పుట:Womeninthesmrtis026349mbp.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

స్మృతికాలపుస్త్రీలు

     నానాబీజాని సగ్‌సృష్టాని వేద్యా: పాగ్‌నూన్
     క్షేత్రాల్లోష్టగ్ శకృచ్ఛ్మశావలోష్టమితి
(ఆ.గృ.సూ. 1-3-16)

(కలిపి యుంచబడిన వివిదములగు గింజలును, యజ్ఞ వేదికలోని ధూళిని పొలమునుండి తేబడిన లోష్టమును, శకృత్తును, శ్మశానమునుండి తేబడిన లోష్టమును.)

పూర్వేషాముపస్పర్శనే యథాలింగమృద్ధి:

(ఆ.గృ.సూ. 1-3-17)

(ఈ పదార్థములలో మొదటినాల్గింటిలో దేనినైన కన్య స్పృశించుచో నామెవలన నామెభర్తకు తదనుగుణమైన వృద్ధివచ్చునట్లు గ్రహింపవలెను)

ఆనగా: ఆమెగింజలను స్పృశించినచో:నామెకు సంతానబాహుళ్యము గల్గుననియు, యజ్ఞవేదికలోని థూళిని స్పృశించుచో నామె భర్తతో గూడి చాలయజ్ఞములను జేయుననియు క్షేత్రలోష్టమును స్పృశించుచో సస్యసమృద్ది గల్గుననియు, శకృత్తును స్పృశించుచో పశుసమృద్ధి గలుగుననియు తెలిసికొనవలెను.

ఉత్తమంచపరిచక్షతే.

(ఆ.గృ.సూ. 1-3-18)

(శ్మశానలోష్టమును పెద్దలు గర్హించుచున్నారు) అనగా: కన్య శ్మశానలోష్టమును స్మృశించుచో నామెయో