పుట:Womeninthesmrtis026349mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాధ్యాయము

19

(తల్లి, తండ్రి, జ్యేష్ఠ సోదరుడు-ఈమువ్వురు నవివాహితయగు రజస్వలను చూచి నరకమును పొందుదురు. అట్టి కన్యను వివాహము చేసికొను మదమోహితుడైన బ్రాహ్మణుడు సంభాషింప తగినవాడు; పజ్త్కిబాహ్యుడు. వానికి వృషలీపతి యనిపేరు. ఒక్కరాత్రి వృషలిని సేవించిన దోషము మూడేండ్లు భిక్షచర్య చేయుచు జపించుచుండినచో హరించును.)

యమసంహితకూడ పరాశరుని వాక్యములతోనే

(యమ 11-23) రజస్వలావివాహమును గర్హించుచున్నది. సంవర్త సంహితకూడ నట్లే గర్హించి (67 శ్లో) యిట్లు ముగించుచున్నది

తస్మాద్వివాహయేత్కన్యాంయాపన్నర్తుమతీభవేత్

(సంవర్త. 08)

(ఆహేతువువలన కన్య రజస్వలయగు లోపలనే వివాహము చేయవలెను.)

యాజ్ఞ వల్క్యుడీ క్రిందివిధముగ రజస్వలా వివాహమును గర్హించుచున్నాడు.

అప్రయచ్ఛన్‌సమాప్నోతిభ్రూణహత్యామృతావృతౌ

(యాజ్ఞ 1-05)

(ఋతుమతి కాకుండనే కన్యను దానము చేయనివాడామె ఋతుకాలమునందెల్ల భ్రూణహత్యాదోషము నొందును)