పుట:Womeninthesmrtis026349mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యక్కడక్కడ తనతలను యెత్తుచునే యుండును. గనుక, మేముకూడ మా శక్తికొలది దీనిని ప్రతిహతము గావింప బ్రయత్నించుచుందుము. కాశీ కృష్ణాచార్యులుగారి అనాది సిద్ధములైనవను వైదికధర్మములు కూడ, పరిణామము వలన యేర్పడినవేగాని, మానవులు, మొట్టమొదట క్రిందితరగతుల జీవములనుండి ఉద్భవమైనపుడు యెట్టిధర్మములు లేనేలేవనియు దేవుడను వాడొకడున్నను ఆయన మన మనఃఫలకములమీద యెన్నడు, యెట్టిధర్మములు వ్యాసియుండలేదనియు, వివిధ మానవసంఘములలో వాని యభివృద్ధి కొఱకు దేశకాలములను బట్టి, అనేక రకములగు మతసాంఘికధర్మములు బయలుదేరినవనియు, ప్రపంచములోని అనాగరికజాతుల సాంఘికచరిత్రవలన స్పష్టపడుచున్నది. ఇంతయేల ? మానవకోటిలో ప్రస్తూ మందవలంబించబడుచున్న వివిధ మతాచారములన్నియు, మానవకల్పితములే యనియు, వేదాంతసూత్రములన్నియు, వట్టి ఊహాజన్యములనియు నా నిశ్చితాభిప్రాయము. దీని నెల్లపుడు, మతసాంప్రదాయములలో చిక్కుకొను మన భారతీయులకు నచ్చజెప్పి, వారి మూడవిశ్వాసములను పారద్రోలి, మానవసౌభ్రాతృత్వమునకు వీరిని పురిగొల్పుటయే నా యాశయము. ముఖ్యముగా మనయాంధ్రులు, సంఘసంస్కరణములందు, ఈ ప్రపంచములోని తక్కిన మానవసంఘములతో