పుట:Womeninthesmrtis026349mbp.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

స్మృతికాలపుస్త్రీలు

    అగ్రేదిధిషూవతిః కృచ్ఛ్రంద్వాదశ
    రాత్రం చరిత్వానివిశేత తాంచోపయచ్ఛేత్.
(వసిష్ఠ 20-9)

ఇట్టినియమము వరుని విషయములో గూడ గలదు. జ్యేష్ఠునకు వివాహము కాకుండ వివాహమాడువానికి పరివేత్తయని పేరు. అట్టి జ్యేష్ఠునికి పరివిత్తయని పేరు.

    పరివిత్తిః వేరివేత్తాయయాచ పరివిద్యతే
    సర్వేతేనరకం యాన్తిదాతృయాజక పంచమా:
(పరా. 4-25)

(పరివిత్తి, పరివేత్త, యాతని వివాహమాడునది, యాకన్యనిచ్చినవాడు. పురోహితుడు - ఈ యైదుగురును నరకమునకు బోదురు.)

కాని యొక్కొకపుడు పరివేదనము దోషము కాదు.

     కుబ్జవామనషండేషు గద్గదేషుజడేషుచ
     జాత్యంధే బధిరేమూకే నదోషఃపరివేదనే
     పితృవ్యపుత్రస్సాపత్న్యః వరనారీసుత స్తథా
     దారాగ్నిహోత్రసంయోగే నదోష:పరివేదనే.
(పరా. 4-27,28)

(జ్యేష్ఠుడు గూనెవాడు, మరగుజ్జు, షండుడు, వణుకు రోగముగలవాడు, స్తబ్ధుడు, పుట్టుగ్రుడ్డి, చెవిటివాడు, మూగవాడు, పినతండ్రికొడుకు, సవతితల్లికొడుకు, పరస్త్రీవలన జనించినవాడునైనచో కనిష్ఠుడు పరివేదనము చేసికొనుటలో దోషము లేదు.)