పుట:Womeninthesmrtis026349mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకుని తొలిపలుకు

ఈ గ్రంథమును, దీనికి పూర్వము వెలువడిన "వేదకాలపు స్తీలు" అను గ్రంథమును చదివి, వానిలోని విషయములను జాగ్రతగ పరిశీలించువారికి, మన భారతదేశములోని ఆర్యులలో, సాంఘికధర్మము లితర మానవసంఘములలో వలెనే, యెట్లు మారుచుండెనో స్పష్టముగ తెలియగలదు. సనాతన ధర్మములనగా అనాది ధర్మములనియు, అవి, సత్యము, అహింస మొదలగు నైతికధర్మములుగాని, కేవలము లౌకికములైన సాంఘికధర్మములు కావనియు, కాశీ కృష్ణాచార్యులు మొదలగు పండితుల యభిప్రాయము. తక్కిన వారిలో కొందరు, మన పూర్వమతగ్రంథములగు శృతిస్మృతి పురాణేతిహాసములలో చెప్పబడిన ధర్మములన్నియు, సనాతనధర్మములే యనియు, వీనిలో పైకి కన్పడు పరస్పరవిరుద్ధములు సమర్థించుకొనజాలకుండుటకు, కారణము మన నవనాగరికుల యసమర్థతయే యనియు, యీ ధర్మములన్నియు అనుల్లంఘనీయములనియు వాదించెదరు. సనాతనధర్మపరులమని చెప్పుకొనువారి యీవాదన నెంతగా ఖండించినను నది