పుట:Womeninthesmrtis026349mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

ద్వితీయాధ్యాయము.

వివాహవయస్సు

స్త్రీల వివాహవయస్సును గూర్చి స్మృతు లిసుమంతయు సందేహము లేకుండునట్లు పరిష్కరించినవి. స్మృతుల నన్నిటిని పరిశీలించిన పిమ్మట నీక్రింది సిద్ధాన్తములను ప్రకటించుటకు వీలుగల్గుచున్నది.

(1) రజస్వల కాకుండగనే వివాహము చేయవలెనని చాల ధర్మశాస్త్రములు నొక్కి చెప్పుచున్నవి. అవి రజస్వలా వివాహమును మిక్కిలి గర్హించుచున్నవి.

(2) రజస్వల యైనంత మాత్రమున మహాదోషము లేదనియు నాపిమ్మట వివాహము చేయుట కుపేక్షించుట ఘోరదోషమనియు కొన్ని స్మృతులు చెప్పుచున్నవి.

(3) రజస్వలా వివాహము మంచిదని యేస్మృతియు చెప్పుటలేదు.

(4) ఎనిమి దేండ్లకును పండ్రెం డేండ్లకును నడుమను స్త్రీకి వివాహము చేయవలెనను నిర్దేశమును గూడ కొన్ని స్మృతులు చేయు చున్నవి.