనదు. వానిలోని విషయములు భగవంతుని నూటనుండి వెలువడినవనియు, అవి పరమప్రమాణమనియు, వాదించువారితో మేమేకీభవించము. ప్రస్తుత మతి