పుట:Womeninthesmrtis026349mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాధ్యాయము

51

కన్యాదానము చేయుచో నార్షవివాహమగును. అదియు ధర్మ్యమే. 'మీ రిరువురును గలసి ధర్మమాచరింపుడు', అని నియమముచేయుచు సాలంకృత కన్యాదానముచేయుచో నా వివాహమునకు ప్రాజాపత్యమని పేరు. మఱొకస్త్రీని వివాహమాడరాదనియే యీ నియమములోని విశేషము. కన్యకును జ్ఞాతులకును శక్తికొలది ధనమునిచ్చి కోరి కన్యను స్వీకరించుచో నది యాసురవివాహమగును. కన్యావరులు కోరుకొని పరస్పరము పొందుట గాంధర్వవివాహము. ఇది మైథునమునకు హితమైనది. కామమువలన బయలుదేరినది. కన్యయొక్క బంధువులనుచంపి, నరికి, కొట్టి యేడ్చుచున్న కన్యను పితృగృహమునుండి బలవంతముగ తీసికొనిపోవుట రాక్షస వివాహమనబడును. నిద్రపోవుచున్న దానిని, నొడలు తెలియకున్న దానిని, పిచ్చిదానిని, నేకాస్తముగ పొందుట పైశాచవివాహము. ఇది వివాహము లన్నిటిలోను పాపిష్ఠము.)

వసిష్ఠస్మృతిప్రాజాపత్య పైశాచములను పేర్కొనలేదు.

బ్రాహ్మదై వఆర్ష గాన్ధర్వక్షాత్రోమానుషశ్చేతి

(వసిష్ఠ. 2-29)

ఇచట 'క్షాత్రము' రాక్షసమను నర్థమున వాడబడినది.

యాంహరన్తి సక్షాత్ర:

(వసిష్ఠ 2-34)

(స్త్రీని హరించి వివాహము చేసికొనుచో నదిక్షాత్రము.)