పుట:Womeninthesmrtis026349mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

స్మృతికాలపుస్త్రీలు

యంతర్వైరుద్ధ్యములను ప్రక్షిప్తములను ప్రస్తుత గ్రంథమున చర్చించుట సాధ్యముకాదు. కాన నీయంశమిచట చర్చింపబడుటలేదు.

    అదదీతనశూద్రోపి శుల్కందు హితరందదత్
    శుల్కంహిగృహ్ణన్ కురుతేచ్ఛన్నం దుహితృవిక్రయం
(మను 9-98)

(శూద్రుడైనను కుమార్తెనిచ్చుచు శుల్కము తీసికొనరాదు. అట్లు తీసికొనుచో కుమార్తె నమ్మిన వాడగును.)

ధనమిచ్చి కన్యను తెచ్చికొనుట యత్రిసంహితలో నీక్రింది విధముగ నిందింపబడినది:

     క్రియక్రీతాచయాకన్యా పత్నీసానవిధీయతే
     తస్యాంజాతాః సుతాస్తే షాంపితృపిండంనవిద్యతే
(అత్రి 377)

(ధనముచే కొనబడిన స్త్రీ పత్ని కానేరదు. ఆమెయందు జనించినవారికి పిండప్రదానము కూడ నుండదు.)

కన్యాశుల్కమును మనువిట్లు నిందించుచున్నాడు.

    నకన్యాయాః పితావిద్వాన్ గృహ్ణీయాచ్ఛుల్కమణ్వపి
    గృహ్ణంచ్ఛుల్కంహిలో భేనస్యాన్నరో౽ పత్యవిక్రయీ.
(మను. 3-51)

(కన్యయొక్క తండ్రి. తెలిసినవాడగుచో కొంచెమైనను శుల్కమును తీసికొనకూడదు. లోభముచే శుల్కమును తీసికొనుచో సంతానము నమ్ముకొను వాడగుచున్నాడు.)