పుట:Womeninthesmrtis026349mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

స్మృతికాలపుస్త్రీలు

కన్య తండ్రికే కాక కన్యకు శుల్కమునిచ్చుట గూడ గర్హ్యమేయని పైననీయబడిన యాసురవివాహ నిర్వచనమునుబట్టి తెలియుచున్నది. వివాహసమయమున కన్యకు వరుడేమైన నిచ్చుచోనది శుల్కము కానేరదు.

వివాహసమయమున పలువురు కన్యకు కాన్కలిచ్చుట స్మృతులవలన తెలియవచ్చుచున్నది. అది "ధనము" అను నధ్యాయమున వివరింపబడును.

కన్యాశుల్కముపట్ల స్మృతుల దృష్టిని చూచితిమి. వరశుల్కముయొక్క వాసనయైనను స్మృతులలో నెచ్చటను కానవచ్చుట లేదు.

"వివాహమెంత ప్రశస్తమైన సంతానమంత ప్రశస్తమైనదగును. వివాహమెంత నింద్యమైన సంతానమంత నింద్యమగును. కావున నింద్య వివాహములను చేసికొనరాదు" అని మనువు చెప్పినాడు.

    అనిందితైః స్త్రీవివాహైరనింద్యా భవతిప్రజా
    నిందితైర్నిందితాన్హణాం తస్మాన్నింద్యా న్ప్రవర్జయేత్
(మను. 3-42)

     త్రిపురుష మార్షాత్
(గౌతమ 4-29)

(ఆర్ష వివాహమువలన మూడు పురుషములు పవిత్రములగును)