పుట:Womeninthesmrtis026349mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాధ్యాయము

45

మఱొకవరునిపై దృష్టినిడుకొనియున్న కన్యను వివాహమాడరాదని నారదస్మృతి చెప్పుచున్నది.

దుష్టాన్యగతభావావాచ కన్యాదోషాః ప్రకీర్తితాః

(నారద 12-88)

(దుష్టమగు నితరగతభావమును గల్గియుండుటకూడ కన్యాదోషములలోనిదే)

వరపక్షము వారన్వేషణమునకు బోయినపుడు నిద్రపోవుచున్న దానిని, నేడ్చుచున్నదానిని, బయటకుబోయిన దానిని వివాహమాడరాదు.

సుప్తాంరుదంతీం నిష్క్రాన్తాం వరణేపరివర్జయేత్.

(ఆ.గృ.సూ 1-3-11)

ఒక కన్యను వివాహమాడుటచేగలుగు లాభాలాభముల విషయమై యొకవిధమగు శకునము చూచుట నాపస్తంబుడు సూచించుచున్నాడు. అదియెట్లన:

(ఆ.గృ.సూ 1-3. 15)

శక్తివిషయేద్రవ్యాణి ప్రతిచ్ఛన్నాన్యుపనిధాయబ్రూయాదుపస్పృశేతి.

(శక్తి ననుసరించి కొన్ని పదార్థములను తెచ్చి వానిని కప్పిపుచ్చి యందేదోయొక దానిని స్పృశింపుమని కన్యతో చెప్పవలెను.

ఆ పదార్థము లేవన: