పుట:Womeninthesmrtis026349mbp.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాధ్యాయము

53

(వీనిలో బ్రాహ్మము మున్నగు నాల్గేధర్మ్యములు గాన్ధర్వము సామాన్యము. మిగిలిన మూడును నధర్మ్యములు.)

అని చెప్పినాడు.

బ్రాహ్మణునకు బ్రాహ్మదైవార్ష ప్రాజాపత్యములును క్షత్రియునకు గాంధర్వ రాక్షసములును మంచివని మనువు చెప్పు చున్నాడు.

చతురోబ్రాహ్మణస్యాద్యాన్ ప్రశస్తాన్ కవయోవిదుః

(మను. 3-24)

గాంధర్వోరాక్షసశ్చైవధర్మ్యౌక్షత్రస్యతౌ స్మృతౌ.

(మను 3-26)

లిఖితస్మృతికూడ నిట్లే చెప్పుచున్నది.

     ఏతేధర్మ్యాస్తుచత్వార: పూర్వంవిప్రేప్రకీర్తితాః
     గాంధర్వో రాక్షసశ్చైవ క్షత్రియన్య వ్రశన్యతే.

(లిఖిత 4-3)

గాంధర్వ రాక్షసములలో రాక్షసమే క్షత్రియున కెక్కుడు ప్రశస్తమనియు వైశ్యశూద్రులకు నాసురము ముఖ్యమనియు గూడ మనుస్మృతిలో నొకచోటగలదు.

రాక్షసం క్షత్రియస్యైకమాసురం వైశ్యశూద్రయోః

(మను 3-24)

ఇట మనువు వైశ్య శూద్రులలో కన్యాశుల్క మంగీకరించినాడు. కాని యాతడు స్థలాన్తరమున కన్యాశుల్కమును శూద్రులలో గూడ నిషేధించుచున్నాడు. స్మృతులలోని