పుట:Womeninthesmrtis026349mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

స్మృతికాలపుస్త్రీలు

ఎంతబాల్యములో కన్యను దానముచేసిన నంత మంచిదనియే కొందఱి యభిప్రాయమని గౌతముడు చెప్పుచున్నాడు.

ప్రాగ్వాసన: ప్రతిప త్తిరి త్యేకే

(గౌ. 18-28)

(గుడ్డ కట్టుకొను వయస్సునకు పూర్వమే దానముచేయుట మంచిదని కొందఱు ఋషులు చెప్పుచున్నారు)

గౌతముడు అరజస్వలావివాహమును శాసించుటతో నూరకుండక రజస్వలావివాహమును నిషేధించుచు నిట్లు చెప్పుచున్నాడు.

అప్రయచ్ఛన్దోషీ.

(గౌ. 18-22)

(ఋతుకాలమునకు పూర్వమే దానము చేయనివాడు దోషవంతుడగుచున్నాడు.)

పరాశరస్మృతి రజస్వలావివాహమును సర్వవిధముల నీక్రిందివిధముగ నిందించుచున్నది.

 
    మాతాచైవ పితాచైవ జ్యేష్ఠాభ్రాతాతదైవచ
    త్రయన్తేనదకంయాంతి దృష్ట్వాకన్యాం రజస్వలాం
    యస్తాం సముద్వహేత్కన్యాం బ్రాహ్మణోమనమోహిత:
    అసంభాష్యోహ్య పాజ్త్కేయస్స విప్రోవృషలీపతి:
    యఃకరోత్యేకరాత్రేణ వృషలీసేవనంద్విజ:
    సభైక్షభుగ్జపన్నిత్యంత్రిభిర్వర్షైర్విశుద్ధ్యతి

(పరా. 8-6, 7, 8.)