పుట:Womeninthesmrtis026349mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాధ్యాయము

55

సంతానము నమ్ముకొనుట యుపపాతకములలో చెప్ప బడినది.(అవత్యస్యచవిక్రయః మను 11-61)

అట్లగుచో నార్షవివాహములో కన్యాదాతకు గోమిథున మీయవలెనని యున్నదికదా యది యపత్య విక్రయమగుటచే నార్షవివాహము కూడ గర్హ్యమగుట లేదా యను ప్రశ్న బయలు దేరుచున్నది.

     ఆర్షేగోమిథునం శుల్కంకేచిదా హుర్మృషైవతత్
     అల్పో౽ప్యేవం మహాన్ వా౽పి విక్రయస్తావ దేవ స:
(మను. 3-53)

(ఆర్ష వివాహములోని గోమిధునము కన్యాశుల్కమని కొందఱు చెప్పుచున్నారు. కాని యది యసత్యము, అది శుల్కమే యగుచో నెంత స్వల్పమైనదయినను కన్యా విక్రయమే కావలసివచ్చును. అనగా: అది శుల్కముగాదు. అని తాత్పర్యము)

ఆర్షవివాహ నిర్వచనము చేయుచున్న 'ఏకం గోమిథానం' అను శ్లోకములో 'ధర్మత' అని యుండుటచేతనే కన్యాదాత యీగోమిథునమును ధర్మార్థము తీసికొనుచున్నాడని తేలుచున్నది. ఆధర్మమేమనగా: 'ఆర్షవివాహ సంపత్తి కొఱకవశ్యాచరణీయమైన యాగాది సిద్ధికొఱకు' అని కుల్లూకభట్టు చెప్పుచున్నాడు.