పుట:Womeninthesmrtis026349mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

స్మృతికాలపుస్త్రీలు

    ఆలంకృత్య సుతాదానందైవం ధర్మ్యం ప్రచక్షతే
    ఏకంగో మిధునంద్వేవావరా దాదాయధర్మత:
    కన్యాప్రదానం విధివదార్షో ధర్మస్స ఉచ్యతే.
    
    సహోభౌచరతాం ధర్మమితివాచానుభాష్యచ
    కన్యాప్రదానమభ్యర్చ్య ప్రాజాపత్యో విధిఃస్మృతః
    జ్ఞాతిభ్యోద్రవిణం దత్వాకన్యాయై చైవశక్తితః
    కన్యాప్రదానం స్వాచ్ఛంద్యాదాసురోధర్మ ఉచ్యతే
    ఇచ్ఛయాన్యోన్యసంయోగ: కన్యాయాశ్చవరస్యచ
    గాంధర్వస్సతువిజ్ఞేయో మైధున్యః కామ సంభవః
    హత్నాభిత్వాచఛిత్వా చక్రోశన్తీం రుదతీం గృహాత్
    ప్రనహ్యకన్యాహరణం రాక్షసోవిధిరుచ్యతే
    సుప్తాం మత్తాం ప్రమత్తాం వారహోయత్రోపగచ్ఛతి
    సపాపిష్ఠోవివాహానాం పైశాచష్టాష్టమో ధమ:
(మను. 3-27 నుండి 34 వరకు)

(వేదముచదివి చక్కనిశీలము గల్గియున్న వానిని పిలచి వస్త్రాలంకారాదులచే పూజించి యట్లే పూజింపబడిన కన్య నాతనికిచ్చుచో నది బ్రాహ్మవివాహమనబడును. ఇది ధర్మ్య వివాహము యజ్ఞమందు నార్త్విజ్యముచేయువానికి సాలంకృత కన్యాదానము చేయుచో నా వివాహమునకు దైవ వివాహమని పేరు. ఇదియు ధర్మ్యమే. ఒకటికాని రెండుకాని గోమిథునములను యాగాదిసిద్ధికై వరునినుండి తీసికొని విధ్యుక్తముగా